ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి | 3 killed in RTC bus, 108 ambulance accident at peddapuram | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి

Sep 11 2014 10:30 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి - Sakshi

ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలో ఏడీబీ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న108 వాహానం ఢీ కొట్టింది.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలో ఏడీబీ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న108 వాహానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 108 వాహనంలో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందగా, అదే వాహనంలో ఉన్న డ్రైవర్, పారా మెడికల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కాగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారిని పెద్దపురం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన మూడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement