రిక్షాను ఢీకొన్నబస్సు: విద్యార్థులకు గాయాలు | 3 injured in road accident at vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

రిక్షాను ఢీకొన్నబస్సు: విద్యార్థులకు గాయాలు

Mar 13 2015 12:57 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

విజయనగరం: వేగంగా వెళ్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. స్తానిక లెండీ ఇంజనీరింగ్ కాలేజీ కి చెందిన బస్సు ముందు వెళ్తున్న రిక్షాను ఢీ కొట్టింది. దీంతో రిక్షాలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement