నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మిట్టపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మిట్టపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. గ్రామంలోని మూల మలుపు వద్ద బుధవారం మధ్యాహ్నాం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వీరంతా పెళ్లి నిమిత్తం శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(దక్కిలి)