హుదూద్ తుఫాను ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. మంగళవారం ఉదయం వరకు 21 మంది మాత్రమే మరణించినట్లు అధికారవర్గాలు తెలియజేశాయి.
హుదూద్ తుఫాను ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. మంగళవారం ఉదయం వరకు 21 మంది మాత్రమే మరణించినట్లు అధికారవర్గాలు తెలియజేశాయి. అయితే, మరో నలుగురు కూడా వివిధ కారణాలతో మరణించినట్లు తాజాగా తెలిసింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరుకుంది.
కానీ, ఇప్పటికీ విశాఖపట్నంలోని పలు ప్రాంతాలకు ఎవరూ చేరుకోలేని పరిస్థితి ఉండటం, శిథిలాలను ఇప్పటికీ తొలగించలేకపోవడం తదితర కారణాలతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు అంటున్నాయి. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తమకు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ప్లకార్డులతో స్థానికులు కోరారు.