21కి చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య | 21,reached the nagarm death toll | Sakshi
Sakshi News home page

21కి చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య

Jul 3 2014 1:20 AM | Updated on Sep 2 2017 9:42 AM

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మంగళవారం అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు.

ఇంకా ఐదుగురి పరిస్థితి విషమం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మంగళవారం అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. సంఘటన జరిగిన జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వానరాశి వెంకటరత్నం (46) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం కాకినాడ అపోలోలో ఆరుగురు, ట్రస్ట్‌లో ఆరుగురు, సాయిసుధలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఐదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు వైద్యులుచెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement