ఆర్టీసీ బస్సు - కారు ఢీ: 20 మందికి గాయాలు | 20 people injured in RTC bus - car accident in Chittoor district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు - కారు ఢీ: 20 మందికి గాయాలు

Feb 25 2014 10:47 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బసవరాజ కండ్రిగలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్నాయి.

చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బసవరాజ కండ్రిగలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో  వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement