'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు | 20 injured in bus accident | Sakshi
Sakshi News home page

'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు

May 18 2015 5:58 AM | Updated on Sep 3 2017 2:17 AM

'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు

'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు

కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు సోమవారం తెల్లవారుజామున గుత్తి ఎన్ హెచ్ 44పై బోల్తా పడింది.

గుత్తి:కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు సోమవారం తెల్లవారుజామున  గుత్తి ఎన్ హెచ్ 44పై బోల్తా పడింది.  హైదరాబాద్ నుంచి బెంగళూరు కు వెళ్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదానికి గల కారణాలను రాబట్టే పనిలో పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో అధికశాతం మంది హైదరాబాద్ కు చెందిన వారే.

Advertisement
 
Advertisement
Advertisement