ఆటోను ఢీకొన్న లారీ : ఇద్దరి మృతి | 2 died, 7 injure din road accident at srikakulam distiric | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ : ఇద్దరి మృతి

Mar 2 2015 6:57 PM | Updated on Sep 2 2018 4:46 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఆటో, బైకును ఢీ కొట్టింది.

శ్రీకాకుళం : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఆటో, బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నర్సీంపేట మండలంలోని జాతీయరహాదారి-16పై జరిగింది. ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(నర్సంపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement