ఆర్నెళ్లల్లో 1700 ‘డబుల్‌’ పనులు ప్రారంభిస్తాం | 1700 'double' tasks will be started in 6 years | Sakshi
Sakshi News home page

ఆర్నెళ్లల్లో 1700 ‘డబుల్‌’ పనులు ప్రారంభిస్తాం

Nov 5 2017 1:29 PM | Updated on Sep 29 2018 4:44 PM

1700 'double' tasks will be started in 6 years  - Sakshi

కామారెడ్డి అర్బన్‌: వచ్చే ఆర్నెళ్లల్లో అర్హులైన లబ్ధిదారులకు 1700 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించేందుకు పనులు ప్రా రంభిస్తామని ఎమ్మెల్యే, విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని లింగాయిపల్లిలో 40 ఇళ్లకు, ఇందిరానగర్‌ కాల నీ సమీపంలో 300 ఇళ్ల నిర్మాణానికి శనివారం విప్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన సభల్లో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూంలు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉం దన్నారు. ఇవి ఆర్నెళ్లల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. 

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.40 లక్షలు, మౌలిక వసతు ల కోసం రూ.1.20లక్షలు వ్యయం చేస్తున్నామన్నారు. పట్టణంలోని రామేశ్వర్‌పల్లి వద్ద 200 ఇళ్ల నిర్మా ణం జరుగుతుందన్నారు. ఎంపీపీ మంగమ్మ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకట్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పి.ఆంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్‌ బల్వంత్‌రావు, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, కాంశెట్టి, పిప్పిరి వెంకటి, లక్ష్మారెడ్డి, సంగిమోహన్, మంద వెంకటేశ్వర్‌రెడ్డి, రవితేజగౌడ్, సర్పంచ్‌లు డి. అంజమ్మ, రమాగౌడ్, ముల్కరాజు, బాల్‌కిషన్‌గౌడ్, ఎంపీటీసీలు బాల్‌రాజ్, గంగాధర్‌రావు, నాయకులు అంజల్‌రెడ్డి, రవి, కిషన్‌గౌడ్, లక్కాకుల రాజుకుమార్, లింగం, సాయాగౌడ్‌ ఉన్నారు.

పేదలకు సర్కారు అండగా ఉంటుంది
సాక్షి, కామారెడ్డి: పేద ప్రజలకు ప్రభు త్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. శనివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృ హంలో ఆరుగురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2.35 లక్షలు, కల్యాణలక్ష్మి ద్వారా 8మందికి మంజూ రైన రూ.5.20 లక్షలు, గుడుంబా అమ్మ కం మానేసిన కుటుంబానికి పునరావా సం కింద రూ.2లక్షల చెక్కులను ఆయ న పంపిణీ చేశారు. గోపిగౌడ్, ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కాంశెట్టి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement