పాలు తాగి 15 మందికి అస్వస్థత | 15 ill due tofood poison in chittoor distirict | Sakshi
Sakshi News home page

పాలు తాగి 15 మందికి అస్వస్థత

Apr 1 2015 11:49 AM | Updated on Sep 2 2017 11:42 PM

పాలు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది.

చిత్తూరు: పాలు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 70 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా పాలు తాగారు. వారిలో 15 మంది మంది విద్యార్థునులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని హుటాహుటిన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే నిల్వ ఉంచిన మూడు రోజుల క్రితం పాలు బుధవారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాలుగు రోజుల కిందట కూడా కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.   ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు స్పందించడంలేదని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement