అలో లక్ష్మణా అంటూ అన్నదాత వాపోతున్నాడు. ఆరుగాలం కష్టించినా నాలుగువేళ్లు నోటికి వెళ్లే దారిలేక, బతికేందుకు వేరే మార్గం కానరాక కుంగిపోతూ... తన దురదృష్టానికి తిట్టుకుంటూ కన్నీరుకారుస్తున్నాడు.
కరువు మేఘాలు
Oct 16 2013 6:43 AM | Updated on Sep 1 2017 11:41 PM
	అలో లక్ష్మణా అంటూ అన్నదాత వాపోతున్నాడు. ఆరుగాలం కష్టించినా నాలుగువేళ్లు నోటికి వెళ్లే దారిలేక, బతికేందుకు వేరే మార్గం కానరాక కుంగిపోతూ... తన దురదృష్టానికి తిట్టుకుంటూ కన్నీరుకారుస్తున్నాడు. తుఫాన్ వచ్చినా కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. పై-లీన్ ముప్పు తప్పడంతో కలిగిన ఆనందం... కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో ఆవిరైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రెలు వారిన నేలకు  తుఫాన్ తీరం దాటిన సమయంలో పడే వర్షాలకు జీవం వస్తుందని ఆశించిన రైతులకు, అధికారులకు నిరాశేమిగిలింది.    
	 
	 
	 
	 
	 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్:  ఈ ఏడాది కూడా  రైతులకు కష్టాలు తప్పేటట్టు లేవు.  వర్షాభావ పరిస్థితులతో జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. తుఫాన్ సమయంలోనైనా తగిన స్థాయిలో వర్షాలు పడలేదు. శని,ఆదివారాల్లో అంతంత మాత్రం గానే కురిశాయి. అదికూడా కొమరాడ, గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బలిజి పేట,చీపురుపల్లి, పూసపాటిరేగ,  భోగా పురం మండలాల్లో కొద్దిపాటి వర్షం పడిం ది.   ఖరీఫ్ సీజన్‌లో(జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి) జిల్లాలో 692.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావలసి ఉండగా 574.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. డెం కాడ, జామి, భోగాపురం, మెరకముడిదాం మండలాల్లో 40 శాతం కంటే తక్కువ వర్షపా తం నమోదైంది. విజయనగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, బొండపల్లి, గుర్ల, కొమరాడ, ఎల్.కోట, ఎస్.కోట, గంట్యాడ మండలాల్లో  50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
	 30 వేల హెక్టార్లలో నాట్లు లేవు
	 వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాం తాల్లో నాట్లు వేయని పరి స్థితి నెలకొంది. గత ఏడా ది ఖరీఫ్ సీజన్‌లో 1,20,475 హెక్టార్లలో వరి పంట సాగవగా ఈ ఏడా ది కేవలం 90 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 30,475 హెక్టార్ల లో నాట్లు వేయలేదు.
	 గుండె చెరువు...
	 గ్రామాల్లోని చెరువులను చూస్తుంటే రైతులకు గుండె చెరువవుతోంది. వర్షాలు కురవకపోవడంతో వాటిలో చుక్కనీరు చేరలేదు. దీంతో చాలా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. కనీసం చెరువుల్లో నీరున్నా  ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడైనా నాట్లు వేసుకునే పరిస్థితి ఉండే ది. నీరు లేక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు భగవంతునిపై భారం వేసి మిన్నుకుంటున్నారు. 
	 ప్రత్యామ్నాయానికి అదునులేదు 
	 సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో వరిపంటను జూల్, ఆగస్టు నెలలో వేస్తారు. వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంతో ముగిస్తారు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత ఇంకా నాట్లు వేయని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ పంటలు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి, అమలుచేస్తుంది. అయితే సెప్టెంబర్ నెలకూడా ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చినా ఉపయోగించుకులేని పరిస్థితి.   
	 అపరాలు, చోడి పంట మేలు:
	 ప్రస్తుత పరిస్థితుల్లో అపరాలైన పెసర, మినుము పంటలు లేదా, చోడి పంట వేసుకుంటే మేలని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పి.గురుమూర్తి తెలిపారు. పెసర, మినుము పంటలయితే 70 నుంచి 80 రోజుల్లో చేతికి అందివస్తాయన్నారు.  చోడి పంటయితే 100 నుంచి 110 రోజుల్లో  చేతికి వస్తుందని తెలిపారు.  ఇప్పుడు  వర్షాలు కురిసినట్టయితే స్వల్పకాలిక వరి రకాలైన 1010, పుష్కల విత్తనాలను డ్రమ్ సీడర్ పద్ధతిలో వెదజల్లుకోవాలని సూచించారు. ఈ రకాలు 100 రోజుల్లో పండుతాయని తెలిపారు.
	 పంట ఎండిపోతోంది
	 నాకున్న రెండు ఎకరాల్లో వరి వేశాను. రూ.20 వేల వర కు పెట్టుబడి పెట్టాను. నా ట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంట ఎం డిపోయింది. గత ఏడాది పంట చేతికి అందివస్తుందనుకునే సమయంలో భారీ వర్షాలకు నీట మునిగింది. ఈ ఏడాది ఇలా అయింది.  తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. ఇలా అయితే సాగు చేయడం చాలా కష్టం 
	 - వి.సింహాద్రి, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం 
	 ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగైన పంట వివరాలు   
	 పంటరకం= సాధారణం= సాగైంది
	 వరి= 1,20,475= 90,000
	 జొన్న= 475= 83
	 గంటెలు= 663= 107
	 మొక్కజొన్న= 8805= 11,116
	 చోడి= 2528= 1457
	 సామ= 680= 25
	 కొర్ర= 330= 130
	 ఊద= 124= 0
	 చిరుధాన్యాలు= 177= 0
	 కంది= 1884= 1634
	 మినుము= 1698= 423
	 పెసర= 1611= 472
	 వేరుశనగ= 22,644= 8911
	 నువ్వులు= 11956= 7012
	 చెరుకు= 15078= 15602
	 పత్తి= 10691= 13903
	 గోగు= 18965= 4680
	 పొగాకు= 269= 3
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
