11మంది మట్కా బీటర్ల అరెస్టు | 11 matka beaters arrested in ysr district | Sakshi
Sakshi News home page

11మంది మట్కా బీటర్ల అరెస్టు

Jan 24 2015 7:32 PM | Updated on Oct 16 2018 2:30 PM

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో 11 మంది మట్కా బీటర్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.

కడప క్రైం: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో 11 మంది మట్కా బీటర్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. కడప అర్బన్ సీఐ సదాశివయ్య నేతృత్వంలో పోలీసులు హవేలీనగర్, మార్కెట్ యార్డు ప్రాంతంలో దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 2.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హవేలీ నగర్‌లో ఐదుగుర్ని, మార్కెట్ యార్డు సమీపంలో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement