ఏపీలో 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు | 11 lakhs Corona tests In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Jul 11 2020 5:33 AM | Updated on Jul 11 2020 5:33 AM

11 lakhs Corona tests In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,15,635కి చేరింది. వరుసగా మూడో రోజు కూడా కరోనా నుంచి కోలుకుని వెయ్యి మందికి పైగా.. 1,040 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194కి చేరింది. 1,608 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. మొత్తం మరణాలు 292కు చేరాయి. యాక్టివ్‌ కేసులు 11,936 ఉన్నాయి.  
ఇన్ఫెక్షన్‌ రేటు    2.28% 
రికవరీ రేటు    51.90% 
మరణాల రేటు    1.15%

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement