100 మంది విద్యార్థులకు అస్వస్థత | 100 Students suffer Food poisoning | Sakshi
Sakshi News home page

100 మంది విద్యార్థులకు అస్వస్థత

Jul 2 2015 12:01 PM | Updated on Oct 5 2018 6:48 PM

మోపిదేవి మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

విజయవాడ : మోపిదేవి మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని ఆశ్రమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం జరిగింది. బుధవారం రాత్రి తిన్న భోజనం వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

కాగా పాఠశాల ఆవరణలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు వాంతులు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు సెలైన్లు ఎక్కిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులను పరామర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement