బద్వేల్ బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు దొంగలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ జిల్లా (బద్వేల్) : బద్వేల్ బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు దొంగలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను చిన్న ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో పెట్టుకుని నెల్లూరు బస్సు కోసం వెయిట్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.