పెళ్లి ట్రాక్టర్ బోల్తా: పదిమందికి గాయాలు | 10 injured as tractor overturns | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్ బోల్తా: పదిమందికి గాయాలు

Dec 6 2015 9:57 AM | Updated on Sep 3 2017 1:36 PM

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.

సింహాద్రిపురం (వైఎస్సార్‌ జిల్లా) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం రావలకొలను గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తొండూరు నుంచి బానుకోటకు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ రావలకొలను వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement