గుంటూరు జిల్లాలోని అద్దంకి రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి పై ఈ సంఘటన చోటు చేసుకుంది.
రహదారిపై ‘గేదె’ బీభత్సం
Dec 24 2015 2:03 PM | Updated on Apr 3 2019 7:53 PM
రొంపిచర్ల: గుంటూరు జిల్లాలోని అద్దంకి రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి పై ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీకి గేదె అడ్డం రావడంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో లారీ వెనక ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గుర్తించక లారీని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు వెనక గేదెల లోడుతో వెళ్తున్న మరో లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.లారీ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు .
Advertisement
Advertisement