గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్‌పోస్ట్ సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.