breaking news
-
కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వేద పారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు. వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు’’ అని భూమన ధ్వజమెతారు.‘‘శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి. ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు. ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలి. మన హిందూ జాతి మేల్కోవాలి. వేదాలను కాపాడుకోవాలి. నేను రాజకీయం చేయడం లేదు.. మన వేదాలను కాపాడుకోవాలి’’ అని భూమన పిలుపునిచ్చారు.‘‘ఏడు యజర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయి. శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయి. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామి వారి కోసం పారాయణం చేస్తారు. స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు. వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతోంది. టీటీడీ చాలా చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తుంది...వైఎస్సార్ వేద విశ్వ విద్యాలయాన్న నెలకొల్పారు. పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఆ అధికారి చదవాలి. వేద పారాయణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 700 పోస్టులు సృష్టించింది. మేం ఓడిన తర్వాత ఆ పోస్ట్‌లు ఏమయ్యాయో తెలియదు. వేదాలపై కామెంట్ ఆ అధికారి స్కంద పురాణం చదవాలి. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ అధికారి మాట్లాడుతారా అనే అనుమానం ఉంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల సాయం అందజేత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
కడప కార్పొరేషన్లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళ జరుగుతున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు నెలలుగా మీటింగ్ హాలుకు అధికారులు తాళం వేశారు. చివరికి ఇవాళ ఉదయం 11గంటలకు పాలకవర్గ సమావేశం ఉన్నా కానీ తాళం తీయలేదు. కుర్చీ కోసం.. కడప ఎమ్మెల్యే దొడ్డి దారిన కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించారనే ఆరోపణలు ఉన్నాయి.మీటింగ్ హాల్ తలుపులు తీస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడు మీటింగ్ ఉన్నా ఇంతవరకూ తాళం తీయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ హాలులో మేయర్‌తో సమానంగా తనకు వేదికపై కుర్చీ వేయలేదన్న కారణంతో.. గత రెండు సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్.మాధవిరెడ్డి తన అనుచరులతో ప్రవేశించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.తనకు లేని కుర్చీ.. మేయర్‌కు కూడా ఉండకూడదని భీష్మించుకుని.. మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేయించాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురపాలక శాఖ కార్యదర్శి ఏకపక్షంగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. మళ్లీ విచారణ చేసి మేయర్ వాదన వినాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పురపాలక అధికారులు పెడచెవిన పెట్టి పాత పద్ధతిలోనే విచారణ చేసి.. ఈనెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం కంటే ముందే మళ్లీ అనర్హత వేటు వేయాలని పన్నిన కుయుక్తులు న్యాయస్థానం ముందు ఫలించలేదు.19వ తేదీ వరకూ మేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈనెల 20వ తేదీన మేయర్ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగడం తథ్యమని తేలిపోయింది. మేయర్ కోరినా కౌన్సిల్ హాలు తలుపులు ఎందుకు తెరవలేదో.. మేయర్ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్స్ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు మేయర్‌తో సమానంగా వేదికపై కుర్చీలు వేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే కౌన్సిల్ హాలు తాళం చెవులను తన వద్ద ఉంచుకొని.. మేయర్ స్వయంగా కోరినా తలుపులు తెరవలేదని సమాచారం. దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాలు తెరిచేలా ఆదేశాలివ్వాలని జాయింట్ కలెక్టర్‌ను కోరడంతోపాటు సమావేశంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించవద్దని, పటిష్ట భద్రత కల్పిపంచాలని జిల్లా ఎస్పీని కోరారు.అంతేగాక 39 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించి తమకు భద్రత కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ల పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరపాలక సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశపు హాలులో ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేసి ఉంటే.. మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎలా స్పందిస్తారు.. కమిషనర్ ఎవరి ఆదేశాలతో.. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు.. కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు పట్టుబడతారు.. అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించబోతోంది. ఒకవేళ కుర్చీ వేయకపోతే ప్రభుత్వ విప్ ఆర్.మాధవిరెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే వైఎస్సార్సీపీ మేయర్, కార్పొరేటర్ల గోడు విని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయాల్సింది మళ్లీ అధికారులే కావడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సభ నిర్వహణకు, సభలో చేసిన తీర్మానాలను మినిట్స్ బుక్‌లో రాయించేందుకు, వాటిని అమలు చేసేందుకు, అభివృద్ధి పనులు చేసేందుకు ఇలా ప్రతి దానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, మేయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో ఎన్నడూ ప్రతిపక్షంపై అధికార పక్షం ఇంతటి ఘర్షణ పూరిత వాతావరణం తీసుకురాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్ సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్ జగన్ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. -
మా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదు: నారా లోకేశ్
సాక్షి, న్యూఢిల్లీ: ‘మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలి అస్సలు బాలేదు. నియోజకవర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మాట తీరు, వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.’’ అని లోకేశ్ అన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేశ్ భేటీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ ద్వారా సహకారం అందించాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను మంత్రి నారా లోకేశ్ కోరారు. గురువారం ఢిల్లీలో టోనీ బ్లెయిర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరినట్లు లోకేశ్ ‘ఎక్స్’లో తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు. -
బాండ్లు చూపి బాబును నిలదీయండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్ అంటూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబట్టారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్ కోడ్ వినియోగిస్తే చాలు డౌన్లోడ్ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా అన్ని హామీలు 2024 జూన్ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జగన్ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్ చేస్తున్నవే కాకుండా అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు. ⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్ గెజిట్ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా? ⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వాలి అంటే సిలిండర్‌కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్‌ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్! ⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయలసీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు. ⇒ 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు). కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది. ⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్‌లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకునేలా వైఎస్సార్సీపీ త్వరలో రిలీజ్ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్ జగన్ ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్సహించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు. ⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్ చెప్పే పీరియడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్ విధానం, రోజుకొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరుగైనవిగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్రమంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోడ్‌తో పెండింగ్ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. ⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు. ⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్దయ్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.బాబు బాదుడే బాదుడుచంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్ కోసం అమూల్‌ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు. ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్ కాకి! బెవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్ ఇస్తానన్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్. వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసేసి ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.ఇలా ఇంటింటా మోసం..మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్ ఐడీ కోడ్ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్ సైట్ లింక్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు. ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్ కాల్ ఇవ్వండి అని రాశారు. మిస్డ్ కాల్ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్ డీటెయిల్స్.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్ పెట్టారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్ఎంఎస్ అని చూపి డిమాండ్ చేయండి. ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. సంపద సృష్టి కాదు.. ఆవిరిసాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్ కో జేబుల్లోకిమా హయాంలో జీఎస్డీపీలో అప్పుల శాతం 4.08% చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12% వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పుబాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతున్నాయంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతానికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే..చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోందిరాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్ ట్యాక్స్) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది. 2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్ 24న పర్మిషన్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. -
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకేంటి సంబంధమన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తన ఫోన్‌ను దగ్గరి వాళ్లు ట్యాపింగ్ చేశారని షర్మిల చేసిన వ్యాఖ్యలపై.. మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధమేంటన్నారు వైఎస్ జగన్. ‘ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు?, కేసీఆర్ ప్రభుత్వం.. షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేసిందా?, అప్పట్లో ఆమె తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాబట్టి చేశారేమో.. చేశారో, లేదో నాకేం తెలుస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఏం సంబంధం?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకుల సమాధానమిచ్చారు వైఎస్ జగన్. ఇంకా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నేను పరామర్శకు వెళ్లడం తప్పా?పల్నాడు జిల్లాలో నిన్నటి నా పర్యటన. మా పార్టీకి చెందని ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే, నేను పరామర్శకు వెళ్లాను. దానిపై నాగమల్లేశ్వరరావు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినా, కేసు నమోదు చేయలేదు. నేను వారిని పరామర్శించడం కోసం వెళ్లడం తప్పా? వారు మా పార్టీ నాయకులు. నేను అక్కడికి పోకుండా కర్ఫ్యూ పరిస్థితి తీసుకురావడం తప్పు కాదా? నేను వెళ్లిన ఇంటి యజమానిపై కేసు పెట్టడం తప్పు కాదా?ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు.ఎవరు ఆ సమస్య సృష్టిస్తున్నారు?నా పర్యటనలో శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు. రైతుల దగ్గరకు పోయాను. పరామర్శించాను. అందులో తప్పేమిటి? నన్ను అడ్డుకోవాలని చూడడం ఎందుకు? ఎందరు రావాలో చెప్పడానికి నువ్వు ఎవరు? నన్ను చూడడానికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఎందుకు? వారికి భోజనం పెడుతున్నావా?నా అభిమానులు. నా పార్టీ కార్యకర్తలు వస్తే, నీకేం బాధ?నేను సమస్యలపై పోరాటం మొదలు పెట్టేవరకు ఆయన స్పందించడం లేదు. రైతుల దగ్గరకు నేను వెళ్తేనే కదా, ఆయన స్పందించలేదు. నేను రైతులను పరామర్శిస్తే, మీకేం బాధ?అసలు నీవు సమస్యలు పరిష్కరిస్తే, నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది?ఆ అబ్బాయి టీడీపీ సభ్యుడు నిన్నటి పోస్టర్ల ప్రస్తావన. అది పుష్ప సినిమా డైలాగ్. అది పెట్టినా తప్పేనా? ఆ ఫ్లెక్సీ పెట్టిన యువకుడు టీడీపీ సభ్యుడు. ఆయనకు సభ్యత్వం కూడా ఉంది. అంటే, టీడీపీకి చెందిన వ్యక్తి, యువకుడికి కూడా చంద్రబాబుపై కోపం వచ్చింది. అందుకే రప్పా రప్పా కోస్తాను అన్నాడు. ఏ పథకాలు లేవు. అంతా మోసం. అందుకే టీడీపీ వారిపై ఆక్రోషం చూపుతూ ఫోటోలు, ఫ్లెక్సీల ప్రదర్శన. టీడీపీ కార్యకర్త, సభ్యుడు.. మన కార్యక్రమంలో పాల్గొని, టీడీపీ వారినే రప్పా, రప్పా నరుకుతా అన్నాడు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి...చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. -
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్ జగన్ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ నోట పుష్ప ‘రప్పా.. రప్పా’ డైలాగ్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్ప 2 సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘రప్పా.. రప్పా’ డైలాగ్ కొట్టారు. కూటమి అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తాజా రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు.ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పోస్టర్లో వైఎస్ జగన్ ఫొటో కూడా ఉండటంతో అది కాస్తా ట్రెండ్‌లోకి వచ్చింది. ఈ పోస్టర్ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం ప్రెస్మీట్లో విలేకర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్ జగన్ తొలుత డైలాగ్ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్ ప్రశ్నించారు.అయితే 2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డ్ ప్రదర్శించిన వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌ను ముగించారు. -
సూపర్ సిక్స్ ఇచ్చేశారట.. ప్రశ్నిస్తే నాలుక మందమా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. విద్యా రంగంలో మేము తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ నాలుక మందం అని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.‘రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టారు. గట్టిగా నిలదీస్తే ప్లేట్ మార్చి రూ.15వేలు కాదు.. రూ.13వేలే అంటున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని బాబు ప్లేట్ మార్చారు. మరోసారి ప్లేట్ తిప్పేసి 54 లక్షల మందికి ఇస్తామంటున్నారు. ఏపీలో ూసూపర్ ిసిక్స్ ఇచ్చేశామని చంద్రబాబు చెబుతున్నారు. హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు. అన్ని హామీలు తీర్చేశారంట. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ నాలుక మందం అని బెదిరిస్తారు. ఇంకా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. అక్రమ అరెస్ట్‌లు చేశారు.గతంలో ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ తల్లికి అమ్మ ఒడి ఇచ్చాం. ప్రభుత్వ విద్యా రంగాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు. మా హయాంలో తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. కాలేజీల నిర్వహణ భారమైపోయాయి. ఉన్నత విద్య కుంటుపడింది’ అని తెలిపారు. బాబు.. బాదుడే.. బాదుడే.. చంద్రబాబు అన్ని రకాలుగా బాదుతున్నారు. మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు తీసేశారు. రూ. 15వేల కోట్ల కరెంట్ ఛార్జీలతో బాదుడే బాదుడు.ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలను చంపేసి ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు పెంచారు. సబ్సిడీకే కంది పప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేశారు. ఇంటింటికీ రేషన్ ఇచ్చే వాహనాలను ఆపేశారు. ఉన్న పీఆర్సీని రద్దు చేశారు. కొత్త పీఆర్ఎసీ అమలుకు నోచుకోలేదు. ఐఆర్ ఇస్తామని ఉద్యోగులను మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు మోసంతో జనం ఇబ్బంది పడుతున్నారు. -
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్ట్ చేశారు. అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్‌గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్ స్టేట్ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్.. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. తిరుపతి.. ఆర్సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి. -
QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్‌మెన్ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్‌బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్‌కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్‌న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
నిజం దాచి ఎల్లో మీడియా విష ప్రచారం.. అసలు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చి అబద్దాలను పచ్చ కూటమి వల్లె వేస్తోంది. సత్తెనపల్లిలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారం చూసి జనం అవాక్కవుతున్నారు.నిజానికి జయవర్ధన్ రెడ్డి అస్వస్థతతో మృతి చెందారు. ర్యాలీ పాల్గొన్న సమయంలో ఆయన అలసటకు గురయ్యారు. అలసటతో ఒక షాపు ఎదుటకు వెళ్లి కూర్చున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత వెళ్లేందుకు లేచిన జయవర్ధన్ కుప్పకూలారు. వెంటనే స్థానికులు బైకు మీద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయవర్ధన్ మృతి చెందారు. దీనిపై కూడా ఎల్లో బ్యాచ్ విష ప్రచారం చేస్తోంది. -
ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించాలని చూస్తున్నారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని చెవిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్-కృష్ణవేణిలను వేధించారు. రాజ్‌కుమార్‌ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్ జగన్ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్ జగన్
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ ప్రస్తావించారు. -
జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా
సాక్షి,గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానుల్ని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్ ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్ఐఆర్ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం...మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు. -
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్ మీడియాను మేనేజ్ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది. -
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం: చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు.లిక్కర్ వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మేము లిక్కర్ ఎప్పుడూ పంచ లేదు, విక్రయించలేదు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మా గన్ మ్యాన్, పీఏ, మా సిబ్బందినీ కూడా బెదిరిస్తున్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు. -
ప్రశ్నిస్తానన్న పవన్.. ఏమైపోయావ్?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయారని.. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం ఆయన ‘‘జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?. తల్లికి వందనం పథకంపై కూటమి నాయకులు డబ్బులు కోరుకుంటున్నారు. ఏడాది కూటమి పాలనలో స్త్రీ శక్తి పథకం డబ్బులు ఎవరికీ వేశారు?. రాష్ట్ర మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా?. ఏ ఆగస్ట్‌లో ఈ ఉచిత బస్సు అమలు చేస్తారు?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో పూర్తిగా దెబ్బతింది. ప్రజలు ప్రభుత్వన్ని నిలదీస్తారని రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేసేవాళ్లం. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్సార్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. 1 లక్ష 50 వేల కోట్లలో పోలవరానికి ఎంత కేటాయించారు?. మైనింగ్ కార్పొరేషన్లో గనులకు వచ్చే లక్షల కోట్ల రూపాయల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి’’ అని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పిఠాపురంలో జనసేన కార్యకర్త అన్యాయన్నీ ప్రశ్నించాడని ఊరు నుంచి వెలివేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేస్తే వీడియో కాల్లో పరామర్శిస్తారా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. -
బాబూ.. ప్రజాదరణ ఉన్న జగనన్నను అడ్డుకుంటారా?: రోజా
సాక్షి, నగరి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా?. చంద్రబాబు గారూ.. మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా?. ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడటం ఏ మాత్రం కరెక్టు కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
చెవిరెడ్డి అక్రమ అరెస్ట్.. తిరుపతిలో నిరసనలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై పార్టీ కార్కకర్తలు కదం తొక్కారు. కూటమి అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని, అక్రమ అరెస్టులు నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు పార్టీ కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. కూటమికి అంతిమ ఘడియలు ప్రారంభమైనట్టు హెచ్చరించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై తిరుపతిలో ఆగ్రహజ్వాలు వ్యక్తమవుతున్నాయి. భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి.. తామంతా వారి వెంటే ఉంటామని నియోజకవర్గపు కార్యకర్తలు భరోసా ఇచ్చారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభం అయ్యాయని కార్యకర్తలు హెచ్చరించారు. చెవిరెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.మరోవైపు.. చెవిరెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి స్పందించారు. ఈ క్రమంలో గురుమూర్తి ట్విట్టర్ వేదికగా..‘వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అతి త్వరలో ప్రజాగ్రహానికి ఆహుతి కాక తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. @YSRCParty సీనియర్ నాయకులు Dr చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది గారి అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు… pic.twitter.com/PgqNTGA8ND— Maddila Gurumoorthy (@GuruMYSRCP) June 18, 2025