breaking news
-
కొమ్మినేని అరెస్ట్‌పై వైఎస్ జగన్ స్పందన
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం (జూన్9న) ఉదయం హైదరాబాద్ తన నివాసంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2025 -
కొమ్మినేని పారిపోయే రకం కాదు: దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: కొమ్మినేని శ్రీనివాస్‌ను ఏపీ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని, వేధించడం పద్ధతి కాదని మరో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు.. మీడియాను కూటమి నేతలు రాజకీయమయం చేసేశారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించింది. అయినా కూడా 70 ఏళ్ల వయసులోనూ కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదు.మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోంది. కొమ్మినేని టెరరిస్ట్ కాదు. పారిపోయే వ్యక్తి అంతకన్నా కాదు. విశ్లేషకుల అందరిపైనా కొమ్మినేనిపై పెట్టినట్లే అక్రమ కేసులు పెడతారా?. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటే ఎలా? అని అమర్ ప్రశ్నించారు. -
‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్‌పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్‌కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్‌లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్‌కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్‌ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు. -
‘కొమ్మినేని అరెస్ట్‌కు 200 టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల కుట్ర’
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఆర్గనైజ్డ్గా టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజులుగా టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న రాద్దాంతం దారుణం. విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, కృష్ణం రాజు మాటలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆపేశారు. అసలు విషయాలు పక్కకు పోతాయని, అనసవర విషయాలు పట్టించుకునే వాళ్లం కాదు. దుర్మార్గులు, పిరికివాళ్లు అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని. వాళ్లు ట్వీట్ పెట్టడంతో వారు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనే అనుమానం వచ్చింది.కృత్రిమంగా ఆర్గనైజ్డ్ చేసిన నిరసనలే. ఈనెల 6వ తేదీ ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని షోలో కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆ షోలో ఓ అంశం పై కృష్ణం రాజు వ్యాఖ్యలు. 24 గంటల తర్వాత పథకం ప్రకారం రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ, ఆ పార్టీ ప్రచార సంస్థలు, 200 యూట్యూబ్ ఛానల్స్ మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా చేస్తోంది అధికార పార్టీనే.6వ తేదీన జరిగిన డిబేట్ లో అమరావతి చుట్టుపక్కల గురించి ప్రస్తావన వచ్చినపుడు కొమ్మినేని వారించారు. కొమ్మినేని వారించారు...డిబేట్ కూడా అయిపోయింది. ఆ డిబేట్ తర్వాత మరోసారి ప్రసారం కాలేదు. కొమ్మినేని కానీ, కృష్ణంరాజు కానీ మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. 7వ తేదీ నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఏబీఎన్, టీవీ5లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా వందల డిబేట్లు నిర్వహించారు. కానీ మేం ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం దూర్భషలాడేవాళ్లు...సత్తా లేనివాళ్లు మాత్రమే ఇలా చేస్తారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఇలాంటి దూర్భషలాడేలా వ్యవహరించలేదు. లేని సమస్యను సృష్టించి విషప్రచారం చేయడం టీడీపీకి, చంద్రబాబుకు అలవాటు. నారా లోకేష్ ట్వీట్ పెట్టిన తర్వాత మాకు అనుమానం వచ్చింది. సాక్షి మీడియా కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించింది.ఇలాంటివి తామెప్పుడూ ప్రోత్సహించమని సాక్షి స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఖండన విడుదల చేసింది.8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, దుర్భాషలు, సాక్షి ఆఫీస్‌పై దాడులతో పరాకాష్టకు చేరింది. తన షోలో జరిగిన అంశం కాబట్టి కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పారు. టీడీపీ వాళ్లు ఆర్గనైజ్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అంచెలంచెలుగా ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలని చూస్తున్నారు. అమరావతిని పొరబాటున ఎవరైనా ఏదైనా అంటే రాష్ట్రమంతా కదిలొస్తుందని చూపేందుకు ఆర్గనైజ్ గా కార్యక్రమాలు చేపట్టారు.చంద్రబాబు ట్వీట్‌తో సహా టీడీపీ అధికారిక మీడియాలో మూడు రోజుల నుంచి అమరావతి మహిళల పరువు తీస్తున్నారు. అదే పనిగా మహిళల పరువును తీసేలా వ్యవహరించినది ఎవరు? రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రం మొత్తాన్నీ అవమానించినట్లేనా. చంద్రబాబు ఒక పథకం ప్రకారం తనకు తెలిసిన ఏకైక విద్యను ప్రదర్శిస్తున్నాడు. కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిజంలో పొరబాటున కూడా ఒకరిని ఒక మాట అనలేదు. ఎన్టీవీలో నిస్పక్షపాతంగా డిబేట్లు చేసినందుకు ఉద్యోగంలోంచి తీయించాడు. ఉద్యోగం తీసేవరకూ ఎన్టీవీ ప్రసారాలను చంద్రబాబు నిలిపివేయించాడు. ఆతర్వాత కొమ్మినేని సాక్షి టీవీలో చేరారు.ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజూ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు ...పోలీసుల దుర్మార్గాలు ఎవరికీ కనబడటం లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మహిళల పట్ల ఏదైనా ఘటన జరిగితే స్పందించిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. అనంతపురంలో 14 ఏళ్ల బాలికను చంపేస్తే ఈ ప్రభుత్వానికి కనిపించదు. కంప్లెంట్ ఇచ్చిన రోజే పోలీసులు స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో ఉండేది. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను ఇంటికి కేంద్రబిందువుగా గుర్తించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి జగన్ మోహన్ రెడ్డి మహిళలను కించపరుస్తారా. ఈ ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనించాలి. అరెస్టులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చిందిఓ సీనియర్ జర్నలిస్టును ఈ విధంగా అరెస్ట్ చేయడం.. మొత్తం మీడియాకే ప్రమాద ఘంటికలు. చంద్రబాబును పొగిడితేనే మీడియాకు మనుగడ ఉంటుందనేలా హెచ్చరిస్తున్నారు. ఓ జర్నలిస్టు డిబేట్ పెడితేనే చంద్రబాబు భయపడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025 -
YSRCP: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది. -
‘కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్ట్‌ను నాశనం చేస్తున్నారు’
రాజమహేంద్రవరం: కమీషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను తాజాగా ప్రాజెక్ట్‌ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ తన నివేదికలో బయటపెట్టిందని అన్నారు. సీడబ్ల్యుసీ ఆమోదించిన దానికి భిన్నంగా డయాఫ్రం వాల్ డిజైన్లు, కాంక్రీట్ నాణ్యతలో ప్రమాణాలు లేకపోవడం, లోపభూయిష్టమైన విధానాలతో మొత్తం ప్రాజెక్ట్‌నే ప్రమాదంలోకి నెట్టేట్టుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరంపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సిఫారస్ల మేరకు ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే....చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో చేసిన తప్పులనే మళ్ళీ పునరావృతం చేస్తూ పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుల నుంచి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా కమీషన్ల కక్కుర్తితో రూ.990 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. గతంలో సబ్ కాంట్రాక్టు పనులు చేసే బావర్స్ కంపెనీకి నేరుగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు అప్పగించేశారు. దీంతో పనుల్లో జాప్యం, నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన ఒక నివేదికలో వెల్లడించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ను తుంగలో తొక్కి 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నారని తప్పుపట్టింది. కాంక్రీట్ మందం సగానికి సగం తగ్గించేసినట్టు నిపుణుల కమిటీ తన నివేదికలో బట్టబయలు చేసింది. రాబోయే రోజుల్లో 190 టీఎంసీల నీటిని నిల్వచేసే పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం. పునర్ నిర్మాణం చేసే పనుల్లో కూడా కనీస బాధ్యత తీసుకోవడం లేదు.నిపుణుల పరిశీలనతో బయటపడ్డ డొల్లతనంపోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్‌బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి మే నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ, వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది.నిబంధనలకు విరుద్ధంగా డయాఫ్రం వాల్ పనులుపోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్-2లో కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్‌కు విరుద్ధంగా పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించింది. దీంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని, కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది. గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై ఎయిర్ బబుల్స్ (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి, మళ్ళీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్‌ను మరో ప్యానల్‌తో నిలువునా జత చేసేటప్పుడు 7.5 సెంటీమీటర్లకు బదులుగా కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది. ప్రాజెక్ట్ పనుల్లోనూ తీవ్ర జాప్యంప్రధాన డ్యాం గ్యాప్-2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు 3 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. దాదాపు 35 రోజులు వెనుకబడి ఉన్నారు. పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే, సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందని కమిటీ చెప్పింది.’ అని పేర్కొన్నారు. -
‘నువ్వా విలువల గురించి మాట్లాడేది’.. అనితపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
సాక్షి,విశాఖ : హోంమంత్రి అనితపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైరయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని,ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను మా పార్టీ ఎంత మాత్రం సమర్ధించదు.రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు. వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోం మంత్రి అనిత ఏం చేశారు..? కనీసం స్పందించారా..? ఈ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా..?. విలువలు నేర్పించే అర్హత హోం మంత్రి అనితకు ఉందా..? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోం మంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా జరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. -
‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్‌ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే. -
‘సీజ్ ద షిప్ అన్న మీరు.. లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?’
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్‌ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?, ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు. -
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్‌ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, కాగ్ నివేదికల్లో వాస్తవాలను ఉటంకిస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కూటమి సర్కార్ చెబుతున్న అబద్ధాలను కడిగి పారేశారు. ఇంకా ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒కాగ్ 2025 ఏప్రిల్‌కు సంబంధించి కీలక సూచికలను వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమవుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 ఏప్రిల్‌లో నికర జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా మే 1న ప్రభుత్వం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ⇒ కానీ.. కాగ్ నివేదికలో వాస్తవ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క అబద్ధమని తేల్చింది. 2024 ఏప్రిల్‌తో పోల్చితే, 2025 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది. కాగ్ వాస్తవాలను బట్టబయలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ ఆదాయాలు చెప్పకుండా, మేలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.⇒ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌కు సంబంధించి ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్ల కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ.796 కోట్లు తగ్గాయని ఆ పత్రికా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్లను మైనర్ హెడ్ 110 కింద లెక్కిస్తారు. ప్రభుత్వ ఖాతాల మేజర్ హెడ్ 0006 కింద ఎస్జీఎస్టీని లెక్కిస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఈ సర్దుబాట్లన్నింటినీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలను లెక్కకడతారు.⇒ 2025 ఏప్రిల్‌కు సంబంధించి నికర జీఎస్టీ ఆదాయం రూ.3,354 కోట్లుగా ఉన్నట్లు మే 1న పత్రికా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. ఇపుడు సర్దుబాట్లు కారణంగా రూ.796 కోట్ల ఆదాయం తగ్గిందని చెబుతోంది. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే.. దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగమనంలో ఉంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 12.76 శాతం తగ్గింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం. -
కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్సీపీ ఖండన
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
కూటమి వైఫల్యాలు దృష్టి మళ్ళించేందుకే 'ఈనాడు' భజన కథనాలు
సాక్షి, శ్రీకాకుళం: అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా 'ఈనాడు'లో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు.చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ ఈనాడు రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమంటున్నారంటే..చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఇంకా కొంత పెండింగ్‌లో ఉంది. వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉంది.పెన్షన్ల పథకం అమలులోనూ మోసంకూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్, అలాగే 143 హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి. పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా? ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి. అలా ఇచ్చినట్లయితే అదనంగా 20 లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న 66 లక్షల పెన్షన్లకు అదనంగా మరో 20 లక్షలు కలిస్తే, మొత్తం 86 లక్షల పెన్షన్లను ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అలా జరుగుతోందా? పైగా వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి, వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు, మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇళ్ళ వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్ళకు పిలిపించుకుని, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారు.అధ్వాన్నంగా శాంతిభద్రతలురాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, కక్షసాధింపులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే చాలు వెంటనే దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి, బురదచల్లుతున్నారు. రాష్ట్రంలో ఇలా పెట్టుబడిదారుపై దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు.కానీ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలపై మామూళ్ళ కోసం దాడులు, వేధింపులతో ఒక భయోత్పాతంను సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ కంపెనీని వేధించారు. అలాగే రాయలసీమలో సిమెంట్ కంపెనీలపై, పోర్ట్ల్లో రవాణా వాహనాల నుంచి మామూళ్ళ కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎంఓయులు చేసుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు. కూటమి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు. దావోస్‌కు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు.పథకాల అమలుపై స్పష్ట ఏదీ?రాష్ట్రంలో 1.60 కోట్ల దీపం కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.869 కోట్లు కేటాయించారు. ఇవి వాస్తవం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దీనిని అమలు చేస్తారు? ఏడాదికి సుమారు రూ.32,400 కోట్లు అవసరం. ఉచిత బస్సు అన్నారు, దాని అమలు ఊసే లేదు. యువగళం అంటూ నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.ఎంతమంది నిరుద్యోగులకు దీనిని ఇచ్చారు? రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వన్నీ ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా? అమ్మ ఒడి కింద గత ఏడాది పూర్తిగా దాదాపు 80 లక్షలకు పైగా విద్యార్ధులను, వారి తల్లులను దగా చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఎగ్గొడతారో తెలియదు. రైతులకు ఇస్తామన్న రైతుభరోసా ఏమయ్యిందీ? కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇచ్చే రైతుభరోసాపై గతంలో చంద్రబాబు పలుసార్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే దానితో కలిపే ఇస్తామని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నారు? కనీసం అలా అయినా ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాము. కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎల్లా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్సార్ వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్ననేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటివెలుగు, విదేశీ విద్యాదీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన, కాపునేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్దిదారులకు రూ.36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం.దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడింది. అలాగే 2023-24 లో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 22 శాతం. పారిశ్రామిక, వ్యవసాయ గ్రోత్‌లో ప్రగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి పాలనలో జీడీపీ గ్రోత్ 22 శాతం తగ్గిపోయిందంటే వారి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.2024-25కి సంబంధించి కూటమి ఏడాది పాలనలో స్టేట్ జీఎస్టీ రెవెన్యూ రూ.2652 కోట్లు అయితే, 2023-24 వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో వచ్చిన రాష్ట్ర జీఏస్టీ రెవెన్యూ రూ.3499 వచ్చింది. అంటే సుమారు 24 శాతం ఆదాయం తగ్గిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ప్రతిసారీ చెబుతూ ఉంటారు. 3.3 లక్షల కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు రూ.1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్‌లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్. -
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
రైతుల గోడు పట్టదా?: కూటమి సర్కార్‌పై కారుమూరి ఫైర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారుసిండికేట్గా మారిన పొగాకు కంపెనీలురాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్‌గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.రైతుల వేదన అరణ్య రోదనరాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్‌ఫెడ్‌తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్‌ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండివైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్‌ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్‌ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్‌ను పట్టుకున్నారు.ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి. -
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.శంషాబాద్‌లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. -
పవన్‌కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్ లెక్కలతో వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా కాగ్ నివేదికలను బయటపెట్టారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించింది. 2024 ఏప్రిల్‌తో పోల్చితే 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోంది.టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం’ అని చెప్పుకొచ్చారు. April 2025 fiscal performance indicates further distressThe CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances. On 1st May, the Government made a press release suggesting that the… pic.twitter.com/oGwLzKXzQZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025 -
పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసుల వేధింపులు: సజ్జల
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్దులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్‌కు యూనిఫారం వేసినట్లుంది.లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. డీఎస్పీకి సివిల్ మ్యాటర్లో ఏం పని. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చేయగలరు. శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి. దీని వెనుక టీడీపీ నేత ఉన్నారు. సంఘ విద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది. ఒక్కరిపై చర్యలు లేవు. మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు. కృష్ణవేణి, సుధారాణిలను వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. ఇంత కన్నా దిగజారడం ఉంటుందా?. చంద్రబాబు, లోకేష్‌లు పరిస్థితి గమనించాలి. అదుపు తప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయి. లక్ష్మీనారాయణ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. దాడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపేక్షించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్‌కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్‌లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్ షాక్ తగలినట్టు అయ్యింది.అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..‘ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కోనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందిస్తాను. నా రాజీనామా విషయం మా తండ్రితో ముందే చర్చించాను. ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా?
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి ఎలాంటి ఆధారాలూ లేవని బాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా ? అందుకే మొన్నటి కేబినెట్ భేటీలో పిల్లిలా సన్నాయినొక్కులు నొక్కారా ? అదే అనిపిస్తోంది. వాస్తవానికివైఎస్ జగన్ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్ కార్పొరేషన్ చేసింది.. లాభమంతా కార్పొరేషన్ కు వస్తుంది.. కార్పొరేషన్ అంటే ప్రభుత్వం .. అంటే సర్కారుకు లిక్కర్ వ్యాపారం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.. పైగా వీధుల్లో ఇష్టానుసారం దుకాణాలు.. అక్రమ బెల్ట్ షాపులు కూడా లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మద్యం ద్వారా భారీ ఆదాయం రావడంతోవైఎస్ జగన్ కూడా సంక్షెమ పథకాలు దర్జాగా అమలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ కుంభకోసం అనే కాన్సెప్ట్ ను ప్రజల్లోకి ఎక్కించేందుకు యాతన పడ్డారు. అనుకూల మీడియాలో రకరకాల వార్తలు రాయించారు..పనిలోపనిగా అప్పటి ఏపీ బీసీఎల్ ఎండీ వసుదేవరెడ్డిని ... రాజ్ కసిరెడ్డిని ఇంకొందరిని అరెస్ట్ చేసి అదేదో పెద్ద కుంభకోణం అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు తపనపడ్డారు. ఇదే ఊపులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా లీకులు ఇచ్చారు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నిన్న వాస్తవాలు చెప్పేసారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద స్పష్టత ఇచ్చేసారు. "నన్ను స్కిల్ స్కాములోవైఎస్ జగన్ సర్కారు అరెస్ట్ చేసింది కదాని నేను ఆయన్ను లిక్కర్ కుంభకోణంలో ఎలా అరెస్ట్ చేస్తాను.. ఆధారాలు ఉండాలి కదా.. అవి లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలకు దొరికిపోతాం కదా." అనేసారు.. అంటే రాష్ట్రంలో ఆనాడు కుంభకోణమే జరగలేదని చంద్రబాబు అన్యాపదేశంగా కేబినెట్లో ఒప్పేసుకున్నారు. అంటే అది అసలు కుంభకోణమే కాదని.. కేవలంవైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలెట్టిన దుష్ప్రచారం అని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లు కేబినెట్ సహచరులు చెబుతున్నారు. మరి ఏమీ లేనిదానికి ఇలా కుంభకోణం అని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే వచ్చి ఏడాది అయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుచేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో నెల ఒక్కో అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి వారి దృష్టిని మరల్చడానికి చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు అర్థం అవుతోంది..-సిమ్మాదిరప్పన్న -
‘పవన్.,. మీ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?’
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్‌ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. -
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్‌లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్‌లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్‌లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.