ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్‌ లెక్కలతో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | YS Jagan Tweet On CAG Report Over AP Financial Situation | Sakshi
Sakshi News home page

ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్‌ లెక్కలతో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Jun 7 2025 1:15 PM | Updated on Jun 7 2025 2:59 PM

YS Jagan Tweet On CAG Report Over AP Financial Situation

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా కాగ్‌ నివేదికలను బయటపెట్టారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించింది. 2024 ఏప్రిల్‌తో పోల్చితే 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.

ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోంది.

కాగ్ నివేదికలను బయటపెట్టిన వైఎస్ జగన్

టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement