‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్‌పై ఉన్మాదపు చర్య’ | Ambati Rambabu Strong Reaction On Kommineni Srinivasa Rao Arrest, More Details Inside | Sakshi
Sakshi News home page

కిర్రాక్‌ ఆర్పీ, సీమ రాజాలాంటి వాళ్లపై చర్యలుండవా?: కొమ్మినేని అరెస్ట్‌పై అంబటి ప్రశ్న

Jun 9 2025 2:32 PM | Updated on Jun 9 2025 4:26 PM

Ambati Rambabu Strong Reaction On Kommineni Arrest

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్‌ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్‌ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు.  సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్‌ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్‌ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్‌కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. 

తన డిబేట్‌లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్‌లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్‌కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. 

చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. 

బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్‌ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా.  

ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.

బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు.

కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement