breaking news
Seema Raja
-
గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా
-
‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్‌పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్‌కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్‌లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్‌కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్‌ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్‌గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్‌పై షేక్ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. కారు హారన్ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్‌లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. ముగ్గురినీ కారులో చిట్వేల్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్ చౌదరి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్యఅకారణంగా కొట్టారు మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు. – షేక్ రసూల్పోలీస్ స్టేషన్లోనూ రెచ్చిపోయారుచిట్వేల్ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్లో కూడా అలాగే రెచ్చిపోయాడు. – కె పెంచలయ్య