breaking news
-
‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయాలనే గొంతులను మాత్రం ఏడాదిది నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, జూన్ 12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. ‘తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నామని అబద్దం చెబుతున్నారు.రికార్డ్స్ ప్రకారం దాదాపు 87 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి. పదమూడు వేల కోట్ల రూపాయిలు తల్లికి వందనం పథకానికి కావాలి. కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం అని తెలియదా?, దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా?, దమ్ము దైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబూ?, ప్రజా స్వామ్య విలువలు పాటించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు?, ఒక పథకాన్ని అమలు చేయడంలో ఇంత వంచనా?, ఇవ్వాల్సిన సొమ్ములో రెండు వేలు కట్ చేసి, తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు?, P4 అనేది ప్రణాళిక లేని కార్యక్రమం. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళితుల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు?, రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు.శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలి అనుకుంటున్నారా?, ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతగా రైతులు తిరగ బడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.ప్రభుత్వం పై రైతులు తిరగబడితే రౌడి లా కనపడుతున్నారా?, రైతులను రౌడీలంటూ అగౌరవపరుస్తారా?, ఇదేనా మీ సంస్కారం?’ అని విమర్శించారు. -
చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మరోమారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గురువారం.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన-రైతాంగానికి ఇచ్చిన హామీలు- అమలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకులు పి.మధు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైపోయిందని.. రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక ఒక ఖరీఫ్, ఒక రబీ సీజన్ అయిపోయాయి. కేంద్రం ఇచ్చేవి కాకపోయినా మీరు ఇస్తామన్న 14 వేలైనా ఇవ్వాలి కదా. గతంలోనూ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండు కిస్తీలు ఎగ్గొట్టేశాడు...రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బోనస్ రూపంలో రైతుకు కొంత సాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనీసం రైతుల గురించి ఆలోచన చేయడం లేదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.‘‘ఏడాది నుంచి మెట్రో రైలు, రింగ్ రోడ్డు, ఐకానిక్ వంతెనలు అంటూ భజన చేస్తున్నారు. కృష్ణానదిపై 15 కిలోమీటర్లకు ఒక ఐకానిక్ వంతెన కట్టాలని ఓ ఛానల్లో చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా పిచ్చి ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. ఏదో స్వప్రయోజనం మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తున్నాడు. భూములను 22ఏలో చేర్చి చిన్ని చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భూములు రైతుల వద్ద కాకుండా.. ప్రభుత్వం వద్దే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన.అమరావతిలో భూములిచ్చిన రైతులకు హామీలిచ్చి మోసం చేశారు. గతంలో గ్రాఫిక్స్‌తో మూడేళ్ల పాటు కథ నడిపించారు. ఇప్పుడు మళ్లీ 45 వేల ఎకరాలు రాజధానికి తీసుకుంటామంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కడతామంటున్నారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు అవసరమా?. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సింది తాగు, సాగునీరు కానీ.. ఎయిర్ పోర్టు కాదు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు కడితే సరిపోదు. ఎక్కేవాడు కావాలిగా.. ఇన్నేళ్ల అనుభవమున్న నిన్ను ఏమనుకోవాలి?. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజావ్యతిరేకమైన పిచ్చి ఆలోచనలను మానుకోవాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
జగన్ పర్యటనల్లో TDP మార్క్ పోలీసింగ్!
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనల సందర్భంగా పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం హోదాలో ఆయనకు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ కింద భధ్రత కల్పించడం లేదు. ఎక్కడికి వెళ్లినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పొదిలి పర్యటనలో ఓ అడుగు ముందుకు వేసి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు.జగన్ పొదిలి పర్యటన సందర్భంగా అధికార పార్టీ టీడీపీ మార్క్ పోలీసింగ్ కనిపించింది. నిరసన పేరిట ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీవాళ్లను వదిలేసి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. గొడవ చేశారంటూ ఇప్పటికే 15 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసులు(హత్యాయత్నం) కేసు పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.అయితే గొడవలు చేసిన వారిని వదిలి పెట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించేందుకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ వెళ్లారు. అయితే ఆ పర్యటనలో జగన్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. నల్ల బెలూన్లు, ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో మహిళలను ముందుంచి టీడీపీ కార్యకర్తలు కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తిరిగి వైఎస్సార్సీపీ వాళ్లే ఈ దాడికి పాల్పడారంటూ ఇప్పుడు కేసులు పెడుతున్నారు. -
‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.మరోవైపు.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
మానసికంగా ఆరోజే చచ్చిపోయా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్‌పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయయారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏవిధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కూటమి మాయమాటలతో.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ (2024 అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి) దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఈ మధ్య రోజుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే!. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోసిన ప్రతీ కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు.. అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్‌పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు. నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది. గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం. కానీ అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చిందనే కేసు పెట్టారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టి వదిలేయని చెప్పింది. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్‌లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా. ఈ మధ్య.. ‘నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికేనా?’ అని ఈనాడు లో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్‌లో మచిలీపట్నంకు సంబంధించిన ఒకటి పోర్ట్.. రెండోది ఇళ్ల పట్టాలు సమస్య చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారు. అయినా కూడా 15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి ఇచ్చాం.అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది. అప్లికేషను నంబర్ల నుంచి వాటి నరిహద్దులతో సహా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది?. 500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళ్తున్నారట. ఎంతకు అమ్మారు.. పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా? అని అడుగుతున్నారట. ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు. -
సాగుకు శాపం.. 'బాబుదే ఈ పాపం': వైఎస్ జగన్
గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడి పోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా రూ.11,781తో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. ఎన్ని కేజీలు కొన్నారు? ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటా కూడా కొనలేదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, ఇటీవల ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరులో ఒకరు, కొండపిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్‌ఫెడ్‌ను వెంటనే రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడ అధికారులు, రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, రైతులకు కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ చెల్లించిందని చెప్పారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అదే ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే అది పూర్తిగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రైతు భరోసా లేదుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టారు. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను, దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం. జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా చార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేశారు. రైతు దళారీలకు అమ్ముకున్నాడు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటా వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించాం. ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను కూర్చోబెట్టి.. ప్రతి పంట ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్డేట్ చేయించాం. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.పొగాకుకు మద్దతు ధర పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరం (2023–24)లో కూడా కేజీ రూ.360 చొప్పున క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా క్వింటా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయింది. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. ఏం మాట్లాడుతాడోనని.. అల్లరవుతామేమేనని వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. కేవలం 40 మిలియన్ టన్నులు మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం కిలో రూ.220 నుంచి రూ.260 మధ్య అమ్ముడుపోతోంది. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రావడం లేదు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు. ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. ఆ ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కు తీసుకెళ్తున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల మధ్యకొచ్చాం. సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్ణాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్‌ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈ రోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. రూ.4 లక్షల పరిహారం ఘనత మాదేపొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చి రైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా.. వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్‌గా ఈ–క్రాప్ జరిగేది. ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా ఐదు ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చాం.రైతులను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ‘ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువగా పండించండి.. మేము కొనుగోలు చేస్తాం’ అని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్‌కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పంటను కొంటామని హామీ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం 30 శాతం పెరిగింది. ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఇతర పంటలదీ అదే దుస్థితి నిన్న (మంగళవారం)నే మా ఆఫీస్‌కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1,050 ఉండేది. ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్‌కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606కి పడిపోయింది. ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం.ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాంపొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసాఅన్నదాతలు, అధికారులతో ముఖాముఖిపొదిలి/కొనకనమిట్ల: పొగాకు రైతులు అధైర్య పడొద్దని, ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పంట ఉత్పత్తి, ధరలు, రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు. వేలం అధికారి గిరిరాజ్‌కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్‌కు వివరించారు. ‘4,390 మంది రైతులు 2,601 బ్యారన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారు. 8,534 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా, 11,031 హెక్టార్లలో సాగు చేశారు. 11.10 మిలియన్ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా, 18 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నాం. బ్రైట్ రకం కిలో రూ.265, మీడియం రూ.225, లో గ్రేడ్ రూ.180 సగటు ధరగా కొనుగోలు చేస్తున్నాం. బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లోనూ 25% ఉత్పత్తి పెరిగింది. బయ్యర్లు లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో రిజక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది’ అని తెలిపారు. ‘లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిల్వ ఉంది. సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది. రిజక్షన్ బేళ్ల సంఖ్య పెరిగింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ధైర్యం వీడొద్దని, రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు, రైతులకు మేలు జరిగేలా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు, పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు. జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్హం. -
జగన్‌ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్ టార్గెట్: వైఎస్సార్సీపీ
సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైఎస్ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు.జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే.పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైఎస్ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు.పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్.రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్లు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి ప్రోత్సహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.టీడీపీ నేతలు సిగ్గుపడాలి: చుండూరి రవికిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి రవి అన్నారు. -
‘డైవర్షన్ పాలిటిక్స్‌కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్‌కి తెగబడ్డారు. వారి దిగజారుడు రాజకీయాలకు మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. మహిళల నిరసన పేరిట సాక్షి కార్యాలయాలను టార్గెట్ చేసుకుని గడిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు టీడీపీ కుట్ర చేసింది.మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం, రక్షణ కల్పించడం వంటివి చేయకపోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మహిళా కార్యకర్తలను పంపించి, వారి వెనుక టీడీపీ కార్యకర్తలను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదుసాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. చంద్రబాబులా మహిళల గురించి ఏనాడైనా వైఎస్ జగన్ చులకనగా మాట్లాడటం జరిగిందా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకనే అవమానించేలా మాట్లాడిందే చంద్రబాబు. దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మహిళలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలతో అండగా నిలిస్తే, చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు మహిళలను వాడుకుంటున్నాడు.ఈ ప్రభుత్వంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదు. డైవర్షన్ పాలిటిక్స్‌తో ఎంతోకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. ఇలాంటి కుట్రలు, వక్రీకరణలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలి. కూటమి మోసపు హామీలు నమ్మి మోసపోయామని ఇప్పటికే మహిళలు ఆందోళనగా ఉన్నారు. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాం. మార్క్‌ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్‌ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
సాక్షిపై విషం చిమ్ముతూ.. మరింత దిగజారిన టీడీపీ!
సాక్షి, అమరావతి: అధికార పార్టీ తెలుగు దేశం మరింత దిగజారిపోయింది. అమరావతి మహిళలను టీవీ డిబేట్లో అగౌరవపరిచారంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతోంది. ఇప్పుడేమో సోషల్ మీడియా వేదికగానూ అసత్య ప్రచారాలతో ‘సాక్షి’పై విషం చిమ్ముతోంది.తాజాగా.. ఏలూరు సాక్షి కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టి ఫర్నీచర్‌ను దహనం చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మూడు రోజులుగా ఆఫీస్ వద్ద నిరసలు చేస్తూ.. మంగళవారం సాయంత్రం రెచ్చిపోయారు. తొలుత దెందులూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. ఆపై కార్యాలయం కింద ఉన్న ఫ్లెక్సీతో పాటు ఫర్నీచర్‌ను తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కూడా. అయితే.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఐ టీడీపీ, ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా సాక్షిపై తప్పుడు ప్రచారానికి దిగింది. సాక్షి కార్యాలయానికి తమ పార్టీ శ్రేణులు నిప్పు పెట్టలేదని, సంస్థ ఉద్యోగులే నిప్పు పెట్టి సీసీ ఫుటేజీ దొరక్కుండా మాయం చేశారంటూ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది. మరోవైపు.. పోలీసులేమో భిన్నమైన ప్రకటన ఒకటి చేయడం కొసమెరుపు. కార్యాలయం వద్ద జరిగిన దాడికి, సాక్షికి అసలు సంబంధమే లేదంటూ కాలిన ఫర్నీచర్ యాజమానితో చెబుతున్నారు(పోలీసులే చెప్పించారు!). ఇలా.. పరస్పర విరుద్ధ ప్రచారాలతో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లైంది. టీడీపీ శ్రేణుల తీరుతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే ఇలా కొత్త డ్రామాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. -
పొగాకు రైతులు ఎందుకు నష్టపోతున్నారు?: వైఎస్ జగన్ ఆరా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పోగాకు బేళ్లను పరిశీలించిన ఆయన.. ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది? అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జన సంద్రంగా మారింది.అంతకు ముందు.. జగన్‌కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు.. చూసేందుకు భారీగా రైతులు, జనం తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ నినాదాలతో హెరెత్తిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా.. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. కొందరు రైతులు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ‘‘మా పరిస్థితి ఏం బాగా లేదు. మిర్చి రైతుల దగ్గరి నుంచి అంతా నష్టాల్లోనే ఉన్నాం. టిఫిన్ తినడానికి కూడా డబ్బుల్లేవు. జగన్ పాలనలోనే మా పరిస్థితి బాగుంది. కూటమి పాలనలో మా పరిస్థితి అధ్వాన్నం. జగన్ హయాంలో కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేశారు.. .. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేక ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మా పరిస్థితి బాలేదని చెప్పుకున్నా అరెస్ట్ చేస్తున్నారు. వైఎస్సార్, జగన్ పాలనలో రైతులకు మంచి జరిగింది. కూటమి పాలనలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒక్కో పొగాకు బేళ్లకు రూ.3 వేలు నష్టం. కనీసం ఇవాళ్టి జగన్ పర్యటనతోనైనా గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉంది. 2029లో కూటమి ప్రభుత్వాన్ని పడగొడతాం’’ అని కొందరు పొగాకు రైతులు సాక్షితో అన్నారు. జగన్ వస్తున్నాడయ్యా.. త్వరగా కానివ్వండి!ఏడాది కాలంగా పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే జగన్ రాక నేపథ్యంలో పొగాకు ఆక్షన్ పూర్తి చేయాలని ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆక్షన్ త్వరగతిన పూర్తి చేయాలని బోర్డుపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం నుంచి రైతులు లేకుండానే అధికారులు ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా తొంబై శాతం బేళ్లు కొనుగోలు జరిగినట్లు సమాచారం. మాములు రోజుల్లో ఇలా అసలు ఉండదు. రైతుల సమక్షంలోనే బోర్డు ఆక్షన్ నిర్వహిస్తోంది. పైగా వచ్చిన బేళ్లలో 40 శాతం మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అయితే.. ఇవాళ అందుకు భిన్నంగా అన్నీజరిగిపోతున్నాయి. పొగాకు రైతులను ఈ ఏడాది కాలంగా ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. ఇంతకాలం గిట్టుబాటు ధర లేక వాళ్లు అల్లలాడిపోయారు. ఈ తరుణంలో జగన్ రాక సందర్భంగా హడావిడిగా ఆక్షన్ నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అక్రమ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం, సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. మూడు రోజులుగా ఓ పథకం ప్రకారమే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి చేశారంటే.. ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. ఈ హింసాత్మక చర్యలు భవిష్యత్‌లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి అని బొత్స ఓ ప్రకటనలో అన్నారు. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. -
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా.. మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను, కొమ్మినేని అరెస్ట్ తదితర అంశాలను ఖండిస్తూ.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లకు ఆయన చురకలంటించారు.పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైఎస్సార్సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోగా.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, జనాల దృష్టి మరలించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు.. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్... వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న నినాదం వెనుక ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కడే.. సొంత ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం!. అలాంటప్పుడు ఇది నిజమైన మహిళా గౌరవ రక్షణా?. ఈ ఘటనలు వారి అసలైన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల ముందు ఒక ప్రచారాన్ని నిర్మించుకుంటూ.. నిజమైన విలువలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి..కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?: చంద్రబాబుఅమ్మాయిల వెంటపడమంటే ఊరుకుంటారా నా ఫ్యాన్స్. ఏమయ్యా.. ఊరుకోరు కదా. ఎళ్లి ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేసేయాలి అంతే.. అంతే కమిట్ అయిపోవాలి. ఏదో ఒకటి: నందమూరి బాలకృష్ణవిదేశీ యువతులతో డ్యాన్సులు వేస్తూ.. ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025 ఏడాది కాలంలో 188 రేపులు, 15 హత్యాచారాలు ఇదేనా మహిళలకు రక్షణ కల్పించడం అంటే?. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిమండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై టీడీపీ నేతలే అత్యాచారానికి పాల్పడడం.. లాంటి ఘటనలు తాజా నిదర్శనాలు. ఇదేనా వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీ?. ఇదేనా వాళ్లు కాపాడుతున్న మహిళా గౌరవం?.. వాళ్ల చేతలు, మాటలు.. పొంతన లేకుండా పోతోంది. మహిళల పట్ల వీరి వైఖరి సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న వంకతో కక్షసాధింపు చర్యలు తీసుకోవడం అత్యంత దారుణమైన చర్య’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
కూటమి సర్కార్ భారీ కుట్ర.. కొమ్మినేనిపై మరిన్ని కేసులు!
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్(Kommineni Srinivasa Rao) పై కక్ష సాధించడం కోసం కూటమి ప్రభుత్వం అడ్డదారులను ఎంచుకుంటోంది. టీవీ డిబేట్లో తన జోక్యం, ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు కక్ష చల్లారనట్లుంది!. అందుకే టీడీపీ నేతల(TDP Leaders)తో మరిన్ని కేసులు పెట్టిస్తున్నారు. తుళ్లూరు పీఎస్ కేసులో ఆయన సోమవారం అరెస్టు కాగా.. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు కొమ్మినేని విషయంలో ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. విజయవాడ సత్యనారాయణ పురం, పడమట పీఎస్, సాలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదులతో కొమ్మినేనిపై కేసులు నమోదయ్యాయి. అయితే..ఇప్పటికే కొమ్మినేనిపై దాఖలు చేసిన సెక్షన్ల విషయంలో మంగళగిరి కోర్టు(Mangalagiri Court) ఇవాళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ.. ఆ సెక్షన్లను కొట్టేసింది. ఈ తరుణంలో ఆయనపై కేసు వీగిపోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఒకవేళ ఈ కేసులో గనుక ఆయనకు బెయిల్ లభిస్తే.. మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం తాజా కేసులతో స్పష్టమవుతోంది. గతంలో పోసాని విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్‌లపై అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూటమి నేతలతో కేసులు పెట్టించారు. దీంతో ఆయన్ని పీటీ వారెంట్ కింద వివిధ జైళ్లకు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.కొమ్మినేనిపై మరో మూడు కేసులు ఎక్కడ?.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఎవరు?.. టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంధ్యా రాణిఏయే సెక్షన్లు?.. 79BNS,67A ITA-2000-2008,75(3) BNS సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసుఎక్కడ?.. విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టింది ఎవరు?.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1)(a),353(1)(b),61(2), r/w 3(5)BNS, 67A ITA 2000-2008 సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసుఎక్కడ?.. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎవరు?.. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1),353(3)b, 61(2),r/w 3(5) BNS, 67A ITA2000-2008 సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసు నమోదు -
మేం భయపడం.. ఎలాంటి విచారణకైనా సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోందని.. ఇందుకోసం తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీ అక్రమ నిర్బంధం, అబద్దపు వాంగ్మూల సేకరణకు జరుగుతున్న ప్రయత్నాలు, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించారు. బాలాజీని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. అయినా మేం భయపడం. ఎందుకంటే తప్పుడు కేసులు నిలవబడవు కాబట్టి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ బాలాజీతో సహా ముగ్గురుని పోలీసులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్యప్రదేశంలో వాళ్లను హింసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తమ వాళ్లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తుండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసుల దుశ్చర్యను ప్రశ్నిస్తూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నట్లు సమాచారం. -
హోంమంత్రి అనిత రాజీనామా చేయాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, గుంటూరు: ప్రతిపక్షనేతలపై కేసులు పెట్టడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం మంగళవారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు విజయవంతం కావడంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ..రాష్ట్రంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముచ్చుమర్రి ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది. అందుకే కూటమి వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మేం నిరసన చేపట్టాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. .. రాష్ట్రంలో చంద్రబాబు పాలన లో మహిళలకి రక్షణలేదు. రాప్తాడు లో 14 ఏళ్ల మైనర్ బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేశారు. టీడీపీ కార్యకర్తలను నిన్నటి వరకు అరెస్టు చేయలేదు. ఈ హత్యలు, అత్యాచారాలకు కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి, డ్రగ్స్ డోర డెలివరీ అవుతున్నాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పోలీసులు , ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. తన సొంత నియోజకవర్గంలో అఘాయిత్యాలు జరిగినా హోం మంత్రి అనిత పట్టించుకోవడంలేదు. టీడీపీ కార్యకర్తలే మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అనంతపురం జిల్లాలో చిన్నారి చనిపోయింది. చిన్నారి మృతిపై హోం మంత్రి బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా చేయాలి. అనంతపురం చిన్నారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’’ అని వరుదు కళ్యాణి అన్నారు. -
‘ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర’
తాడేపల్లి : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమని, ఎలాంటి అరెస్టు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, జూన్ 10) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుముట్ల.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘చర్చా వేదికలో జరిగిన విషయాలను సాక్షి టీవీకి, వైఎస్ఆర్ సీపీకి రుద్దే ప్రయత్నం చేసారు. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ప్రీప్లాన్డుగానే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటలను కొమ్మినేని అదే వేదిక మీద ఖండించారు. అయినప్పటికీ అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను డైవర్టు చేసేందుకే ఈ దాడులు, అక్రమ .మహిళలు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు. దీనిపై చంద్రబాబు కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రత్యర్థి పార్టీలు, ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి. కొమ్మినేనికి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. చట్టం, రాజ్యాంగాలతో పని లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొమ్మినేని తన న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.అసలు కొమ్మినేని మీద ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?, అంటే కొమ్మినేని మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధింపునకు దిగిందో అర్థం చేసుకోవచ్చు’ అని కోరుముట్ల ధ్వజమెత్తారు.. -
‘మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు’
చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలని, మరి అటువంటిది అధికారంలో ఉన్నవాళ్లే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు(మంగళవారం, జూన్ 10) ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటు. నగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చింది. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. హోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణం. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే మొదటగా చంద్రబాబు చెప్పాలి, ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపున చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ పై కేసు పెట్టాలి అన్న ఆయనపై కేసు పెట్టాలి’ అని రోజా తెలిపారు. జగన్ అన్న లండన్ వెళ్తే తప్పుడుడు వాఖ్యలు చేసిన నారా లోకేష్ పై ముందు కేసు పెట్టాలి. మూర్తి, రేణుక చౌదరి మాట్లాడిన మాటలు పై ఎందుకు కేసు నమోదు చేయాలేదు. బి.ఆర్.నాయుడు పై ఎందుకు కేసు పెట్టలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎప్పటి నుంచో కక్ష గట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. జూన్ 6 తేదీ ఈ డిస్కషన్ జరిగింది, కొమ్మినేని క్షమాపణ చెప్పారు. లోకేశ్, చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. ఒక పథకం ప్రకారం యాక్షన్ ప్లాన్ తో సాక్షి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లారు. ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది’ అని ధ్వజమెత్తారు ఆర్కే రోజా. -
‘చంద్రబాబు.. ఎల్లకాలం మీ ఆటలు సాగవు’
తిరుపతి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఖండించారు. ఆయన ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా క్షమాపణలు చెప్పడం జరిగిందని, దీన్ని రాజకీయం చేస్తన్నారని నారాయణస్వామి మండిపడ్డారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని, గత ఐదేళ్లలో మహిళా అభ్యున్నతి ఆయన కృషి చేశారన్నారు. కార్పొరేటర్లు, మేయర్, జడ్పి చైర్మన్, రాష్ట్ర స్థాయి పదవుల్లో 60 శాతం మహిళలకు అందించిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. చంద్రబాబ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఆయన రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవని, చంద్రబాబ ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు నారాయణస్వామి. -
టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను అరెస్ట్ ఎప్పుడు చేస్తారు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొమ్మినేనిపై మరోసారి చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు దిగిందని స్పష్టమవుతోందన్న కామెంట్ సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో.. కూటమి ప్రభుత్వం సమాన న్యాయం పాటించడంలేదని వైఎస్సార్సీపీ అంటోంది. తాజాగా టీవీ5 డిబేట్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనుగానూ టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి అని వైఎస్సార్సీపీ నిలదీసింది. -
రేపు ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(మంగళవారం) రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం పిలుపు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిర్ణయించింది. కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఏడాది పాలనలో నేరాలు ఘోరాలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా హోం మంత్రి అనిత కనీసం స్పందించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సగటున రెండు రోజులకి ఒక అత్యాచారం జరుగుతుండగా.. ఇంకా వెలుగులోకి రాని అఘాయిత్యాలు ఎన్నో?!. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని.. ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని వైఎస్సార్సీపీ చంద్రబాబుకు హితవు పలుకుతోంది. -
చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని ధ్వజమెత్తారు. 👉అనంతపురం జిల్లాలో తన్మయి అనే ఇంటర్ విద్యార్ధిని కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు సదరు విద్యార్థిని దారుణమైన స్థితిలో హింసకు గురై చనిపోయినట్లుగా గుర్తించామని పోలీసులు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు అందిన ఆరు రోజుల్లోనే వారు సరైన రీతిలో దీనిపై దర్యాప్తు చేసి ఉంటే, ఈ రోజున తన్మయి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యేదేనా? పోలీసుల నిర్లక్ష్యం వల్ల సదరు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? దీనిపై అందరూ ప్రశ్నిస్తుంటే, దానిని కప్పిపుచ్చుకునేందుకు అనేక సాకులను తెర మీదికి తీసుకువస్తారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏడాదిగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదుపుతప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టే ఆసక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే, స్థానిక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తేనే దానిపైన స్పందిస్తున్నారు.కొమ్మినేని అరెస్ట్.. దారుణంఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదు. పోలీస్ వ్యవస్థను చట్టాలకు అనుగుణంగా నడిపించాలనే ఉద్దేశం అంతకంటే లేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇటీవలే సాక్షి టీవీ డిబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను సాక్షిటీవీ యాజమాన్యంతో పాటు వైయస్ఆర్సీపీ అందరూ ఖండించారు. దీనిని ఎవరూ సమర్థించడం లేదని చాలా స్పష్టంగా ప్రకటించాయి. అయినా కూడా టీడీపీ దీనిలో రాజకీయాన్ని వెతుక్కుని సాక్షియాజమాన్యాన్ని, వైయస్ఆర్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతమ్మను కూడా వివాదంలోకి లాగుతున్నారు. జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకు వీరికి ఏం సంబంధం? పదేపదే దీనిని కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇందుకోసం మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న వ్యవహారం వల్లే మహిళలకు అవమానం జరుగుతోంది. చివరికి సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సామాజిక అంశాలపై చక్కని విశ్లేషణను, చర్చను సమాజానికి అందిస్తున్నారు. ఆయనను కూడా ఈ వివాదంలోకి లాగి అరెస్ట్ చేయడం చూస్తుంటే, రెడ్‌బుక్ పాలన పరాకాస్టకు చేరిందని అర్థమవుతోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోంది. వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌ల వరకు ఈ రెడ్‌బుక్ వేధింపులు వచ్చాయి. సాక్షి డిబేట్లో సదరు జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని వారించారు, తరువాత దానిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా ఆయనను అరెస్ట్ చేశారంటే తమను ఎవరు ప్రశ్నించినా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తామనే భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు.ప్రశ్నిస్తున్న సాక్షిపై చంద్రబాబు కక్షసాధింపుప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి మీడియాపై ఈ రోజు దాడులు చేస్తున్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వంలోని అరాచకాన్ని ప్రశ్నిస్తున్నందుకు చంద్రబాబు సాక్షిపై కక్ష పెంచుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రశ్నించినందుకు సాక్షిపై కోపం పెంచుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. దీనిని వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షిమీడియాపై దాడులకు తెగబడుతున్నారు. ఇదేనే ప్రజాస్వామ్యం? ఏడాది పాలన వైఫల్యాలను నిలదీస్తూ వైయస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభించింది. దీనిని ఓర్చుకలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నేడు అమరావతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే వివాదాన్ని సృష్టించారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫేస్టోను ఏడాదిలోనే తొంబైశాతం అమలు చేశాం. మహిళల పక్షపాతిగా వైయస్ జగన్ అనేక పథకాలను అమలు చేశారు. మహిళా ఆర్థిక స్వావలంభనకు అండగా నిలిచారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలను ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహిళ రక్షణ కోసం దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లను తీసుకువచ్చారు. మహిళల పట్ల అంతటి గౌరవం ఉన్న నాయకుడు వైయస్ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని రజిని అన్నారు.