టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను అరెస్ట్‌ ఎప్పుడు చేస్తారు? | YSRCP Raised Questions on TV5 Murthy Renuka Chowdhury Debate | Sakshi
Sakshi News home page

టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను అరెస్ట్‌ ఎప్పుడు చేస్తారు?

Jun 9 2025 8:19 PM | Updated on Jun 9 2025 8:31 PM

YSRCP Raised Questions on TV5 Murthy Renuka Chowdhury Debate

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొమ్మినేనిపై మరోసారి చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు దిగిందని స్పష్టమవుతోందన్న కామెంట్‌ సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో.. 

కూటమి ప్రభుత్వం సమాన న్యాయం పాటించడంలేదని వైఎస్సార్‌సీపీ అంటోంది. తాజాగా టీవీ5 డిబేట్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనుగానూ టీవీ5 మూర్తి, రేణుకా చౌదరిలను ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారు? అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి అని వైఎస్సార్‌సీపీ నిలదీసింది.

Advertisement
 
Advertisement
Advertisement