నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్‌సీపీ నిరసనలు | YSRCP Student Wing Protest Against Chandrababu Govt on june 13 | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్‌సీపీ నిరసనలు

Jun 11 2025 3:17 PM | Updated on Jun 11 2025 3:53 PM

YSRCP Student Wing Protest Against Chandrababu Govt on june 13

సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్‌ 13) వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.

మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement