‘ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర’ | YSRCP Spokesperson Koramutla Slams TDP Govt | Sakshi
Sakshi News home page

‘ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర’

Jun 10 2025 1:58 PM | Updated on Jun 10 2025 4:18 PM

YSRCP Spokesperson Koramutla Slams TDP Govt

తాడేపల్లి : సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమని, ఎలాంటి అరెస్టు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, జూన్‌ 10) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుముట్ల.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

‘చర్చా వేదికలో జరిగిన విషయాలను సాక్షి టీవీకి, వైఎస్ఆర్ సీపీకి రుద్దే ప్రయత్నం చేసారు. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ప్రీప్లాన్డుగానే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటలను కొమ్మినేని అదే వేదిక మీద ఖండించారు. అయినప్పటికీ అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను డైవర్టు చేసేందుకే ఈ దాడులు, అక్రమ .

మహిళలు, చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ లేదు. దీనిపై చంద్రబాబు కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రత్యర్థి పార్టీలు, ప్రశ్నించే గొంతులను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి. కొమ్మినేనికి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. చట్టం, రాజ్యాంగాలతో పని లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొమ్మినేని తన న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.అసలు కొమ్మినేని మీద ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?, అంటే కొమ్మినేని మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధింపునకు దిగిందో అర్థం చేసుకోవచ్చు’ అని కోరుముట్ల ధ్వజమెత్తారు..

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం: కోరుముట్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement