breaking news
-
మైనర్‌పై అఘాయిత్యం.. బాధిత కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం నిభానుపూడికి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అత్యాచారానికి గురై బలన్మరణానికి పాల్పడ్డ బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున ఆమె తల్లిదండ్రులకు పదిలక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధాకరమైన ఘటనలు రాజకీయం చేయొద్దు! హోంమత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారానికి గురవ్వడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విచారణ పూర్తయ్యాక నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలను అనవసరంగా రాజకీయం చేయొద్దని కోరారు. వేగంగా స్పందించిన సీఎం ఏ కుటుంబంలో ఇలాంటి దురృష్టకర సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. త్వరతగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే పదిలక్షల రూపాయలు సహాయం ప్రకటించడంతో పాటు హోంమంత్రిని పంపించారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు, మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున, స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామని.. నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు,. బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు పామర్రుకు బాలిక ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు. ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు సీపీ తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. కేసును చేధించిన పోలీసులు పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. అత్యాచారం చేయడం వల్లే అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. నిమ్మకూరు హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక (14)ను.. ప్రేమపేరుతో లోకేష్ (20) అనే యువకుడు దగ్గరయ్యాడు. ఈనెల 20వ తేదీన స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. అయితే స్కూల్‌కు వెళ్లకుండా లోకేష్‌తో ఉయ్యూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరులోని ఓ లాడ్జిలో తన బంధువైన నరేంద్రతో కలిసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు లోకేష్. అత్యాచారం తర్వాత బాలికను నిభానుపూడి సమీపంలో వదిలిపెట్టాడు. అయితే అవమానం భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది బాలిక. అదే రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల అరెస్ట్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాలువలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితులు లోకేష్, నరేంద్ర, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్,13 పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. అతి త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఐదుగురిని బలిగొన్న ‘ట్యాంకర్’
ఓబులవారిపల్లె/రాయచోటి/అమరావతి: మద్యం మత్తు ఐదుగురు ప్రయాణికుల ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు వద్ద నాలుగో నంబర్ జాతీయ రహదారిపై దాబా హోటల్ సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కడప ఐసీఎల్ నుంచి చెన్నైకి సిమెంట్ పొడి లోడుతో వెళ్తున్న లారీ ట్యాంకర్ చిన్నఓరంపాడు దాబా వద్ద అదుపు తప్పి తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని మితిమీరిన వేగంతో నడుపుతూ రోడ్డుకు అటూ ఇటూ తిప్పుతూ రావడాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సును తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించి కుడి వైపునకు పూర్తిగా పక్కకు తిప్పాడు. దీంతో ట్యాంకర్ లారీ ఆర్టీసీ బస్సు మధ్య భాగంలో కండక్టర్ సీటు వద్ద నుంచి బస్సు వెనుక భాగం వరకు బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలో ముగ్గురు.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరి మృతి బస్సులోని మ«ధ్య సీట్లలో కూర్చున్న వైఎస్సార్ జిల్లా కోగటం గ్రామానికి చెందిన బి.కమాల్ బాషా (65), అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు జనంపల్లె దళితవాడకు చెందిన జి. శ్రీనివాసులు (60) అలియాస్ బుడ్డయ్య, రాజంపేట మండలం వెంకటరాజంపేట గ్రామానికి చెందిన కొమరావతి శేషాద్రి శేఖర్ (55)అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం దొగ్గలపాడు గ్రామానికి చెందిన చెవ్వు అమర్నాథ్రెడ్డి (25), నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య (70)లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న నికిత, వెన్నెల అనే బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి తరలించారు. వీరు కాకుండా మరో 12 మందికి గాయాలయ్యా యి. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం కారణంగా లారీ ట్యాంకర్, బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పుల్లంపేట నుంచి మంగంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాజంపేట డీఎస్పీ చైతన్య ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్టు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు వేర్వేరుగా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఘటనపై ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఆర్టీసీ తరఫున పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. -
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్‌షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్‌పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
ఆవనిగడ్డ కరకట్ట కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి ఏం జరిగింది.. రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కీలకం.. రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జరిగింది ఇదే.. ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. -
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
తిరుపతిలో దారుణం.. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై ప్రియుడు దాడి చేశాడు. వివరాల ప్రకారం.. డక్కిలి మండల కేంద్రంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలి పేరెంట్స్‌పై ప్రియుడు గిరి దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి దాడిలో ప్రియురాలి తండ్రి తులసి జగదీష్(45) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే జగదీష్‌ను స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగదీష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, నిందితుడు గిరిని శ్రీకాళహస్తి మండలానికి చెందిన వాగివేడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
కాకినాడలో దారుణం: మహిళా చిరు వ్యాపారి హత్య
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణం జరిగింది. ఓ మహిళా చిరు వ్యాపారిని నగదు కావాలంటూ బెదిరించి.. కత్తులతో దాడి చేశారు ఇద్దరు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూసింది. తొలుత.. ఆ దారి వెంట వెళ్తున్న ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. దాడి అనంతరం అతని ఆటో తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో.. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడిపించుకుంటున్న మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి నగదు కావాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయగా.. కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. క్లూస్ టీం ఘటనా స్థలి నుంచి వివరాలు సేకరించింది. మృతి చెందిన మహిళ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: దిశ పోలీసుల ఎంట్రీతో నర్సింగ్ విద్యార్థినులు సేఫ్ -
విషాదం: ప్రియాంక ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు: కడుపు నొప్పి భరించలేక సచివాలయ ఉద్యోగి ధనపాల ప్రియాంక (27) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన వైఎస్సార్‌జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యుగంధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషం తాగింది. అది గమనించిన వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఇక, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్
సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు. చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం... -
రైల్వేస్టేషన్లలో లేడీ కిలాడీ గ్యాంగ్.. ఒక్కో స్టేషన్లో ఒక్కో పేరుతో ప్రత్యక్షం
తిరుపతి అర్బన్: రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని.. ప్రయాణికుల జేబులను కొల్లగొట్టడమే వృత్తిగా జీవనం సాగిస్తున్న ముగ్గురు లేడీ కిలాడీలను తిరుపతి రైల్వే స్టేషన్లో శనివారం పోలీసులు అరెస్టు చేసి 3 సెల్ఫోన్లతోపాటు రూ.34,500 స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని తుతుకుడి జిల్లాకు చెందిన ఎం.మీనా (23), ఎస్.రాణి (29), ఏ అంజలి (25) రైల్వే స్టేషన్లను టార్గెట్ చేస్తూ ఒక్కో రైల్వే స్టేషన్లో తిష్ట వేసి చోరీలు చేస్తారు. తర్వాత మరో రైల్వే స్టేషన్‌కు వెళ్లి మారు పేర్లతో ఇదే తంతు కొనసాగిస్తారు. వారి భర్తలు వీరున్న సమీపంలోనే కూలి పనులు చేస్తుంటారు. ఇదే సమయంలో వీరు చోరీ లకు పాల్పడుతుంటారు. ముగ్గురిపై రైల్వే పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
వీడియో: ఏం తెలివిరా నాయనా.. సినీ ఫక్కీలో 10లక్షలు చోరీ
సాక్షి, గుంటూరు: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్‌గేట్ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 కోసం కక్కుర్తిపడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపించారు. రూ. 20నోటును ఎరగవేసి రూ.10లక్షల నగదును ఎత్తికెళ్లారు. బాలాజీ నగర్‌కు చెందిన కోసూరి హరిబాబు ఎం.ఎన్ ఎక్స్‌పోర్టు కంపెనీలో మూడేళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేశారు. కాగా, బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్‌కు తగిలించారు. తర్వాత బైక్ స్టార్ట్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. దీంతో, ఆ రూ.20లను తీసుకునేందుకు హరిబాబు.. బైకి దిగి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్‌కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో షాకైన హరిబాబు.. తేరుకుని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా.. బ్యాంకులోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది. 2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్లో విచారించారు. ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్ అయ్యారు. చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు. అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు. అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. -
అమానవీయ ఘటన.. కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసిన మహిళ
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి. సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం -
కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్బ్యాచ్ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు. చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం? విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు. -
Singapore : చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అరెస్ట్
సింగపూర్ : చంద్రబాబు ఆప్త మిత్రుడు, సింగపూర్ రవాణాశాఖ మంత్రిగా మొన్నటి వరకు పని చేసిన ఎస్.ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్‌ను జూలై 11నే అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై విడుదల అయినట్లు అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) శుక్రవారం వెల్లడించింది. అయితే ఈశ్వరన్‌పై విచారణ ప్రారంభించిన మరుసటి రోజే CPIB ఆయన సన్నిహితులపై కూడా దృష్టి సారించింది. మంత్రి ఈశ్వరన్ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించి.. దీనికి సంబంధించి ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ ను అరెస్ట్ చేసింది. (ఈశ్వరన్ సన్నిహితుడు సెంగ్ ను అరెస్ట్ చేస్తోన్న సింగపూర్ పోలీసులు) ఎవరీ హూంగ్ బెంగ్ సెంగ్ ? హూంగ్ బెంగ్ సెంగ్ ఒక హోటల్ అధినేత. ఆయన సంస్థ పేరు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్(HPL). దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా హూంగ్ బెంగ్ సెంగ్. 2008లో ఫార్ములా వన్ రేస్‌ను సింగపూర్‌కు తీసుకువస్తానంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసి కాంట్రాక్టు సంపాదించారు సెంగ్. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 135 మిలియన్ డాలర్లు. (F1 ప్రతినిధులతో ఈశ్వరన్) ఈశ్వరన్ పాత్ర ఏంటీ? ఫార్ములా వన్ రేస్ ప్రాజెక్టుకు సంబంధించి హూంగ్ బెంగ్ సెంగ్ సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఈశ్వరన్ ఈ వ్యవహారం నడిపించారు. మొత్తం 135 మిలియన్ డాలర్ల ఈ కాంట్రాక్టులో 40 శాతం వాటా ప్రమోటర్ గా హూంగ్ బెంగ్ సెంగ్ ది. ఆ మేరకు నిధులను సమకూరుస్తాడు. ఇక ఈ కాంట్రాక్టులో 60 శాతం నిధులను సింగపూర్ టూరిజం బోర్డు ఇవ్వాలి. ఈ మేరకు మంత్రిగా ఈశ్వరన్ ఈ ఒప్పందంలో ప్రభుత్వం తరపున సంతకాలు చేశారు. (తన స్నేహితుడు సెంగ్ తో ఈశ్వరన్ సెల్ఫీ) దర్యాప్తు సంస్థ అభియోగాలేంటీ? ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న CPIB సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం కేటాయించిన 60 శాతం నిధులలో కుంభకోణం జరిగిందని గుర్తించింది. ఈ వ్యవహారంలో హూంగ్ బెంగ్ సెంగ్ పారదర్శకత పాటించకపోవడం, కొన్నిపెద్ద మొత్తాలకు సంబంధించిన వ్యవహారాన్ని గుప్తంగా ఉంచడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో హూంగ్ బెంగ్ సెంగ్ కు మొదటి నుంచి మద్దతిస్తోన్న మంత్రి ఈశ్వరన్ పైనా ప్రధానికి లేఖ రాసింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ CPIB నుంచి లేఖ రావడంతో హుటాహుటిన ఈశ్వరన్ ను బాధ్యతల నుంచి తప్పించారు ప్రధాని. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ప్రధాని. ( సింగపూర్ ప్రధాని విడుదల చేసిన ప్రకటన) ఈశ్వరన్ వ్యవహారశైలి ఏంటీ? మొదటి నుంచి ఈశ్వరన్ వ్యవహారశైలి అనుమానస్పదంగానే ఉందన్నది సింగపూర్ వర్గాల సమాచారం. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు, సింగపూర్ కు లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించాడు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించాడు. (నారా లోకేష్ తో సింగపూర్ ఈశ్వరన్) అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. (బాబు నాడు కుదుర్చుకున్న అమరావతి ఒప్పందం, సంతకం చేస్తున్నది ఈశ్వరన్) కేసులో తాజా అప్ డేట్స్ ఏంటీ? హూంగ్ బెంగ్ సెంగ్ ను తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన CPIB సంస్థ.. ఈశ్వరన్ తో లావాదేవీల గురించి లోతుగా ప్రశ్నించినట్టు సింగపూర్ మీడియా పేర్కొంది. తనకు ఇప్పటికే విదేశాల్లో ఇతర షెడ్యూల్ ఉందని, ఆ మేరకు బెయిల్ ఇవ్వాలని హూంగ్ బెంగ్ సెంగ్ కోర్టులో అభ్యర్థించారు. ఆ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను హూంగ్ బెంగ్ సెంగ్‌కు మంజూరు చేసింది. అయితే విదేశీ పర్యటన నుంచి వెనక్కు రాగానే.. హూంగ్ బెంగ్ సెంగ్ తన పాస్ పోర్టును CPIB సంస్థకు అప్పగించాలని సూచించింది. అలాగే బెయిల్ మంజూర్ చేయడానికి ఒక లక్ష అమెరికన్ డాలర్లను పూచీకత్తుగా పెట్టాలని కోర్టు సూచించింది. అలాగే ఈశ్వరన్ కు సంబంధించిన లావాదేవీల పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఈశ్వరన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సీపీఐబీ ఓ అంచనాకు వచ్చింది. సేకరించిన ఆధారాల మేరకు ఈశ్వరన్‌ను విచారిస్తున్నామని సీపీఐబీ డైరెక్టర్ డెనిస్ టాంగ్ తెలిపారు. ఈ కేసును కొందరు మరో కేసుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మొదటి కేసు పార్లమెంటుకు సంబంధించిందని, దాంట్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు టాంగ్. అయితే ఈశ్వరన్ పై ఇప్పుడు పెట్టిన కేసు.. CPIB స్వయంగా గుర్తించిందని, ఆ మేరకు అభియోగాలు నమోదు చేసి, ప్రధానికి సమాచారం అందించామన్నారు డైరెక్టర్ టాంగ్. We have always been unapologetic in stamping out corruption even if it is potentially embarrassing for the @PAPSingapore . No means No. Check out my bro @LawrenceWongST explaining the difference between CPIB investigating #ridout Ridout and Iswaran. pic.twitter.com/hJlEu9aYpl — Edwin Tong Fan Bot (@EdwinFanBot) July 12, 2023 ఇదీ చదవండి: చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ‘ఈశ్వరన్’ ఔట్ -
అత్యాచారం కేసు: పూర్ణానంద రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖ: పూర్ణానంద అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’ -
విజయవాడ: పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వారాహి యాత్రలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయోధ్య నగర్‌కు చెందిన వలంటీర్ దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదుతో 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విజయవాడ లీగల్ సెల్ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ–అడ్మిన్ ) మోకా సత్తిబాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వలంటీర్లపై దౌర్జన్యకాండ కోవిడ్ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని వారు గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు. వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
నల్ల‘మార్గ’o ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్టలో దాగిన ‘నల్ల’పాములు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బెంబేలెత్తుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు. బ్యాంకులను కాదని చిట్టీ కంపెనీలోనా? రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులను సీఐడీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడించాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడించేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఇదే తరహా మోసంలో సహారా చైర్మన్‌కు జైలు శిక్ష బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్‌దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుకాయించబోయి దొరికిన రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడంలేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది. -
పవన్ కల్యాణ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
సాక్షి, కృష్ణా: వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బుధవారం పలువురు వాలంటీర్లతో కలిసి వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు విజయవాడ సీపీలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ను పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. సాక్షితో న్యాయవాదులు.. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోంది. కానీ, ఆ మాటల్ని వాలంటీర్లు పట్టించుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏ నిఘా సంస్థ చెప్పిందో వెల్లడించాలి. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: పవన్‌ను చీల్చిచెండాడిన పోసాని -
ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ కాగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
మార్గదర్శిలో ‘నల్ల’ ఇంధనం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్‌ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రూ.కోటికిపైగా డిపాజిట్‌దారులకు నోటీసులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయ వివరాల పరిశీలన.. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్‌దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ఫండ్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు. మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు. మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.