breaking news
-
బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పీఎన్‌కాలనీలో నివాసముంటున్న ఓ బ్యాంకు ఉద్యోగిని ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రెండో పట్టణ ఎస్ఐ కె.లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌కాలనీ మొదటి లైన్ సాయిసత్య అపార్ట్మెంట్లో ఉరిటి స్వప్నప్రియ(39) తల్లి సరళ, సోదరుడు కిరణ్బాబులతో కలిసి నివాసముంటోంది. స్వప్నప్రియ గార మండలం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచి ఆఫీసులో డిప్యూటీ మేనేజరు/అకౌంటెంట్‌గా , కిరణ్‌బాబు శ్రీకాకుళం ఎస్బీఐ రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం నరసన్నపేట సమీపంలోని యారబాడు. స్వప్నప్రియకు 2010లో శ్రీకాకుళానికి చెందిన కుప్పలి ప్రదీప్‌కుమార్‌తో వివాహం జరిగినా అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తాను ఒంటరిననే బాధతో ఉండేవారు. తనఖా బంగారం మాయమవ్వడంతో.. గార ఎస్బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.3 కోట్ల బంగారం మాయమైందని, దీని వెనుక డిప్యూటీ మేనేజర్/అకౌంటెంట్‌గా ఉన్న ఓ మహిళా ఉద్యోగినితో పాటు కొందరి హస్తముందని కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వరుస కథనాలు వస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడం, చివరకు బుధవారం గార సీఐ కామేశ్వరరావు సమక్షంలో రీజనల్ మేనేజర్ ఖాతాదారులకు బంగారం ఇప్పించే బాధ్యత తనదని సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆ కథనాలతో మనస్థాపం చెంది.. పత్రికల్లో వస్తున్న కథనాలు తన గురించే అని ఇంటి వద్ద తల్లితో చెప్పి స్వప్నప్రియ తీవ్రంగా మనోవేదన చెందేదని, సోషల్ మీడియాలో కూడా కావాలనే తనపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని స్వప్నప్రియ వాపోయేది. ఈ క్రమంలో ఈ నెల 24న బయటకు వెళ్లి వచ్చిన స్వప్నప్రియ వాంతులు చేయడంతో తల్లి ఆందోళన చెందింది. ఏమైందని అడగ్గా.. తన బతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ పడుకుంది. మరుసటి రోజు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చి ఎలుకల మందు తాగానని తల్లితో చెప్పింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నా వాంతులు తగ్గలేదు. ఈక్రమంలో ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వప్నప్రియ స్వగ్రామం యారబాడుకు తరలించనున్నట్లు ఎస్ఐ లక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Nov 29th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 6:42 PM, Nov 29, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు 6:22 PM, Nov 29, 2023 బీటెక్ రవికి బెయిల్ బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవిని పాత కేసులో ఈ నెల 14న అరెస్ట్ చేసిన పోలీసులు నారా లోకేష్ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్ రవి బీటెక్ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్ క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్ రవి వివాదస్పద వ్యాఖ్యలు "జూదం మా బ్లడ్‌లోనే ఉంది" అంటూ నాడు బీటెక్ రవి వ్యాఖ్యలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి దందాలు, దౌర్జన్యాలు 6:15 PM, Nov 29, 2023 ఎస్సీలంతా YSRCPకే ఓటేస్తే పరిస్థితి ఎలా? గుంటూరు తెదేపా కార్యాలయంలో ఎస్సీ విభాగం సమావేశం తెలుగుదేశం కార్యాలయంలో భేటికి హాజరైన టిడిపి, జనసేన నేతలు ఎస్సీల ఓట్లన్నీ YSRCPకే పడతాయని ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం, జనసేన ఉధృతంగా ప్రచారం చేయాలి మరో సారి ఎస్సీలంతా YSRCPకే అవకాశం ఇస్తే మన పరిస్థితి ఏంకావాలి? తెలుగుదేశం, జనసేన పొత్తు జయప్రదం చేయడానికైనా ఎస్సీలు కలిసిరావాలి 5:45 PM, Nov 29, 2023 రేపు తిరుపతికి చంద్రబాబు అమరావతి : రేపు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు డిసెంబర్ 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు 5:20PM, Nov 29, 2023 చంద్రబాబు చరిత్ర అంతా నేరాల మయమే : అనిల్‌కుమార్ యాదవ్ కృష్ణాజిల్లాలో మాట్లాడిన మాజీ మంత్రి,అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం బిసిలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50% శాతం అవకాశం కల్పించారు 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బిసిలమైన మేము సున్నాలమే మీ దృష్టిలో సున్నాలమైన మమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి నాయకులను, మంత్రులను చేశారు మన తరాలు...తలరాతలు మారాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు ఓ పది వేల మందికి కత్తెరలు, ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు కాపులంతా ఆలోచన చేయాలి రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బిసి మంత్రి కూడా లేడు కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక బిసినైన నన్ను మంత్రిని చేశారు గొర్రెలు,పశువులు కాసేవాడికి పదవులిచ్చారని టీడీపీ నేతలు ఎగతాళి చేశారు ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా గొర్రెలు,పశువుల కాపరే ఏసు ప్రభువు పుట్టింది కూడా పశువుల పాకలోనే మాలాంటి గొర్రెలు,పశువులు కాసే వ్యక్తులు పాలు పితికి ఇస్తే...వాటి పై సంపాదించిన వేలకోట్లే మీ హెరిటేజ్ ఆస్తి 4:50PM, Nov 29, 2023 లోకేష్ పై మంత్రి అంబటి ఫైర్ తూర్పు గోదావరి : లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు టీడీపీ కి లోకేష్ శనిలా దాపురించారు : అంబటి 4:05PM, Nov 29, 2023 YSRCPది నమ్మకం, TDPది మోసం కురుపాంలో వైఎస్సార్సిపి బస్సు యాత్ర ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ : వైసీపీ నేతలు హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబువి గోబెల్స్ ఆలోచనలైతే ... సీఎం జగన్‌వి గ్లోబల్ ఆలోచనలు రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగనన్నే భవిష్యత్తు అంటున్నారు బాబూ.. మీదంతా నాటకం అంటున్నారు అర్హులైన అందరికీ సంక్షేమ పధకాలు అందించిన నాయకుడు జగన్ చంద్రబాబు మాటలు నమ్మితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే నిజం చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు చంద్రబాబు మేనిఫెస్టో వెబ్ సైట్ లో ఉండదు మా పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని జగన్ చెబుతున్నారు జగన్‌ను ఓడిస్తామంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్ ఢీ కొట్టేందుకు వీరంతా ఒక్కటవుతున్నారంటేనే అయన బలం అర్ధమవుతుంది వైఎస్ జగన్ కు జనబలమే ఆయుధం 3:45PM, Nov 29, 2023 మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్‌కు సీఐడీ జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-19గా ఉన్న వరుణ్ కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కోరిన సీఐడీ తదుపరి విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా 3:40PM, Nov 29, 2023 ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా తదుపరి విచారణ శుక్రవారం(డిసెంబర్1కి)వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 3:30PM, Nov 29, 2023 స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన ఉండవల్లి కొందరికి మాత్రమే నోటీసులు అందాయన్న పిటిషనర్ తరఫు లాయర్లు తదుపరి విచారణ డిసెంబర్ 30కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 3:20PM, Nov 29, 2023 చంద్రబాబు కేసు : సుప్రీంకోర్టులో వాయిదా చంద్రబాబుకు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ వాయిదా తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసిన ధర్మాసనం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా 3:10PM, Nov 29, 2023 నారాయణ క్వాష్ పిటిషన్ వాయిదా అసైన్డ్ భూముల కుంభకోణంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మాజీ మంత్రి నారాయణ ఆయన బినామీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ తదుపరి విచారణ డిసెంబర్ 11కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 1:56 PM, Nov 29, 2023 పవన్ కళ్యాణ్‌ను రాజకీయనాయకుడిగా లెక్కలోకి తీసుకోవడం లేదు విజయవాడలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరుగుతాయి అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అవకాశాలు పెరుగుతున్నప్పుడు సాంకేతికత వచ్చినపుడు కులవృత్తులు కూడా మారుతాయి. కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా? లేక ఉన్నత చదువు.. మారుతున్న భవిష్యత్ వైపు అడుగులు వేయిస్తున్న జగన్ కావాలా? అనేది ఆలోచించాలి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు జగన్ రూపాయి చేస్తే చంద్రబాబు పది చేస్తానంటారు ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అని నమ్మితేనే ఓట్లేయమబే నాయకుడు జగన్ మాత్రమే ఇలాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడైనా చూశారా? బిసిల అభ్యున్నతికి జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూత ఇస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు స్వార్థపూరిత ఆలోచనలతో హామీలు ఇస్తున్నారు ఎన్నికలప్పుడు చిల్లర వేషాలు వేసే నాయకులు కావాలా? పూర్తి స్థాయి చేయూత అందించే వారు కావాలా? జగన్ రూపాయి చేస్తే నేను 10 రూపాయలు చేస్తా అని చంద్రబాబు అంటున్నారు 2014-19 మధ్యలో ఎందుకు చేయలేదు? నావల్ల మేలు జరిగితేనే ఓటు వేయండి అని జగన్ అడుగుతున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ ను మేము లెక్కల్లోకి తీసుకోవడం లేదు చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? తేల్చుకోవాలి 1:56 PM, Nov 29, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్‌పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్‌కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నారు పవన్‌కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్‌గా పవన్ కళ్యాణ్‌ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్‌కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు (ఇటీవల సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ మాట్లాడుతుండగా అలకిస్తోన్న లోకేష్) 1:06 PM, Nov 29, 2023 ఓటుతో తెలుగుదేశం దుర్మార్గ రాజకీయాలు: మంత్రి జోగి రమేష్ ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ వాళ్లు మాపై ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు చెబుతారు లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాయిస్తారు ఎలాగో ఓడిపోతామని తెలిసే ఇలాంటి రాతలు రాయిస్తున్నారు ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మేం మొదటి నుంచి చెబుతున్నాం ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం తెలుగుదేశం దురుద్దేశపూర్వకంగా కొందరికి రెండు, మూడు చోట్ల ఓట్లు చేర్పించినట్టు తెలిసింది తెలంగాణలో ఉన్నవారి ఓట్లను కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు ఈ అక్రమాలకు పక్కా ప్లాన్‌తో టిడిపి చేయిస్తోంది వీటిపై మళ్లీ పచ్చమీడియాలో వార్తలు రాయిస్తోంది ఎన్నికల సంఘం విచారణలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ప్రతీ ఓటును ఆధార్‌తో లింకు చేస్తే తెలుగుదేశం దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయి 70 రోజులు పారిపోయిన లోకేష్.. మంత్రులకు భయం చూపుతాడా? వచ్చే ఎన్నికల్లో మేమే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పుల్‌స్టాప్ పెడతాం 12:39 PM, Nov 29, 2023 చంద్రబాబు, లోకేష్‌లకు అడ్డం తిరిగిన టిడిపి ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా? (ఫైల్ ఫోటో : ఇటీవల లోకేష్‌తో జడ శ్రవణ్) 12:19 PM, Nov 29, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్‌స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 12:01 PM, Nov 29, 2023 నారాయణ పిటిషన్ వాయిదా అసైన్డ్ భూముల కేసులో మాజీమంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ వాయిదా 11:55 AM, Nov 29, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా ఐఆర్ఆర్ మాస్టర్‌ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 11:23 AM, Nov 29, 2023 స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ స్కిల్ స్కాం కేసులో మరింత లోతుగా విచారణ జరిపించడంతో పాటు సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కొందరికే నోటీసులు అందాయని, మరి కొందరికి అందలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్ తరఫున న్యాయవాదులు 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చాం మిగతా వారి అడ్రస్‌లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని కోర్టుకు తెలిపిన రిజిస్ట్రార్ వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి కోరిన పిటిషనర్ కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసిన హైకోర్టు 11:03 AM, Nov 29, 2023 చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు.. విచారణ వాయిదా చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా వేసిన ధర్మాసనం ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో వినతి 10:54 AM, Nov 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామిలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ 10:06 AM, Nov 29, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో వినతి 9:23 AM, Nov 29, 2023 తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.! చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు. వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్..పాక్..కరివేపాక్..! అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు 7:38 AM, Nov 29, 2023 సెక్షన్ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం సెక్షన్ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్కిల్ కేసులో అరెస్ట్ కాగానే సెక్షన్ 17a రాగం అందుకున్న చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు సుప్రీంకోర్టులో సెక్షన్ 17aపై సుదీర్ఘ వాదనలు CID తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వేర్వేరు కేసుల్లో సెక్షన్ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు సెక్షన్ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు సెక్షన్ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు 7:09 AM, Nov 29, 2023 ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముఖ్య నేతల అపాయింట్మెంట్లు లేక నిరాశతో తిరుగు ప్రయాణం ఢిల్లీలోని జాకీర్‌హుస్సేన్ మార్గ్‌లో ఉన్న ప్రముఖ హోటల్లో బస చేసిన చంద్రబాబు మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మోహన్నాయుడులతో భేటీ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ అనంతరం సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు గుంటూరు ప్రభాకర్, గుంటూరు ప్రమోద్, ప్రేరణ తదితరులు కలిశారు. సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్‌నెట్ కేసులపై న్యాయవాదులతో చర్చ సోమవారం మధ్యాహ్నం తన సతీమణితో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ విందుకు హాజరు ఈ పర్యటనలో పలువురు ముఖ్య నేతలను ఆయన కలుస్తారనే ప్రచారం జరిగింది కానీ, ఎవరి అపాయింట్మెంట్లు లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన చంద్రబాబు 7:01 AM, Nov 29, 2023 లోకేష్ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ? లోకేష్ : స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వాస్తవాలు: 3300 కోట్ల ‘స్కిల్’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని సీమెన్స్ కంపెనీ చెప్పింది ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్‌కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది వారి మధ్య కోడ్ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6 షెల్ కంపెనీల ద్వారా మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్ అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్? 6:59 AM, Nov 29, 2023 చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు బెయిల్ రద్దుపై డిసెంబర్ 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయండి స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే బెయిల్ రద్దుపై విచారణ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టీకరణ తదుపరి విచారణ 11వ తేదీకి వాయిదా -
చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈరోజు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్ 64గా లిస్ట్ అయ్యింది. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరింది. ఏపీ సీఐడీ పిటిషన్లో కీలక అంశాలు.. చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం -
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి -
Nov 28th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:00 PM, Nov 28, 2023 సెక్షన్ 17aపై ఇప్పటివరకు ఏ కోర్టు ఏమి చెప్పింది? పట్నా హైకోర్టు ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ కర్ణాటక హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ (డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది) సెక్షన్ 17aను కోర్టులు ఏ రకంగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాయి? ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయి చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఎందుకు అర్హులు కారో సులభంగా అర్థం చేసుకోవచ్చు కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2:50 PM, Nov 28, 2023 సెక్షన్ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం సెక్షన్ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్కిల్ కేసులో అరెస్ట్ కాగానే సెక్షన్ 17a రాగం అందుకున్న చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు సుప్రీంకోర్టులో సెక్షన్ 17aపై సుదీర్ఘ వాదనలు CID తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వేర్వేరు కేసుల్లో సెక్షన్ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు సెక్షన్ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు సెక్షన్ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు 2:40 PM, Nov 28, 2023 చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు CID దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు డిసెంబర్ 8వ తేదీకి విచారణ వాయిదా బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి 2:30 PM, Nov 28, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ పిటిషన్లో CID వాదనలు చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం 1:30 PM, Nov 28, 2023 బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు : YSRCP ఏలూరు జిల్లా : కైకలూరులో YSRCP బస్సుయాత్రలో మంత్రి,కారుమూరి నాగేశ్వరరావు జగన్ మోహన్ రెడ్డి చెప్పినవి...చెప్పనివి చేస్తున్న గొప్ప మనిషి క్యాబినెట్ లో 70% బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయంతో అధికారం కట్టబెట్టిన ఆ సామాజికవర్గానికి మేలు చేశారు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బిసిలకు ఏం చేశాడు? చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించావా? వందల కోట్లకు చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలను సైతం కౌంటర్లు పెట్టుకుని చంద్రబాబు అమ్మేసుకున్నాడు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు మా వాళ్లకే పనులు చేయండని కలెక్టర్లకు చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఓటేసినా ..వేయకపోయినా అందరికీ మంచి చేయమని చెప్పారు రాజకీయంగా ఇక చంద్రబాబు పనైపోయింది ఈ ప్రభుత్వం పై కుళ్లుతో చంద్రబాబు,ఎల్లో మీడియా బురద జల్లుతున్నారు సామాజిక న్యాయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డే మళ్లీ కావాలని ప్రజలు కోరుతున్నారు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు, పవన్ కళ్యాణ్ చీల్చడానికి ఏమీ లేదు 12:00 PM, Nov 28, 2023 లోకేశ్, చంద్రబాబుకు విజయసాయి కౌంటర్ ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2023 RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) పెరిగింది. చంద్రబాబు హయాంలో (2018-19) కంటే ఇప్పుడు రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2023 11:09 AM, Nov 28, 2023 లోకేష్ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ? లోకేష్ : స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వాస్తవాలు : 3300 కోట్ల ‘స్కిల్’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని సీమెన్స్ కంపెనీ చెప్పింది ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్‌కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది వారి మధ్య కోడ్ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6 షెల్ కంపెనీల ద్వారా మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్ అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్? 10:52 AM, Nov 28, 2023 తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.! చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు. వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్..పాక్..కరివేపాక్..! అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు 10:33 AM, Nov 28, 2023 మా పాదయాత్రకు బ్రేక్ పడింది.. సారీ.. మళ్లీ వస్తున్నా 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత కొనసాగుతున్న యువగళం బ్రేక్ విషయాన్ని కవర్ అప్ చేసేందుకు ప్రచారం పెంచాలని అడుగుతోన్న లోకేష్ అన్ని కులాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్లు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు టార్గెట్లు పెడుతోన్న టిడిపి అధిష్టానం లోకేష్‌ను అన్ని కులాల వారి దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశం ఇవ్వాళ బీసీ సంఘాల నేతలతో లోకేష్ సమావేశం అనంతరం చేనేత కార్మికులతో లోకేష్సమావేశం ఆ తర్వాత దివ్యాంగులతో లోకేష్ భేటీ ఆ తర్వాత గంగిరెడ్డి సామాజికవర్గీయులతో లోకేష్ భేటీ మధ్యాహ్నం కాపులతో లోకేష్ సమావేశం భోజనం సమయంలో ఎస్సీలతో లోకేష్ భేటటీ ఆ తర్వాత కొందరు యువకులు, విద్యార్థులతో మాట, ముచ్చట సాయంత్రం గున్నేపల్లిలో స్థానికులతో లోకేష్ సమావేశం రాత్రి ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి సమీపంలో లోకేష్ బస ఎల్లో మీడియాలో ప్రచారం బాగా రావాలని సూచించిన లోకేష్ 10:33 AM, Nov 28, 2023 చంద్రబాబు కేసు @ ఐటం నెంబర్ 64 ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని వినతి 10:14 AM, Nov 28, 2023 క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.! క్షమించాలి... ప్లీజ్.. నన్ను క్షమించాలి : లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్ ? : YSRCP తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు అరెస్ట్ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.! పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.! నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్‌కు పరిమితమయ్యావు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.! విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు? పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు? చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా? 8:55 AM, Nov 28, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు పిటీషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది ఇదీ చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 8:49 AM, Nov 28, 2023 చంద్రబాబు సచ్చీలుడని కోర్టు చెప్పలేదు: ఎంపీ మార్గాని భరత్ స్కిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు అన్ని విషయాలను పరిశీలించింది తప్పు జరిగిందని నిర్ధారించుకున్నాకే చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానాలేమీ చంద్రబాబు సచ్చీలుడని బెయిల్ ఇవ్వలేదు స్కిల్ స్కాం జరిగింది కాబట్టే సెంట్రల్ జైలులో 52 రోజులు రిమాండ్‌లో ఉన్నారు స్కిల్ స్కామ్ జరగలేదని స్పష్టంగా ఎక్కడా చంద్రబాబు తరఫు న్యాయవాదులు చెప్పడం లేదు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రజాధనం రూ.375 కోట్లను అడ్డదార్లలో ఇంటికి సూట్ కేసుల ద్వారా రప్పించుకున్నది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తామేమీ ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ కంపెనీ స్పష్టంగా చెప్పింది 7:11 AM, Nov 28, 2023 నేడు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్ స్కాం కేసు స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID నేడు విచారణకు రానున్న CID పిటిషన్ సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశారు. మరి 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు అమలు చేసిన నాలుగు పథకాలు చెప్పగలరా? అయినా ఎల్లో మీడియా మాత్రం ఏవో ఘోరాలు జరిగిపోతున్నట్టు గగ్గోలు పెడుతోంది. - వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… pic.twitter.com/NkLQgvOZg7 — YSR Congress Party (@YSRCParty) November 27, 2023 7:00 AM, Nov 28, 2023 ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.! ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్‌పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు హైదరాబాద్‌లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ లోకేష్ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ 6:59 AM, Nov 28, 2023 ఢిల్లీకి చంద్రబాబు టిడిపి లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు 6:56 AM, Nov 28, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ 6:53 AM, Nov 28, 2023 ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు -
నకిలీ బంగారంతో రూ 2.71 కోట్లకు టోకరా
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ ధికారులు, బ్యాంక్ అధికారులు గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆడిట్ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంక్ రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదు చేశారు. 2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్ అప్లికేషన్స్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండా రుణాలు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు వారు తీసుకున్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు -
Nov 27th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:29PM, Nov 27, 2023 ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు 6:05 PM, Nov 27, 2023 ప్రభుత్వంపై పచ్చపత్రికల విషం ఇంకెన్నాళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్, YSRCP ప్రభుత్వంపై టన్నుల కొద్దీ విషాన్ని చిమ్ముతున్న రామోజీ, రాధాకృష్ణ ఎల్లో మీడియా ఉగ్రవాదం స్థాయి దాటి.. బరితెగించింది. సచ్ఛీలుడివైనట్లు ప్రవచనాలు వల్లిస్తే ఎలా రామోజీ..? ఆ పత్రికలు టీడీపీ కరపత్రాల స్టేజ్ దాటిపోయి.. కరదీపికలుగా మారాయి. జగన్ గారు 99 శాతం హామీలు అమలు చేస్తే.. మిగిలిన ఆ ఒక్క శాతం మీద రాస్తారు బాబు కోసం..ఇక్కడేదో ఘోరాలు జరుగుతున్నట్లు నిత్యం రోత రాతలు చంద్రబాబు అక్రమాల సంగతేంటీ? పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నాం ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగినప్పుడు మీ రాతలేమయ్యాయి? నాడు ఎన్జీటీ వంద కోట్ల పెనాల్టీ వేసినప్పుడు మీ రాతలు ఏమయ్యాయి ..? కానుకల పేరుతో హెరిటేజ్ మజ్జిగ టెండర్‌ను కొట్టేసింది చంద్రబాబు కాదా..? ఉచితంగా పత్రిక పంచుతారా? అసలు నీకు 175 స్థానాలకూ అభ్యర్థులున్నారా బాబూ..? విషాన్ని మరింత ఎక్కించేందుకు ఉచితంగా ఈనాడు పంపిణీ వీళ్ల ఎల్లో రాతలతో చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నాడు. రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు జగన్‌గారు అండగా నిలిచారు అందుకే మేం ఇంత ధీమాగా ఉన్నాం. మా ప్రభుత్వంలో టీడీపీ వారికి ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా? చివరికి రాజకీయాన్ని వ్యభిచారంలా చంద్రబాబు అండ్ కో మార్చారు లోకేశ్ పాదయాత్రపై భయాన్ని పరిచయం చేసే వాడివి ఢిల్లీ ఎందుకు పారిపోయావ్ లోకేశ్..? అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుంది..? ఆఫ్ చేసిన లోకేశ్ టేప్ రికార్డర్ మళ్లీ మొదలైంది 5:15 PM, Nov 27, 2023 ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.! ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్‌పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు హైదరాబాద్‌లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ లోకేష్ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ 4:25 PM, Nov 27, 2023 ఢిల్లీకి చంద్రబాబు ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు 3:45PM, Nov 27, 2023 లోకేష్‌పై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ విజయవాడ: లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా? చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ మాట్లాడలేదు అంబేద్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని బాబు చూశాడు చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు బాబు, జగన్‌కు నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి లోకేష్‌కు, చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు ఐదేళ్ల పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు మాకు సమవుజ్జీకాని వ్యక్తి,రాజకీయాల్లో లేని లోకేష్‌కు మేం సమాధానం చెప్పనవసరం లేదు 2:50PM, Nov 27, 2023 ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్ దాటిపోయింది: సజ్జల 2014-18 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు? ఇప్పుడు టీడీపీ పెట్టిన వంద పథకాలు ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు నాడు కనీసం ఒక పథకాన్ని అయినా బాబు పూర్తిగా అమలు చేశారని చెప్పగలరా? టీడీపీ నేతలు బరితెంగించారు. గతంలో ఉచితంగా ఇసుక అని చెప్పారు. ఇసుక ఉచితమైతే దెందలూరు ఎమ్మెల్యే ఎమ్మార్వోతో ఎందుకు అలా ప్రవర్తించారు ఇసుక ఉచితమైతే.. జేసీబీలు ఎవరు పెట్టారు. ఎన్జీటీ వంద కోట్ల పెనాల్టీ ఎందుకు వేసింది. చంద్రబాబు పెట్టిన పథకాలు ఉంటే కదా జగన్ వచ్చి తీసివేయడానికి. ఇసుక అక్రమ దందాలో అందినకాడికి టీడీపీ నేతలు దోచుకున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతీచోటా ఇసుక దందా చేసింది టీడీపీనే మా ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సవాల్ ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్ దాటిపోయింది 2:47 PM, Nov 27, 2023 క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.! క్షమించాలి... ప్లీజ్.. నన్ను క్షమించాలి : లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్ ? : YSRCP తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు అరెస్ట్ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.! పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.! నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్‌కు పరిమితమయ్యావు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.! విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు? పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు? చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా? 2:27 PM, Nov 27, 2023 మద్యం కేసు .. తీర్పు రిజర్వ్ ఏపీ హైకోర్టు: గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తయిన ఇరుపక్షాల వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు 2:15 PM, Nov 27, 2023 నిజాలు చెప్పవా.. నారా లోకేష్.? లోకేష్ చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని అనుకున్నారు స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వ్యవస్ధలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారు నాపై కూడా సిఐడి కేసులు పెట్టారు.. ఒక్క ఆధారం లేదు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా లోకేష్ వ్యాఖ్యలపై YSRCP సూటి ప్రశ్నలు చంద్రబాబు, లోకేష్ తప్పు చేయలేదని కోర్టుకు ఎందుకు చెప్పలేదు? 17a సెక్షన్ కింద మినహాయింపు ఎందుకు అడుగుతున్నారు? గవర్నర్ ముందస్తు అనుమతి అంటున్నారు తప్ప.. మా తప్పేమీ లేదని ఎందుకు చెప్పరు? మీ వాదనలో పస ఉంటే.. సుప్రీంకోర్టు దాకా ఎందుకు? ప్రజల ముందు అబద్దాలు ఇంకెన్నాళ్లు చెబుతారు? CID కోర్టుకు ఇచ్చిన ఆధారాల గురించి ప్రజలకు చెప్పరా? 2:04 PM, Nov 27, 2023 మద్యం కేసు @ హైకోర్టు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై విచారణ లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 1:30 PM, Nov 27, 2023 బీటెక్ రవి రిమాండ్ పొడిగింపు బీటెక్ రవికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగించిన కడప మెజిస్ట్రేట్ బీటెక్ రవిని కడప కోర్టు నుంచి జైలుకు తరలింపు నారా లోకేష్ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్ రవి బీటెక్ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్ క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్ రవి వివాదస్పద వ్యాఖ్యలు "జూదం మా బ్లడ్‌లోనే ఉంది" అంటూ నాడు బీటెక్ రవి వ్యాఖ్యలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి దందాలు, దౌర్జన్యాలు 12:48 PM, Nov 27, 2023 సంగం డెయిరీ పేరిట టిడిపి మోసం ఏలూరు జిల్లా : సంగం డెయిరీ చైర్మన్,టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల డిమాండ్ ఏలూరు స్పందన లో ఫిర్యాదు చేసిన రైతులు బోనస్ 14% ఇస్తామని ఆశ చూపి తమని మోసం చేశారని ఫిర్యాదు అడిగితే.. దాడులు చేశారని చెప్పిన చింతలపూడి, దెందులూరు కు చెందిన రైతులు పాడి రైతులకు పార్టీలు ఆపాదిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోపరేటివ్ సొసైటీ నీ కంపెనీ యాక్ట్ లోకి తెచ్చి రైతులను మోసం చేస్తున్నారనీ స్పష్టం చేసిన రైతులు సంగం డెయిరీ యాజమాన్యం నుండి తమకు రావలసిన 14% బోనస్ ఇప్పించాలని కోరుతున్న రైతులు భవిష్యత్తులో పాడి రైతులు నష్టపోకుండా సంగం డెయిరీ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు 12:28 PM, Nov 27, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 10:04 AM, Nov 27, 2023 రేపు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్ స్కాం కేసు స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID రేపు విచారణకు రానున్న CID పిటిషన్ 9:43 AM, Nov 27, 2023 ఇసుక కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇసుక కుంభకోణం ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు చంద్రబాబు వచ్చాక పలు మార్పులు తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటన మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యం చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు CID నమోదు చేసిన కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్ పై విచారణ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ ఇసుక స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు విచారణకు చంద్రబాబు సహకరిస్తారు, ముందస్తు బెయిల్ ఇవ్వండి 2016లో కేబినెట్ ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది 2019లో సీఎంగా చంద్రబాబు పదవీకాలం ముగిసింది 2023లో APMDC ఫిర్యాదు చేసింది : చంద్రబాబు లాయర్లు 9:30 AM, Nov 27, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : నవంబర్ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 29కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 30కి వాయిదా పడ్డ విచారణ 8:45 AM, Nov 27, 2023 యువగళం.. హస్యగళం.? లోకేష్ యాత్రపై అంబటి చురకలు ఎవరి కోసం? ఎందు కోసం? ప్రజలు నవ్వుకోడానికి తప్ప యువగళం ఇంకెందుకు? ప్రారంభమయిన "హాస్యగళం" విని, చూసి........నవ్వుకోండి ! @naralokesh — Ambati Rambabu (@AmbatiRambabu) November 27, 2023 8:45 AM, Nov 27, 2023 యువగళం.. ఎంతవరకు? రాజమండ్రి వచ్చిన లోకేష్ చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వస్తోన్న లోకేష్ వాయిదాల పర్వం తర్వాత మొదలైన యువగళం అప్పుడు విరామం ప్రకటించిన పొదలాడు నుంచే యాత్ర ప్రారంభం ఉదయం 10:19 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం ప్రజల దృష్టి ఏమార్చేందుకు పార్టీ శ్రేణులను భారీగా రప్పించిన తెలుగుదేశం ఘనస్వాగతం పలికి లోకేష్‌లో జోష్ తీసుకురావాలని సూచించిన చంద్రబాబు పాదయాత్రలో కచ్చితంగా పాల్గొనాలని అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జ్‌లకు ఆదేశం పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురంలోకి పాదయాత్ర ఇప్పటివరకు 209 రోజుల్లో 2,852 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర రాజోలు, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యాత్ర జనసేన కార్యకర్తలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు కచ్చితంగా కనిపించాలని పవన్‌కళ్యాణ్‌కు ఆదేశాలు లోకేష్ యాత్ర విజయవంతమయిందన్న పేరు వస్తేనే కూటమికి మనుగడ అంటోన్న చంద్రబాబు 8:42 AM, Nov 27, 2023 ఢిల్లీకి చంద్రబాబు, క్వాష్‌పై కింకర్తవ్యం? ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు తమ లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్లనున్న చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెళ్లనున్న నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు 8:24 AM, Nov 27, 2023 నోరు జారి.. కడుపుమంట బయటపెట్టి..! నేడు బండారు అరెస్ట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల కేసులో బండారు అరెస్ట్ పై పిటిషన్ 8:04 AM, Nov 27, 2023 మద్యం కేసు @ హైకోర్టు అమరావతి: మద్యంకేసుపై నేడు హైకోర్టులో విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ఇష్టానుసారంగా తన వాళ్ల మద్యం కంపెనీలకు అనుమతులిచ్చిన చంద్రబాబు చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం 7:41 AM, Nov 27, 2023 టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్‌కి ఆ వివరాలు అనుసంధానం ఆ సమాచారం అంతా లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం ఇందుకోసం ప్రజల ఫోన్ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు ఓటర్ల తనిఖీ పేరుతో వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగేలా వ్యవహరిస్తూ.. అడ్డదారుల్లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న రాజంపేటలో నిన్న నెల్లూరులో టీడీపీ కార్యకర్తలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. #EndOfTDP pic.twitter.com/LrEKkEzYXa — YSR Congress Party (@YSRCParty) November 26, 2023 7:00 AM, Nov 27, 2023 నేటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ ఈరోజు ఉదయం 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖతో సరిపెడతానన్న చిన్నబాబు 6:50 AM, Nov 27, 2023 నేడు ఢిల్లీకి చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు హాజరుకానున్న చంద్రబాబు రేపటి వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస 6:45 AM, Nov 27, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ పిటిషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది 6:40 AM, Nov 27, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 6:30 AM, Nov 27, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్‌కు ఏమని చెప్పాలి? -
రఘురామకృష్ణరాజుకు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్(ఐబీఎస్‌ఈపీఎల్)లోకి మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రూ.202 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2011 మార్చి 24న ఇన్వెస్ట్ చేసింది. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సేకరించిన రూ.202 కోట్లలో రూ.200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా.. ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కల్)కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధుల తరలింపుపై ఈడీ విచారించి 2017లో షోకాజ్ నోటీసులిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న రూ.40 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది -
Nov 26th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:16PM, Nov 26, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ 07:15PM, Nov 26, 2023 తెలంగాణ రాజకీయాలు ఏపీపై ప్రభావం ఉండదు : అంబటి అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో సత్సంబంధాలే ఉంటాయి వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా? బాబు చెబితేనే వారాహి.. ఆయన డైరెక్షన్ లోనే వెళ్తుంది 07:00PM, Nov 26, 2023 విశాఖలో రూ.50 వేల చెక్కు ఇచ్చి సీఎం జగన్‌ను దూషించాడు : మంత్రి అంబటి పవన్ గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేటైనా జగనే కారణమంటాడు ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు కాంగ్రెస్ కి, పవన్ బీజేపీకి.. ఏంటయ్యా మీ నీచ రాజకీయాలు పవన్ కి ఈ రాష్ట్రంతో ఏం సంబంధం... నీకు ఊరు, ఇల్లు, ఓటు ఇక్కడ లేవు ఎక్కడ పోటీ చేస్తాడో కూడా పవన్ కు తెలియదు పవన్ పీకే కాదు... కేకే... కిరాయి కల్యాణ్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్ కు ఉందా? ఆగిపోయిన హాస్యకథా చిత్రం రేపటి నుంచి మళ్లీ మొదలవుతుంది అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చు 04:05PM, Nov 26, 2023 చంద్రబాబు, లోకేష్, పవన్‌కు వెల్లంపల్లి ఛాలెంజ్ ఆర్యవైశ్యులకు నేనేమి చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నా టీడీపీ ఆఫీస్‌కు రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధమే ఆర్యవైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి చంద్రబాబు ఎప్పుడూ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆర్యవైశ్యులకు అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు చంద్రబాబు, పవన్, బీజేపీ హిందూ ద్రోహులు టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు విజయవాడ పశ్చిమ టికెట్ వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్‌కు ఉందా? పోతిన మహేష్ సిగ్గులేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని పెట్టలేని దద్దమ్మలు నాకు చెప్తున్నారు 04:02PM, Nov 26, 2023 పవన్ కల్యాణ్‌పై అడపా శేషు ఫైర్ కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టారు కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు పవన్‌కు ఏపీకి వచ్చినప్పుడు వచ్చే పూనకం తెలంగాణలో ఎందుకు రావడం లేదు ఏపీలో బాబు, పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు 04:00PM, Nov 26, 2023 రేపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం పొదలాడ వద్ద రేపు(సోమవారం) ఉ.10.19కి పాదయాత్రను ప్రారంభించనున్న లోకేష్ ఉ.11.20 గంటలకు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ 03:05 PM, Nov 26, 2023 మీ పొత్తుకో దండం! మా సీట్లకే సరి పెడతారా? జనసేనకు 30 సీట్లు ఇవ్వాలని టీడీపీ నేతల యోచన పొత్తులపై చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయి : బుద్ధ వెంకన్న లోకేష్ పాదయాత్రలో తెదేపా, జనసేన శ్రేణులు పాల్గొంటాయి: బుద్దా వెంకన్న పొత్తులపై సొంత పక్షంలోనే అనుమానాలు సందేహాలు ఉన్నాయా? జనసేన కి ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై పార్టీలో అంతర్గతంగా అసమ్మతి తలెత్తుతోందా? లోకేష్ పాదయాత్రకి కచ్చితంగా రావాలని జనసేన కార్యకర్తలను తెలుగుదేశం ఎందుకు పట్టు బట్టుతోంది? రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లో ఒక్కోచోట పది చొప్పున జనసేనకు సీట్లు కేటాయిన్చడం ఖాయమేనా? 01:58 PM, Nov 26, 2023 ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్‌నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ 12:34 PM, Nov 26, 2023 విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్.. ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి, పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురందేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌తో జత కట్టడంపై ఏమంటారో మరి! ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి , పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడంపై ఏమంటారో మరి! pic.twitter.com/ZbZHvJbj8D — Vijayasai Reddy V (@VSReddy_MP) November 26, 2023 11:34 AM, Nov 26, 2023 ఈ నెల 28న సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం పిటీషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది 10:51 AM, Nov 26, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 9:38 AM, Nov 26, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్‌కు ఏమని చెప్పాలి? 8:01 AM, Nov 26, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని నిరూపించే కీలక ఆధారాలు లభ్యం. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్‌కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించాడు.#TDPScams#TDPLiquorScam#CorruptBabuNaidu… pic.twitter.com/yWx66CgCwo — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:54 AM, Nov 26, 2023 తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం.. పేర్ని నాని ఫైర్ పవన్ శ్వాస బాబు కోసమే చంద్రబాబును అధికారంలో చూడాలన్నదే ఆయన కాంక్ష మీ హయాంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ జెట్టీ అయినా కట్టారా? సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలతో మత్స్యకారులకు ఎంతో మేలు చంద్రబాబు కార్యాలయాలకు వందల కోట్లు దుబారా వావి వరుసల్లేకుండా పవన్, చంద్రబాబుల రాజకీయం తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం పవన్ కళ్యాణ్ విశాఖలో మత్స్యకారులకు చేసిన సాయం కంటే.. ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే ఎక్కువ ఖర్చు అయ్యింది. బాధితులకు సహాయం చేసి వెళ్లకుండా... తక్షణమే సాయం చేసిన ప్రభుత్వంపైనా, సీఎం వైయస్ జగన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసమా? - మాజీ మంత్రి పేర్ని నాని… pic.twitter.com/P8nAbbADAJ — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:20 AM, Nov 26, 2023 టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్‌కి ఆ వివరాలు అనుసంధానం ఆ సమాచారం అంతా లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం ఇందుకోసం ప్రజల ఫోన్ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు 7:15 AM, Nov 26, 2023 ఈనెల 28న సుప్రీంలో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు స్కిల్ స్కాం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 7:10 AM, Nov 26, 2023 నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు.. పచ్చమూకల డేటా చౌర్యం నెల్లూరులో ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ దొంగల ముఠా ఆధార్, ఓటర్ కార్డులు, మొబైల్ నెంబర్, ఓటీపీ వివరాల సేకరణ ఓటర్ల తనిఖీ పేరుతో బరితెగింపు ఇంటింటికీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ అనుచరులు మహిళలు, యువతుల ఫొటోలను కూడా వదలని వైనం ప్రజలు నిలదీయడంతో పరారు ఒకరిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు ఓటర్ల పరిశీలన పేరుతో వివరాలు సేకరిస్తున్న @JaiTDP నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న రాజంపేటలో అడ్డంగా దొరికిన పచ్చ బ్యాచ్.. ఇవాళ నెల్లూరులోని మూలపేటలో ఇంటింటికి తిరుగుతూ పట్టుబడ్డారు. సెల్ఫోన్లో ఓటీపీ వస్తుందని అడిగి.. తమ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారంటూ స్థానికులు… pic.twitter.com/w9RXjFjlrY — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:08 AM, Nov 26, 2023 రేపటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ రేపు ఉ. 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖ తో సరిపెడతానన్న చిన్నబాబు 7:06 AM, Nov 26, 2023 ఈ నెల 27న ఢిల్లీకి చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్న చంద్రబాబు నేడు సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహం ఈనెల 28 వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస -
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు.. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు. తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు. పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా.. టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు. కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు. ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట. ఎల్లో మీడియా తీరు మారదా? రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు. -
కాల్చి పడేసిన సిగరెట్టే బోట్ల దగ్ధానికి కారణం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇద్దరు వ్యక్తుల బాధ్యతా రాహిత్యం, కాల్చి పడేసిన సిగరెట్ విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదానికి కారణమైంది. 48 బోట్లను దగ్ధం చేసింది. రూ.కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వారిద్దరూ మద్యం తాగి, సగం కాల్చిన సిగరెట్‌ను బోటులో విసిరేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు నిర్ధారణైంది. సీసీ కెమెరాల దృశ్యాలు, లోతైన దర్యాప్తు ద్వారా వాసుపల్లి నాని (23) అలియాస్ దొంగ కోళ్లు, అతని మామ అల్లిపల్లి సత్యం అలియాస్ పట్టా ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. శనివారం వారిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక బృందాలు 47 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, ఆ ఘటన సమయంలో సెల్ టవర్ ఆధారంగా జట్టీలో ఉన్న వారి వివరాలను సేకరించాయని, పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తించామని చెప్పారు. నాని పేరుతో ముగ్గురు ఉండడం వల్ల యూట్యూబర్ నానిని కూడా విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనతో అతనికి సంబంధం లేదని నిర్ధారణ అయిన తరువాత పంపించేశామని వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన వాసుపల్లి నాని వన్‌టౌన్ చెంగలరావుపేట బజార్ వద్ద ఉంటున్నాడు. నాని ఒక బోటుకు వాచ్‌మేన్‌గా ఆరేళ్లు, మత్స్యకారుడిగా రెండేళ్లు పనిచేశాడు. అతను పనిచేసే పుక్కళ్ల మసేను బోటు మరమ్మతుకు గురవడంతో ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. మద్యం సేవించేందుకు నిత్యం హార్బర్‌కు వెళుతున్నాడు. అలాగే ఈ నెల 19న సాయంత్రం 6.30కి నాని అతని మావయ్య అల్లిపల్లి సత్యంతో కలిసి హోండా డియో స్కూటర్ మీద వెళ్లి రాణీ బొమ్మ జంక్షన్ వద్ద లిక్కర్, జీరో జెట్టీ వద్ద సిగరెట్లు, అగ్గిపెట్టె కొన్నారు. రాత్రి 8.30కు అల్లిపిల్లి వెంకటేష్ కు చెందిన 887 నంబరు బోటులోకి వెళ్లారు. లోపల గ్యాస్ స్టవ్‌పై ఎండు చేపలు గ్రిల్ చేసుకొని, మద్యం తాగారు. కొంత సేపటి తరువాత నాని సిగరెట్ సగం కాల్చి పక్కన ఉన్న మున్నెం హరి సీతారామ్‌కు చెందిన 815 నంబరు బోటులో విసిరాడు. సిగరెట్ అందులోని నైలాన్ వలపై పడడంతో నెమ్మదిగా మంట రాజుకుంది. కొంత సేపటికి భారీగా పొగ, మంట రావడంతో వారిద్దరూ భయంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటలు వ్యాప్తి మరునాడు వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లలో సిలిండర్లు, భారీగా డీజిల్ సిద్ధం చేసుకున్నారు. వీటి కారణంగా మంటలు మరింత ఎగసిపడ్డాయి. సిలిండర్లు పేలడం, అదే సమయంలో తీవ్రమైన గాలుల కారణంగా మంటలు పక్కన ఉన్న బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా.. 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.8.9 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 47 సీసీ కెమెరాలు పరిశీలించి.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారం మేరకు కొందరు అనుమానితులను విచారించారు. యూట్యూబర్ నాని, అదే పేరుతో ఉన్న మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. మరికొంత మందిని కూడా విచారించారు. యూట్యూబర్ నాని ప్రమాద సమయంలో ఒక హోటల్లో ఉన్నట్లు గుర్తించి అతని ప్రమేయం లేనట్లు నిర్ధారణకు వచ్చారు. మిగిలిన వారు చెప్పిన వివరాలతో పాటు ఆ సమయంలో హార్బర్లో ఉన్న వారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఘటన స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ప్రమాద సమయంలో హార్బర్ నుంచి హడావుడిగా వెళుతున్న వాసుపల్లి నాని, సత్యంలను సీసీ కెమెరాల్లో గుర్తించారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సాంకేతిక ఆధారాలతో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. వీరిపై 437, 438, 285 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు బి.భాస్కరరావు, ఇ.నరసింహారావు, జి.డి.బాబు, వి.వి.సి.ఎం.యర్రంనాయుడు బృందాలను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీ–2 కె.ఆనందరెడ్డి, హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ప్రమేయం లేకుండానే అరెస్టు చేస్తారా? డాబాగార్డెన్స్: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో వాసుపల్లి నాని, సత్యం ప్రమేయం లేకుండానే అరెస్టు చేశారంటూ వారి కుటుంబ సభ్యులు శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మత్స్యకార మహిళలు రోడ్డుపై భైఠాయించారు. ఘటన సమయంలో వాసుపల్లి నాని, సత్యం అక్కడ లేరని, తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేశారని, వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. -
నెల్లూరులో ‘పచ్చదొంగల ముఠా’ ఆగడాలు
సాక్షి, నెల్లూరు: ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న ‘పచ్చదొంగల ముఠా’ బాగోతం మరోసారి వెలుగుచూసింది. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగలించడానికి యత్నించిన ఘటన తాజాగా నెల్లూరులో బయటపడింది. మాజీ మంత్రి పొంగురు నారాయణకు చెందిన ప్రైవేటు సైన్యం ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ సెల్ఫోన్లో మీకు ఓటిపి వస్తుంది అని ఓటిపి తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(శనివారం) మూలాపేటలో ఓ ఇంటికి వెళ్లి ఇలా వ్యక్తిగత డేటాను దొంగిలించే యత్నించేందుకు ఓటీపీలు అడుగుతున్నటువంటి పచ్చదొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇది చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనలో కీలక ఆధారాలు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు ఇద్దరు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారని, 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కొంప ముంచిన ఉప్పు చేప ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం అదేబోటులో పనిచేసిన నాని మామ సత్యం.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేశాడు. దీంతో మంటలు చెలరేగాయి. 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి నిందితులు కారణమయ్యారు. వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణం: సీపీ ఈ కేసుపై సీపీ రవిశంకర్ మీడియాకు వివరించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని పేర్కొన్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి ఫిషింగ్ హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేష్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకుని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరెట్ తాగి పక్కన ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మంటలు చెలరేగి వ్యాపించడంతో గమనించి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామని.. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానతులను విచారించామని సీపీ పేర్కొన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగానే యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని సీపీ తెలిపారు. చదవండి: చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది! -
Nov 25th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 04:10PM, Nov 25, 2023 పురందేశ్వరికి విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 1:25 PM, Nov 25, 2023 మాది ప్రజల పార్టీ, పవన్‌ది ప్యాకేజీ పార్టీ అనకాపల్లి : పవన్ పై వైఎస్ఆర్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ పవన్ లా మాది ప్యాకేజీ పార్టీ కాదు పేదల పక్షాన నిలిచే పార్టీ వైఎస్ఆర్ సీపీ షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్ కు ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్ సీపీకి చాలా తేడా ఉంది రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్ కు అభివృద్ధి గురించి తెలుస్తుంది బీసీలను పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా? పవన్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయి హైదరాబద్‌లో హెలికాప్టర్ మిస్సైతే ఏపీకి ఏం సంబంధం వైఎస్సార్సీపీతో జనసేనకు పోలికేంటి? మరో 15,20 ఏళ్లు జగనే సీఎం అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు : వైవీ సుబ్బారెడ్డి 12:45 PM, Nov 25, 2023 ప్రభుత్వంపై పసలేని పవన్ విమర్శలు ఎప్పుడు వైజాగ్ కి వద్దామనుకున్నా ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది : పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్.. మీరు లోకలా? నాన్ లోకలా? అసలు నెలకు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారు? సినిమా షూటింగ్‌కు షూటింగ్‌కు మధ్య గ్యాప్‌లో ఏపీలో వాలి విమర్శలెందుకు చేస్తున్నారు? మీరు ఏ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు? ఏ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు? నెలలో రెండు రోజులు కనిపిస్తారు, మళ్లీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతారు? మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే.. నిజాయతీగా ఏదైనా సమస్యపై పోరాడారా? వారాహి యాత్ర అంటారు.. రోజుల కొద్ది షెడ్డులో వ్యాన్ పెడతారు..! మీదొక పార్టీయేనా? లేక తెలుగుదేశం పార్టీకి బీ టీమా? మీకు, మీ పార్టీకి ఏమైనా సిద్ధాంతాలున్నాయా? మీరు విశాఖ రావడానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఏముంది? మీరు ఇలాగే ప్రవర్తిస్తే.. ప్రజలే మిమ్మల్ని తరిమే పరిస్థితి వస్తుందేమో.! : YSRCP (ఫైల్ ఫోటో : చంద్రబాబు అరెస్ట్ అవగానే రోడ్డు మీద పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 12:33 PM, Nov 25, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టిడిపి క్యాడర్‌కు ఏమని చెప్పాలి? 12:17 PM, Nov 25, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 12:05 PM, Nov 25, 2023 ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు : CPM విజయవాడ : పవన్ కళ్యాణ్ గురించి CPM నేత శ్రీనివాసరావు వ్యాఖ్యలు జనసైనికులను పవన్ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కారు కావాలంటున్నారు పవన్ కు బుల్డోజర్ పాలన కావాలా? ప్రశ్నిస్తానన్న పవన్ బీజేపీని ఏనాడైనా ప్రశ్నించారా? బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించలేదా? ఇప్పుడు మళ్లీ బీజేపీకి పవన్ వంత పాడుతున్నారు : శ్రీనివాసరావు 12:03 PM, Nov 25, 2023 విశాఖలోనే పవన్ కల్యాణ్ విశాఖలోనే ఉండిపోయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం సాయంత్రం తాండూరు వెళ్లనున్న పవన్ నిన్న బోటు ఘటన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవ్వాళ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ సమావేశం సమన్వయ కమిటీ సమావేశాల గురించి పార్టీ నేతలతో పవన్ చర్చలు ఉత్తరాంధ్రలో ఎన్ని చోట్ల పార్టీకి అవకాశాలున్నాయన్న దానిపై ఆరా తెలుగుదేశం ఎన్ని చోట్ల పోటీ చేయాలి? జనసేనకు అవకాశమెక్కడుంది? పవన్ గాజువాక నుంచి పోటీ చేయాలా? లేదా అన్నదానిపై నిర్ణయం గత ఎన్నికల్లో గాజువాక అని ఊరించి దెబ్బ తీశారన్న యోచనలో పవన్ ఉత్తరాంధ్రలో కచ్చితంగా గెలుస్తావని పవన్‌కు నాడు చెప్పిన పార్టీ నేతలు గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఆరా 11:33 AM, Nov 25, 2023 విశాఖ మిలీనియం టవర్స్‌పై పచ్చ మీడియా విష ప్రచారం ఈనాడు ఏం రాసింది? ఐటీ సంస్థల కోసం చంద్రబాబు మిలీనియం టవర్స్ నిర్మిస్తే దాన్ని వేరే అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందని, ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని, క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ, HSBC వెళ్ళిపోయింది అని వాపోయింది. ఇందులో నిజమెంత? వాస్తవాలు ఒక సారి పరిశీలిద్దాం విశాఖలో నిర్మించిన వాటిలో రెండు టవర్లు ఉన్నాయి. టవర్–A, టవర్–B పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న టవర్–Aను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్–Bని నిర్మించింది టవర్–B ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిర్మించే పరిస్థితి లేకుంటే అందుబాటులో ఉన్న భవనాలు వినియోగంలోకి తీసుకురావడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను ఫైవ్‌స్టార్ హోటళ్లలో లేదా బాబు అనుకూల బిల్డింగ్స్ లో పెట్టి పెట్టి భారీ అద్దెలు చెల్లించాలా? క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. ‘టవర్–ఏ’లో ఐటీ సంస్థ కాండ్యుయెంట్ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు . కాండ్యుయెంట్‌కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. మరి క్యాండ్యూయెంట్ ఏం చెబుతోంది? ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నట్టు మాకు హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యే ఆలోచన లేనే లేదు. దీనిపై ఇప్పటికే పలు మార్లు ప్రకటనలిచ్చాం. అయినా ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. HSBC వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? చైనాకు చెందిన HSBC తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్‌తో పాటు భారీ ఐటీ టవర్‌ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్‌ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘i Space’ పేరిట ఐటీ టవర్‌ను నిర్మిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ సీఎం జగన్ ప్రభుత్వం బీచ్ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఇప్పటికే డేటా సెంటర్‌ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్‌ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్ , రాండ్‌స్టాడ్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. 11:04 AM, Nov 25, 2023 చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు రూ.1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు పున్నమ్మా.. దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు గారు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. 1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా! దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 10:15 AM, Nov 25, 2023 విశాఖపై విష ప్రచారం విశాఖ : మిలినియం టవర్స్‌పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం మిలినియం టవర్స్‌లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం టవర్ - ఏలో కొనసాగుతున్న కాండియట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా కంపెనీ మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్ బిజినెస్ సర్వీసెస్ మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్ ప్రస్తుతం టవర్ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు ఈ మధ్యే ప్రభుత్వానికి అప్పగింత ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా 09:08 AM, Nov 25, 2023 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చంద్రబాబు.. బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో టీడీపీ జిల్లా నాయకులను.. పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి.. సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో! చంద్రబాబు గారు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టిడిపి భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి గారి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 07:53 AM, Nov 25, 2023 చంద్రబాబు, పవన్‌లు పొలిటికల్ టూరిస్ట్‌లు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్రపై ఎందుకంత అక్కసు? సీఎం ఎక్కడి నుంచైనా పాలించవచ్చు విశాఖకు కార్యాలయాలు తరలింపుపై విషం కక్కుతున్నారు ఈ ప్రాంతం ఏపీలో లేదా? విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ప్రజలు హర్షిస్తున్నారు వికేంద్రీకరణలో భాగంగా విశాఖ నుంచి పరిపాలన సాగాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతున్నాయి. చంద్రబాబు ఆయన బినామీల కోసం సృష్టించిన గ్రాఫిక్స్ మాయాజాలం అమరావతి. అక్కడ భూముల విలువ తగ్గిపోతుందన్నదే వారి బాధ. - మంత్రి గుడివాడ అమర్నాథ్… pic.twitter.com/EENcVHR2nZ — YSR Congress Party (@YSRCParty) November 24, 2023 07:45 AM, Nov 25, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్‌నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ 07:27 AM, Nov 25, 2023 నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు వెలుగులోకి అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం ఆర్థిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 07:21 AM, Nov 25, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 07:12 AM, Nov 25, 2023 పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోనైనా కలుస్తాను చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు.., కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు.. నాది హ్యుమనిజం : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన -
టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు
పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై శుక్రవారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు. సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్కడ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచయం పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు. అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితురాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధితురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యాయమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నిందితుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణిప్రసాద్ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. -
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్ అధికారి
సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్ అధికారి ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్ అధికారిగా ఉన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్‌కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్‌ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు. ఈ క్రమంలో మహమ్మద్ నదీమ్ హుస్సేన్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్యాంట్ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
నారాయణవనం/కావలి: తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... తిరుపతి జిల్లా, పుత్తూరు మండలం, పరమేశ్వరమంగళానికి చెందిన రమేశ్ నాయుడు (60), భార్య పుష్ప (55), వదిన వనజాక్షి (60), సమీప బంధువులు భాను, శివమ్మ కారులో నిశ్చితార్థానికి చెన్నైలోని పెరంబూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు నారాయణవనం బైపాస్ వద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న కాలేజ్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేశ్ నాయుడు, పుష్ప, వనజాక్షి, భాను అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ శివమ్మను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ఘటనలో... హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో తిరుమల వచ్చారు. తిరుగు ప్రయాణంలో కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద గడ్డిమోపుతో రోడ్డు దాటుతున్న కరకమిట్ల సుబ్బమ్మ (55)ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అంతే వేగంతో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహంకాళి సునీత (40), డ్రైవర్ జీవన్‌కుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, భవాని (57), శేఖర్ (58) తీవ్రంగా గాయపడ్డారు. -
ఇంకా పరారీలోనే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల నరేంద్ర మోసానికి తెరతీసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో ఎనిమిది రోజుల నుంచి ధూళ్లిపాళ నరేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ధూళిపాళ్లతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉండగా, ఎనిమిది రోజుల నుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతులపై దాడి చేసిన ధూళ్లిపాళ్ల అనుచరులు సంగం డెయిరీలో దాక్కున్నారన్న సమాచారంతో డెయిరీకి పోలీసులు వెళ్లగా, లోపలికి రానివ్వకుండా ధూళ్లిపాళ్ల అనుచరులు డెయిరీ గేట్లు మూసివేశారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
Nov 24th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:56 PM, Nov 24, 2023 పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోనైనా కలుస్తాను చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు.., కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు.. నాది హ్యుమనిజం : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు, కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు..నాది హ్యుమనిజం. నాకు తెలంగాణ నేల సనాతన ధర్మం నేర్పింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు ఒకవైపు ఎర్ర జెండా పట్టి మరోవైపు వేదాలను… pic.twitter.com/UXzhqhkfD1— JanaSena Party (@JanaSenaParty) November 23, 2023 3:25 PM, Nov 24, 2023 విమానం ఆగిపోయినా.. ప్రభుత్వంపై ఏడుపా? పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై జనసేన రాజకీయం బేగంపేట నుంచి విశాఖకు రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం లోపం ఉందని తెలియడంతో ప్రత్యేక విమానాన్ని రద్దు చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు విశాఖలో పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది : జనసేన కేవీఎస్ఎన్ రాజు ఎయిర్ పోర్టు అధికారులు రద్దు చేసేలా కొందరు సమాచారం ఇచ్చారు : రాజు జనసేన ఆరోపణలు హస్యాస్పదం : YSRCP ఒక విమానాన్ని అనుమతించాలా? లేదా? అన్నది ఎయిర్పోర్ట్ అధికారుల నిర్ణయం అయినా పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తే ఎవరికి అభ్యంతరం? ప్రభుత్వంపై బురద జల్లి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెంచుకోవాలన్న మీ కక్కుర్తికి ఇదే నిదర్శనం 2:55 PM, Nov 24, 2023 విశాఖపై విష ప్రచారం విశాఖ : మిలినియం టవర్స్‌పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం మిలినియం టవర్స్‌లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం టవర్ - ఏలో కొనసాగుతున్న కాండియట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా కంపెనీ మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్ బిజినెస్ సర్వీసెస్ మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్ ప్రస్తుతం టవర్ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు ఈ మధ్యే ప్రభుత్వానికి అప్పగింత ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా 2:35 PM, Nov 24, 2023 విశాఖను ఆశీర్వదించాలే తప్ప.. విష ప్రచారం వద్దు : సీదిరి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల. గతం లో ప్రజల ఆకాంక్ష తీరక సాయుధ పోరాటం చేసిన చరిత్ర వుంది. సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష తీర్చారు. విశాఖ రాజధానిలో పరిపాలన శాఖల కార్యాలయాల కోసం భవనాలు సమకూర్చితే పచ్చ మీడియా సిగ్గులేకుండా కబ్జా అని రాస్తోంది చంద్రబాబు, లోకేష్, రామోజీ రావు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉండి ఏపీలో ప్రజల్ని నిర్దేశిస్తారా.? ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకులు బానిస బ్రతుకులు బ్రతకడం అవసరమా.? ఏపీలో ఆధార్ కార్డ్ లేని వాళ్లు మనకు రాజధాని వద్దు అంటుంటే టీడీపీ లో ఉండటానికి సిగ్గు లేదా.? ఇక్కడ వలసలు నివారించాలి అంటే గొప్ప రాజకీయ నిర్ణయం జరగాలి. ఇతర ప్రాంతాలతో సరి తూగాలంటే విశాఖ రాజధాని అవ్వాల్సిందే.! ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన పనులు సీఎం జగన్ చేస్తుంటే ఎందుకు అడ్డుపడతారు.? విశాఖ లో ఐటీ ఇండస్ట్రీ దివంగత ముఖ్యమంత్రి డా.YSR వలన వచ్చింది. వైజాగ్‌కు దేశంలోనే పెద్ద పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ లాంటి వాళ్లను సీఎం జగన్ తీసుకొచ్చారు 1:30 PM, Nov 24, 2023 కోర్టులతో ఆటలా.? ఇది సరికాదు.! ఎస్సై నియామకాల వివాదంపై ఏపీ హైకోర్టులో తెలుగుదేశం మద్ధతుదారు న్యాయవాది జడ శ్రావణ్ పిటిషన్ మాన్యువల్‌గా చేసిన కొలతల ప్రక్రియను తప్పుబట్టిన న్యాయవాది జడ శ్రావణ్ పిటిషన్ వేయడంతో మరోసారి ఎస్సై అభ్యర్థులకు కొలతల ప్రక్రియ చేపట్టాలని సూచించిన హైకోర్టు హైకోర్టు సూచనలతో ఎస్సై అభ్యర్థులకు మరోసారి కొలతల ప్రక్రియ, వీడియోను కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం అభ్యర్ధులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదన్న ఏపీ ప్రభుత్వం 45 వేల మంది యువత భవిష్యత్ కు సంబంధించిన అంశమని, స్టే ఎత్తివేయాలని హైకోర్టును అభ్యర్ధించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు సమక్షంలో అభ్యర్ధులకు తిరిగి ఎత్తు కొలుస్తామన్న జడ్జి అభ్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిరూపితమైతే ఒక్కో అభ్యర్ధికి రూ.లక్ష జరిమానా విధిస్తామన్న హైకోర్టు ఈ నెల 29న ఎంతమంది హాజరవుతారో లేఖ పూర్వకంగా తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కు హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 12:00 PM, Nov 24, 2023 విశాఖపై విషం చిమ్ముతోన్న ఈనాడు, రామోజీ నిజాలు మీరే గమనించండి ఈనాడు రాసిందేంటీ? విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోయాయి. ఒకసారి నిజాలేంటో పరిశీలిస్తే.. 2016లో ఇండియాలో 24 బ్రాంచ్‌లను మూసేయాలని HSBC నిర్ణయం తీసుకుంది : ది హిందూ దిన పత్రిక (HSBC India to shut down 24 branches -The Hindu May 20, 2016 ) ఏడాదిన్నర కింద కంపెనీలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను కుదించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మన దేశంలో చెన్నై, కోల్‌కతాతో పాటు విశాఖ శాఖనూ మూసేయాలని నిర్ణయించింది. (News 18, Dec 16 2021) ఇందులో సీఎం జగన్‌కు సంబధం ఏంటీ? విశాఖలో HSBC బ్రాంచ్‌కు ప్రభుత్వానికి ఎలా ముడిపెడతారు? 11:50 AM, Nov 24, 2023 ఇసుక కుంభకోణం కేసు 30వ తేదికి వాయిదా ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఈనెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:49 AM, Nov 24, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 29కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం 11:45 AM, Nov 24, 2023 అసలు సంగతి ఇదా.. నారాయణ ఏపీలో మేము టీడీపీ కలవాలనుకుంటున్నాం : సీపీఐ నారాయణ కానీ టీడీపీ పక్క చూపులు చూస్తుంది బీజేపీతో టీడీపీని కలిపేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారు : నారాయణ 11:40 AM, Nov 24, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు సవాల్ పిటిషన్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన ఏపీ సీఐడీ తమ పిటిషన్‌ను త్వరగా విచారించాలని లేఖ ద్వారా సీజేఐని కోరిన ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వస్తుందని భావిస్తున్న ఏపీ సీఐడీ ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ 10:40 AM, Nov 24, 2023 470 పేజీల అఫిడవిట్ దాఖలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరిన సీఐడీ ఏపీ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు 470 పేజీలతో అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ 09:56 AM, Nov 24, 2023 సిక్కోలు కాదు.. వైజాగ్‌కే స్టాప్ పాదయాత్ర విషయంలో కొడుక్కు సర్ది చెప్పలేక తలపట్టుకుంటోన్న చంద్రబాబు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు యువగళం పాదయాత్ర నిర్వహించాలన్న చంద్రబాబు అంతదూరం నడవలేను, వైజాగ్‌తో సరిపెడతానంటోన్న లోకేష్ బాబు ఇప్పటికే చాలా దూరం నడిచాను, ఇక నా వల్ల కాదంటున్న లోకేష్ పైగా గతంలో చంద్రబాబు కూడా వైజాగ్ వరకే యాత్రను చుట్టేసిన వైనాన్ని గుర్తు చేస్తోన్న లోకేష్ మధ్యలో వదిలేశానన్న అపకీర్తి లేకుండా యువగళాన్ని విశాఖలో వైండ్ అప్ చేయాలన్న యోచనలో లోకేష్ ఎంత నడిచినా, ఏం చేసినా డిసెంబర్ వరకేనంటోన్న చినబాబు 08:59 AM, Nov 24, 2023 నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఇసుక కేటాయింపులు, ఐఆర్ఆర్ కేసుల్లో విచారించనున్న ఏపీ హైకోర్టు నేడు హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేయనున్న ఏపీ సీఐడీ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరనున్న సీఐడీ 08:52 AM, Nov 24, 2023 తెలంగాణలో పవన్ కళ్యాణ్ కొత్త సమీకరణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవన్ కళ్యాణ్ వింత విచిత్ర ప్రసంగం తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఊసెత్తని పవన్ కళ్యాణ్ కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హనుమంత రావుతో నాకు పరిచయాలున్నాయి : పవన్ పరిచయాలు వేరు రాజకీయాలు వేరు : పవన్ నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా : పవన్ నీను కెసిఆర్‌ను, BRSను తిట్టడం లేదు : పవన్ ఎందుకంటే.. ఏపీలో లాగా బాగా తిరిగితే తప్ప BRS గురించి నాకు అర్థం కాదు: పవన్ తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా ఇవాళ నుంచే మొదలు పెడుతున్నా ఇక కాస్కోండి : పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై వచ్చిన వారి కేకలు ఇబ్బందికర పరిస్థితి తప్పించేందుకు జనసేన కార్యకర్తల పోటీ నినాదాలు ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం పవన్ అంటూ జనసేన నేతల నినాదాలు 08:46 AM, Nov 24, 2023 తమ్ముడు గారు... మన దారి తెలంగాణలో ఎటు.? ఏపీలో ఎటు.? పవన్ వ్యాఖ్యలపై పార్టీలో, కార్యకర్తల్లో అయోమయం వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిపోతాయి జనసేన అభ్యర్థులు పోటీ చేసిందే ఎనిమిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిందే అత్యంత ఆలస్యంగా పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ఇప్పుడొచ్చి తొడలు కొట్టడమెందుకు? తెలంగాణలో ఎన్నికలు ముగిసాకా పవన్ కళ్యాణ్ తిరిగితే ఏమొస్తుంది? పైగా కాస్కోండి అని పవన్ సవాల్ విసిరితే ఎవరు పట్టించుకుంటారు? నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వెనుకడుగు వేసే వాడిని కాదని స్టేట్మెంట్ ఇస్తే జనం విశ్వసిస్తారా? ఇప్పటివరకు జనసేన సిద్ధాంతమేంటీ? పవన్ సిద్ధాంతమేంటీ? ఏ పార్టీతో మనం పొత్తులో ఉన్నాం? ఎవరి వెంట తిరుగుతున్నాం? 2014లో ఎందుకు పోటీ చేయలేదు? 2019లో ఒంటరిగా ఎందుకు దిగాం? ఇప్పుడు ఏం కారణం చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడు? సిద్ధాంతం పక్కనబెట్టి పవన్కళ్యాణ్లోనయినా స్పష్టత ఉందా? తెలంగాణలో ఎవరికి ఓటేయమంటున్నాం? ఏపీలో ఏం కావాలని అడుగుతాం? ఆలస్యంగా రావడమే కాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో డిటో అనుకోవాలంటూ మెసెజ్లేంటీ? పార్ట్‌టైం పొలిటిషియన్ అని చాటుకోవడమెందుకు? మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, ఓటేయమని ఎందుకు అడగడం లేదు? నోరు తెరిస్తే గద్దర్ ఆశయాన్ని గెలిపించమంటున్నారు.. గద్దర్ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అన్న విషయం మరిచిపోతున్నారా? అసలు మద్ధతు ఇవ్వాల్సింది బీజేపీకా? లేక చంద్రబాబు సూచనల మేరకు గద్దర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కా? 07:33 AM, Nov 24, 2023 నేడు సీజేఐ ముందు చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ ప్రస్తావన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో హైకోర్టు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలన్న పిటిషన్ త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరనున్న ఏపీ సీఐడీ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించనున్న సీఐడీ ఈ మేరకు మెన్షనింగ్ జాబితాలో చేర్చాలని గురువారం రిజిస్ట్రీకి సీఐడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి 07:30 AM, Nov 24, 2023 ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు చంద్రబాబు ఆదేశాల మేరకే ఫీజు తొలగింపు ఫైల్ సిద్ధమైంది ఫీజు తొలగింపు వల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం వాటిల్లింది ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం దర్యాప్తు అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు చంద్రబాబు, రవీంద్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు ముందుకెళ్లదు వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విచారణ సోమవారానికి వాయిదా ప్రపంచంలో అతిపెద్ద డీప్‌ఫేక్ చంద్రబాబే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అధికారం కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నాడు. ఈ సవాలక్ష రోగాల బాబుని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.#CorruptBabuNaidu #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/OtAOUxJNtc — YSR Congress Party (@YSRCParty) November 23, 2023 07:28 AM, Nov 24, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 07:12 AM, Nov 24, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్‌నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ -
మెడలో తాళి కట్టి.. విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: యండగండి పాఠశాలలో అమానుషం జరిగింది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు.. విద్యార్థినిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే స్కూల్ లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కీచక ఉపాద్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆమెకు ముగ్గురు... మొదటి భర్త ఆత్మహత్య! -
నవ దంపతుల ఆత్మహత్య
అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మండలంలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.