breaking news
-
చైతన్యలో విద్యార్థిని మృతిపై విచారణ వేగవంతం
మధురవాడ: కొమ్మాదిలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రూపశ్రీ బలవన్మరణంపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణ జరిపి 24 గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణ కమిటీగా నియమించినట్టు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు వీరే పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖపట్నం పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి కె. రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ డాక్టర్ కె. రాజ్యలక్ష్మి సభ్యులుగా నియమించింది. సమగ్రంగా విచారణ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. దీనికి కారకులను గుర్తించేందుకు సీసీ పుటేజీలతో పాటు యాజమాన్య ప్రతినిధులు, ఫ్యాకల్టీ, ఇక్కడ పనిచేస్తున్న పురుష సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. శుక్రవారం విశాఖ సిటీలో ఓ సీఐతో పాటు భీమిలి, పద్మనాభం పోలీస్ స్టేషన్ల చెందిన సీఐలు దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటన జరిగి 36 గంటలు దాటుతున్నా పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో బాలిక తల్లి తండ్రులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాల గుర్తింపు రద్దు చేయాలి కొమ్మాది చైతన్య కళాశాలలో విద్యార్థిని మృతికి కారణమైన కామాంధ ఫ్యాకల్టీని కఠినంగా శిక్షించాలని జనజాగరణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వాసు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అధికారులు సమగ్ర విచారణ చేసి చైతన్య ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌వో ఆందోళన : విద్యార్థిని మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని కళాశాల వద్ద పీడీఎస్‌వో ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, నాయకులు రుద్రి, ఎల్. భాను తదితరులు మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుకు మెమోరాండం ఇచ్చినట్టు చెప్పారు. ముగ్గురు వైద్యులతో పోస్టుమార్టం మహారాణపేట: కళాశాల విద్యార్థిని భౌతిక కాయానికి ముగ్గురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్టు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. గైనిక్,పెథాలజీ,ఫోరెన్సిక్ విభాగ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. వారు నివేదికను ప్రిన్సిపాల్‌కు అందజేస్తారు. కాగా కేసు దర్యాప్తు గురించి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి శనివారం పీఎంపాలెం సీఐ రామకృష్ణతో మాట్లాడారు. ఎవరిపై కేసు నమోదు చేశారు.. ఏ సెక్షన్లు పెట్టారో తెలుసుకున్నారు. -
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్‌లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు వారు.. విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదం వారి ఆశలను గల్లంతు చేసింది. వివాహమైన ఐదు నెలలకే భర్తను బలి తీసుకుంది. భార్తను తీవ్రగాయాలపాలు జేసింది. కళ్లెదుటే కట్టుకున్నవాడు విగతజీవిగా పడిఉండడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదిస్తోంది. రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఊటుకూరు సమీపంలోని అశోక్‌గార్డెన్స్(రాజంపేట) వద్ద బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భార్య తీవ్రగాయాల బారిన పడింది. వివరాలిలా ఉన్నాయి.. పుల్లంపేట మండలం (వత్తలూరు) దేవసముద్రం వడ్డిపల్లెకు చెందిన ఊర్సు బీ.హరి(24), చిట్వేలి మండలం వడ్డిపల్లెకు చెందిన శ్రీలేఖతో ఐదునెలల కిందట వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ చిట్వేలి వడ్డిపల్లె నుంచి బైకులో రాజంపేట మండలం గోపమాంబపురం వడ్డిపల్లెకు వస్తుండగా అశోక్‌గార్డెన్ వద్ద లారీ ఢీ కొంది. దీంతో భర్త హరి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రీలేఖకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఐదునెలల క్రితం వివాహం కావడం, ప్రమాదంలో భర్తను కోల్పోవడంతో భార్య పరిస్థితిని చూసిన పలువురు కంటతడి పెట్టారు. కాగా హరి ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ రాకెట్ చిక్కుముడిని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్ మ్యాప్ వివరాలను పిన్ టు పిన్ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైఈస్ట్ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పది రోజుల ప్రయాణం.. అసలు ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? ఓషన్ నెట్వర్క్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్‌తో కూడిన కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగ్ కార్గో షిప్ హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్ టెర్మినల్‌కు, ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్ కాలింగ్’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్వెర్ప్ గేట్‌వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్లోని సీఎన్ఎం టెర్మినల్‌కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది. అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోని టెర్మినల్–2కి 16వతేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్ ఇచ్చారు. కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్ టాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్రెజిల్‌కు బృందాలు.. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్లో డ్రైఈస్ట్ ఆర్డర్ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్ బెర్తింగ్ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ అవశేషాలతో వచ్చిన కంటైనర్‌ని విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోనే భద్రపరిచారు. -
విశాఖ డ్రగ్స్ కేసు: అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు
సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్‌బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు. -
ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు
విజయవాడలోని గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ‘ఎన్నికల సర్వేలో చురుగ్గా పాల్గొంటున్నందున మా పార్టీ నుంచి కొన్ని రీడిమ్ పాయింట్లు ఇస్తున్నాం. ఈ పాయింట్ల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి’ అని అందులో ఉంది. పాయింట్లు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి లింక్‌ను క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేయడంతో లబోదిబోమన్న బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ (స్పోర్ట్స్): కాలానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన సైబర్ నేరగాళ్లు ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. సర్వే అంటూ, ఓటరు కార్డు సరి చేయాలంటూ ఫోన్లు చేసి ప్రజల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఎవరికీ ఫోన్ కాల్ రాదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సర్వే పేరుతో వివరాలు సేకరించి మోసాలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల స్వభావం తెలుసుకునేందుకు, ఓట్లు అభ్యర్థించేందుకు పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. దీనినే కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు వాడుకుంటున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడు ఏదో ఒక పార్టీ సర్వే పేరుతో తియ్యని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి స్వభావంపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఆన్లైన్లో ఆకర్షణీయమైన గిఫ్ట్ పంపుతామని ఆశ పెడతారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత మీరు గిఫ్ట్ పొందేందుకు అర్హత సాధించారని నమ్మిస్తారు. గిఫ్ట్ మీ ఇంటికి రావాలంటే మీ ఓటర్ కార్డ్, బ్యాంక్, ఆధార్, పాన్ వివరాలు చెప్పాలని అభ్యర్థిస్తారు. ఈ వివరాలన్నీ సేకరించిన తరువాత ఆయా బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) ద్వారా ఖాళీ చేస్తారు. ఏఈపీఎస్ మోసాల్లో ఖాతాదారుడికి డబ్బులు వేరే ఖాతాకు డెబిట్ అయినట్టు కనీసం మెసేజ్ కూడా రాదు. ఖాతాలో నగదు లేకుండా అదే వ్యక్తి పేరున ఓ సిమ్ తీసుకుని సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారు. వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు నగదును ముందుగా ఈ బ్యాంక్ ఖాతా, యూపీఐ యాప్‌లకు బదిలీ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడినే నేరగాడిగా మార్చేస్తున్నారు. సామాన్య ప్రజల పేరునే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదును ఆయా ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు రాగానే దాని ఆధారంగా ఆయా బ్యాంక్ ఖాతాను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ముందుగా స్మార్ట్ ఫోన్ సరిగ్గా వాడటం తెలియని వ్యక్తులే తారసపడుతున్నారు. రీడిమ్ పాయింట్లు ఎరగా చూపి.. సర్వే పేరుతో నేరగాళ్లు పలు రకాల ప్రశ్నలు వేసిన అనంతరం.. సర్వేలో చురుగ్గా పాల్గొన్న మీకు కొన్ని ఎస్బీఐ రీడిమ్ పాయింట్లు ఇచ్చామని, తాము పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో మీ వివరాలు నింపాలని సూచిస్తారు. ఫామ్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదంటూ.. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరని ఫోన్ ద్వారా ప్రజలను నేరగాళ్లు ఆందోళనకు గురి చేస్తారు. ఎన్నికల సంఘం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వివరాలు చెప్తే సరి చేస్తామని, ఎనేబుల్డ్ అయిన కొత్త ఓటరు కార్డుతో నిర్భయంగా ఓటు వేయవచ్చని భరోసా ఇస్తారు. వాట్సాప్‌కు పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. పాన్, ఆధార్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఖాతాలోని నగదును లూటీ చేస్తారు. అప్రమత్తంగా ఉండండి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు రావని ప్రజలు గ్రహించాలి. ఓటరు కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. సర్వే పేరుతోరాజకీయ పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. అవతలి వ్యక్తి మాట్లాడే సర్వేలకు స్పందించాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయొద్దు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకా>శం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఎస్డీ తేజేశ్వరరావు, ఏసీపీ, సైబర్ క్రైం, విజయవాడ -
'మత్తు' బంధం బహిర్గతం
కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కలగలిసిన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం చంద్రబాబు అండ్ గ్యాంగ్ వ్యాపార పునాదులను కదిలిస్తోంది. డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలు దేరడం.. ఆ సమాచారం ఇంటర్‌పోల్ చెవిన పడటం.. వారు సీబీఐకి చేరవేయడం.. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్ట్‌కు రావడం.. ఆ కంటైనర్‌ను గుర్తించి సోదాలు, పరీక్షలు చేయడం.. అందులో కొకైన్ తదితర డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం కావడం.. అంతా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ చంద్రబాబు, ఆయన బంధుగణంపైనే చూపిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, అమరావతి: విశాఖ డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన సంధ్యా ఆక్వా కంపెనీ కూనం కోటయ్య చౌదరి వెనుక ఉన్నది తమ కోటరీయేనని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుట్రకు పదును పెడుతున్నాయి. అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను, అభూతకల్పనలను ప్రచారంలోకి తెస్తున్నాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా.. ఫ్లెక్సీలను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరిలతో దగ్గుబాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సంధ్యా ఆక్వా కంపెనీతో టీడీపీ నేతల వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఏమీ తెలీనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది. కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్ దందాచంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాల మెడకు ఇప్పటికే చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం. మసిపూసి మారేడుకాయ చేయాలన్న కుతంత్రాలు బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణలోపడిపోయారు. అంతా చౌదరి కుటుంబమే.. డ్రగ్స్ దందాలో పాత్రధారులు కూనం కోటయ్య చౌదరి కుటుంబం కాగా, సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులేనన్నది బట్టబయలైంది. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కాగా ఈ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, డ్రగ్స్ భారత్‌కు చేరుకున్నాక మార్కెటింగ్ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యుల వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. అసలు సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులోనే దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగానే ఆ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందన్నది తాజాగా సీబీఐ సోదాల్లో వెల్లడైంది. మరోవైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి నిర్వహించారన్నది వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేశ్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్ చేస్తారనే ఫొటోలు సోషల్ మీడియాలో రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఆలపాటి రాజాకూ లింకు చంద్రబాబు గీచిన గీత జవదాటరనే పేరున్న ఆలపాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలతో ఆరి్థక బంధం ఉందని నిరూపించే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు నిగ్గు తేలింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందాను విస్తరించిన సంధ్యా ఆక్వా కంపెనీతో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. బాలయ్య చిన్న అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ కుటుంబం విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం కోటయ్య చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించింది. భరత్ కుటుంబ సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్యా ఆక్వా వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా భరత్ కుటుంబంతో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిందన్నది గమనార్హం. ఈ వాస్తవాలు, పరిణామాలన్నీ కూడా డ్రగ్స్ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టంచేస్తున్నాయి. పచ్చ గ్యాంగ్ నాడు అలా.. నేడు ఇలా భారీ డ్రగ్స్‌ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఈ) కోసం విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జోనల్ కార్యాలయానికి సంధ్యా ఆక్వా దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలేమీ పాటించలేదని తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2019 సెపె్టంబర్ 18న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. నిజానికి అంతకు ముందు కూడా దరఖాస్తు చేయగా తిరస్కరించామని, ఇదే కంపెనీ అదే మళ్లీ అలానే దరఖాస్తు చేసినందున తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. సంధ్యా ఆక్వాలో నీరు, గాలి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగినంత భూమి వారి వద్ద అందుబాటులో లేదని తెలిపింది. వ్యర్థాలను సమీపంలోని కాలువలో వదిలేస్తున్నట్లు తాము గుర్తించామని ఆర్డర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. అప్పటికే ఏవైనా కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే వెంటనే వాటన్నింటినీ నిలిపివేయాలని కూడా హెచ్చరించింది. దీనిని బట్టి సంధ్యా ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందనేది సుస్పష్టం అవుతోంది. అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురదజల్లడానికి పచ్చ గ్యాంగ్, పచ్చ మీడియా విఫలయత్నం చేస్తోంది. తమ సన్నిహిత సంస్థ అని ఆ రోజు భుజానకెత్తుకుని, ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా.. ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం బయట పడేసరికి ప్లేటు ఫిరాయించాలని చూస్తోంది. కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నది టీడీపీ యత్నం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. అయోమయానికి గురై వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతున్నారు. కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు ఉన్న ఓ ఫ్లెక్సీని చూపిస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామంప్రకాశం జిల్లాలోని ఈదుమూడి వెళ్లారు. ఆ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలో కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు వేశారు. అదేమీ వైఎస్సార్సీపీ రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం అంత కంటే కాదు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది. అందులో ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు కూడా లేదు. అయినా ఆ ఫ్లెక్సీలో ఫొటో ఉంది కాబట్టి కూనం ప్రభాకర్ చౌదరి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ దు్రష్పచారం చేస్తుండటం విడ్డూరం. డ్రగ్స్ దందాలో నిండా మునిగిన చంద్రబాబు ఈ ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా భావిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘మేత’వన్నె పులి
సాక్షి, అమరావతి: డ్రై ఈస్ట్ మాటున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ పేరిట దిగుమతి చేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. రొయ్యల మేత మాటున రూ.లక్షల కోట్ల డ్రగ్స్ దందా సాగిస్తూ ‘మేత’వన్నె పులిగా ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్’ ఖ్యాతిపొందింది. ఈ క్రమంలో అసలు డ్రై ఈస్ట్ అంటే ఏమిటి? ఎలా తయారవుతుంది.? ఏయే అవసరాల కోసం ఎంత మోతాదులో వినియోగిస్తారు. ఆక్వా ఫీడ్ తయారీలో నిజంగానే వాడతారా? ఫీడ్ తయారీలో ఈ సంస్థ ఎప్పుడు అడుగు పెట్టింది ? ప్లాంట్ సామర్థ్యం ఎంత ? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది 90 శాతానికిపైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే డ్రై ఈస్ట్ అనేది సజీవ సూక్ష్మజీవుల సమాహారం. ఇదొక ఇమినో బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం సక్కరో మైసెస్. ప్రధానంగా యాక్టివ్ డ్రై ఈస్ట్, ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, ఫాస్ట్ యాక్టింగ్ ఇన్స్టంట్ ఈస్ట్, బ్రెడ్ మెషిన్ ఈస్ట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బేకరీ, ఆహార ఉత్పత్తుల తయారీలో వాటి ఆకృతి, రుచి, పెరుగుదలకు వాడుతుంటారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలోనూ కొద్దిగా వాడతారు. ఈస్ట్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయంగా చాలా ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ ఆహార ఉత్పత్తుల తయారీదారులు విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయంగా క్వాలిటీని బట్టి కిలో రూ.200 నుంచి రూ.480 వరకు ఉంటే, ఒక్క బ్రెజిల్‌లోనే కిలో రూ.70కు అందుబాటులో ఉంటుంది. కారణం ఇక్కడ ఎక్కువగా పండే బార్లీ నుంచి ఈస్ట్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఒక్క బ్రెజిల్ నుంచి ఏటా 500 టన్నుల ఈస్ట్ మన దేశానికి దిగుమతి అవుతుంది. దిగుమతి అయ్యే డ్రై ఈస్ట్‌లో నూటికి 90 శాతానికి పైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే ఉపయోగిస్తారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలో వాడకం ఐదు శాతం లోపే ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువగా ఫీడ్ సప్లిమెంట్ కోసం వాడతారు. ఆక్వా సాగులోనూ హెక్టారుకు 5 గ్రాములకు మించి వాడరు ఆక్వాసాగులో ఈస్ట్‌ను రైతులు ఉపయోగిస్తుంటారు. సాగుకు ముందు చెరువులను సిద్ధం చేసే సమయంలో వాటర్ ఫ్యూరిఫికేషన్ చేస్తారు. ఈ సమయంలో వరిపిండి, తవుడు, బెల్లం, నీరు కలిపిన ద్రావణంలో 1–2 గ్రాములు ఈస్ట్‌ను కలిపి 24 గంటలపాటు పులియబెట్టి ఆ తర్వాత చెరువులో కలుపుతారు. దీనివల్ల పైటో ప్లాంటన్ (వృక్ష సంబంధమైన ప్లవకం), జూ ప్లాంటన్ (జంతు సంబంధమైన ప్లవకం) తయారవు తుంది. వీటిని తినేందుకు రొయ్యలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇలా హెక్టార్‌కు ఐదు గ్రాములకు మించి వినియోగించరు. ఆ తర్వాత వ్యాధికారక క్రిములను తట్టుకొని మెరుగైన రోగనిరోధకశక్తిని పొందేందుకు, నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రో బయోటిక్స్గానూ వాడుతుంటారు. వీటి తయారీలో కూడా ఈస్ట్‌ను ఫీడ్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. రొయ్యల మేత తయారు చేసే ఫీడ్ కంపెనీలు దేశీయంగా 16 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 14 లక్షల టన్నుల మేత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క అవంతి ఫీడ్ కంపెనీయే ఏటా 5–6 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత సీపీఎఫ్ కంపెనీ 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే, మిగిలిన కంపెనీలన్నీ ఏటా 50 వేల నుంచి లక్ష టన్నులలోపు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏకంగా 25 టన్నులెందుకు? ఇక సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెట్ పేరిట అధికారికంగా పామర్రులో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నెల్లూరులో బ్లాక్‌వాటర్ షల్ ఫిష్ హేచరీ ఉంది. రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా మూలపేట వద్ద మరో ప్రాసెసింగ్ ప్లాంట్, వజ్రకూటం వద్ద ఏటా 60వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్వా ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మార్కెట్లోకి రాలేదు. కేజీ మేత తయారీ కోసం కేవలం 5 గ్రాములకు మించి డ్రై ఈస్ట్‌ను వాడరు. అంటే 25 టన్నుల డ్రై ఈస్ట్ ద్వారా కనీసం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మేత తయారు చేయొచ్చు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 60 వేల టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంత పెద్ద ఎత్తున డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ ఇవ్వడం వెనుక చాలా గూడుపుఠాణి ఉందని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పెద్దల సహకారంతోనే డ్రై ఈస్ట్ పేరిట డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రైతులకు రూ.కోట్లలో బకాయిలు మరోవైపు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ రోజుకు 80 టన్నుల నుంచి 150 టన్నుల రొయ్యలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తుంది. గతంలో ఎక్స్పోర్ట్ కంపెనీలు చెప్పిందే ధర.. ఇచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్సడా చట్టం చేయడం, పైగా కౌంట్ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రతి 15రోజులకోసారి పర్యవేక్షిస్తుండడంతో కంపెనీల ఆటలు సాగడం లేదు. స్థానిక ఆక్వా రైతులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈక్వెడార్ నుంచి 17 కంటైనర్లలో రొయ్యలను దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి తిరిగి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలియడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కంపెనీని కొంతకాలం పాటు సీజ్ చేసింది. ఎగుమతులకూ బ్రేకులేసింది. ఇటీవల కాలంలో ఈ సంస్థ రైతులకు రూ.కోట్లలో బకాయి పడింది. రొయ్యలు సరఫరా చేసినందుకు ఈ కంపెనీ తనకు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని భీమవరానికి చెందిన ఓ రైతు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లించేలా చూడాలి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను ప్రాసెస్ చేసి అమెరికాకు పంపుతున్న సమయంలో అప్సడా ఉక్కుపాదం మోపింది. చట్టపరంగా చర్యలు తీసుకుని కంపెనీని చాన్నాళ్లు మూసేసింది. ఇటీవల ప్రారంభించిన ఫీడ్ ప్లాంట్ తయారీకి ఎలాంటి అనుమతులూ లేవని చెబుతున్నారు. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించని ఈ సంస్థకు ఇంతపెద్ద ఎత్తున డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా ముందుగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు అణాపైసలతో సహా చెల్లించి తీరాల్సిందే. ఈ సంస్థను అడ్డంపెట్టుకుని డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న టీడీపీ, బీజేపీ పెద్దలెవరో తెలియాలంటే సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్నిఫర్ డాగ్స్ అడిగారు.. పంపాం
విశాఖ సిటీ: డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేస్తోందని వివరించారు. ‘బ్రెజిల్ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో జేఎం భక్షి అనే ప్రైవేట్ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్లోడ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెలివరీ అయిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ కావాలని పోలీస్ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్‌లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. కంటైనర్‌లో డ్రగ్స్ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్‌ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు. ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన టెక్నికల్ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు. స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం ‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ లేవు. ఒడిశా, మల్కన్‌గిరి, జైపూర్, కోరాపుట్ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. -
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు. విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్.. 'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది. గంట మోగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు. -
విశాఖ డ్రగ్స్ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
విశాఖ డ్రగ్స్: డామిట్ కథ అడ్డం తిరిగింది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌పై పనిగట్టుకుని పచ్చ బ్యాచ్ మళ్లీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు అండ్ కో టీమ్ రెడీగా ఉంటుంది కదా. అందులో భాగంగా మరో కొత్త నాటకానికి ప్లాన్ చేసింది.కానీ, ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే అసలు విషయం బట్టబయలైంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి. ::చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చింది. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. ::: పవన్ కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో.. నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లో కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు ఆయా కుటుంబాలకు ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబం తోను వీరభద్రరావు కు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలు తో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోయి పచ్చ బ్యాచ్ కంగుతింది. దర్యాప్తులో వేళ్లన్నీ తమవైపే చూపిస్తాయని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు విశాఖ తీరానికి చేరిన సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు! ఈ డ్రగ్స్ స్కాంలో @JaiTDP నేతలకు నేరుగా లింకులు! టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు. కాగా దామచర్ల సత్య,… pic.twitter.com/bBmfqar1az — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 కూనం వీరభద్రరావు అసలు చరిత్ర.. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కునం వీరభద్రరావుకి ఘనమైన చరిత్రే ఉంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఇతను దగ్గుబాటి పురందరేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్లో పార్ట్నర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠపై బురదజల్లడం, దాని ద్వారా లబ్ధిపొందాలని చూడటం నీకు అలవాటే గా @ncbn! విశాఖలో దొరికిన డ్రగ్స్ విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ సంస్థకు చెందిందని, దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం… https://t.co/Ozx79Yhs7Q pic.twitter.com/EOAzOwdwAy — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో టీడీపీ నేతలకు నేరుగా సంబంధాలున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గరి సంబంధాలున్నాయి. కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్‌కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశముంది. Whats up ‘Telugu Drugs Party’ @JaiTDP!#TeluguDrugsParty pic.twitter.com/XgtpowH6r0 — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 డ్రగ్స్ కంటైనర్‌పై సంధ్యా ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ రొయ్యల మేతలో వాడే ఈస్ట్‌ను తొలిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బు చెల్లించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయల్దేరి మార్చి 16న విశాఖకు వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్‌లోని డ్రగ్‌ను టెస్ట్ చేశారు. నిషేదిత డ్రగ్‌గా సీబీఐ అనుమానిస్తోంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం అని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం.. విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి'
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. -
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్‌లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్‌ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది. 18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్‌పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్‌కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది. -
ఊపిరి తీసిన వివాహేతర సంబంధం
పిఠాపురం: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరొకరిని ప్రాణాపాయస్థితికి తీసుకెళ్లింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాసు (45), పెండ్యాల లోవమ్మ (35)లను అదే గ్రామానికి చెందిన లోకా నాగబాబు కత్తితో నరికి చంపాడు. లోవమ్మ తల్లి రామలక్షి్మపైనా దాడి చేయడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. పెండ్యాల లోవమ్మ భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. గ్రామానికి చెందిన లోకా నాగబాబుతో సహజీవనం చేస్తోంది. ఇటీవల పోసిన శ్రీనివాసుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో ఆమెను నాగబాబు పలుమార్లు హెచ్చరించాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 20 రోజులుగా శ్రీనివాసు, లోవమ్మలను వెంబడిస్తున్నాడు. ప్రతి రోజూ శ్రీను తన మోటారు సైకిల్‌పై లోవమ్మను తన పొలంలోకి పనులకు తీసుకెళ్లడం గమనించాడు. ఎలాగైనా వారిద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. మాటు వేసి దాడి లోకా నాగబాబు మంగళవారం అర్థరాత్రి చేబ్రోలు శివారు లక్ష్మీపురం పొలిమేరలో ఉన్న శ్రీనివాసు పొలానికి కత్తి తీసుకుని వెళ్లాడు. తన మోటారుసైకిల్‌ను దూరంగా పొదల్లో దాచాడు. అక్కడ బెండ తోట పక్కనే ఉన్న నువ్వుల చేనులో దాకున్నాడు. కాగా.. శ్రీనివాసు తన పొలంలో బెండకోత కోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని బుధవారం ఉదయం 4.30 గంటలకు వారిని రమ్మని చెప్పాడు. ముందుగానే లోవమ్మను తీసుకుని పొలానికి వెళ్లిపోయాడు. అక్కడే నువ్వుల చేలో దాక్కున్న నాగబాబు వారిద్దరిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లి రామలక్షి్మపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడకు వచ్చేసరికీ నాగబాబు పరారయ్యాడు. కాగా.. బెండకాయల కోతకు వచ్చిన కూలీలు పొలంలో లోవమ్మ, శ్రీనివాసు మృతదేహాలను చూశారు. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోసిన శ్రీనివాసుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగబాబు గత 20 రోజులుగా కత్తి తీసుకుని శ్రీనివాసు పొలంలో తిరగడాన్ని సమీపంలోని రైతులు గమనించారు. ఈ విషయాన్ని శ్రీనివాసుకు చెప్పినా అతడు పట్టించుకోలేదు. నాగబాబు గతంలో లోవమ్మ వెంటబడిన ఒక వ్యక్తి చెయ్యి నరికాడని, ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని స్థానికులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
తాళి కడుతుండగా బయటపడ్డ వరుడి బాగోతం
వెల్దుర్తి(కృష్ణగిరి): మరో అరగంటలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయిన ఘటన బ్రహ్మగుండం క్షేత్రంలో బుధవారం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన యువకునికి కర్నూలు మండలానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. రూ.లక్షల్లో కట్నకానుకలు పూర్తికాగా రామళ్లకోట టు వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో పెళ్లికి ముహూర్తం కుదిరింది. తమ తమ ఇళ్ల వద్ద పెళ్లి ముందు కార్యక్రమాలు పూర్తి చేసుకుని వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం రాత్రి బ్రహ్మగుండం చేరుకున్నారు. బుధవారం ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది. వధూవరుల బంధువులు రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మండలాల నుంచి విచ్చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పలువురు బంధువులు పెట్టుబడులు చదివించేసి కూడా వెళ్లిపోయారు. పెళ్లి పీటల మీద కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానంటూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వివాహిత ఫోన్ ద్వారా సంప్రదించింది. తనను పెళ్లి కూడా చేసుకున్నాడు, పిల్లాడు ఉన్నాడంటూ ఫొటోలు షేర్ చేసింది. దీంతో పెళ్లి కుమారుడి అసలు బాగోతం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేశారు. వరుడిపై, అతని కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవకు దిగారు. దీంతో వరుడి తరపు గ్రామ పెద్దలు, బంధువులు కలుగజేసుకుని పంచాయతీ నిర్వహించి రూ.లక్ష కట్టించేలా, క్షమాపణలు చెప్పి పంపించారు. వరుడు విశాఖపట్నం నేవీ పోర్టు ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే సోషల్ మీడియా ద్వారా పరిచయమై కుమార్తె ఉన్న ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి వాగ్దానాలతో గడుపుతూ ఇక్కడ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారమే తెలుసుకున్న వివాహిత వెల్దుర్తి పోలీసులకు 100 కాల్ ద్వారా సంప్రదించి విషయం చేరవేసింది. కేసు ద్వారా లేక స్వయంగానైనా లేక పెళ్లి అయినట్లు తగు సాక్ష్యాలతో విచారణ కోరాల్సిందిగా పోలీసులు తెలపడంతో వివాహిత యువతి స్వయంగా వధువు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించి తనతో వరుడు గడిపిన ఫోటోలు షేర్ చేసి పెళ్లి ఆపినట్లు తెలుస్తోంది. తాను తన అక్కతో విశాఖపట్టణం నుంచి రామళ్లకోటకు బయలుదేరుతున్నట్లు వరుడి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. వరుడు తన స్వగ్రామంలో సైతం పలువురిని నమ్మించి తను పోర్టు ప్రాంతం నుంచి చవకగా బంగారు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. -
బాబు బెయిల్ రద్దు పిటిషన్: ఏప్రిల్ 16న పూర్తి విచారణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
పోలీస్ స్టేషన్లో దస్తగిరి దాదాగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్‌నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్ఓను గానీ.. ఎస్ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?