breaking news
-
ముందస్తు కుట్రతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి పక్కాప్లాన్, ముందస్తు కుట్రతో జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ఏ2 పోద్బలంతోనే సీఎం జగన్‌పై రాయితో దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు (ఏ1) వేముల సతీష్‌కుమార్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. వివేకానంద స్కూల్ వద్ద కంటే ముందు డాబా కొట్ల కూడలిలోనే రాయి విసిరేందుకు మొదట ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. న్యాయస్థానం ప్రత్యేక అనుమతితో విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీన నిందితుడు సతీష్ ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు సతీష్‌ను అతడి తండ్రి దుర్గారావు, అతడి న్యాయవాది సమక్షంలో సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. శనివారం కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడిని పోలీసులు సబ్‌జైలులో అప్పగించారు. మూడురోజుల విచారణ, సీన్ రీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీల్డ్ కవర్లో న్యాయాధికారికి అందజేశారు. విచారణలో నిందితుడు పూర్తిగా సహకరించలేదని, అతడు ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నిందితుడిని విచారించాల్సి ఉందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడురోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక ఏ2తో పాటు, మరికొందరి కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్‌కుమార్ కూలిపనికి వెళ్లాడు. అదేరోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో హత్యాయత్నానికి వారు కూలిపని చేస్తున్న ప్రదేశంలోనే స్కెచ్ వేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడిచేయాలి? ఎలా తప్పించుకోవాలి? దాడిచేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు? వంటి అంశాలను ఏ1తో కలిసి ఏ2 చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏ2గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏ1 సతీష్ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కుట్ర ఎలా అమలు చేయాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సీఎం జగన్ బస్సుయాత్ర గవర్నమెంట్ ప్రెస్ కూడలి దాటి ఫ్లైఓవర్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు నిమిషాల్లో యాత్ర తాను నిలబడిన (డాబాకొట్లు) సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్దే ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్‌తో పాటు అతడి స్నేహితుడు ఉన్నాడు. బస్సుయాత్ర డాబాకొట్లు సెంటర్‌కు చేరుకోగానే అప్పుడే సీఎం జగన్‌పై రాయి విసేరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వద్దని, ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్‌ను అతడి స్నేహితుడు వారించి నిలువరించాడు. భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సుయాత్ర వివేకానంద స్కూల్ వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్, గంగానమ్మ గుడి మధ్యనున్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్‌పై దాడిచేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్‌తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే తన ఇంటికెళ్లిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులను కలిశాడు. తరువాత వారంతా అక్కడ టపాసులు కాల్చారు. ఈ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు పోలీసు కస్టడీకి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) వేముల సతీష్ కుమార్‌ను గురువారం నుంచి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను గురువారం ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను ప్రతి రోజూ ఉదయం 10 ఉంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారించనున్నారు. విచారణ అనంతరం రోజూ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సబ్ జైలులో అప్పగించాల్సి ఉంటుంది. సీఎం జగన్‌ను హతమార్చేందుకే దాడి మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పదునైన కాంక్రీట్ రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో బలమైన గాయమైంది. పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా బలమైన గాయమైంది. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అదే ప్రాంతానికి చెందిన వేముల సతీష్‌కుమార్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుపర్చారు. సతీష్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను హతమార్చేందుకే సతీష్ రాయితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పాత్రధారులు, సూత్రధారుల గుర్తింపునకే..కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే సీఎం జగన్‌పై తాను ముందస్తుగా సేకరించిన కాంక్రీట్ రాయితో దాడి చేశానని పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించినట్లు సమాచారం. దీని అధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరో సరిగా తేలక పోవడంతో ఈ కేసు అసంపూర్తిగానే ఉంది.కేసును మరింత సమగ్రంగా, లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది. మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇవే విషయాలను పేర్కొంటూ నిందితుడిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం నిందితుడిని మూడు రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు
కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్ నగర్‌కు చెందిన కుమార్ (45), జ్యోతి (38), సిరి అలియాస్ రాజీ (38) వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో వారిని చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్‌పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్‌నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్‌నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్‌ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్‌ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. -
బెదిరించి, కవ్వించి.. వైఎస్సార్సీపీ కుటుంబంపై టీడీపీ దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ఐదుగురిని గాయపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు ఈ దారుణానికి దిగారు. బాధితుల కథనం ప్రకారం వైజాగ్‌లో ఉద్యోగం చేసుకునే ఈ కాలనీ వాసి గడ్డం కిషోర్ ఇటీవల ఇంటికి వచ్చాడు. వీరి కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ 2019 నుంచి డిమాండ్ చేస్తున్నాడు. ఆయన భయపెట్టినా, బెదిరించినా కిషోర్ కుటుంబం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కిషోర్ తన ఇంటి గేటు వద్ద ఉండగా ఆ కాలనీకి చెందిన గడ్డం మధు అనే యువకుడు సిమెంటు రాయి తెచ్చి కిషోర్ ఇంటి తడికపైకి విసిరాడు. రాయి ఎందుకు విసిరావంటూ కిషోర్ కేకలు వేశాడు. తరువాత 11.40 గంటలకు టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ సుమారు 15 మందిని తీసుకొచ్చి కేకలు వేశాడు. బయటకు వచ్చిన కిషోర్ కుటుంబసభ్యులపై దాడిచేశారు. కిషోర్ భార్య హెమీమాను జుట్టు పట్టుకుని లాగటంతోపాటు ఆమె చేతివేలిని గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొరికి గాయపరిచాడు. కిషోర్ అక్క దాసరి ఎస్తేరమ్మ, తల్లి గడ్డం కొండమ్మ, బావ నాగరాజుపైన దాడిచేసి గాయపరిచారు. కిషోర్‌ను మురుగు కాలువలో పడేసి పొడవాటి వస్తువుతో కొట్టి గాయపరిచారు. ఆ ప్రాంతంలో వీధిలైట్లను కూడా ఆపేసి ఈ దాడికి దిగారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిషోర్ మేనకోడలు దాసరి ప్రవల్లిక సెల్‌ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులకు కొండపి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఐనంపూడి రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, లక్కిపోగు సుధాకర్, ఐనంపూడి భాస్కర్, గడ్డం మధు, గడ్డం మరియమ్మ, గడ్డం నిర్మల, గడ్డం ఆకాష్, మరికొందరు తమపై దాడిచేసినట్లు కిషోర్ చెప్పారు. ఇరువర్గాలకు గాయాలయ్యాయని, రెండువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్.ఐ. కృష్ణబాజిబాబు చెప్పారు. దాడికి గురైనవారి మీద కూడా కేసు పెడతామని ఎస్.ఐ. పోలీసులు చెప్పడంతో వైఎస్సార్సీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత«ంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్‌ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్‌ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్‌ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్‌పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్‌ను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు, ఆయన అనుచరులకు ఓటమి భయం పట్టుకోవడంతో వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సీఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయవద్దన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు.. ఇక్కడ లోకేశ్ గెలవాలంటూ కేకలు వేశారు. టీడీపీకి, లోకేశ్‌కు అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పారు. వీరిని పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బూతులు తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలిరా ప్రచారం చేయవద్దని అని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడంతో అతడిపై దాడిచేశారు. అంతలో మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. వారిలో ఒక యువకుడు మోటారు సైకిల్‌తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఢీకొట్టాడు. ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయారు. కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్రంగా గాయమైంది. వచ్చిన ఆరుగురిలో ఇద్దరు యువకులు రోడ్డుపై రక్తపుగాయాలతో ఉన్న మేకా వెంకటరెడ్డిని కాళ్లతో తన్నారు. వెంకటరెడ్డిని కొడుతుంటే ఆపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసి కొట్టి ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న వారిలో ఒక యువకుడిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుకున్నారు. అది గమనించిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెనక్కివచ్చి పట్టుకున్న వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పట్టుబడిన వ్యక్తి విడిపించుకుని పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను అడిగి వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు తెలిపారు. బయటి నుంచి దించారు ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి పలువురిని తీసుకొచ్చారు. కొందరు స్థానికులు, బయట నుంచి వచ్చినవారు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఏపీ 39 ఎఫ్వై 2192 నంబరుతో ఉంది. ఇది విశాఖ అడ్రస్‌తో ఉందని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి లోకేశ్ నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించారని, ఎవరూ ఎక్కడా తగ్గవద్దు.. నేను చూసుకుంటానంటూ చెప్పారని గుర్తుచేశారు. లోకేశ్ అలా మాట్లాడబట్టే ఆ పార్టీ వారు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశాయి. రెచ్చిపోయిన పచ్చమూకల దాడిలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్ ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో గురువారం రోడ్‌షోకి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కాన్వాయ్కి ముందున్న ప్రచార వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని తాళాలు లాక్కున్నారు. తాళాలివ్వాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోరినా ససేమిరా అన్నారు. ‘తాళాలిచ్చేది లేదు. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి..’ అంటూ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు అవినాష్, వ్యాపార భాగస్వామి రాజగోపాల్ ఆ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత మొదలైంది. ప్రచారరథం తాళాలివ్వాలని కోరిన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మంజునాథ్, అనిల్‌కుమార్‌లపై అవినాష్, రాజగోపాల్ దాడికి దిగారు. వీరితోపాటు అమిలినేని ప్రైవేట్ బౌన్సర్లు సుమారు 20 మంది మూకుమ్మడిగా దాడిచేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దుతూ, ఎదపై కాళ్లతో తన్నుతూ, రాళ్లతో కొడుతూ మురుగు కాలువలోకి పడేశారు. పదేపదే గుండెలపై దాడిచేసి చంపేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వ్యక్తిగత వాహన డ్రైవర్ శివపైనా దాడి చేశారు. అతడి గొంతు నులిమారు. వారి దాడిలో శివ చేతికి గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక వాల్మీకి వర్గానికి చెందిన మహిళలను అమిలినేని వర్గీయులు, కుటుంబసభ్యులు నానా దుర్భాషలాడారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడికెళ్లిన కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్‌పైనా టీడీపీ నాయకులు చిందులు వేశారు. ముఖ్యంగా బ్రహ్మసముద్రం మండల టీడీపీ కన్వినర్ పాలబండ్ల శ్రీరాములు నానా దుర్భాషలాడారు. సీఐని ఏకవచనంతో మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగారు. విషమంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల పరిస్థితి టీడీపీ మూకల దాడిలో గాయపడిన బిక్కి హరి, మంజునాథ్, అనిల్కుమార్లను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గురువారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. టీడీపీ మూకలు పిడిగుద్దులు, రాళ్లతో ఎదపై దాడిచేయడంతో వారు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న కార్యకర్తలను పలువురు నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య చెప్పారు. శాంతికాముకులైన వాల్మీకులపై దాడిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిననే చిన్నచూపుతోనే తనను బూతులు తిడుతూ, కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారని బిక్కి హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని, తమకేదైనా జరిగితే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత అని బిక్కి నాగలక్ష్మి చెప్పారు. రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు ఈ విషయమై రెండుపక్షాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎర్రనేల వీధిలో ఎన్నికల ప్రచారం చేయడం, అదే ప్రాంతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఇల్లు, పార్టీ కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. ముందస్తుగా ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడటంతో తోపులాట జరిగిందని తెలిపారు. వివాదం తీవ్రం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగుడితోపాటు సహకరించిన ముఠా, కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు గుర్తించిన అనుమానితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం. హత్యాయత్నం వెనుక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అనుమానితులు, తెర వెనుక పాత్రధారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి. 60 మందికిపైగా విచారణ ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడిందీ నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు? దుండగుడికి సహకారం అందించింది ఎవరు? అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తును పోలీసులు తుది అంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికిపైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. కుట్ర కోణంపై ముమ్మర దర్యాప్తు ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దుండగుడికి సహకరించినవారితోపాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో సెంట్రల్ నేత తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ డాబా కొట్ల జంక్షన్ వద్ద వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజిలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరితులు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలు»ొమ్మలుగా మారిన యువత వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు (శనివారానికి) రెండు రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజిలతో పోల్చి చూశారు. సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వారిని మరింత లోతుగా విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలినవారు అతనికి సహకరించినట్లు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడినవారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంతవరకు నమ్మవద్దని కోరారు. అప్పటివరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించవద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసువర్గాలు తెలిపాయి. -
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్‌ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్‌కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్‌ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్‌ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్‌ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్‌బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్‌బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్‌ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్‌ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్‌గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు -
వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్మీట్లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్మీట్లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని, వాటిని చంద్రబాబు.. మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అసలు హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన ధోరణి, దర్యాప్తులో డొల్లతనంతో పాటు సునీత వ్యవహార శైలిని కూడా అవినాష్ రెడ్డి పలు ఆధారాలతో మీడియా ముందుంచారు. ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు: షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోంది అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాను దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండి ఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడు రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలి నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు దస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారు అనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడు దస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదు పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు 306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదు కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారు అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయి ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.? హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసు జమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు? నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చాను ఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోంది ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది? వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ? శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాను మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ? ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా? నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడు నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పాను వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలి ఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడు ఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడు సునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలి ఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసు వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారు చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ? బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారు ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదు గూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోంది వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోంది అది కూడా మూడేళ్ల తరువాత చూశారు? మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు? గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది? గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది? ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారు వారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదు చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదు న్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారు ఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలి నా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుంది నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా? మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారు అనేక ఇబ్బందులకు గురిచేశారు 74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడు టిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారు హత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.! వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు? వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచింది కేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
వెంకటాయపాలెం : 1996 శిరోముండనం కేసులో కీలక తీర్పు
సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాడి కేసులో మాత్రం మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. కోర్టు దోషులుగా గుర్తించిన పది మందిలో రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులు ఒకరు. నేరం జరిగినప్పుడు త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. వెంకటాయపాలెంలో అయిదుగురు దళితులను చిత్రహింసలు పెట్టారని, వారికి శిరోముండనం చేశారని కేసు నమోదయింది. భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ జరిగి ఈ రోజు తుది తీర్పు వెలువడింది. తోట త్రిమూర్తులు భవితవ్యమేంటీ? 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. చట్టాన్ని గౌరవిస్తాను చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత, ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను, అందుకే గడువు కోసం బెయిల్ విజ్ఞప్తి చేయగా... కోర్టు అంగీకరించింది : తోట త్రిమూర్తులు -
రఘురామ కేసులో స్టే ఎత్తేయండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఆర్బీఐ సర్క్యులర్‌కు సంబంధించి క్రిమినల్ చర్యల్లో ఎఫ్ఐఆర్ కొనసాగుతోందన్నారు. దీనికి సంబంధించి తీర్పు ఉందని తెలిపారు. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగకుండా సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని అభ్యర్థించారు. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసును కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని కేసును వాయిదా వేసింది. రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, రఘురామకృష్ణరాజు మరో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాటు చేస్తామన్న కంపెనీని నెలకొల్పకుండా.. ఇతర బ్యాంకుల్లో ఆ సొమ్ములు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాటిపై మళ్లీ రుణం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. రంగంలోకి దిగిన ఈడీ మరోవైపు ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దీంతో విషయాన్ని లోతుగా పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీ ఇండ్ –భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ –భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు ఈ మొత్తం బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎన్సీఎల్టీని ఆశ్రయించిన బ్యాంకులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. ఇండ్–భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేసింది. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాలా తీసినట్లుగా భావిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు అనుమతించింది. బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణరాజు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని వాటిని నిండా ముంచిన రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. గతంలో సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ ఆయన తెచ్చుకున్న స్టేను ఎత్తివేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రఘురామ మోసాలు చర్చనీయాంశంగా మారాయి. ఇండ్– భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో ఆయన వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ మొత్తాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకులను నిండా ముంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించాయి. వీటిలో పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి ఈ సందర్భంగా సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యాయత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలువురి సెల్ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయత్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రౌడీషి టర్లు, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు అనుమానితులను మ్యాపింగ్ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు.. గ్రూప్ కాల్స్ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డాబా కొట్ల సెంటర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్ ప్రాంగణంలో మాటు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్‌ఫోన్ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్/వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 ఆర్. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్: 9440627089 -
సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్‌పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
రఘురామ కేసు దర్యాప్తుపై స్టే ఎత్తేయండి.. సుప్రీంకోర్టును కోరిన సీబీఐ
సాక్షి, ఢిల్లీ: బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ కోరింది. ఇందులో భాగంగా క్రిమినల్, సివిల్ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కాగా, రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు మోసం చేసిన కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సంద్భంగా సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్ మిసిలేనియస్ రోజుల్లో విచారణ జరిపాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది జస్టిస్ బీఆర్. గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. అయితే, రఘురామ కృష్ణంరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. ఇన్డ్-భారత్ కంపెనీ పేరుతో రఘురామ పెత్తనం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోంది. -
మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేసేందుకే పక్కా పన్నాగంతో ఆయనపై ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ముందుగా రెక్కీ నిర్వహించి సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు అనువుగా ఉందనే విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లు నిర్దారణ అయింది. క్యాటర్ బాల్ / ఎయిర్‌గన్ లాంటి పరికరం ద్వారా పదునైన రాయి లాంటి వస్తువుతో దాడికి పాల్పడ్డాడు. కణతపైగానీ తల వెనుక దిగువ భాగంపైగానీ తీవ్రంగా దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రిని అంతమొందించాలన్నదే దుండగుల లక్ష్యమని వెల్లడైంది. దాడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై ఆగంతకుడు ఎక్కడ నుంచి ఏ విధంగా దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు, టవర్ పరిధిలోని సెల్ ఫోన్ల డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాకు నివేదిక సమర్పించారు. హత్య చేసేందుకే పక్కాగా రెక్కీ.. ముఖ్యమంత్రి జగన్‌పై ఆగంతకుడి దాడి లక్ష్యం ఆయన్ని అంతం చేయడమేనని పోలీసులు నిర్ధారించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలో కొనసాగే వివిధ ప్రాంతాల్లో ఆగంతకుడితోపాటు ఈ కుట్రలో ఇతర పాత్రధారులు రెక్కీ నిర్వహించారు. సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. కాస్త ఇరుకుగా ఉండే ఆ రోడ్డులో కుడివైపు ఇళ్లు, దుకాణాలున్నాయి. అక్కడ ప్రజలు భారీగా గుమిగూడతారు. ఎడమ వైపున వివేకానంద స్కూల్ భవనం ఉంది. అటువైపు జన సంచారం ఉండదు. సీఎం జగన్ తన వాహనంపై నుంచి కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళతారు. ఎడమ వైపు ఎవరూ దృష్టి సారించరు. అంతేకాకుండా ఆ జంక్షన్‌లోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న భారీ ప్రచార వాహనం వెళ్లేందుకు వీలుగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని గుర్తించారు. దీంతో స్కూల్ భవనం వైపు పూర్తిగా చీకటి కమ్ముకుని ఉంటుంది. ప్రహరి లోపల స్కూల్ భవనానికి, ఆ పక్కనే ఉన్న గంగానమ్మ ఆలయానికి మధ్యలో ఖాళీ స్థలంలో నిందితులు మాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్కూల్ ప్రాంగణం వెనుక వైపు నుంచి తూర్పు దిశలో ఉన్న చిన్న ఇనుప గేటు దాటి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోకి వెళ్లి సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంది. సీఎం జగన్ యాత్రకు సంఘీభావంగా హాజరైన భారీ జనసందోహంలో కలసిపోతే ఎవరూ గుర్తించ లేరు. ఇన్ని రకాలుగా కసరత్తు చేసిన అనంతరమే వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి దాడి చేసేందుకు ఆగంతకుడు తెగబడ్డాడు. వీడియో ఫుటేజీ విశ్లేషణ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీడియో ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి 45 డిగ్రీల కోణంలో బలమైన రాయి లాంటి వస్తువు అత్యంత వేగంగా దూసుకొచ్చి సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ పైభాగంలో బలంగా తాకినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆయనకు తగిలి అనంతరం ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా బలంగా తాకింది. సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ్మ పైభాగంలో తీవ్ర గాయం కాగా ఎమ్మెల్యే వెలంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైంది. ఆ ప్రదేశంలో రోడ్డువైపు నుంచి వివేకానంద స్కూల్ ప్రహరి గోడ ఆరు అడుగుల ఎత్తు ఉంది. స్కూల్ ప్రాంగణంలో నేల ఎత్తు చేయడంతో లోపల వైపు నుంచి ప్రహరి కేవలం మూడు అడుగుల ఎత్తే ఉంది. అక్కడి నుంచి సీఎం వాహనం వచ్చే రోడ్డు కేవలం 20 అడుగుల దూరమే ఉంది. ఆ ప్రహరి లోపల ముందుగానే మాటు వేసిన ఆగంతకుడు సీఎం వాహనం అక్కడికి చేరుకోగానే బలమైన రాయిని క్యాటర్ బాల్తోగానీ ఎయిర్‌గన్ వంటి పరికరంతోగానీ బలంగా గురి చూసి కొట్టాడు. 45 డిగ్రీల కోణంలో బలంగా వచ్చిన రాయి సీఎం జగన్‌కు తగిలింది. సీఎం జగన్ రోడ్డుకు కుడివైపున ఉన్న జనసందోహాన్ని చూస్తూ అభివాదం చేస్తుండగా దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఎడమ కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ దాడి చేయాలన్నది ఆగంతకుడి ఉద్దేశమన్నది స్పష్టమైంది. ఎందుకంటే కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ బలంగా దాడి చేస్తే మెదడుకు తీవ్రగాయం /మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కణత ప్రాంతంలో మెత్తగా ఉండే ఎముక విరిగి మెదడుకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. దాంతో మెదడులో రక్తస్రావమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తల వెనుక కింద భాగంలో తగిలినా, మెదడు దెబ్బతిన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతోనే ఆగంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ తలను కాస్త పక్కకు తిప్పడంతో ఆ బలమైన రాయి ఆయన కణతకు, తల వెనుక కింద భాగంలో కాకుండా ఎడమ కనుబొమ్మ పైభాగంలో తగిలింది. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కీలక ఆధారాలు లభ్యం సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి అజిత్‌సింగ్ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాడి ఎలా జరిగిందనే అంశంపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు కోసం ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదివారం ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో ఆరు టాస్క్‌ఫోర్స్ బృందాలున్నాయి. దాడి జరిగిన ప్రదేశాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఆగంతకుడు ఏ మార్గాల్లో తప్పించుకునేందుకు అవకాశం ఉంది? ఎంత దూరం వెళ్లి ఉండవచ్చు? అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న 24 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. గంగానమ్మ గుడి ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ పరిధిలోని మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక బలగాలను మోహరించి ఆ ప్రాంతంలో విస్లృతంగా తనిఖీలు చేపట్టారు. డాబా కొట్ల జంక్షన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను ఆరా తీస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా దాడులకు పాల్పడ్డ నేరగాళ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గతంలో విజయవాడలో దాడులకు పాల్పడిన వారి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, ఇతర శాస్త్రీయ ఆధారాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి నుంచి కీలక వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కుట్ర కోణంపై దృష్టి సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డ ఆగంతకుడితోపాటు నిందితుడి వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరనే కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు ఇప్పటికే కీలక పురోగతి సాధించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అసలు కుట్రదారులెవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే ఛేదిస్తాం సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డాటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేస్తున్నాం. కేసులో ఇప్పటికే కొంత పురోగతి సాధించాం. – కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్ -
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. చదవండి: రక్తమోడినా సడలని సంకల్పం -
సీఎం జగన్‌పై హత్యాయత్నం!
‘సిద్ధం’ అంటూ నగారా మోగించి.. జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారు. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచీ కనీవినీ ఎరుగని అశేష జన స్పందనతో సాగిన యాత్రలో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏ దారిలో వెళతారు? ఎక్కడెక్కడ ఆగుతారు? యాత్ర వెళ్లేటపుడు కరెంటు వైర్లు తగలకుండా కరెంటు తీసేస్తారు కనుక చీకటిగా ఉన్నపుడు ఎక్కడైతే బాగుంటుంది? అనే అంశాలన్నిటినీ అధ్యయనం చేసి... విజయవాడ సింగ్‌నగర్‌లో ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్‌తో ఆయన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. స్కూల్లో నక్కి ఉండి.. ఆయన బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నపుడు... కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని... బస్సుపై ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఉన్న జగన్‌ను గురిచూసి పదునైన వస్తువుతో కొట్టారు. జగన్ కణతకు గురిపెట్టి సంధించిన ఆ వస్తువు గనుక ఆయనకు అదే ప్రాంతంలో తగిలి ఉంటే ఏమయ్యేదో అనేది ఊహించడానికే భయంవేసే పరిణామం. అదృష్టవశాత్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన పక్కకు తిరగటంతో... ఆ వస్తువు ఆయన కణతకు బదులు ఆయన ఎడమ కనుబొమపై తగిలింది. లోపలికంటా చర్మం చీలిపోయి బలమైన గాయం అయ్యింది. అంతేకాక... ఆయనకు గాయం చేశాక... అదే వస్తువు ఆయన పక్కనే నిల్చున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా తగిలింది. ఆయన కన్ను వాచింది. వైఎస్ జగన్‌కు వస్తువు బలంగా తగలటంతో... ఆయన ఒక్కసారిగా విలవిలలాడుతూ పక్కకు ఒరిగారు. తరవాత తమాయించుకుని నిలబడి గాయాన్ని గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ... సెక్యూరిటీ సిబ్బంది తోడురాగా బస్సులోపలికి వెళ్లారు. కనుబొమ వాచిపోవటంతో... గాయాన్ని శుభ్రం చేసి, రక్తాన్ని తుడిచి బస్సులో ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. కాసేపు ఆగిన తరవాత వైఎస్ జగన్ యథా ప్రకారం యాత్ర కొనసాగించారు. దాదాపుగా రాత్రి 8.10 సమయంలో ఈ దుర్ఘటన జరగ్గా... కాసేపు ఆగాక యాత్రను రాత్రి 10.39 వరకూ షెడ్యూలు ప్రకారం కొనసాగించాక... నైట్ హాల్టు ప్రాంతమైన కేసరపల్లికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళికతోనే.. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్లోని వివేకానంద స్కూల్ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు. తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు. ఎయిర్ గన్ వినియోగించారా.. సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్ బాల్‌ను వినియోగించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగాయి. ఈ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సైతం రాష్ట్ర ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నా పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా వెల్లువలా సీఎం జగన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఆదరణను తట్టుకోలేక.. ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపైన హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతోనే.. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వీరిద్దరూ తమ మాటల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారని గుర్తు చేస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ నవరత్న పథకాలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. కులమతాలు, పార్టీలు, ప్రాంతాలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందించారు. దీంతో మరోమారు సీఎం వైఎస్ జగన్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటరిగా సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని టీడీపీ.. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుందని వైఎస్సార్సీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించకపోవడం, కూటమి నేతలతో కలిసి నిర్వహించిన సభలు విఫలం కావడం, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సభలకు ప్రజలు లక్షల సంఖ్యలో పోటెత్తడం తట్టుకోలేకే ఇలా హత్యాయత్నాలకు చంద్రబాబు, లోకేశ్ పురమాయిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే.. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు హారతులు పడుతున్నారు. లక్షల్లో ప్రజలు ఆయన సభలకు హాజరవుతున్నారు. ఇదే చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జైత్రయాత్రలా సాగుతున్న బస్సు యాత్రను ఆపడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవడానికే చంద్రబాబు, లోకే‹Ùలు ఆపార్టీ శ్రేణులను సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసేందుకు పురిగొలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భయోత్పాతం సృష్టించడం ద్వారా సీఎం జగన్ బస్సు యాత్రను ఆపేయడానికే ఈ దారుణం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలించని సీఎం... యథాతథంగా యాత్ర కొనసాగింపు తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం వెరవలేదు. వాహనంలోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే ఆయన మళ్లీ వాహనం పైభాగానికి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు విజయవాడ సింగ్‌నగర్ డాబా కొట్ల జంక్షన్ నుంచి కృష్ణా హోటల్ సెంటర్, పైపుల రోడ్, ప్రకాశ్ నగర్, పాయకాపురం, కండ్రిగ, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి వరకు అంటే 20 కి.మీ. వరకు యాత్రను కొనసాగించారు. శనివారం రాత్రి కేసరపల్లిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రాత్రి బస చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స.. సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్రై్కబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి... కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. అది హత్యాయత్నమే: వెలంపల్లి వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు తనకూ తగలటంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. సంఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇది ఖచ్చితంగా హత్యాయత్నమేనని, ఆ వస్తువు తాలూకు పదును, వేగం చూస్తే ఇదే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌కు తగిలాక... పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకూ గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి జగన్‌కు అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఈ దారుణానికి పురమాయించి ఉంటాడని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదంటూ వంగవీటి రంగా హత్యను ఉదహరించారు. ఎన్ని కూటములు కట్టినా, ఎందరితో కలిసి వచ్చినా జగన్ ముందు తాను నిలవలేకపోతున్నానన్న అక్కసుతోనే బాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారాయన. కాగా వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు చాలా పదునైనదని, అదేమిటనేది తేలాల్సి ఉందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ దిశగా తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. అది పదునైన రాయి, చెక్కిన గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్.. ఏదైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. అయితే ఆ వస్తువు వైఎస్ జగన్‌కు తగిలే సమయంలో ‘టప్’ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానని, అది రాయి కాకపోవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆయన ఆ సమయంలో వైఎస్ జగన్‌కు వెనకనే అడుగు దూరంలో ఉన్నారు. స్కూలు భవనానికి చేరుకున్న పోలీసు బృందాలు పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టాయి. ఆదివారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తాం. –కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్