Mental illness
-
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్‌లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్‌లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్‌లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్‌గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్‌గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్‌ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్‌మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్‌కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్ క్యాన్సిల్
చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్ టెర్రర్ లేదా స్లీప్ టెర్రర్ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం. మాధురి, మాధవ్ అందమైన జంట. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్ స్టేజ్‌కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్ స్టాఫ్ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్ కేన్సిల్ చేసుకుని వచ్చేశారు. ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్ చేసి అదో స్లీప్ డిజార్డర్ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్ కు తీసుకువచ్చాడు. స్లీప్ టెర్రర్స్... మాధురి సమస్యను స్లీప్ టెర్రర్స్ లేదా నైట్ టెర్రర్స్ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్ టెర్రర్స్ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. స్లీప్ టెర్రర్ లక్షణాలు యుక్త వయసు తర్వాత కూడా స్లీప్ టెర్రర్స్ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్ ప్లేస్‌లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి ... · నిద్రలో భయపెట్టే అరుపులు · కళ్లు పెద్దవి చేసి చూడటం · మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం · గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం · మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం · మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ... స్లీప్ టెర్రర్స్ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్ టెర్రర్స్ లేదా స్లీప్ వాకింగ్ చరిత్ర ఉంటే స్లీప్ టెర్రర్స్ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. · నిద్ర లేమి, విపరీతమైన అలసట · మానసిక ఒత్తిడి · నిద్ర షెడ్యూల్‌కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు · తరచూ ప్రయాణాలు · జ్వరం · నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు · రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు, · మద్యం వినియోగం ప్రశాంతత ముఖ్యం... మీకు లేదా మీ పిల్లలకు స్లీప్ టెర్రర్స్ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. · మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. · అలసట, ఆందోళన స్లీప్ టెర్రర్స్కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి. · స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్ రూమ్‌ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. · నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా సహాయపడవచ్చు. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. · ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్‌లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్‌బ్యాక్ లేదా రిలాక్సేషన్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు)


