Nirmal District News
-
నాన్న కల నెరవేర్చా..
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతంకై లాస్‌నగర్: ‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మ రింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆ నందానిచ్చింది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లా కు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలో ని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు. సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్దరూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న దక్ష్. గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు. సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది.. ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానామిక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు.. ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతో పాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలాబాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించాను. సాక్షి: సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు. -
పనులు చేయకున్నా కూలి కాజేశారు!
సారంగపూర్: మండల కేంద్రంలో మంగళవారం ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. జనవరి 1, 2024నుంచి మార్చి 3, 2025వరకు మండలవ్యాప్తంగా అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వ నాల్లో నాటిన మొక్కలు చనిపోయిన వి షయం, న ష్టాన్ని తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు. మ హవీర్తండాలో అధిక మస్టర్లు వేసి దాదాపు రూ.4 లక్షలు కూలీలు, మేట్ పంచుకున్నట్లు తెలిపారు. దీ నిని కూలీలు రాతపూర్వకంగా అంగీకరించగా, అధి కారులు మళ్లీ విచారణకు ఆదేశించారు. తనిఖీ బృందం సభ్యులు నిరాకరించి ఇద్దరు మేట్లను తొలగి స్తున్నట్లు ప్రకటించారు. దుర్గానగర్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. మహవీర్‌తండాకు చెందిన ఒకే కుటుంబానికి మూడు జాబ్‌కార్డులు జారీ చేసి 236రోజుల పని కల్పించిన విషయమై ఇన్చార్జి డీఆర్డీవో మేట్, ఫీల్డ్ అసిస్టెంట్లను వివరణ కోరగా, గమనించలేదని బదులిచ్చారు. మహవీర్‌తండా, దుర్గానగర్‌లో తల్లిదండ్రుల పేరిట మైనర్లతో పనులు చేయించినట్లు బృందం సభ్యులు వెల్ల డించగా, మేట్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తంజేశా రు. ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఫిర్యాదుల పరిష్కార అధికారి నవీన్, ఎంపీవో అ జీజ్ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, ఎస్టీఎం దత్తు, ఎస్ఆర్పీలు సాంబశివాచారి, కార్యదర్శులు పాల్గొన్నారు. -
నిర్మల్
విహారం.. వినోదం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రకృతి సంపదకు నిలయం. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలెన్నో ఉండగా.. సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025IIలోu పనుల పురోగతిపై సమీక్ష లక్ష్మణచాంద: మండలంలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై డీఈవో రామారావు మంగళవారం మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయా పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పాఠశాలల్లో ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని ఒడ్డెపెల్లి, బోరిగాం పాఠశాలల్లో సంబంధిత హెచ్ఎంలు, చైర్మన్లు పెండింగ్ పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఈవో అశోక్‌వర్మ, పీఆర్ ఏఈ సంజయ్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్, లింబాద్రి, చైర్మన్లు, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. కడెం: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో రామారావు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా పాఠశాల ల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో షేక్ హుస్సేన్, పీఆర్ ఏఈ సూర్యతేజ తదితరులున్నారు.‘ఏం సార్.. మొన్న మీబాబు మెయిన్‌రోడ్డుపై బైక్ నడుపుతున్నాడు. ఇప్పుడింకా టెన్త్ క్లాసే కదా సార్.. ఇప్పటి నుంచే అలా బండి నడపడం అవసరమంటారా..!?’ అని ప్రవీణ్ అంటుండగానే.. ‘అరె ఏం సార్.. మీరింకా ఏ జమానాలో ఉన్నారు. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల జమానా నడుస్తుంది. పిల్లలు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి. అన్ని నేర్చుకోవాలి. ఏజ్ది ఏముంది సార్..!? వాడికి బైక్ బాగానే వస్తుంది. ఈమధ్య ఏ పని ఉన్నా.. వాడికే చెబుతున్నాం కూడా..’ అంటూ శ్రీనివాస్ చెబుతూ ఉండటంతో ప్రవీణ్ సైలెంట్ అయిపోయాడు. సరిగ్గా వారం తర్వాత.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శ్రీనివాస్ కనిపించడంతో ప్రవీణ్ ‘ఏమైందంటూ..’ పలకరించాడు. తన బాబు బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టాడని, దీంతో తన కొడుకు ఎడమకాలు విరగడంతో పాటు వెనుక కూర్చున్న పిల్లాడికీ తీవ్రగాయాలయ్యాయని చెబుతూ, వాడికి బైక్ ఇచ్చినందుకు తనపైనా పోలీసు కేసు నమోదైందని తలదించుకున్నాడు. –నిర్మల్●● గాలిలో కలుస్తున్న చిరు ప్రాణాలు ● పోలీసుల హెచ్చరికలు బేఖాతరు ● జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ ● మైనర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ప్రాణాలు పోయిన ఘటనలెన్నో.. ఇదొక్కటే కాదు.. ఇలాంటివెన్నో ఈమధ్య చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలూ పోయాయి. శ్రీనివాస్‌లాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ నేర్పాలన్న అత్యాశలో వయసుకు మించిన సాహసాలు, తప్పిదాలనూ చేయిస్తున్నా రు. తమ కొడుకు/బిడ్డ చిన్నవయసులోనే డ్రైవింగ్ చేస్తుండటం చూసి మురిసిపోతున్నారు. కానీ.. వారి వయసురీత్యా ఉండే మానసికస్థాయికి అది సరికాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈక్రమంలోనే తమ చేతులారా.. తమ పిల్లల ప్రాణాలు, ఎదుటివారి జీవితాలతోనూ ఆడుకుంటున్నారు. దీనిపైనే ఇటీవల పోలీస్‌శాఖ సీరియస్‌గా దృష్టిపెట్టింది. జిల్లాలో ఒకేరోజు వందకేసులు నమోదు చేసింది. చిన్నవయసులో డ్రైవింగ్ సరికాదని మానసిక వైద్యనిపుణులూ హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇలా.. రెండేళ్లక్రితం జిల్లాకేంద్రంలోనే ఓ పేరున్న బిల్డర్ బిడ్డ (మైనర్) కారు నడుపుతూ మంచిర్యాలరోడ్డులో బైక్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. అక్కడున్న వారందరూ ‘ఏంటమ్మా.. ఇంత చిన్నవయసులో కారు నడుపుతున్నావ్.. అది కూడా ఇంత స్పీడ్‌గా..’ అని ప్రశ్నిస్తే.. ‘మా నాన్నే నాకు నేర్పించారు. కారు కూడా ఆయనే ఇచ్చారు. మీరెవరు నన్ను అడగడానికి..’ అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో అక్కడున్నవారు సదరు బిల్డ ర్కు ఫోన్ చేసి మందలించారు. పిల్లల డ్రైవింగ్.. పెద్దలపై కేసులు 18 ఏళ్లున్నవారే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హులు. లేనిపక్షంలో పిల్లలు వాహనాలు నడిపిస్తే.. సంబంధిత వాహన యజమానిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199ఏ ప్రకారం బాలల డ్రైవింగ్‌పై కేసుల నమోదు ఉంటుంది. ఇటీవల జిల్లాలో పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. సదరు పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కేసుల నమోదు, జరి మానాలు వసూలు చేస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీ స్స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 296 మంది మైనర్లు పోలీ సులకు పట్టుబడగా 100 మందిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం మైనర్ల తల్లిదండ్రులకు మో టార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు.స్పెషల్ డ్రైవ్‌లో పట్టుకున్న వాహనాలుడ్రగ్స్ రవాణా చేస్తే చర్యలు నర్సాపూర్ (జి): మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తప్పవని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా హెచ్చరించారు. సోమవారం రాత్రి నర్సాపూర్ (జి), చాక్పల్లి, తిమ్మాపూర్ (జి) గ్రామాల్లోని అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించా రు. మాదకద్రవ్యాల వినియోగిస్తే కలిగే నష్టా ల గురించి అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, నర్సాపూర్ (జి), దిలావర్పూర్, సారంగపూర్, నిర్మల్ రూరల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. మానసిక సామర్థ్యం తక్కువ మైనర్లకు మానసిక సామర్థ్యం తక్కువ. వాహనాల ను నడిపేటప్పుడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. మైనర్లకు వాహనాలిస్తే వారిని ప్రమాదంలోకి నెట్టినట్లే తల్లిదండ్రులు భావించాలి. – సురేశ్ అల్లాడి, సైకియాట్రిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాం. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తిస్తున్నాం. పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది. – జానకీషర్మిల, ఎస్పీ 18 ఏళ్లు నిండితేనే డ్రైవింగ్ మనకున్న నిబంధనల ప్రకారం 18ఏళ్లు ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాన్ని నడిపించాలి. లేనిపక్షంలో వాహనాలు నడిపితే చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలివ్వొద్దు. – పీ దుర్గాప్రసాద్, జిల్లా రవాణాశాఖ అధికారి న్యూస్రీల్రేపు భైంసాలో ప్రజావాణి భైంసాటౌన్: పట్టణంలోని పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోగల ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎస్పీ జానకీ షర్మిల పోలీ స్ ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కా ర్యాలయంలో అందుబాటులో ఉండి సబ్ డివి జన్‌పరిధిలోని బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. భరోసా కేంద్రంలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఠాణా వాహనాలు ఠాణా వాహనాలు నిర్మల్ టౌన్ 10 భైంసా టౌన్ 10 నిర్మల్ రూరల్ 5 భైంసా రూరల్ 4 ఖానాపూర్ 6 కుభీర్ 3 కుంటాల 6 బాసర 5 లోకేశ్వరం 7 ముధోల్ 4 తానూరు 6 దస్తురాబాద్ 4 కడెం 4 పెంబి 1 దిలావర్పూర్ 3 నర్సాపూర్ 3 సారంగపూర్ 7 లక్ష్మణచాంద 6 మామడ 2 సోన్ 4 పిల్లలకు వాహనాలిస్తే కేసులు నిర్మల్‌టౌన్: మైనర్లకు వాహనాలిచ్చే ఓనర్లపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకీ షర్మిల హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడిన మైనర్ల తల్లి దండ్రులకు రెండో విడతగా మంగళవారం జి ల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిలింస్, మైనర్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల వీడియోలు చూపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే మైనర్లపై కేసులు నమోదు చేస్తే వారు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎట్టి పరిస్థితుల్లోనే వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్ఐలు రాంనిరంజన్, శేఖర్, రమేశ్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన మూడో సబ్ జూనియర్, జూనియర్, రెండో సీనియర్ రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లాతోపాటు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 11 బంగారు, ఆరు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించినట్లు ఖేలో ఇండియా కోచ్ జ్ఞానతేజ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, ఎం.శ్రేయాన్ కార్తికేయ, వాగ్మారే కరణ్, రాథోడ్ కృష్ణ, రూప భాదూర్, తోకల్వాడ్ అరవింద్, జాదవ్ ఆర్యన్ బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో రాంచరణ్, హర్షవర్ధన్ శర్మ, సీనియర్ విభాగంలో కొట్టె స్వరూప బంగారు పతకాలు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. వీరు మే, జూన్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
‘భూభారతి రైతులకు వరం’
కుంటాల: భూభారతి పథకం రైతులకు వరం లాంటిదని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అందాకూర్ గ్రామంలో రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఆధార్ లాగే భూధార్ ద్వారా నంబర్ ఇచ్చి భూమి, హద్దులు గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. మే 1నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో లింబాద్రి, డీటీ నరేశ్‌గౌడ్, ఏవో విక్రమ్, ఎంపీవో రహీంఖాన్, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్, రైతులు పాల్గొన్నారు. సోన్: మండల కేంద్రంలోని రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం, గ్రామ రెవెన్యూ అధికారుల నియామకంతో భూసమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి గోవింద్, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో కలీం, ఏవో వినోద్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కుభీర్: భూభారతి చట్టం కింద భూసమస్యలన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కారమవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. కుభీర్‌లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. గతంలో సాదాభైనామా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, స్పెషలాఫీసర్ శంకర్, తహసీల్దార్ శివరాజ్, ఏవో సారిక, ఎంపీడీవో నవనీత్‌కుమార్ తదితరులున్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
● జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పీసీసీ అబ్జర్వర్లు చంద్రశేఖర్‌గౌడ్, అవేజ్నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపే తం చేయడమే లక్ష్యమని పీసీసీ అబ్జర్వర్లు, చంద్రశేఖర్‌గౌడ్, అవేజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం పార్టీ జి ల్లా విస్తతస్థాయి సమావేశం డీసీసీ అధ్యక్షుడు కూ చాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి ప హల్గాం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మే 4నుంచి 10వరకు బూత్ స్థాయి సమావేశాలు, మే 13 నుంచి 20వరకు మండల స్థా యి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ముడుసు సత్యనారాయణ అనే పార్టీ కార్యకర్త ఎస్సీ నాయకులను వేదికపైకి పిలవలేదని ఆరోపించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కలగజేసుకుని వేదికపై ఎస్సీ నాయకులు ఉండగా అనవసర రా ద్ధాంతం చేయకూడదని సముదాయించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ గల పార్టీ అని, అనవసర ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని పీసీసీ అబ్జర్వర్లు హె చ్చరించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వడ్మ బొజ్జు పటే ల్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్, రేఖానాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ హాజరయ్యారు. పని చేసేవారికే పదవులు పార్టీ కోసం పని చేసినవారికే పదవులు దక్కుతా యని పీసీసీ అబ్జర్వర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్ర భుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు సీఎం రే వంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. ఇచ్చిన హామీ లు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానా లను కై వసం చేసుకుంటామని చెప్పారు. జిల్లా స్థా యి సమావేశంలో ఎస్సీలకు సముచిత స్థానం కేటా యించలేదని కార్యకర్త సత్యనారాయణ చేసిన ఆరో పణలను ఖండించారు. పార్టీ మహిళా విభాగం జి ల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలో 2014 నుంచి ఎస్సీ మహిళనే జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతుందని చెప్పా రు. కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. పీసీసీ పరిశీలకుడు అవేజ్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్ ఉన్నారు. -
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
లోకేశ్వరం మండలం నగర్లో సర్వే నంబర్ 404/7 లో 2.12 ఎకరాల అసైన్డ్ భూమి మా తండ్రి పేరుమీద ఉంది. ఆయన 1995 అక్టోబర్ 24న మృతి చెందాడు. నేను మా తండ్రికి ఒకే సంతానాన్ని. అట్టి భూమిని నా పేరుమీదకు సక్సెషన్ చేయాలని అర్జీ పెట్టుకున్నా. తీరా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి చూడగా అట్టి భూమి భూటి మౌనిక, భర్త మహేష్ పేరుమీద సర్వే నంబర్ 404/7/1పై రెండెకరాల భూమి పట్టా అయినట్లు ఉంది. కేవలం 0.12 గుంటలు భూమి మాత్రమే నా పేరున ఉంది. అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నా భూమిని నాకు ఇప్పించాలి.ఙ – గైని పోసాని, లోకేశ్వరం -
అవకాశం ఇస్తామని మాట తప్పారు..
మేము 2017 నుంచి 2019 వరకు భైంసా పీహెచ్సీలో ఆశా కార్యకర్తలుగా ఔట్ సో ర్సింగ్ విధులు నిర్వర్తించాం. ఆ రెండు సంవత్సరాలు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. 2019 నుంచి మమ్మల్ని విధులకు హాజరు కావద్దన్నారు. ప్రభుత్వం నుంచి పోస్టులు మంజూరైతే మొదటి ప్రాధాన్యత మాకే ఇస్తామని చెప్పారు. ఇటీవల ఆయా పోస్టుల్లో వేరే వారిని నియమించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పోస్టులు మాతోనే భర్తీ చేయాలి. – సుజాత, నీరజ, భైంసా నాభూమి నాకు ఇప్పించాలి కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో 103 సర్వే నంబర్లో నాకు 120 సెంట్లభూమి ఉంది. నాకు తెలియకుండా మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నా సంతకం లేకుండానే అట్టిభూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇదే విషయం అధికారులను అడిగితే ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను నా భూమిని ఎవరికీ అమ్మలేదు. నాభూమి నాకు ఇప్పించాలి. – ఎరుకల లక్ష్మి, ఓలా, కుంటాల -
అధికారులు సమయపాలన పాటించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ అ భిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ఉదయం 11 గంటలు దాటినా సగానికి పైగా అధికారులు గ్రీవెన్స్‌కు హాజ రు కాలేదు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్లో గ్రీన్ పె న్నుతో మార్క్ చేశారు. అనంతరం జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దా దాపు 60 దరఖాస్తులకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ఏర్పా టు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫోన్ కాల్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి, రసీదులను దరఖాస్తుదారులకు పంపించా రు. ప్రజలు ఇంటినుంచే 91005 77132 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యలు తెలియజేసి, వాట్సప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
సారంగపూర్/ఖానాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి అపారనష్టం సంభవించింది. ఖానాపూర్ మండలంలోని బావాపూర్(ఆర్)తండాకు చెందిన లావుడ్య చిన్నిబాయి ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో పాటు పశువుల కొట్టం కూలిపోయింది. విద్యుత్ స్తంభం విరిగిపడి తీగలు తెగిపోయాయి. సారంగపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన జొన్న, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డులో తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న జొన్న, మొక్కజొన్న సంచులు తడిసిపోయాయి. -
అధికారులు పట్టించుకోవడం లేదు
నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్‌లో గతంలో ఒక ప్లాటు కొనుగోలు చేశా. దీనికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు కూడా చెల్లించా. ప్లాటు క్రమబద్ధీకరించుకుందామని డబ్బులు కడదామంటే నాభూమి ఎఫ్టీఎల్లో ఉందని చెప్పారు. అధికారుల చుట్టూ తిరిగి ఎఫ్టీఎల్ లోనుంచి నా భూమిని తొలగించుకున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డబ్బులు కడదామంటే తొందరేముంది.. నీ ఫైల్ ఎల్–2లాగిన్ లో ఉంది. ఆ లాగిన్ మాకు లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30 తో ముగియనుంది. గడువులోగా చెల్లించకపోతే మాకు రాయితీ రాదు. అధికారులు సమస్య త్వరగా పరిష్కరించాలి. – ఎం.రాజేందర్, నిర్మల్ -
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలా ల తహసీల్దార్లతో భూభారతి, రెవెన్యూ సదస్సులు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. గతంలో నిర్వహించిన సదస్సులు, గుర్తించిన సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పంచాయతీలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సందర్శించి ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగినంత ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ భూ రికార్డులను స్కాన్ చేసి, డిజిటల్ రూపంలో భద్రపరచాలన్నారు. వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు సవిత, స్వాతి, ఈడీఎం నదీమ్, తదితరులు పాల్గొన్నారు. -
రైలు మార్గం.. మరింత మెరుగు
భైంసా: బాసర మీదుగా రైల్వే డబ్లింగ్ లైన్ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త లైన్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రైల్వేశాఖ టెండర్లు పిలిచి పనులను ప్రారంభించింది. కర్నూలు జిల్లా డోన్ నుంచి మహారాష్ట్రలోని ముత్కేడ్ వరకు డబ్లింగ్ పనుల కోసం 2023–24 రైల్వే బడ్జెట్లో నిధులను కేటాయించింది. రెండింటి మధ్యన ఎన్నో స్టేషన్లను కలుపుతూ ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో 502.34 కిలోమీటర్ల డబుల్ లైన్ నిర్మాణానికి రూ.5,655.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజన్ అధికారులు టెండర్లను పిలిచారు. ఈ పనుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట, నిర్మల్ జిల్లా బాసర వరకు 16.90 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ పనులు చేపట్టనున్నారు. మహారాష్ట్రలోని ముత్కేడ్ నుంచి ధర్మాబాద్ వరకు రెండేళ్ల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ఎలక్ట్రిసిటీ పనులు పూర్తయ్యాయి. డబ్లింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైలు సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. జిల్లాలో 12 కిలోమీటర్లు... నిర్మల్ జిల్లాలో డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం బాసర మీదుగా పనులు చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లాలో బాసర ఒకే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయి. బాసర స్టేషన్ దాటగానే అటు మహారాష్టలోని ధర్మాబాద్ స్టేషన్ వస్తుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఫకీరా బాద్ స్టేషన్ ఉంది. నిజామాబాద్ జిల్లా నవీ పేట, ఫకీరాబాద్ స్టేషన్లను కలుపుతూ బాసర వరకు డబ్లింగ్ లైన్ పనులు జరుగనున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో బాసర వద్ద రెండు ఎకరాలకు పైగా భూమి అవసరం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో బాసర – రవీంద్రాపూర్ రెండు గ్రామాల పరిధిలో 41 మంది రైతుల తక్కువ వి స్తీర్ణంలో తమ భూములు ఇవ్వాల్సి ఉంది. ఈ రై తులకు రైల్వేశాఖ నష్టపరిహారం చెల్లించనుంది. రైలు ప్రయాణం మెరుగు డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకు 49 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ లైన్ ఎలక్ట్రిక్ లైన్‌గా మారిన తర్వాత ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. బాసర సరస్వతీ దేవాలయాన్ని దర్శించే భక్తులు, షిర్డీ యాత్రికులు ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడతారు. నాందేడ్ డివిజన్లో బాసర స్టే షన్ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. నాలుగో వంతెన పనులు.. బాసర వద్ద గోదావరి నదిపై డబ్లింగ్ లైన్ కోసం నాలుగో వంతెన నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం బాసర వద్ద రైల్వే లైన్ కోసం ఒక వంతెన, రోడ్డు మార్గం కోసం మరో వంతెన ఉంది. 161 హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్గం కోసం మూడవ వంతెన నిర్మిస్తున్నారు. డబ్లింగ్ లైన్ కోసం గోదావరి నదిపై నాలుగవ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణంతో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. డబ్లింగ్ పనులకు శ్రీకారం గోదావరి నదిపై నాలుగో వంతెన బాసర – నవీపేట మధ్య పనులు వందేళ్లుగా సింగిల్ లైనే..బాసర రైల్వే స్టేషన్ నిజాం కాలం నుంచి సింగిల్ లైన్.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నిజాం కాలంలో ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించారు. అప్పట్లో నిర్మించిన ఈ ట్రాక్ బాసర మీదుగా హైదరాబాద్‌ను కలిపేది. అదే మార్గంలో ఇప్పటికి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. వందేళ్ల క్రితమే నిర్మించిన ఈ ట్రాక్ ఇప్పుడు డబ్లింగ్ నిర్మాణానికి నోచుకుంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో రైలుమార్గం చాలా తక్కువ. ఉన్న మార్గంలోనూ సింగిల్ ట్రాక్‌లే ఉన్నాయి. నిర్మల్ – ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ మార్గం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తునే ఉన్నారు. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే బాసర మీదుగా వెళ్లే యాత్రికుల ప్రయాణం సులభతరం కానుంది. -
గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మత్యువాత పడిన కార్మికుల కుటుంబాలను ఆ దుకోవాలని, వారికి ఆర్థిక సామాజిక బాధ్యత క ల్పించాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎన్నారై రాష్ట్ర సలహా మండలి సభ్యులు, ప్రవాసీమిత్ర కా ర్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. సోమవారం అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో బాధిత కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గల్ఫ్ జేఏసీ, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ ఫోరం, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన వలస కార్మికుల హక్కులను పరిరక్షించేలా చట్టాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిి, ప్రముఖ నవలా రచయిత టి.సంపత్ కుమార్, ఆకుల సుదర్శన్, సీపీఐ కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, సంఘం జిల్లా ప్రతినిధులు కొమ్ము గీత, శశిమాల, రేఖ, వాసవి పాల్గొన్నారు. -
‘లేబర్ కోడ్స్ రద్దుకు పోరాడాలి’
నిర్మల్‌చైన్‌గేట్: కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దుకు పోరాడాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్ సంఘ భవనంలో కార్మిక సంఘాల జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా అమలు చేయాలని చూస్తోందన్నారు. కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారుల జేబులు నింపడానికే ఈ లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ.జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసచారి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సూర్య శివాజీ, జిల్లా అధ్యక్షుడు సునాకరి రాజేశ్, జిల్లా కార్యదర్శి హరిత, తదితరులు పాల్గొన్నారు.‘ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి’ నిర్మల్‌చైన్‌గేట్: ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి ఆదివాసీ, మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే.రాజు డిమాండ్ చేశారు. కర్రెగుట్టను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా కేంద్రంగా ఉన్న దండకారణ్యంలో సహజ వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పడమే లక్ష్యంగా, అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను, అడవికి రక్షణగా ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగర్ పేరుతో చంపుతున్నారని విమర్శించారు. వెంటనే చర్చలు జరిపి ఆదివాసీలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం.హరిత, సునరికారి రాజేశ్, వెంకటేశ్, రాజన్న, మల్లక్క పాల్గొన్నారు. -
హిందువులపై దాడులు తిప్పికొట్టాలి
భైంసాటౌన్: హిందువులపై దాడులను ఐకమత్యంతో తిప్పికొట్టాలని వీహెచ్‌పీ మాతృశక్తి సంయోజక్ పద్మశ్రీ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఫులేనగర్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో అభ్యాస వర్గ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందువులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఇందుకుగాను ప్రతిరోజూ మందిరకేంద్రంగా సత్సంగ్ నిర్వహించుకోవాలని, తద్వారా హిందూసమాజం జాగృతం కావాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, ప్రాంత మాతృశక్తి సహ సంయోజక్ శ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు జాదవ్ విఠల్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి మూర్తి ప్రభు, సహ కార్యదర్శి నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సరిహద్దు’లో క్షీరవిప్లవం
తానూరు: మహారాష్ట్ర సరిహద్దులోగల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఇంటింటా పాడి పశువులు పెంచుతున్నారు. వ్యవసాయం చేసుకుంటూ నే పాల దిగుబడి సాధిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. మండలంలోని హిప్నెల్లి, బెంబర, బోరిగాం, బోల్సా, బోసి, వర్జడి, కోలూరు, మసల్గతండా, బోంద్రట్ గ్రామాల్లో ఇంటింటా ఆవులు, గేదెలున్నాయి. పూర్వీకుల నుంచి పశుపోషణ ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామాల ప్రజలు మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ.. పాలు, పాల ఉత్పత్తులనే అధికంగా వినియోగిస్తారు. అందుకే ఏ ఇంటా చూసినా తప్పనిసరిగా ఆవులు లేదా గేదెలను పెంచుకుంటారు. లాభదాయకం కావడంతోనే.. తమ ఇళ్లలో పెంచుకుంటున్న పాడి పశువులు ఇచ్చే పాలను రైతులు విక్రయించి లాభాలు గడిస్తున్నా రు. ఉదయం, సాయంత్రం వేళలో తీసిన పాలను సమీపంలోని హోటళ్లు, గృహాలకు సప్లయ్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ పాలను రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తారు. కిలో పెరుగును రూ.80 వరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. పశువులను అధికంగా పెంచుకుంటున్న రైతులు పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. పశువులను పోషించగా వాటి ద్వారా వచ్చే పాలను విక్రయించడమే కా కుండా పేడను సేంద్రియ ఎరువుగా పంటలకు వే స్తుంటారు. పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పశువుల కాపరులకు ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పోషించుకుంటున్న ఆవులు, గేదెలతో పశువుల కాపర్లకు కూడా ఉపాధి దొరుకుతోంది. నెలకు ఒక్కో ఆవును మేపినందుకు రూ.500, గేదెకు రూ.600 తీసుకుంటారు. ఉద యం వేళ పశువుల కాపరులు ఇంటింటికీ చేరుకుంటారు. పశువులను అటవీ ప్రాంతానికి తోలుకెళ్తా రు. అక్కడ దినమంతా అవి మేత మేసిన తర్వాత సాయంత్రం తిరిగి ఇంటికి చేరుస్తారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ ఇంటింటా ఆవులు, గేదెల పెంపకం హోటళ్లు, గృహాల్లో పాల విక్రయం లాభాలు గడిస్తున్న పశుపోషకులు తానూరులోని హోటల్లో పాలు విక్రయిస్తున్న ఈ రైతు పేరు పోతన్న. ఇతనికి మూడు గేదెలున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం 16 లీటర్ల పాలు ఇస్తాయి. వీటిని గృహాలు, హోటళ్లకు సప్లయ్ చేస్తాడు. మిగిలిన వాటితో పెరుగు, నెయ్యి తయారు చేసి విక్రయిస్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కావడంతో కిలో రూ.800కు అమ్ముతున్నాడు. పశుపోషణతో అధిక లాభాలున్నాయని పోతన్న చెబుతున్నాడు. ఇలా మండలంలోని చాలా మంది రైతులు పాడి పశువుల పెంపకం ద్వారా లాభాలు గడిస్తున్నారు. -
ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 374 విద్యార్థులకు 275 మంది హాజరు కాగా 99మంది గైరాజరయ్యారు. ఏ డోతరగతి నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించిన ప్రవేశ పరీ క్షకు 216 మందికి 136 మంది హాజరుకాగా 80 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్ న వీన్కుమార్, డీవో మహేందర్ తెలిపారు. పరీ క్షాకేంద్రాన్ని డీఈవో రామారావు తనిఖీ చేశా రు. పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004–05లో పదో తరగతి చదివిన వారంతా ఆదివారం మండలంలోని కొండుకూ ర్ గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆత్మీయ స మ్మేళనం పేరిట కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు 20 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకుని సందడి చేశారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి గురువులను ఆహ్వానించి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని బ్రహ్మపురి కాలనీలోగల శ్రీసరస్వతి శిశుమందిర్ ప్రాథమిక పా ఠశాలలో 1993–94లో ఎస్సెస్సీ పూర్తి చేసినవా రంతా స్థానిక ఉత్సవ్ ఫంక్షన్హాల్లో కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. -
‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ కుటుంబం’
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నా యకులు భస్వపురం లక్ష్మీనర్సయ్య, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసమ్మ రాజు, నల్లా రవీందర్‌రెడ్డి, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తిక్, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్
వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసే అవకాశముంది. ● 296 మంది మైనర్ల పట్టివేత ● 100 మందిపై కేసులు నమోదు నిర్మల్‌టౌన్: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధి లో మైనర్ డ్రైవింగ్‌పై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 296 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడగా 100 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులకు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, నిర్మల్ ఏఎ స్పీ రాజేశ్‌మీనా మోటార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. రెండో విడత కౌన్సె లింగ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మల్ ప ట్టణంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 10 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డా యి. భైంసా టౌన్లో 10 ద్విచక్ర వాహనా లు, నిర్మల్ రూరల్ పరిధిలో ఐదు, భైంసా రూరల్‌లో రెండు ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్లు, ఖానాపూర్ పట్టణంలో ఆరు, కుభీర్‌లో మూడు, కుంటాలలో ఆరు, బాసరలో ఐదు, లోకేశ్వరం ఏడు, ముధోల్‌లో నా లుగు, తానూరులో ఆరు, దస్తురాబాద్‌లో నాలుగు, కడెంలో నాలుగు, పెంబిలో ఒకటి, దిలావర్పూర్లో మూడు, నర్సాపూర్‌లో మూడు, సారంగపూర్‌లో ఏడు, లక్ష్మణచాందలో ఆరు, మామడలో రెండు, సోన్‌లో నా లుగు ద్విచక్ర వాహనాలను ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు. -
మే డే పోస్టర్ విడుదల
ముధోల్: తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మే డే పోస్టర్లను మండల కేంద్రంలో శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం పోరాడుదామన్నారు. కార్యక్రమంలో కార్మికులు రాజేశ్వర్, భోజారాం, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
సాహితీరంగంలో కవియాత్ర ప్రశంసనీయం
నిర్మల్‌ఖిల్లా: సమాజంలో సాహితీరంగంపై జిల్లా కవులు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తున్నతీరు ప్రశంసనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కవియాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న ఖమ్మం జిల్లాలో కవియాత్ర నిర్వహణ విజయవంతంగా పూర్తిచేసుకున్నందున శనివారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘంభవనంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న మాట్లాడుతూ.. కవియాత్ర ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తున్న ప్రముఖ కవులు కారం శంకర్, డాక్టర్ బి.వెంకట్ సేవలను కొనియాడారు. కవియాత్ర సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం శంకర్ బి.వెంకట్ మాట్లాడుతూ.. కవియాత్రకు విశేషమైన స్పందన రావటం హర్షణీయమన్నారు. ఖమ్మంలోని వికాసవేదిక సాహిత్య సంస్థ ప్రతినిధులు వెంకటస్వామి నాయుడు, లెనిన్ శ్రీనివాస్ ఖమ్మం కవియాత్రకు సహకరించారన్నారు. 25 కిలోమీటర్ల యాత్రలో 100 మందికిపైగా కవులు, కవయిత్రులు మండుటెండను సైతం లెక్కచేయకుండా పాల్గొని కవితా గానం చేశారన్నారు. ఈ యాత్రలో బౌద్ధారామంలో మూడు పుస్తకాలను, రెండు సీడీలను ఆవిష్కరించామని వివరించారు. కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, సాహితీవేత్తలు, కళాకారులు అంబటినారాయణ, ఎట్టెం రజిత, పోలీస్ భీమేశ్, కడారి దశరథ్, దేవీప్రియ, ఎంఏ.గఫార్, పవన్‌కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘ఆదర్శ’ పరీక్ష కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఆది వారం(27న) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నారు. కుంటాల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్ల కోసం 370, ఏడో తరగతి కోసం 78, 8వ తరగతి కోసం 63, 9వ తరగతి కోసం 61, పదో తరగతిలో ప్రవేశానికి 14 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రిన్సి పాల్ నవీన్‌కుమార్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
సెలవుల్లోనూ విధులు
కడెం: సెలవులు వచ్చాయంటే ఎటు వెళ్దాం.. ఎన్నిరోజులు టూర్ వేద్దాం అని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాన్ చేస్తుంటారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంలో ఇప్పటికే చాలా మంది టూర్లకు వెళ్లారు. కడెం మండలం ఎలగడప ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కుచనపెల్లి శ్రీని వాస్ మాత్రం సెలవుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణ లేకున్నా వృత్తిపై ఉన్న మమకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. శనివారం గ్రామంలో ఉపాధి పనులు పూర్తయిన తర్వాత కూలీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచితవిద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వివరించారు. ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపించాలని కోరారు. -
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు..
● బేస్మెంట్ పైసలు పడుతున్నాయ్ ● లబ్ధిదారులకు ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ ● అవకతవకలు జరగకుండా ఏఐ టెక్నాలజీ వినియోగంనిర్మల్చైన్గేట్: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంత గూడు కలను సాకారం చేస్తోంది. జిల్లాలో 1,92,233 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా, తొలి విడతలో ఎంపికై న లబ్ధిదారుల బేస్మెంట్ పనులు చకచకా పూర్తవుతున్నాయి. వీరి ఖాతాల్లో రూ.లక్ష మొదటి విడత నిధులు జమవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1,444 ఇళ్ల మంజూరు పైలట్ ప్రాజెక్ట్‌లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, 18 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో 1,444 ఇళ్లు మంజూరయ్యాయి. కలెక్టర్ 1,159 దరఖాస్తులను ఆమోదించగా, 1,101 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. 300 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. బేస్మెంట్ పూర్తి చేసిన 36 మందిలో ఇద్దరికి రూ.లక్ష చొప్పున జమ చేశారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది. ఎల్–1 కేటగిరీలో 61,338 దరఖాస్తులు దరఖాస్తుదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీలుగా విభజించారు. సొంత స్థలం ఉన్నవారు ఎల్–1లో, స్థలం లేనివారు ఎల్–2లో, తల్లిదండ్రుల నుంచి విడిపోయిన సంతానం ఎల్–3లో చేరారు. ఎల్–1లో 61,338 దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. అర్హుల జాబితాను కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించి దశలవారీగా ఎంపిక చేస్తారు. ఏఐతో అవకతవకల నియంత్రణ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. బేస్మెంట్ ఫొటోలను గృహ యాప్‌లో అప్లోడ్ చేసి, పరిశీలన అనంతరం బిల్లులు మంజూరు చేస్తారు. నాలుగు విడతల్లో రూ.5 లక్షలు జమ చేస్తారు. బేస్మెంట్కు రూ.లక్ష, పైకప్పుకు రూ.లక్ష, గోడలు ఇతర నిర్మాణానికి రూ.2 లక్షలు, పూర్తయ్యాక రూ.లక్ష మంజూరు చేస్తుంది. మిగిలిన గ్రామాల్లో వేగవంతం తొలి విడతలో ఒక్కో మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు, ఇప్పుడు అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేశారు. ఈ నెల 30లోపు పరిశీలన పూర్తి చేసి, వచ్చే నెల 2న అర్హుల జాబితా ప్రకటిస్తారు. వివరాలు: పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన ఇళ్లు 1,444కలెక్టర్ అప్రూవ్ చేసినవి 1,159ప్రొసీడింగ్ పొందినవారు 1101ఇప్పటివరకు మార్కింగ్ చేసినవి 300బేస్మెంట్ లెవల్ పూర్తయినవి 36లక్ష రూపాయలు అందినవారు 2 -
వనజీవి సేవలు వెలకట్టలేనివి
నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌టౌన్: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన సేవలు వెలకట్టలేనివని కేవా(కుమ్మర ఉద్యోగులు సంక్షేమ సంఘం) ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ఎస్టీయూ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవా జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్ మాట్లాడుతూ.. కుమ్మర కుల బంధువు వనజీవి రామయ్య మరణం యావత్ ప్రజానీకానికి తీరనిలోటని పేర్కొన్నారు. మూడు కోట్ల మొక్కలను నాటి ప్రపంచానికి హరిత సందేశాన్నిచ్చారని గుర్తుచేశారు. రామయ్య జయంతి రోజులు ప్రభుత్వం అధికారికంగా హరిత దినోత్సవంగా నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి సాయన్న, జిల్లా నాయకులు మారుపాక శ్రీనివాస్, మధు సిలారి, తోడిశెట్టి శంకర్, తోడిశెట్టి రవికాంత్, తాళ్లపల్లి నారాయణ, తోడిశెట్టి శ్యాంసుందర్, కానుగుల ముత్యం, శనిగారపు నారాయణ, పోతుగంటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఎండ.. జాగ్రత్తలే అండ..! ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరింది. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. – 08లో సిరాల పూర్తయ్యేనా..? సిరాల ప్రాజెక్టు పనుల్లో వేగం కనిపించడం లేదు. రెండేళ్లలో నాలుగు పంటలు కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈయేడైనా పంట లు సాగు చేయాలనుకుంటున్నారు.IIIలోu ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025IIలోu పశువులకు ఎల్ఎస్డీ టీకాలు లోకేశ్వరం: జిల్లాలోని పశువుల్లో ప్రాణంతరమైన లంపీ స్కిన్ వ్యాధి వెలుగు చూసింది. దీరిపై ‘సాక్షి’లో శనివారం(ఏప్రిల్ 26న) కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా పశువైద్యాధికారి మహమ్మద్ బలిక్ హైమద్ పశువులకు టీకాలు వేయాలని ఆదేశించారు. దీంతో మండల పశువైద్య సిబ్బంది లోకేశ్వరం మండలంలోని ధర్మోర, పంచగుడి గ్రామాల్లో పర్యటించారు. పశువులకు, లేగదూడలకు ఎల్ఎస్డీ టీకాలు వేశారు. నిర్మల్: వేసవి సెలవులు వచ్చాయంటే.. ఒకప్పుడు పిల్లలు ‘చలో..’అంటూ అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు వెళ్లేవాళ్లు. అక్కడే నెలరోజులు ఎంజాయ్ చేసేవాళ్లు. గల్లీలో ఉన్న పిల్లలంతా కలిసి ఆడేవాళ్లు. అమ్మమ్మతాతయ్యలు ఎంత చెప్పినా.. చెట్లకిందే రోజంతా గడిపేవాళ్లు. ఇక రాత్రిళ్లు తాతయ్య దగ్గర అడిగి కథలు చెప్పించుకునేవారు. ఉమ్మడి కుటుంబాల్లో దాదాపు రెండు నెలలు అలా.. గడుపుతూ బంధాలు, అనుబంధాలతోపాటు పెద్దల నుంచి ఎన్నో బుద్ధులనూ నేర్చుకునేవారు. కానీ.. ఇప్పుడు జమానా మారిపోయింది. సెల్‌ఫోన్ చేతిలోకి వచ్చాక పిల్లలకు అదే ప్రపంచమైపోయింది. ఊళ్లకు వెళ్లే మాట అటుంచి, తమ ఇళ్లల్లో ఉన్నా.. తల్లిదండ్రుల మాటలు వినకుండా సెల్లోనే లీనమైపోతున్నారు. ఇలా విలువైన సెలవులను ‘సెల్’పాలు చేయకుండా.. చాలామంది తల్లిదండ్రులు సద్వినియోగం చేసే యోచన చేస్తున్నారు. ఇందుకు సమ్మర్ క్యాంప్‌లు, ప్రత్యేక కోచింగ్‌లూ తోడ్పడుతున్నాయి. ఈనేపథ్యంలో చాలామంది పిల్లలు సైతం.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన చూపిస్తున్నారు. ‘వేసవి’ ప్రయోజనాలెన్నో.. పిల్లల కోసం గణితం, ఇంగ్లిష్ వంటి కోచింగ్ క్లాసులతోపాటు స్విమ్మింగ్, కరాటే, కిక్‌బాక్సింగ్, థైక్వాండో, క్రికెట్, డ్యాన్స్, హ్యాండ్రైటింగ్, చెస్, బ్యాడ్మింటన్, డ్రాయింగ్, యోగా వంటి ఆటలనూ నేర్పే క్లాసులు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏడాదంతా పాఠశాలలో గడిపినట్లు సాధారణ దినచర్యలా కాకుండా ఇవి పిల్లలు నిమగ్నమై, వినోదభరితంగా నేర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఇలాంటి వాటివల్ల చాలా ప్రయోజనాలూ ఉన్నాయి. ● వేసవి శిక్షణలో భాగంగా ఏదైనా ఒకటి నేర్చుకోవాలన్న తప్పన పిల్లల్లో వచ్చిందంటే.. ముందుగా వారు సెల్/టీవీ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ● శిక్షణ కార్యక్రమాల్లో పిల్లలు జట్టుగా నేర్చుకునేందుకు లేదా ఆడేందుకు అవకాశం ఉంటుంది. వీటివల్ల సమూహంగా ఉండటం, ఐక్యంగా పనిచేయడం అలవడుతుంది. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, బాధ్యతలను పంచుకోవడం, ఉమ్మడి లక్ష్యాల సాధన నేర్చుకోవడానికి దోహదపడుతుంది. ● ఎప్పుడూ ఇల్లు, స్కూల్‌కే పరిమితమయ్యే పిల్ల లకు ఈ వేసవిలో శిక్షణ శిబిరాలు సామాజిక నైపుణ్యాలనూ మెరుగుపరుస్తాయి. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన తోటివారితో కలిసి ఆడట, నేర్చుకోవడం వల్ల సామాజిక నైపుణ్యత మెరుగవుతుంది. ● కరాటే, స్విమ్మింగ్, డ్యాన్స్, హ్యాండ్రైటింగ్, మ్యాథమెటిక్స్.. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడమనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒకరిపై ఆధారపడే గుణాన్ని క్రమంగా దూరం చేస్తుంది. ● ఎప్పుడూ సెల్/టీవీల కృత్రిమ తెరల ముందు గడిపే పిల్లలు ప్రకృతిలో, నలుగురితో గడిపే అవకాశం లభిస్తుంది. ● వేసవిలో ఇంటిపట్టునే టీవీ/సెల్ చూస్తూ.. స్నా క్స్ తింటూ గడిపేస్తే ఏం లాభం ఉండదు. ఏదో ఒక శిక్షణలో జాయిన్ అయితే.. మానసిక వికాసంతోపాటు శారీరక శ్రమకూ అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ● చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల టాలెంట్ ఏంటో వేసవిలో నేర్చుకునే విషయాలతోనే తెలుస్తుంది. వారిలోని ప్రతిభ, ఆసక్తులను కనుగొనవచ్చు. వారికంటూ ఓ దినచర్య ఏర్పడుతుంది. ఈ సెలవులు పిల్లల సృజనాత్మకతను వెలికి తీయడానికీ చాలా ఉపయోగపడతాయి. పేరిణి నేర్పిస్తున్నాం.. వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. జిలా కేంద్రంలోనే విజయ హైస్కూల్లో సమ్మర్‌క్యాంప్ ద్వారా పేరిణి నృత్యాన్ని నేర్పిస్తున్నాం. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. – రజిత, డ్యాన్స్ టీచర్క్రికెట్.. నా ఫేవరెట్ గేమ్.. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈసెలవుల్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ నేర్చుకుంటున్నా. నాన్న సాయికృష్ణ నన్ను రోజూ క్రికెట్ కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. – పూదరి శ్రేయాస్, నిర్మల్టేబుల్టెన్నిస్ ఎంచుకున్నాడు.. ఏడాదంతా చదువులతో గడిచిపోతుంది. ఈసెలవుల్లో మా త్రినయన్కు ఏదైనా ఆట నేర్పాలనుకున్నాం. తను వినూత్నంగా టేబుల్‌టెన్నిస్ ఎంచుకుని నేర్చుకుంటున్నాడు. – రేవంత్, నిర్మల్కూచిపూడి నేర్చుకుంటోంది.. మాపాప ఆనందికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తాను కొంత కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ సెలవుల్లో పూర్తిసమయం డ్యాన్స్‌కే కేటాయిస్తోంది. – దాసరి మౌనిక, నిర్మల్●న్యూస్‌రీల్ చదువులకు అదనంగా.. నేర్పుతుంది ఆనందంగా.. తల్లిదండ్రులకూ ఇప్పుడే తీరిక హాలీడేస్ సద్వినియోగమిలా..ఎన్నో నేర్పిస్తున్నారు.. ఒకప్పటికి.. ఇప్పటికి జిల్లాలోనూ చాలా మార్పువచ్చింది. ఏదైనా ఆట నేర్చుకోవాలన్న, పాట నేర్చుకోవాలన్నా.. గతంలో ఏ నిజామాబాదో, హైదరాబాదో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక్కడే.. అన్నీ నేర్పిస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి వంటి కళలనూ నేర్పేవాళ్లు ఉన్నారు. నిర్మల్, భైంసాలో అరకొరగా పూల్స్ ఉన్నా.. స్విమ్మింగ్ కూడా నేర్చేసుకోవచ్చు. ఇక క్రికెట్ కోసం పదుల సంఖ్యలో బాక్స్క్రికెట్లు, రెండు మూడు కోచింగ్ కేంద్రాలూ నిర్మల్‌లో ఏర్పాటయ్యాయి. వెస్ట్రన్ డ్యాన్స్, కరాటే గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతీ ఏరియాలో ఈ సమ్మర్ స్పెషల్ కోచింగ్ కేంద్రాలు వెలిశాయి. ఇవి కాకుండా చాలామంది పిల్లలు ఆన్లైన్లో చెస్, హ్యాండ్రైటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ తరఫున.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆటలకు సంబంధించిన వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్, కరాటేకు పంపిస్తున్నా.. వేసవిని వృథా చేయకుండా మా పిల్లలు శష్విక్, కార్తికేయలకు స్విమ్మింగ్, కరాటే క్లాసులకు పంపిస్తున్నాం. ఉదయం ఈత, సాయంత్రం కరాటే నేర్చుకుంటున్నారు. – రాకేశ్, నిర్మల్ -
ఉపాధ్యాయుల ఔదార్యం
నిర్మల్‌ఖిల్లా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి వైద్యం చేయించే స్థోమత లేదని తెలిసి ఆపన్న హస్తం కోసం తల్లి ఎదురుచూసింది. సోన్ కేజీబీవీలో సీఆర్టీగా విధులు నిర్వహిస్తున్న నాగమణి కుమారు డు సాయిప్రసాద్ పరిస్థితిని తెలుసుకున్న ఉపాధ్యాయులు ఔదార్యం చూపారు. వాట్సప్ గ్రూపుల ద్వారా విషయం తెలుసుకుని జిల్లాలోని ఉపాధ్యాయులు చికిత్స కోసం తోచినంతగా ఆర్థికసాయం అందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ శనివారం జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిప్రసాద్‌ను పరామర్శించారు. విరాళాల ద్వారా సేకరించిన నగదు మొత్తం రూ.4.40 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూమారెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్, కుర్రశేఖర్, అశోక్ పాల్గొన్నారు. -
‘భూభారతి’తో సమస్యలకు పరిష్కారం
లక్ష్మణచాంద/సారంగాపూర్/దిలావర్పూర్: భూభారతి చట్టం అమలుతో మండలస్థాయిలోనే ప్రజల భూసమస్యల పరిష్కారం అవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భూభారతి చట్టంపై లక్ష్మణచాంద, సారంగాపూర్ మండల కేంద్రాల్లో, దిలావర్పూర్ మండలం బన్సపల్లి రైతువేదికల్లో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. భూభారతి చట్టం అమలు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. రైతులకు వారి భూములపై సమగ్రమైన హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలి పారు. గ్రామ పాలన అధికారులను నియమించి ధరణిలో ఉత్పన్నమైన భూసమస్యలను సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించి వారికి హక్కులను కల్పించేందు కు భూభారతిలో అవకాశం ఉందని పేర్కొన్నా రు. సమస్యలపై దరఖాస్తు చేసిన తర్వాత నిర్ణీత గడువులోపే పరిష్కరించాల్సి ఉంటుందని తెలి పారు. చాలా వరకు సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. క్రయవిక్రయాల ద్వారా పట్టా మార్పిడి, వారసత్వ పట్టా మార్పిడి వంటి అనేక పనులు సులభంగా చేసుకోవచ్చన్నారు. సాదాబైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రి య సరళతరం చేయడంతో అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ గ్రామంలో వ్యవసాయ భూముల వివరాలతో రికార్డులను సిద్ధం చేసి గ్రామపంచాయతీల్లో ప్రదర్శించడంతోపాటు ఆధార్ తరహాలో భూమికి భూదార్ నంబర్ కేటాయించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సదస్సులో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, డీఎంహెచ్‌వో రాజేందర్, తహసీల్దార్లు జానకి, శ్రీదేవి,అజీజ్ ఆహ్మద్, ఎంపీడీవోలు రాధారాథోడ్, లక్ష్మీకాంత్‌రావు, అరుణారా ణి, మండల ప్రత్యేక అధికారులు మోహన్‌సింగ్, బాలిక్ అహ్మద్, శంకర్, ఏఎంసీ చైర్మన్ భీమ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ ఈటల శ్రీనివాస్, డీసీసీబీ వైస్‌చైర్మన్ రఘునందన్, మండల వ్యవసాయ అధికారి వసంత్‌రావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ లక్ష్మణచాంద, సారంగాపూర్‌లో అవగాహన సదస్సులు -
మలేరియా నివారణకు సహకరించాలి
● డీఎంహెచ్‌వో రాజేందర్సారంగపూర్: మలేరియా నివారణకు వైద్యసిబ్బందితోపాటు ప్రజలంతా సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ కోరారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా స్థానిక పీహెచ్సీ నుంచి ర్యాలీగా వెళ్లి ప్రజల కు మలేరియా వ్యాధి, నివారణ చర్యలపై అవగా హన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా సహా ఇతర కీటకజనిత వ్యాధుల నివారణకు ప్రజలు కూడా భాగస్వాములు కావాల ని పిలుపునిచ్చారు. మలేరియా అత్యంత ప్రమాదకరమైన జ్వరం అని తెలిపారు. అయితే దీనిని నివా రించడానికి ప్రజల అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు మురికి నీరు నిలువలేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రోజువారీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బారె రవీందర్, డాక్టర్ అబ్దుల్ జవాద్, సూపర్వైజర్లు ఉష, శ్రీనివాస్, ప్రేమ్‌సింగ్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు. -
మందుల లెక్క పక్కాగా ఉండాలి
● రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మంజునాథ్ నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా జనరల్ ఆసుపత్రితోపా టు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల లెక్క పక్కాగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి మంజునాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ముజ్గి, దిలావర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో మందులను సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని తెలిపారు. -
కొలువుదీరిన అడెల్లి ఆలయ పాలకవర్గం
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయ నూతన పాలక మండలి కొలువుదీరింది. చైర్మన్ సింగం భోజాగౌడ్తోపాటు పదిమంది పాలకవర్గ సభ్యులతో దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్ శుక్రవారం ప్రమాణం చేయించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్‌గా సింగం భోజాగౌడ్ను పాలకవర్గ సభ్యులు ముస్కు నర్సారెడ్డి ప్రతిపాదించగా రాజర్ల ప్రభాకర్‌గౌడ్ బలపరిచారు. ప్రమాణ స్వీకారం అనంతరం మండల నాయకులతో పాటు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు నూతన పాలకవర్గ మండలి సభ్యులను, చైర్మన్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, గండిరామన్న సాయిబాబ ఆలయ కమిటీ చైర్మన్ గంగోని బూరజ్, నాయకులు దాసరి రమేశ్, సత్యపాల్‌రెడ్డి, కొట్టె శేఖర్, ముత్యంరెడ్డి ఉన్నారు. -
నిర్మల్
కొడుకును కడతేర్చిన తండ్రి ఆర్థిక గొడవల కారణంగా తండ్రి కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్‌లో శుక్రవారం తెల్ల వారుజామున జరిగింది. శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025IIలోu బాసర పండితుడికి అరుదైన అవకాశం ● కంచి కామకోటి సరవజ్ఞ 71వ పీఠం ఉత్తరాధికారిగా ఎంపిక బాసర : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరానికి చెందిన ఎస్వీఎస్ఎస్.గణేశ్‌శర్మ ఋగ్వేద వేదపండితుడు. తన గురువు వద్ద ఋగ్వేదాన్ని అభ్యసించి బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో ఋగ్వేద పారాయణ దారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అరుదైన అవకాశం దక్కింది. కంచికామకోటి సర్వజ్ఞ పీఠం 71వ ఉత్తరాధికారి గా ఎంపికయ్యారు. ఈనెల 30న అక్షయతృతీయ రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు. గణేశ్ శర్మ ఎంపికపై బాసర ఆలయ వైదిక బృందం హర్షం వ్యక్తం చేసింది. నిర్మల్/భైంసాటౌన్: ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి అండగా నిలిచింది. ఆపార్టీ ఇచ్చిన ప్రతీ పిలుపులో భాగమైంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఆ పార్టీకే జైకొట్టింది. గల్లీ నుంచి ఢిల్లీదాకా ఎదిగిన మహామహులైన నేతలు, సీనియర్ కార్యకర్తలు, భారీ కేడర్‌తో ‘కారు’పార్టీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఎన్నికలేవైనా.. గెలుపు ఆపార్టీదే ఉండేది. ఏ మీటింగైనా, ఏ సభ పెట్టినా.. ‘గులాబీ’ రెపరెపలాడేది. ఒక్క పిలుపుతోనే వేలమంది ఎక్కడ సభ ఉన్నా.. తరలివెళ్లేవారు. చిన్న పదవులైనా నాయకుల మధ్య పోటాపోటీ ఉండేది. ఇలాంటి బలమైన నేపథ్యాన్ని నమ్ముకునే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎదిగింది. కానీ.. ‘కారు’ జోరుకు గత ఎన్నికల్లో బ్రేకులు పడటం, కేసీఆర్ సర్కార్ అధికారం కోల్పోవడమే ఆలస్యం.. సీన్ మొత్తం రివర్స్ అయింది. అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన ‘గులాబీ’ వెలసిపోతూ వచ్చింది. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన వాళ్లు మొదలు.. గల్లీల్లో చెలాయించిన నేతలదాకా అందరూ బీఆర్ఎస్ను వీడారు. ఒక్కో కారణం చూపుతూ హస్తం చెంతకు, కమలం గూటిలోకి చేరిపోయారు. అక్కడక్కడ ఉన్న కొంతమంది గులాబీనేతల్లోనూ సమన్వయం లేకపోవడంతో పార్టీ రజతోత్సవ వేళలోనూ అధిష్టానం జిల్లాపై పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. నేతలు లేక వెతలు.. ఏ పార్టీ మనుగడ సాగించాలన్న సమర్థులైన నేతలు కావాలి. జిల్లాలో బీఆర్ఎస్కు ఇప్పుడు అదే పెద్ద లోటు. మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారిలతోపాటు సీనియర్లందరూ పార్టీలు మారడంతో వారితోపాటు మిగిలిన నాయకులు, కార్యకర్తలూ బీఆర్ఎస్ను వీడారు. ఖానాపూర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన జాన్సన్‌నాయక్ కొంత కష్టపడుతున్నా.. కావాల్సినంత బలగం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్‌లో నియోజకవర్గ ఇన్చార్జిగా సీనియర్ నేత రాంకిషన్‌రెడ్డి శ్రమిస్తున్నా.. ఆయనకంటూ కేడర్ లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ముధోల్‌లో ఉన్నా.. జిల్లాలో బీఆర్ఎస్కు ముధోల్ నియోజకవర్గంలోనే ఎక్కువమంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వారిమధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీకి సమన్వయకమిటీ సభ్యులుగా ఉన్న విలాస్ గాదేవార్, పి.మాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్ మధ్య సమన్వయం లేదన్న విమర్శలు పార్టీ కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. వీరి సమన్వయలోపం జనసమీకరణపై ప్రభావం పడుతుందని భావించిన నాయకత్వం మాజీ మంత్రి జోగు రామన్నను రంగంలోకి దించింది. ఈ మేరకు ఇటీవల ఆయన భైంసాకు చేరుకుని సభ సన్నాహాలపై చర్చించినట్లు తెలిసింది. నలుగురికి మండలాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కనిపించని రజతోత్సాహం.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక్కరోజే గడువున్నా.. జిల్లాలో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. గోడలపై రాతలు, ఒకట్రెండు మీటింగ్‌లు మినహా పెద్దగా సమాయత్తమవుతున్న దాఖలాలూ లేవు. ఈనెల 27(ఆదివారం)న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ ఎత్తున బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు పెట్టడం, జనసమీకరణకు ఏర్పాట్లు చేయడం పూర్తిచేశారు. పార్టీ నుంచీ సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మాత్రం అలాంటి నేతల పర్యటనలేవీ కనిపించలేదు. బలమైన కేడర్ లేకున్నా.. ఇప్పటికీ కేసీఆర్‌పై అభిమానం ఉన్నవాళ్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. కానీ అలాంటివాళ్లను సమన్వయం చేసుకుని రజతోత్సవానికి తీసుకువెళ్లే లీడరే లేడన్న మాట వినిపిస్తోంది.న్యూస్రీల్ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి జిల్లాలో కళ తప్పిన గులాబీ పెద్ద లీడర్లు లేరు.. భారీ కేడరూ లేదు ఒకరిద్దరు ఉన్నా.. సమన్వయం కరువు బీఆర్ఎస్ సభకు వెళ్లేది ఎందరో? -
అంధకారంలో ఆడిట్ ఆఫీస్
నిర్మల్ మార్కెట్ యార్డ్‌లోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో మూడు రోజులుగా అంధకారం నెలకొంది. మూడు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్‌తో సర్వీస్ వైర్ కాలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సాధారణ మరమ్మతులతో సమస్య పరిష్కరించవచ్చు. కానీ, జిల్లా ఆడిట్ అధికారి నిర్లక్ష్యంతో సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు. కరెంటు లేక కార్యాలయంలో పనిచేసే 9 మంది మూడు రోజులుగా విధులకు రావడం లేదు. అధికారి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
ఉగ్రదాడి హేయయమైన చర్య
నిర్మల్‌చైన్‌గేట్: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన హిందూ యాత్రికుల ఆత్మశాంతి కోసం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ చౌక్ నుంచి శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నారాయణరెడ్డి మార్కెట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులు హిందూ ధర్మాన్ని అడిగి హత్య చేయడం దారుణమన్నారు. మతోన్మాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. వారిని తగిన విధంగా శిక్షించేందుకు నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దాడుల వెనుక గల ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి -
మళ్లీ లంపీ స్కిన్
వ్యాధి లక్షణాలు.. ● పశువుల శరీరంపై 2 నుంచి 5 సెంటి మీటర్ల విస్తీర్ణంలో గుండ్రంగా దద్దుర్లు, కురుపులు ఏర్పడతాయి. ● పశువులకు జ్వరం వస్తుంది. ఆకలి మందగించి మేత సరిగా మేయవు ● పాల ఉత్పత్తి తగ్గుతుంది. ● చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుంది. ● చికిత్స అందకపొతే పశువులు మరణించే అవకాశాలు ఉన్నాయి. లోకేశ్వరం: పశువుల్లో ప్రాణాంతకమైన లంపీ స్కిన్(ముద్దచర్మం) వ్యాధి జిల్లాలో మళ్లీ బయటపడింది. వ్యాధి లక్షణాలు తెల్లజాతి పశువుల్లో కనిపిస్తుండటంతో పశువుల యాజమానులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం విస్తరించి పాడి రైతులను ఆందోళనకు గురిచేసింది. పశువుల్లో మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల మృత్యువాత పడిన ఘటనలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అందుబాటులో టీకాలు... గతంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులతోపాటు వాటి పరిసరాల్లోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి ఎల్ఎస్డీ టీకాలు వేశారు. ప్రతీ పశువైద్య ఆస్పత్రిల్లో ఎల్ఎస్డీ టీకా మందులు అందుబాటు ఉన్నాయి. పుట్టిన దూడలకు రైతులు మందుకువచ్చి టీకాలు వేయించాలి. పూర్తి స్థాయిలో ఆవుజాతి పశువులకు టీకాలు వేయించకపోవడంతో మళ్లీ లంపీ స్కీన్ సోకుతుందని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ మండలాల్లో గుర్తింపు.. ప్రస్తుతం లంపీ స్కిన్ వ్యాధిని జిల్లాలోని కుంటాల, లోకేశ్వరం, కడెం మండాల్లోని ఆవుజాతి లేగ దూడల్లో గుర్తించారు. ఎలా ప్రబలుతుందంటే... వైరస్ వల్ల వ్యాధి సోకుతుంది. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్ల వంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుంది. తెల్లజాతి పశువులైన ఆవులు, ఎద్దులపై వై రస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గేదెల్లోనూ ప్ర బలుతుంది. టీకా వేస్తే ఏడాదిపాటు వ్యాధి సోకదు. ఆవుజాతి లేగ దూడల్లో బహిర్గతం మిగతా వాటికి పొంచి ఉన్న ముప్పు ఆందోళనలో రైతులు జిల్లాలోని పశువుల వివరాలు.. తెల్లజాతి పశువులు 1,77,954నల్లజాతి పశువులు 1,19,973లేగ దూడకు వ్యాధి నాకు ఆవులు, లేగదూడలు, ఎద్దులు అన్నీ కలిపి 60 వరకు ఉన్నాయి. లేగ దూడలకు లంపీ స్కిన్ సోకింది. చికిత్స చేయిస్తున్నాను. మిగతా వాటికి సోకకముందే అధికారులు దూడలకు టీకాలు వేయాలి. – సంజీవ్‌రెడ్డి, ధర్మోర అప్రమత్తం చేశాం జిల్లాలో లంపీ స్కిన్(ముద్ద చర్మ) వ్యాధి లక్షణాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఇప్పటికే పశువైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. రైతులు జాగ్రతగా ఉండాలి. లక్షణాలు కనపడగానే పశువును మంద నుంచి వేరు చేసి క్వారంటైన్లో ఉంచి మండల పశువైద్యాధికారికి సమాచారం అందించాలి. జిల్లాని అన్ని పశువుల ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు లేగ దూడలకు తప్పని సరిగా టీకాలు చేయించాలి. – మహమ్మద్ బలిక్ హైమద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పంచగుడిలో లంపీస్కిన్ సోకిన లేగ దూడ -
జిల్లాలో గొలుసు దొంగలు
● బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు ● నడిరోడ్డుపైనే నగలు లాక్కెళ్తున్నారు.. ● బయటకు వెళ్లడానికి జంకుతున్న మహిళలు ● పోలీసులకు సవాల్ నిర్మల్‌టౌన్: ఒకవైపు బంగారం ధరలు రూ.లక్షకు చేరువైంది. మరోవైపు ఈజీ మనీ కోసం దొంగలు రెచ్చిపోతున్నారు. భయం బెరుకు లేకుండా బరితెగిస్తున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దొంగలు పక్కా ప్రణాళికతో మాటువేసి గొలుసులు లాక్కెళ్తున్నారు. పట్టపగలే ఎలాంటి భయం లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో జిల్లాలో గొలుసు దొంగల ముఠా సంచరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. బైక్‌లపై వచ్చే దొంగలు ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని తాళిబొట్లు, గొలుసులు లాక్కుంటున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు తమ రూటు మార్చిన ఈ ముఠాలు, మాయమాటలతో లేదా హఠాత్తుగా దాడి చేసి దోచుకుంటున్నారు. పోలీసులకు సవాల్.. పోలీసుల పెట్రోలింగ్, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొంగలు ఆనవాళ్లు లేకుండా తప్పించుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దు, జాతీయ రహదారులు దొంగలకు పారిపోయేందుకు సౌలభ్యంగా మారాయి. ప్రజలు భద్రతా చర్యలు పెంచాలని, ముఖ్యంగా ఒంటరిగా బంగారం ధరించి బయటకు వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో అపరిచితులతో మాట్లాడకుండా, తోడుగా వెళ్లడం, ఇంటి లోపల మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. పోలీసులు గస్తీని మరింత ఉద్ధృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి.... జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర ఉండడంతో నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. అంతేకాకుండా జిల్లాలో 44, 61 నంబర్ జాతీయ రహదారులు ఉండడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు నేరుగా దొంగతనాలు చేసి పారిపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ● మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మెడలో బంగారం ధరించడం చాలా ప్రమాదకరం. ● వీలైనంతవరకు బయటకు వెళ్లేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్లాలి. ● అపరిచితులు పలకరిస్తే మాట్లాడవద్దు. వారు మాటల్లో దింపి చోరీ చేసే అవకాశం ఉంది. ● ఇళ్ల వద్దకు అపరిచిత వ్యక్తులు వస్తే లోపల ఉండి మాట్లాడడం మంచిది. ఇటీవలి ఘటనలు.. ● ఈ ఏడాది జనవరి 15న జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ కాలనీకి చెందిన నళిని తన కూతురితో కలిసి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూ.1.50 లక్షల విలువైన బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ● ఈనెల 13న జిల్లా కేంద్రంలోని పాత నటరాజ్ మిల్ సమీపంలో ముగ్గురు యువకులు మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన మహిళలు కేకలు వేయడంతో స్థానికులు బైక్‌పై వచ్చిన ముగ్గురిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ● ఇటీవలే తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో నడుచుకుంటూ.. వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు. ● ఈనెల 19న సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి ఇద్దరు మహిళలు ఆటోలో నిర్మల్ నుంచి బయలుదేరారు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై ఆటోను అనుసరిస్తూ.. వచ్చిన ఇద్దరు దొంగలు ధని గ్రామ సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఆటో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం తగ్గించడంతో.. వెనుక వైపు కూర్చున్న సునీత, గంగమణి మెడలోని 26 గ్రాముల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ● ఈనెల 20న లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రామవ్వ తమ బంధువుల వివాహ వేడుకకు ఇంటి పక్కన ఉన్న భీమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో కనకాపూర్ వద్ద ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైక్‌ను ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లొద్దని, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తీసి పర్సులో పెట్టుకునే క్రమంలో తాను పెట్టిస్తామని చెప్పి గొలుసు మాయం చేసి ఖాళీ పర్సు ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో రాళ్లు కనిపించాయి. జాగ్రత్తగా ఉండాలి.. జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలపై దృష్టిపెట్టాం. గతంలో కొన్నిముఠాలు మాత్రమే ఉండేవి. ఇటీవల కొత్త దొంగలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. – జానకీషర్మిల, ఎస్పీ -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్:పాఠశాలలకు ఇచ్చిన విధంగా అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. హక్కుల సాధన కోసం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలహీన పరిచేందుకే కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం తీసుకువచ్చిందన్నారు. జీవో 14ను వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాలు కృషి ఫలితంగా 15 రకాల జబ్బులు నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు బలహీనపరచడం వలన బలహీనవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తున్నారని దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన వసతులు కల్పించాలన్నారు. నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినాశకర విధానాలు ఐసీడీఎస్‌ను ప్రజలకు దూరం చేస్తున్నాయన్నా రు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే యాప్‌ను అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మినీ కేంద్రాల టీచర్ల వేతనాలు విడుదల చేయాలని కోరారు. కేంద్రాలకు పక్కా భవనాలు, మరుగుదొడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షులు దేవిక, లావణ్య, రేష్మ, జిల్లా సహాయ కార్యదర్శిలు రమ్య, భాగ్య, జిల్లా నాయకులు పుష్పలత కవిత, మీనాక్షి, నర్సమ్మ పాల్గొన్నారు. -
ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం
లోకేశ్వరం/నర్సాపూర్(జి): భూ భారతి చట్టంతో ధరణిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కా రం అవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. లోకేశ్వరం, నర్సాపూర్(జి) మండల కేంద్రాల్లోని రైతు వేదికలో భూభారతి చట్టంపై గురువారం వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూభారతి (నూతన ఆర్ఓఆర్)2025 చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు భూభారతిలో వీలు కల్పించిందని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి వార్షికంగా వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారని, ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి అక్రమణలకు అడ్డుకట్టవేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు వారి భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు అడిగిన భూ సమస్యలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్‌రావు పటేల్, నిర్మల్ మార్కెట్ కమిటీ చెర్మన్ భీంరెడ్డి, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు మోతీరాం, శ్రీనివాస్, ఎంపీడీవోలు వెంకటరమేశ్, పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, నర్సాపూర్(జి) మండల ప్రత్యేక అధికారి అంజిప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి●లోకేశ్వరం: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించే రికార్డులను, వరి ధాన్యంలో తేమ శాతంను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, ఏపీఎం మల్లేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ లోకేశ్వరం, నర్సాపూర్(జి) మండలాల్లో అవగాహన సదస్సులు -
పదేళ్ల నిరీక్షణకు తెర
● సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● జిల్లాలో 92 మంది ఉద్యోగులు నిర్మల్‌చైన్‌గేట్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 92 మంది ఉద్యోగులకు బదిలీ అవకాశం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ పూర్తయితే, జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు. దీర్ఘకాల నిరీక్షణ.. గతేడాది జూలైలో జరిగిన సాధారణ బదిలీల సందర్భంగా సెర్ప్ ఉద్యోగులు తమకు అవకాశం కల్పించాలని కోరినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు వర్తింపజేయకపోవడంపై గత కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదేళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2023 నుంచి సెర్ప్ సిబ్బందికి పే–స్కేల్ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగులు విసిగిపోయారు. యూనియన్ నాయకులు గతంలో సంబంధిత శాఖ మంత్రులతో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఎట్టకేలకు, ప్రభుత్వ ం సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలపడంతో వారి దీర్ఘకాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. జిల్లాలో 92 మంది ఉద్యోగులకు అవకాశం సెర్ప్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక ఎదుగుదల, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. 23 ఏళ్లుగా సెర్ప్ ఉద్యోగులు అత్యంత కీలక సేవలు అందిస్తున్నారు. సెర్ప్‌లో మినిస్టీరియల్, ఫీల్డ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో మొత్తం 92 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ‘వెలుగు’ నుంచి సెర్ప్ వరకు 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ‘వెలుగు’ పేరుతో సంస్థను కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. 2002లో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ‘ఇందిరా క్రాంతి పథం’ (ఐకేపీ)గా మార్చగా, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)గా నామకరణం చేసింది. 2002 నుంచి సెర్ప్ ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అయితే, పే–స్కేల్, ఇతర సౌకర్యాలు వర్తింపజేసినప్పటికీ, బదిలీలు, పదోన్నతుల విషయంలో ఇంకా పూర్తిస్థాయి అమలు జరగాల్సి ఉంది. ఉద్యోగుల వివరాలు: మొత్తం ఉద్యోగులు 92 డీపీఎంలు 5 ఏపీఎంలు 21 క్లస్టర్ కోఆర్డినేటర్లు 56 మాస్టర్ బుక్ కీపర్లు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ముందుకురా వడం మంచి పరిణామం. ఉద్యోగులు, సిబ్బంది పదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన చాలామంది సిబ్బంది పదేళ్లు, అంత కంటే ఎక్కువగానే ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వం 100 శాతం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వనుండటంతో దాదాపు అందరికీ స్థానచలనం కలుగుతుందని భావిస్తున్నాం. – జాదవ్ రవీందర్, సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన రైతులు
లక్ష్మణచాంద:మండలంలోని పొట్టపల్లి గ్రామ రైతులు తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గ్రామంలో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టామని, కొందరు రైతుల వరి ధాన్యం ఇప్పటికే ఆరిపోయినప్పటికీ, ప్రభుత్వం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఇదే సమస్య గతంలో పొట్టపల్లి గ్రామంలో ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని రైతులు తెలిపారు. అయితే, రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో ఎఫ్ఎస్సీఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. దీంతో వానాకాలం, యాసంగి పంటలు చేతికి వచ్చిన సమయంలో కొనుగోలు కేంద్రం కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క గ్రామాల కొనుగోలు కేంద్రాల వారిని బతిమాలి, సబ్‌సెంటర్ ఏర్పాటు చేయించి ధాన్యాన్ని అమ్ముకుంటున్నామని, గత రెండేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందని రైతులు పేర్కొన్నారు. తమ గ్రామానికి పీఏసీఎస్, ఐకేపీ లేదా ఇతర కొనుగోలు కేంద్రం మంజూరు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ తహసీల్దార్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు పట్టుబట్టారు. దీంతో మండల కేంద్రం నుంచి నిర్మల్‌కు, నిర్మల్ నుంచి మండల కేంద్రానికి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై మాలిక్ రెహమాన్ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతులు హామీ కోరడంతో ఎస్సై తహసీల్దార్ జానకితో ఫోన్లో మాట్లాడారు. రైతులతో సంభాషించేలా చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ జానకి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
తానూరు: భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా హాజరై మాట్లాడారు. వచ్చే నెలలో రెవెన్యూ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానూరు, ఎల్వి, హిప్నెల్లి, కోలూరు, దౌలతాబాద్ గ్రామాల్లో గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువ నిర్మాణానికి ఒక్కో రైతు వద్ద ఎకరం భూమి తీసుకుని మిగతా భూమిని కూడా హోల్డ్‌లో పెట్టగా ఐదేళ్లుగా వివరాలు ఆన్లైన్లో చూపెట్టడం లేదని వాపోయారు. ఐదేళ్లుగా రైతుబంధు, రుణమాఫీ వర్తించడం లేదని రైతులు కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందర్రావ్ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ్‌రావ్ పటేల్, తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో నసీరొద్దీన్, సిబ్బంది ఉన్నారు. భైంసా మండలం వానల్‌పాడ్‌లో.. భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ రైతువేదికలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంలో భాగంగా సాదాబైనామ ప్రక్రియను మళ్లీ అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు నిర్దిష్ట గడువు విధించామని తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
వెళ్లొద్దు టీచర్..
మామడ: ఆ ఉపాధ్యాయురాలు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచారు. మంచి బోధనతో విద్యార్థులు, గ్రామస్తులకు దగ్గరయ్యారు. గ్రామస్తులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్యను 10నుంచి 35కు పెంచారు. ఆమె బోధన తీరుతో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. చివరికి ఆమె బదిలీ కాగా, వారంతా తట్టుకోలేకపోయారు. వివరాలు.. మండలంలోని చెరువుముందుతండా ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు సుప్రియ అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యా రు. బుధవారం విధుల నుంచి రిలీవ్ కాగా, పాఠశాలలో పోషకుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ కు బోధించిన టీచర్ బదిలీపై వెళ్తుండడాన్ని తట్టుకోలేని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే పాఠశాలలో ఉండి తమకు బోధించాలని వేడుకున్నారు. చివరికి వారికి ధైర్యం చెప్పి, బాగా చదువుకోవాలని సూచించిన ఉపాధ్యాయురాలు సుప్రియ అంతే బాధతో పాఠశాలను వీడారు. -
‘బీసీ కులాల అభివృద్ధికి కృషి చేద్దాం’
నిర్మల్‌చైన్‌గేట్: బీసీ కులాల అభివృద్ధికి కృషి చే ద్దామని ఎంసీ లింగన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం జిల్లా బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మ హాత్మా జ్యోతీబా పూలె, సావిత్రీబాయి పూలె దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం, బీసీ భవన్ ని ర్మాణానికి స్థల సేకరణ, బీసీల ఆర్థిక, సామాజి క, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ లింగన్న, ప్రధాన కార్యదర్శిగా అమరవేణి నర్సాగౌడ్, సహాధ్యక్షులుగా అనుముల భాస్కర్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఈసవేణి మనోజ్‌యాదవ్, కోశాధికారిగా భూసారపు గంగాధర్, అదనపు కార్యదర్శిగా యాటకారి సాయన్న, ఉ పాధ్యక్షులుగా గణేశ్, వెంకటి, ప్రభాకర్, శ్రీనివా స్, రాజేశ్వర్, కార్యదర్శులుగా నరేందర్, సాయి, కిషన్, గణేశ్, రమేశ్, న్యాయ సలహాదారులుగా రాజశేఖర్, అర్చన, రమణగౌడ్, మీడియా కార్యదర్శిగా పోశెట్టి, సంయుక్త కార్యదర్శులుగా నర్సయ్య, రాజేందర్‌గౌడ్, శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా ఆర్.శ్రీధర్, కే శ్రీధర్, మరో 20 మందిని కార్యవర్గ, గౌరవ సలహా సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. -
పట్టుదలతో లక్ష్యం చేరుకోవాలి
భైంసాటౌన్: విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పట్టుదలతో లక్ష్యం చేరుకోవాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించా రు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని పలు వురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఇటీవల ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను ఆమె అభినందించారు. భవిష్యత్‌లో ఉత్తమ ర్యాంకులతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐలు నైలు, గోపీనాథ్, మల్లేశ్, ఎస్సైలు శంకర్, అశోక్, రవీందర్ పడ్వాల్, గౌసొద్దీన్, భరోసా సెంటర్ సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
నిర్మల్‌టౌన్/నిర్మల్ చైన్‌గేట్: జిల్లాకేంద్రంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ ఆలయంలో రాధామురళీకృష్ణ విగ్రహాల పునఃప్రతిష్ఠాపనోత్సవా లు కొనసాగుతున్నాయి. బుధవారం పూజలు, అభిషేకాలు, అర్చన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై ధ్వజస్తంభానికి పూజలు చేశా రు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐకేరెడ్డిని స త్కరించారు. ఐకే రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, పాకాల రాంచందర్, శ్రీకాంత్‌యాదవ్ తదితరులున్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కూడా హాజరై పూజలు చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, గండ్రత్ ఈశ్వర్, నాందేడపు చిన్ను తదితరులున్నారు. -
నిర్మల్
వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడిగాలి వీస్తుంది. ఆకాశం ఉదయం, సాయంత్రం వేళల్లో పాక్షికంగా మేఘావృతమవుతుంది. అమరులకు నివాళిదళారులకు అమ్మి నష్టపోవద్దు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ సూ చించారు. పలు గ్రామాల్లో వరి, జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 11లోu గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025బాధ్యతల స్వీకరణ నిర్మల్‌టౌన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శ్రీవాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా జడ్జిగా పనిచేసిన కర్ణ కుమార్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. సిటీ సివిల్ కోర్టులో విధులు నిర్వహించిన శ్రీవాణి బదిలీపై నిర్మల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని వివిధ సంఘాలు, పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి, మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్/ఖానాపూర్ నస్పూర్‌లో ఏసీబీ ఆఫీస్ ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న ఏసీబీ కార్యాలయానికి అనుబంధంగా నస్పూర్లోనూ మరొకటి త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10లోu న్యూస్‌రీల్ -
అక్కాబావ వద్దకే దేవి
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ కస్తూ ర్బా విద్యాలయంలో నాగరాజు దేవి ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. ఆమె సొంతూరు ఆ దిలాబాద్ కాగా దేవికి మూడేళ్లున్నప్పుడే ఆమె తండ్రి రవి గుండెపోటుతో, మూడేళ్ల క్రితం తల్లి ఊర్మిల అనా రోగ్యంతో మృతి చెందారు. దేవికి ఇద్దరు అక్కలున్నారు. చిన్నక్క హైదరాబాద్‌లో పనిచేస్తోంది. పెద్దక్క, బావ లోహిత–వినోద్ దంపతులు ఖానాపూర్‌లో నివాసముంటున్నా రు. వేసవి సెలవులు కావడంతో దేవిని కేజీబీవీ స్పెషలాఫీసర్ సునీతారాణి ఆమె బావ వినోద్ ద్వారా వాళ్లింటికి పంపించారు. -
‘అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే..’
నిర్మల్‌చైన్‌గేట్: అంబేడ్కను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్సేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో బుధవారం సెమినార్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేడ్కర్‌కు చరిత్రలో స ముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందని తెలిపా రు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు, దళిత గిరిజన బిడ్డలకు రాష్ట్రపతి పదవులు దక్కేలా చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, మహిళలకు కేబినెట్లో ఎక్కువ స్థానాలు కల్పించి అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తోందని చెప్పారు. నాయకులు భస్వపురం లక్ష్మీనర్సయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, రాచకొండ సాగర్, అలివేలు మంగ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సారంగపూర్: గురుకులాలు, వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం రుచికరంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షే మ శాఖ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి నేరుగా వంటగదికి వెళ్లి విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించారు. సరుకుల నిల్వ గది, కూరగాయలు, ఇతర సామగ్రి నాణ్యత ను తనిఖీ చేశారు. వంట సిబ్బంది, కేటరింగ్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోజువారీ మెనూ, ఆహార తయారీ విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. భోజన సమయంలో విద్యార్థులతో సంభాషిస్తూ, ఆ రోజు మెనూ గురించి అడిగి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ సంగీతతో చర్చించిన ఆయన, గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల సంఖ్య, వారి చదువు, ఇతర సౌకర్యాల గురించి వివరాలు సేకరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సరైన విద్యా వాతావరణం అందేలా చూడాలని, భద్రతా విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ తనిఖీలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, ఫుడ్ కమిషన్ కమిటీ సభ్యులు వి.ఆనంద్, ఆర్.శారద, ఎం.భారతి, బి.జ్యోతి, ఎంఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రి తనిఖీ...నిర్మల్‌చైన్‌గేట్:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని గోలి శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అవసరమన్నారు. ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి -
అడవులను సంరక్షించాలి
● పీసీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి మామడ: అడవులను సంరక్షిస్తూ పర్యావరణా న్ని కాపాడుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్స్వరేటివ్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. దిమ్మదుర్తి అటవీ క్షేత్రంలోని తుర్కం, యెంగన్న చెరువులను మంగళవారం పరిశీ లించారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మొక్క నాటారు. చెరువు సమీపంలో ప్రత్యేక కెమెరాలతో పక్షులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎకోటూరిజం, బర్డ్స్వాచ్ కోసం సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ చెరువుల వద్దకు వస్తున్నందున ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, సందర్శకులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అటవీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీసీఎఫ్ శర్వాణన్, డీఎఫ్‌వో నాగినిభాను, ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఎస్‌వోలు అన్నపూర్ణ, శ్రీనివాస్ ఉన్నారు. -
నిర్మల్
కనకం.. ఇక కొనలేం.. పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో ‘లక్ష’ణంగా కొండెక్కి కూర్చుంది. తొలిసారిగా తులం బంగారం లక్ష మార్కు దాటేసింది.పుస్తకనేస్తం..జీవన సర్వస్వం జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. ఎంత చదివితే అంత విజ్ఞానవంతుల్ని చేయగలి గే ఏకైక శక్తి పుస్తకానికే ఉంది. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా కథనం.బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 202510లోu ఉర్దూ మీడియంలో భైంసా విద్యార్థినుల సత్తా..● ఇద్దరికి స్టేట్ ఫస్ట్.. ● మరో రెండు సెకండ్, థర్డ్ ర్యాంకులు.. భైంసాటౌన్: భైంసాలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో స్టేట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఫస్టియర్‌లోనూ స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించారు. ఎంపీసీ సెకండియర్‌లో తుబా తహరీన్ 979, బైపీసీలో అఫీరా తాజీన్ 984 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఫస్టియర్ విద్యార్థిని నిషత్ తరన్నుమ్ 461(ఎంపీసీ)మార్కులతో ఫస్టియర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. తన్జీలా ఫిర్దోస్ 458 మార్కులతో రెండో ర్యాంకు, అయేషా ఖానమ్ 456 మార్కులతో మూడోర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ శివరంజని తెలిపారు.పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ పథకంలో లబ్ధిదా రుల ఎంపిక పారదర్శకంగా జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లు, అధికారుల ను ఆదేశించారు. సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలి పారు. అనర్హులను తొలగించాలని, సామగ్రి ధరలు పెరగకుండా చూడాలన్నారు. పట్టణా ల్లో జీ+3 మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. భూభారతి చట్ట అమలుకు వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల వివరాలు, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని వివరించారు. క్రీడా శిబిరాల పోస్టర్ ఆవిష్కరణ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందేందుకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలా ష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్–2025 పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో లు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, డీఈవో రామారావు, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ రూరల్: ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో సెకండ్ ఇయర్లో జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో నిలువగా, ఫస్ట్ ఇయర్లో 16వ స్థానం సాధించింది. మొత్తంగా ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించారు. దాదాపు నెల రోజుల తర్వాత ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 58.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ విద్యార్థులు 70.57 శాతం పాసయ్యారు. గతేడాది 68 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 70.57% ఉత్తీర్ణత.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సెకండియర్‌లో జిల్లా 70.57% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5,211 మంది విద్యార్థులకు 3,693 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,342 మంది బాలురకు 1,371 మంది(58.54%) పాస్ అయ్యారు. 2,869 మంది బాలురకు 2,322 మంది (80.93%) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. ● సెకండ్ ఇయర్ ఒకేషనల్ కేటగిరీలో మొత్తం 852 మంది విద్యార్థులకు 575 మంది(67.49%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 436 మందికిగాను, 226 (51.83%)పాస్ అయ్యారు. 815 మంది బాలికలకు 349 మంది (83.89%) ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఇలా.... ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇదే స్థానం దక్కింది. మొత్తం 5,483 మందికి 3,223 మంది (58.78%) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,421 మంది బాలురకు 1,054 మంది(43.54%) పాసయ్యారు. 3,062 మంది బాలికలకు 2,169 మంది (70.84%) పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 1,088 మంది విద్యార్థులకు 530 మంది(48.71 %)పాస్ అయ్యారు. ఇందులో 575 మంది బాలురకు 192 మంది (33.39%)పాస్ అయ్యారు. 513 మంది బాలికలకు గాను 338 మంది (65.89%) ఉత్తీర్ణులయ్యారు. ● ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ కేటగిరిలో 48.71% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో మొత్తం 1,088 మంది విద్యార్థులకు 530 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 575 మందికి 192 మంది (33.39%)పాస్ అయ్యారు. బాలికలు 513 మందికి గాను 338 మంది(65.89%) పాస్ అయ్యారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఇంటర్ విద్యార్థులకు మే నెల 22 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం బుధవారం నుంచి ఈనెల 30లోగా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు 100 చొప్పున, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ .600 చొప్పున ఈనెల 30 వరకు ఆన్లైన్లో చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు షార్ట్ మెమోలు ఇంటర్మీడియట్ విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు. దిలావర్పూర్ కేజీబీవీ విద్యార్థుల విజయ సంకేతంన్యూస్రీల్ ఇంటర్ ఫలితాల్లో సత్తా రాష్ట్రస్థాయిలో జిల్లాకు 10వ స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలునిషత్ తరనుమ్ (ఎంపీసీ/461) 6 కేజీబీవీల్లో 100% రిజల్ట్ ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 12 కేజీబీవీలు ఉండగా, 6 కేజీబీవీల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలలో సెకండియర్‌లో 96 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఫస్ట్ ఇయర్లో 87.42% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నర్సాపూర్(జి), దిలావర్పూర్, దస్తురాబాద్, జామ్, లక్ష్మణచాంద, మామడ కళాశాల విద్యార్థులు 100% పాసయ్యారు. నర్సాపూర్(జి), దిలావర్పూర్ కేజీబీవీ కళాశాలలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులై సత్తా చాటారు. నర్సాపూర్ (జి) కళాశాల విద్యార్థిని అనూష 1000 మార్కులకు 990 సాధించి సత్తా చాటింది. జిల్లాలో అత్యల్పంగా భైంసా కేజీబీవీలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 77 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఫస్ట్ ఇయర్లో 32 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. -
భూభారతితో భూములపై హక్కులు
దస్తురాబాద్/పెంబి: భూసమస్యల పరిష్కారం, రైతులకు భూమిపై హక్కుల కల్పన కోసం భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. దస్తురాబాద్, పెంబిలోని రైతు వేదికల్లో మంగళవారం వేర్వేరుగా భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూదార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. నూతన చట్టంలో తహసీల్దార్ నుంచి సీసీఎల్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రతీ రైతుకు భూదార్ కార్డు ఇస్తామన్నారు. మండలంలో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన 762 భూముల దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని వెల్ల డించారు. గ్రామ పంచాయతీలలో రెవెన్యూ రికార్డులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. 470 అసైన్డ్ భూముల సర్వే సమస్యలపై రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రత్యేక సర్వేయర్లతో తిరిగి సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెంబి మండలంలో నెలకొన్న భూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దస్తురాబాద్ మండలం గోడిసీర్యాల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గోడిసీర్యాల గ్రామస్తులు కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకురావటంతో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని, రైతులు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ సర్ఫరాజ్ నవాజ్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్‌గౌడ్, ఎంపీడీవో రమేశ్, డిప్యూటీ తహసీల్దార్లు యాదవరావ్, లక్ష్మణ్, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, సహకారసంఘం చైర్మన్ రామడుగు శైలజ, ఆర్ఐలు ఆర్తి, రచన, ఏవో మానస, ఏఈవో తిరుపతి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ దస్తురాబాద్, పెంబిలో అవగాహన -
వాతావరణం
ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి భానుడి భగభగలు మొదలవుతాయి. మధ్యాహ్నం వేడి ఉక్కపోత అధికంగా ఉంటుంది. మరింత భగభగ..!● జిల్లాలో 44.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలుభైంసాటౌన్: జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం సూరీడు సుర్రుమంటే, మంగళవారం మరింతగా మండిపోయాడు. ఐదురోజులుగా ఆరెంజ్ జోన్లోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ రెడ్‌జోన్‌కు చేరువవుతోంది. దస్తురాబాద్ మండలకేంద్రంలో మంగళవారం 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పగటివేళ బయటికి వెళ్లాలంటే నిప్పులకొలిమిని తలపిస్తోంది. మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు.. ప్రాంతం ఉష్ణోగ్రత దస్తురాబాద్ 44.5 అక్కాపూర్(నిర్మల్ రూరల్) 44.3 నర్సాపూర్(జి) 44.3 ఖానాపూర్ 44.3 భైంసా 44.2 కడెంపెద్దూర్ 44.2 తాండ్ర(మామడ) 44.1 తానూర్ 44.1 పొన్కల్(మామడ) 44.1 పాత ఎల్లాపూర్(ఖానాపూర్) 44.1 పెంబి 44.0 లింగాపూర్(కడెం) 44.0 -
ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్‌టౌన్: పోలీసులు ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల స్థితిగతులను పోలీస్ స్టేషన్‌వారీగా సమీక్షించి, గంజాయి, రౌడీ షీట్లు, ఎస్సీ/ఎస్టీ, పోక్సో, మహిళలపై నేరాల కేసులను వీలైనంత త్వరగా పూ ర్తి చేయాలన్నారు. అవసరమైతే న్యాయమూర్తులను కలిసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఏఎస్పీలు, సీఐలు గ్రామాలను సందర్శించి, నైట్ పెట్రోలింగ్‌తో నేరాల సమాచారం ముందస్తుగా సేకరించాలని తెలిపారు. గంజాయి రవాణా, బెట్టింగ్ యాప్‌ల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు స్పెషల్ టీమ్‌లు, సీసీ కెమెరాలతో నిఘా బలోపేతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద హాట్స్పాట్లలో మార్పులు, డ్రంక్‌అండ్‌డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, సీఐలు ప్రవీణ్‌కుమార్, గోపీనాథ్, గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ సీఎమ్మార్ చెల్లించాలి భైంసాటౌన్: ఆయా సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎమ్మార్ బకాయిలు మిల్లర్లు త్వరగా చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి డివిజన్ పరిధిలోని రైస్‌మిల్లర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. గత సీజన్లకు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన ధాన్యం మరాడించి, బియ్యం అప్పగించాలన్నారు. అప్పగించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. రికార్డు రూం, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి డీసీఎస్వో, ఆర్డీవో కోమల్‌రెడ్డి, సివిల్ సస్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
పాతికేళ్ల గులాబీ
● ఉమ్మడి జిల్లాలో వికసిస్తూ.. ముళ్లను సైతం ముద్దాడుతూ ● తొలి ఎన్నికల నుంచే సత్తా చాటిన ఉద్యమ పార్టీ ● ‘తెలంగాణ’ ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రభంజనం ● మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రతికూలం ● కేడర్‌పైనే కీలక నేతల ధీమా ● రజతోత్సవ వేళ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం ● బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఆసక్తికరంకలిసిరాని కాలం.. అయితే 2023 ఎన్నికలు బీఆర్ఎస్కు కలిసి రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కేవలం బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి గెలుపొందారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పరంగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గులాబీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్ నేత ఎంపీలుగా మారారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా వల్లకొండ శోభారాణి సత్యనారాయణ గౌడ్, ఆ తర్వాత రాథోడ్ జనార్దన్ వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగు జెడ్పీలు ఏర్పడగా, ఈ నాలుగింటిలోనూ బీఆర్ఎస్ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుకావడం, ఈ క్రమంలో పార్టీని పలువురు నేతలు వీడినా కార్యకర్తలు మాత్రం వెన్నంటి ఉన్నారనే ధీమా గులాబీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్‌లో భారీ మహాసభకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ కేడర్ సన్నద్ధమవుతోంది. 25 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో రాష్ట్రంలో మాదిరే జిల్లాలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ రెండుసార్లు అధికా రంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ పటిష్టంగా రూపొందింది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. పలువురు నేతలు పార్టీని వీడినా పునాది లాంటి కార్యకర్తలు వెన్నంటే ఉన్నారన్న అభిప్రాయం నాయకత్వంలో ధీమా నింపుతోంది. పార్టీ రజతోత్సవం తర్వాత మరింత ఉత్సాహం చోటు చేసుకోనుందని, రానున్న రోజుల్లో కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు నర్మగర్భంతో పేర్కొంటున్నారు. మొదటి ఎన్నికలతోనే ప్రభంజనం.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణలో 26 సీట్లలో గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముథోల్ నుంచి నారాయణరావు పటేల్, బోథ్ నుంచి సోయం బాపూరావు, ఖానాపూర్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్ గెలు పొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాడు ఆదిలాబా ద్ ఎంపీ జనరల్ స్థానంగా ఉండగా, అప్పట్లో గులాబీ పార్టీ నుంచి టి.మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. ఈ విధంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. అప్పట్లోనే అసమ్మతి వర్గం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే అప్పట్లో ఎంపీ మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్ కేసీఆర్‌కు మద్దతుగా రాజీనామా చేయగా, బోథ్ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు, ముథోల్ నుంచి గెలుపొందిన నారాయణ రావు పటేల్ అసమ్మతివర్గంగా నిలిచారు. దీంతో మొదటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఇటు జిల్లాలో నూ అసమ్మతి కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్‌లో తిరిగి పోటీ చేసిన గోవింద్ నాయక్ ఇద్దరూ ఓటమి చెందారు. మళ్లీ పుంజుకున్న వైనం.. 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు, మంచిర్యాల నుంచి గడ్డం అరవింద్‌రెడ్డి, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య గెలుపొందారు. దీంతో పార్టీ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సబ్బండ వర్గాలు కలిసి రావడంతో బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజీ నామా చేయగా, తిరిగి ఉప ఎన్నికల్లో ఆ మూడు స్థానాల నుంచి గెలుపొందింది. ఈ విధంగా పార్టీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. రాజకీయ సుస్థిరత సాధించింది. 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న మధ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరగగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా మారింది. ఇక వెనుదిరిగి చూడని వైనం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరగడంతో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలంతా బీఆర్ఎస్లోకి వలస వచ్చారు. దీంతో పార్టీ బలంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీని సైతం కై వసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఏకంగా ఏడు స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్, సిర్పూర్లో ఐకేరెడ్డి, కోనప్పలు బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో ముథోల్ నుంచి ఏకై క స్థానం గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా ఆ తర్వాత కాలంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో పదికి పది స్థానాలు బీఆర్ఎస్ హస్తగతం అయ్యాయి. ఈ విధంగా ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ప్రత్యేక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. -
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనిస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలు పరిష్కరించాలని 61 అర్జీలు, 4 టెలీ కాల్స్ వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపర్చాలని తెలిపారు. దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేయాలని సూచించారు. నాలుగు టెలీ కాల్స్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల కోసం టెలిఫోన్ ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు ఫోన్ చేసి సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి ప్రజావాణిలో నమోదుకు సంబంధించి రశీదును సంబంధిత వ్యక్తులకు వాట్సప్ ద్వారా అందించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుల బహిష్కరణ నుంచి విముక్తి కలిగించాలి మేము ఖానాపూర్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన వడ్డెర కులస్తులం. గతంలో వీడీసీ సభ్యులు చెప్పిన మాట వినలేదని సామాజిక బహిష్కరణ పేరుతో మా కుటుంబాన్ని ఐదేళ్లుగా వేధిస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల, కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సామాజిక బహిష్కరణ ఉందని దుకాణదారు సరకులు ఇవ్వడం లేదు, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డును కూడా లాక్కున్నారు. స్వయం సహాయక సంఘాల గ్రూపులో తీసుకున్న రుణానికి డబ్బులు చెల్లించినా తీసుకోవడం లేదు. మా కుటుంబంతో ఎవరైనా సత్సంబంధాలు పెట్టుకుంటే వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించారు. – కుంచపు విజయ, ఎల్లయ్య, రాంరెడ్డిపల్లిడీఎంఈ ఉద్యోగులుగా పరిగణించాలి కొన్నేళ్లుగా జిల్లా ఆస్పత్రిలో వివిధ విభాగాలలో మేము విధులు నిర్వహించాం. ఇటీవల జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంతో జిల్లా ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. డీఎంఈ పరిధిలో ఉన్న ఈ ఆసుపత్రిలో 52 పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే మేము విధులు నిర్వహిస్తున్నందున మాకు వెయిటేజీ మార్కులతోపాటు మొదటి ప్రాధాన్యత ఇస్తానని గతంలో మాట ఇచ్చారు. కానీ ఇటీవల నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ వేరే వారికి ఉద్యోగాలు కల్పించారు. అధికారులు స్పందించి మా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మమ్మల్ని డీఎంఈలో కొనసాగేలా చూడాలి. – ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రజావాణికి 61 అర్జీలు, 4 ఫోన్ కాల్స్ బీసీ భవన్ ఏర్పాటు చేయాలి నిర్మల్ జిల్లాలో అత్యధిక జనాభా బీసీలే. జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు స్థలంతోపాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలి. దీంతోపాటు మహత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి. – మనోజ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు సర్వే నంబర్ ఆన్లైన్లో చూపించడం లేదు.. మాది ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి. నాకు గ్రామ శివారులో 271 సర్వే నంబర్లో ఎకరం 6 గుంటల భూమి ఉంది. మిస్సింగ్ సర్వే నంబర్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా సమస్యను పరిష్కరించి నా భూమికి సంబంధించి కొత్త పాస్ బుక్ అందజేయ గలరు. – బర్లపాట రాజేశ్వర్, బాదన్‌కుర్తి -
మండే @ 43.9
● ఈ సీజన్లో ఇదే గరిష్ట ఉష్ణోగ్రత ● అంతటా 40 డిగ్రీలపైనే నమోదు.. ● ఆరెంజ్ అలర్ట్ జారీ భైంసాటౌన్: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రతీరోజు 42–43 డిగ్రీలు నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే వేడి కాస్త తగ్గుతోంది. ఇక, సోమవారం రాష్ట్రంలోనే అధికంగా జిల్లాలోని నర్సాపూర్(జి)లో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో కనిష్టంగా 41 డిగ్రీలు నమోదైంది. అన్ని మండలాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దీంతో మండే రోజున జిల్లా పూర్తిగా ఆరెంజ్ (40–45డిగ్రీలు) జోన్లోకి వెళ్లిపోయింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి... జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం నెత్తిన టోపీలు, రుమాలులు, మహిళలు స్కార్ఫ్‌లను ధరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లలో, బస్సుల్లో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఉన్నా ఎండవేడితో వేడిగాలి వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బస్టాండ్లలో చల్లటి నీటి వసతి సైతం లేకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఇక, రోడ్ల వెంబడి రిక్వెస్ట్ బస్టాప్‌లు, కూడళ్ల వద్ద సరైన నీడ వసతి లేక ప్రయాణికులు ఎండలోనే నిరీక్షిస్తున్నారు. సోమవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు.. మండలం ఉష్ణోగ్రత నర్సాపూర్(జి) 43.9 పెంబి 43.8 కడెం(పెద్దూర్) 43.7 భైంసా పట్టణం 43.5 కుభీర్ 43.5 తాండ్ర(మామడ) 43.4 తానూర్ 43.4 అక్కాపూర్ (నిర్మల్ రూరల్) 43.3 దస్తురాబాద్ 43.2 బుట్టాపూర్ (దస్తురాబాద్) 43.2 బాసర 43.1 ఖానాపూర్ 43.1 -
రైతులకు ప్రత్యేక గుర్తింపు
నిర్మల్కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు.8లోu మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తప్పకుండా చేయించుకోవాలి పైఅధికారుల ఆదేశాలమేరకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా ఏవోలకు ఏఈవోలకు శిక్షణ పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌లో రైతులు తమ వివరాలు కచ్చితంగా నమోదు చేయించుకోవాలి. 2025 జనవరి 1 కంటే ముందు ధరణిలో ఉన్న సమాచారం ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంది. రైతు ఆధార్ కార్డుకు తప్పనిసరిగా మొబైల్ నంబర్ లింకు ఉండాలి. ఆధార్ కార్డులో తెలుగు, ఇంగ్లిష్‌లో ఉన్న పేరు ఒకేలా ఉండాలి లేకపోతే యాప్ స్వీకరించదు. – అంజి ప్రసాద్, డీఏవో నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్‌తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈమేరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ‘ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఈ ప్రక్రియను అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 15న జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులు హరికృష్ణ, విద్యాసాగర్ పాల్గొనగా, ఏప్రిల్ 19న నిర్మల్ అర్బన్ రైతు వేదికలో ఏఈవోలు, ఏవోలకు శిక్షణ అందించారు. కార్డులో రైతు వివరాలు.. ఈ గుర్తింపు కార్డు రైతుల సమగ్ర వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తుంది. 11 అంకెల సంఖ్యతో రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, సారవంతం, పంటల అనుకూలత, బ్యాంకు రుణ అర్హత, సబ్సిడీలు, పీఎం కిసాన్ నిధులు, పంట నష్ట పరిహారం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇకపై రుణాల కోసం పట్టా పాస్‌బుక్, ఇతర పత్రాల అవసరం ఉండదు. కేవలం ఈ సంఖ్య చెబితే సరిపోతుంది. ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తారు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో నమోదు కోసం వెళ్లాలి. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత, రైతు ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా 11 అంకెల సంఖ్య కేటాయిస్తారు. ప్రత్యేక యాప్‌లో నమోదు.. రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు ప్రత్యేక కోడ్ ఉండాలనే ఉద్దేశంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ పథకం పీఎం కిసాన్, పంట బీమా, యాంత్రీకరణ సబ్సిడీలను సులభతరం చేస్తుంది. రైతులు సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్, వేదికపై అదనపు కలెక్టర్, ఆర్డీవో తదితరులు.. న్యూస్‌రీల్ ఫార్మర్ రిజిస్ట్రీతో కేంద్రం కొత్త పథకం ప్రత్యేక కార్టుల జారీకి చర్యలు ఆధార్ తరహాలో 11 అంకెల సాగుదారుల సంఖ్య ఇప్పటికే అధికారులకు శిక్షణ -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: సరదాగా ఈతకు వెళ్లి న విద్యార్థి ప్రాణా లు కోల్పోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్‌కు చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రాంచరణ్(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల ముగిసిన తరువాత గ్రామ సమీపంలోని వాగుపై గల చెక్‌డ్యామ్ వద్దకు ఈతకు వెళ్లాడు. అదే సమయంలో సరస్వతి కాలువ ద్వారా సదర్మాట్ కోసం వాగులోకి ఎక్కువ మోతాదులో నీటిని వదలడంతో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు చెక్‌డ్యామ్ వద్ద వెతుకగా రాంచరణ్ ప్యాంటు, షర్ట్, పాదరక్షలు లభించాయి. ఆదివారం గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది వెతుకగా మృతదేహం లభించింది. ‘పద్నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా లడ్డూ.. నీళ్లలో నీవు ఎలా నిదురపోయావురా..నీవు లేకుండా మేము ఎలా బతకాలిరా.. నన్నుకూడా నీతో తీసుకుపోరా.. అంటూ మృతుని తల్లి కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. -
కారాదు విషాదం
● నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు ● తల్లిదండ్రులకు తీరని శోకం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు ఈత సరదా.. లక్ష్మణచాంద: ఈతకు వెళ్లడం అంటే ఎవరికై నా సరదాగానే అనిపిస్తుంది. వేసవికాలం వచ్చిదంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో చిన్నాపెద్ద తేడాలేకుండా చెరువులు, వాగులు, స్విమ్మింగ్ పూల్స్‌లో సరదాగా ఈత కొడుతుంటారు. అయితే ఈత సరదా కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తోంది. పలువురి ప్రాణాలు బలిగొంటోంది. నీటిలోకి దిగి ఈతరాక అందులో మునిగి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సరదాగా ఈత కసం చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ● ఈ నెల 18న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లికి చెందిన పూరెళ్ల అశోక్ (20)శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి స్నానా నికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ● ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్‌కు చెందిన ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు ఆడుకుంటూ గ్రామ సమీపంలోని చెరువువద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందారు. ● ఈ ఏడాది మార్చి 4న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన గూడెం సత్యనారాయణ (41) స్నానం చేసేందుకు గోదావరినదికి వెళ్లి ఈతరాక నీటమునిగి మృతి చెందాడు. ● ఈఏడాది మార్చి30న ఆదిలాబాద్ జిల్లా నార్నూ ర్ మండలంలోని గంగాపూర్‌కు చెందిన శంకర్ (20) కెరమెరి మండలంలోని శంకర్ లొద్దికి దైవదర్శనానికి వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులో దిగి నీటమునిగి మృతి చెందాడు. ● ఈ నెల 5న ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని చెరువులో ఈతకు వెళ్లిన పదేళ్లలోపున్న సంజీవ్, రాహుల్ ఈతరాక నీటమునిగి మృతి చెందారు. ● 2020లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్‌షిప్‌కు చెందిన వాసు (13), సతీశ్ (14) గ్రామ శివారులోని వ్యవసాయ కుంటలో ఈతకొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు. ● 2024 నవంబర్ 1న మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నేపల్లికి చెందిన కొండ అరుణ్ కుమార్ (18), దాసరి సాయి (16) సుందరశాల సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. ● 2024 మార్చి 26న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నదిమాబాద్‌కు చెందిన వనస కమలాకర్ (22), ఆలం సాయి (22), ఉప్పుల సంతోష్ (25), ఎల్ముల ప్రవీణ్ (23) హోలీరోజు మిత్రులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి సమీపంలోని వార్ధానదికి వెళ్లారు. లోతుకు వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● చిన్నారులకు నిపుణుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. ● ఈత రానివారు నేరుగా నీటిలో దిగకుండా సేఫ్టీ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. ● ఈత వచ్చినవారు సైతం నీళ్లు ఎంతలోతు ఉన్నాయి? అనేది ముందుగానే గమనించిన తర్వాతే నీటిలోకి దిగాలి. లేదంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ● చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. కావున అందులోని పరిస్థితిని తెలుసుకోకుండా దూకితే ప్రమాదాల బారిన పడుతారు. ● చెరువులు, వాగులు, ఇతర జలాశయాల వద్ద అధికారులు తప్పనిసరిగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● రైతులు వ్యవసాయ బావుల చుట్టూ కంచెను ఏర్పాటు చేసి అందులోకి ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టాలి. అవగాహన లేక.. గ్రామాలలో చెరువులు, కాలువలు, కుంటలు, వాగుల్లోకి ఈతకు వెళ్లినవారు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతోనే లోతులోకి వెళ్లి నీటమునిగి ఊపిరి ఆడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. నేను ఇప్పటి వరకు గోదావరిలో మునిగిన సుమారు వందమంది ప్రాణాలు కాపాడాను. – సాయిలు, గజ ఈతగాడు, గాంధీనగర్ సేఫ్టీ జాకెట్ ధరించాలి ఈతకు వెళ్లే సమయంలో లైట్ సేఫ్టీ జాకెట్ ధరిస్తే ప్రమాదం సంభవించదు. ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకనే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈతకు వెళ్లినప్పుడు ఒకరిద్దరు కాకుండా గుంపుగా స్నానం చేయాలి. ప్రమాదవశాత్తు ఒకరు మునుగుతున్నా మిగిలిన వారు కాపాడవచ్చు. – జింక లక్ష్మీనారాయణ, గజ ఈతగాడు, నిర్మల్ ఓ కంట కనిపెట్టాలి ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. పిల్లలు ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని వేసవి శిబిరాలకు పంపించాలి. లేదంటే ఇంటిపట్టున ఉండే పిల్లలను తల్లిందండ్రులు అనుక్షణం కనిపెడుతూ ఉండాలి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తే తరచూ వాకబు చేయాలి. – పి.సాయన్న, పోషకుడు -
ఆర్కేపీలో రెండు చోరీలు
● 10 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులురామకృష్ణాపూర్: పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో రెండు చోరీల ఘటనలను పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమాన్‌నగర్‌కు చెందిన ఇరుముల్ల శరణ్య ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో కిటికీ పక్కన నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని వ్యక్తి తస్కరించాడు. అదేకాలనీలో బుర్ర రాజేంద్రప్రసాద్ ఫోన్‌ను కూడా కిటికీ నుండే దొంగిలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గోదావరిఖనిలోని కాకతీ యకాలనీకి చెందిన గుంజ ఇమ్మానుయేల్గా గుర్తించారు. మధ్యాహ్నం నిందితుడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఎఫ్టీటీజెడ్ బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న మూడు తులాల గొలుసు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహి ంచిన మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, క్రైంటీమ్ సిబ్బ ందిని ఏసీపీ అభినందించి రివార్డ్‌లు అందజేశారు. రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ జరి గింది. ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం మేరకు ఈనెల 18న గ్రామానికి చెందిన కాల్ల రమ, ఊట్నూరి అంజయ్య, ఊట్నూరి లక్ష్మి, ఊ ట్నూరి విశాల్ ఇళ్లలో చోరీ జరిగింది. కాల్ల రమ ఇంట్లో పావుతులం బంగారు పుస్తెలు, ఊట్నూరి లక్ష్మి ఇంట్లో 18 తులాల వెండి ప ట్ట గొలుసులు అపహరించారు. కాల్ల రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పోలీసులమని చెప్పి చైన్ అపహరణ
లక్ష్మణచాంద: పోలీసులమనిచెప్పి వాహనాన్ని ఆపి మహిళ బంగారు గొలుసు అపహరించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్ గ్రామానికి చెందిన ఇప్ప (కొత్తూర్)రామవ్వ ఆదివారం మధ్యాహ్నం తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు తమ ఇంటిపక్కనున్న భీమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ బయలుదేరింది. కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైకును ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లడం సరికాదని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో సదరు మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు తీసి తన పర్స్‌లో పెట్టుకునే క్రమంలో తాము పెట్టి ఇస్తామని చెప్పి తీసుకుని మళ్లీ పర్సు ఇచ్చారు. అనంతరం వారు అక్కడి నుండి జారుకున్నారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో చైన్‌కు బదులు రాళ్లు కనిపించడంతో లబోదిబోమంది. రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జాతీయ రహదారి పరిశీలన కనకాపూర్ జాతీయ రహదారిని నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన కొత్తూరు రామవ్వ నిర్మల్‌లో తమ బంధువుల పెళ్లి ఉండగా తన ఇంటి పక్కనున్న వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఈ క్రమంలో కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి రామవ్వ ద్వారా వివరాలు సేకరించారు. ఘటనపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్సై మాలిక్ రెహమాన్‌ను ఆదేశించారు. -
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కఉట్నూర్రూరల్: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని వైటీసీలో గిరిజన నిరుద్యోగులకు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ సహకారంతో హెవీ వెహికిల్ మోటార్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 59 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం దేవుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు అందజేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఉట్నూర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాలెవాడ(కె) గ్రామానికి చెందిన కోవ ప్రకాశ్ (47), కనక దత్తు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ వైపు వెళ్తున్న బైక్ పులిమడుగు సమీపంలో మూల మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోవ ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మహిళ..భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారిపై తిమ్మాపూర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మహిళకు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, చేతిపై నేతాజీ అని పచ్చబొట్టు రాసి ఉందని, ఎరుపురంగు చీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే భైంసారూరల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యవాంకిడి: మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చెంద్రి లచ్చుంబాయి చిన్న కుమారుడు చెంద్రి సంతోష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం తల్లితో పాటు అతని భార్య కల్పన మందలించారు. దీంతో మనస్తాపానికి గురై రాత్రి అందరు పడుకున్న సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతుని తల్లి లచ్చుంబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలం పెన్‌గంగ సమీపంలోని డొల్లార గ్రామ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఛాతి భాగంలో కత్తితో పొడవడంతో శరీరంలోని పేగులు బయటకు వచ్చాయన్నారు. ముఖంపై కత్తితో పొడిచి గాయపర్చారన్నారు. ముఖం గుర్తుపట్టకుండా బండ రాయితో కొట్టినట్లు ఉందన్నారు. మృతుడు నలుపు రంగు టీషర్ట్, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, మహారాష్ట్రవాసిగా అనుమానిస్తున్నామన్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని ఎస్సై వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే జైనథ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నిర్మల్‌రూరల్: రాబోయే విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డేనియల్ తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో బెల్లంపల్లిలో 80 సీట్లు (బాలురు), నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) 80 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. -
క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు
● రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆదిలాబాద్: క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, తెలంగాణ క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలు, క్రీడ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను గురించి డీవైఎస్వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని డీఎస్ఏ అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. హాస్టల్, జిమ్‌ను పరిశీలించి, మరిన్ని సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షకుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ అధికారులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్, కిసాన్ కాంగ్రెస్ బేల అధ్యక్షుడు ఘన్‌శ్యామ్, మాజీ సర్పంచ్ రూప్ రావు, రమేశ్ పటేల్, ఠాక్రే సాగర్ పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
బెజ్జూర్: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సుంకరి లక్ష్మి (55) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108లో కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త సుంకరి పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
తొడసం కట్టికి ఘన నివాళి
ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారధ్యం వహించిన తుమ్మగూడకు చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద ఆదివారం ఉదయం గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తుమ్మగూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో రాంనగర్చౌక్ వద్ద ఉన్న స్మారక జెండావద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తొడసం కట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మగూడ గ్రామ పెద్దలు కనక హనుమంత్‌రావ్, సోయం వినోద్, ఆత్రం జల్పత్రావ్, మడావి శేకు, తదితరులు పాల్గొన్నారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలుభైంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ముధోల్ వైపు నుంచి ప్యాసింజర్లతో వస్తున్న ఆటో భైంసాలోని సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తా పడగా, అందులోని ప్రయాణికులు నిజామాబాద్‌కు చెందిన సుశ్మిత, సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలు, చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతోక్షతగాత్రులను ఏరియాస్పత్రికి తరలించారు. -
మాట నిలుపుకొన్న సీఎం
గతంలో అమరవీరులకు నివాళులర్పించాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరా ష్ట్రంలోనైనా పరిస్థితి మారుతుందేమోనని ఆశించాం. కానీ పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించిన రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఇచ్చిన మాట ప్రకారం స్మృతి వనానికి రూ.కోటి కేటాయించారు. 15 మంది అమరవీరుల కుటుంబీకులను గుర్తించి వారిలో కొంత మందికి సాయమందించాం. ఇంకా ఉన్నారని తెలుస్తోంది. వారిని సైతం అధికారికంగా గుర్తించి సాయం అందించేలా చూస్తాం. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే -
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, అర్చ న, హారతి నిర్వహించారు. అనంతరం నిర్వ హించిన పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, ఇస్లాపూర్ హిమాయత్‌నగర్, అప్పారా వుపేట్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధి కసంఖ్యలో వచ్చారు. తలనీలాలు, ఎత్తు బంగారం (బెల్లం), బోనాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. -
● అధికారిక స్మరణం.. ఆదివాసీల సంబురం ● 44 ఏళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో స్వేచ్ఛగా నివాళి ● అమరుల త్యాగాలను స్మరించుకున్న నేతలు ● ఇచ్చిన మాట నెరవేర్చామన్న మంత్రి సీతక్క
అమరవీరుల స్మృతివనంలో ఆదివారం నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, మాజీ ఎంపీలు సోయం బాపూరావ్, వేణుగోపాలాచారి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణతో కలిసి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకా రం అధికారికంగా సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఆదివాసీలకు ఆర్వోఎఫ్ఆర్ ద్వా రా భూహక్కు కల్పించామని పేర్కొన్నారు. ఏజెన్సీ లోని సమస్యలను పరిష్కరించేలా ఐటీడీఏ పీవో, కలెక్టర్, అటవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. స్మృతివనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ఆగస్టు 9న అధికారికంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్రం భుజంగ్‌రావు రచించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పేరిట ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు స్తూపం వద్ద, పరిసర ప్రాంతంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడీలు, పటేళ్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరంఆ సిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ ఖానాపూ ర్ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ తమ పార్టీ కా ర్యకర్తలతో కలిసి స్తూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు వాహనాలు అందజేత అమరవీరుల కుటుంబీకుల్లోని భోరుజ్‌గూడ గ్రా మానికి చెందిన హెరేకుమ్ర సావిత్రీబాయి, అనంతపూర్ గ్రామానికి చెందిన తొడసం హనుమంత్‌రావ్, సిరికొండ మండలంలోని సోన్పల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు, పెందోర్ సీతాబాయిలకు ట్రైకా ర్ పథకం ద్వారా మూడు ట్రాక్టర్లు, ఒక బొలెరో వాహనాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్ మండలాలతో పాటు శ్యాంపూర్ మండల సమాఖ్యలకు రూ.159.62 కోట్ల విలువైన సీ్త్ర నిధి, బ్యాంక్ లింకేజీతో కూడిన రుణాల చెక్కులు అందజేశారు. అమరులారా వందనంభూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం పోరాడి ప్రాణాలను త్యజించిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఆంక్షలు లేకుండా వేడుకలు నిర్వహించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిపుత్రులు 1981 ఏప్రిల్ 20న అమరులైన వీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించారు. తొలుత మండలకేంద్రంలోని గోండ్‌గూడ నుంచి తమ సంప్రదాయ వాయిద్యాల నడుమ స్తూపం వరకు చేరుకున్నారు. స్మారక జెండా వద్ద పూజలు చేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు. – ఇంద్రవెల్లి/కై లాస్‌నగర్ -
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవం
సారంగపూర్: మండలంలోని చించోలి (బీ) గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన గంగామాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠానోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై పూజలు చేశారు. ఆయనకు స్థానిక గంగపుత్ర, బెస్త సంఘం నాయకులు స్వాగతం పలికి సన్మానించా రు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉ న్నప్పుడే ఆలయానికి రూ.12లక్షలు మంజూ రు చేయించానని గుర్తు చేశారు. నాయకులు నల్ల వెంకట్రామిరెడ్డి, మాణిక్‌రెడ్డి, అహ్మద్ ముక్త్యార్, మహిపాల్‌రెడ్డి, మాధవరావు, చందు, భూమేశ్, షేక్ షెఫిక్ తదితరులున్నారు. -
చెరువులే ఆదెరువు
సరదా.. కారాదు విషాదం కొద్దిరోజుల్లో వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులు చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోu జిల్లాకేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులుపక్కపక్కనే ఖజానా, జాఫర్ చెరువులునిర్మల్: చుట్టూ ఉన్న చాలా పట్టణాల్లో వేసవి వ చ్చిందంటే చాలు నీటి సమస్యలు మొదలవుతాయి. కానీ.. ఇప్పటికీ నిర్మల్‌కు ఆ పరిస్థితి రాలేదు. పట్ట ణం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులే ఇందుకు కారణం. జిల్లాకేంద్రంలో కొన్ని కొత్త ఏరియాలు మినహాయిస్తే.. ఎక్కడికెళ్లినా 3–4మీటర్ల లోతులో నే భూగర్భజలాలున్నాయి. పలుగురాతి బండలు పర్చుకుని ఉన్నా.. పుష్కలంగా భూగర్భజలాలు ఉన్నాయంటే.. చుట్టూ రీచార్జ్ పాయింట్లలా ఉన్న చెరువులే కారణం. అలాంటి చెరువులను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకూ నీటికష్టాలుండవు. కానీ.. ఇష్టారీతిన కబ్జాలు, నేరుగా డ్రైనేజీ పైపులైన్లు కలపడంతో చాలా చెరువులు పూర్వ వైభవం కోల్పోతున్నాయి. ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో అక్రమార్కులు వాటినీ కనుమరుగు చేసినా.. చేయొచ్చు. చాలా పట్టణాల్లో నీటికష్టం.. ఒక్క కామారెడ్డిలోనే కాదు.. రాష్ట్రంలోనే చాలా జిల్లాకేంద్రాలు, నగరాలు, పట్టణాల ప్రజలు ఎండాకాలం వస్తుందంటేనే ‘అమ్మో..’ అంటున్నారు. వందల మీటర్ల లోతు వేయించిన బోర్లూ ఎత్తిపోతున్నా యి. ఇక రెండుచేతుల్లో బకెట్లు పట్టుకుని, తలపై బిందె ఎత్తుకుని నీళ్లు మోయాల్సిందేనని జనం జంకుతున్నారు. లేదంటే, డబ్బులు పెట్టి ట్యాంకర్లను కొనుక్కోవాలి. మున్సిపల్ ట్యాంకర్ వచ్చేదాకా ఇంట్లో ప్రతీ నీటిబొట్టునూ పొదుపుగా వాడుకోవాల్సిన దుస్థితి. కొన్ని ఊళ్లల్లో నీటికష్టాల కారణంగా అక్కడికి ఆడపిల్లనివ్వడానికీ వెనుకంజ వేసిన సందర్భాలున్నాయి. నిర్మల్ పట్టణంలో మాత్రం ఇప్పటిదాకా ఆ స్థాయిలో నీటికష్టాలు రాలేదు. ౖపైపెనే పాతాళగంగ నిర్మల్‌లోని పాత అర్బన్ తహసీల్ కార్యాలయంలో భూగర్భజలశాఖ వారు ఫిజోమీటర్ ఏర్పాటు చేశా రు. దీని ద్వారా ప్రతినెలా భూగర్భజల నీటిమట్టా లు ఎలా ఉన్నాయో లెక్కలు తీస్తుంటారు. ఈ ఫిజో మీటర్ ప్రకారం జనవరిలో 3.26 మీటర్ల లోతులో నే భూగర్భజలాలన్నాయి. ఫిబ్రవరిలో 4.07 మీట ర్లకు తగ్గాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో ఒకట్రెండు మీటర్ల వరకు తగ్గుతాయన్న అంచనా ఉంది. అయినా.. ఏడెనిమిదిలోపే పాతాళగంగ ఉండటమనేది అరుదైన విషయమే. రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో వందల మీటర్ల లోతుకు వెళ్లినా పాతాళగంగ పలకరించని పరిస్థితులున్నాయి. రీచార్జ్ పాయింట్లుగా మారి.. నిర్మల్‌లో ౖపైపెనే పాతాళ గంగ ‘గొలుసుకట్టు’తో నీటి నిల్వలు కొన్ని ఏరియాల్లో ఎద్దడి షురూ చెరువుల కబ్జానే అసలు సమస్య భవిష్యత్ తరాలకు ఇబ్బందులే..కామారెడ్డి జిల్లాకేంద్రానికి చెందిన ఈ చిత్రం.. అక్కడి నీటికష్టాలకు అద్దం పడుతోంది. వేసవి వస్తోందంటేనే అక్కడ నీటికటకట మొదలవుతుంది. వందల మీటర్ల లోతుకు వేసిన బోర్లూ అడుగంటాయి. ఇక ప్రతీ ఇంటి ముందూ ప్రజలు డ్రమ్ములు, బకెట్లు అన్నీ పెట్టుకుని నీటిట్యాంకర్ వచ్చేదాకా ఎదురుచూస్తుంటారు. ప్రతీ ఇంట్లో సంప్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని నింపుకోవాలంటే రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నీటి కష్టాలు తప్పవు నిర్మల్‌లో ఇప్పటికీ నీటికష్టాలు లేవంటే గొలుసుకట్టు చెరువులే కారణం. అలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే భవిష్యత్‌లో పట్టణంలో నీటికష్టాలు తప్పవు.– కూన శ్రీకాంత్, నిర్మల్ జిల్లాకేంద్రంలో బంగల్ చెరువు, ఖజానాచెరువు, సీతాసాగర్, జాఫర్ చెరువు, బతుకమ్మకుంట, ఇబ్రహీం చెరువు, వెంకటాపూర్ చెరువు, కంచెరోని చెరువు, సిద్ధాపూర్ చెరువు, చిన్నరాంసాగర్, మోతీచెరువు, ధర్మసాగర్, పల్లి చెరువు ఇలా.. చుట్టూ ఒకదానికొకటి గొలుసుకట్టుతో ఉన్నా యి. ఎప్పుడో 400 ఏళ్లక్రితం కాకతీయుల స్ఫూర్తితో నిర్మల్ పాలకులు వీటిని తవ్వించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టణ ప్రజలకు నీటికుండల్లా అండగా ఉంటున్నాయి. నీటికష్టం లేకుండా చూస్తున్నాయి. భూగర్భజలాలకు రీచార్జ్ పాయింట్లుగా గొలుసుకట్టు చెరువులు ఉపయోగపడుతున్నాయి. కాపాడుకోవాలి జిల్లాకేంద్రంలో భూగర్భజలాలు తక్కువ లోతులోనే ఉన్నాయి. ఇక్కడి గొలుసుకట్టు చెరువులు భూగర్భజలాలకు రీచార్జ్ పాయింట్లుగా మారాయి. వీటిని కాపాడుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. – శ్రీనివాస్‌బాబు, ఉపసంచాలకులు, భూగర్భజలశాఖ -
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వేడి గాలులు వీస్తాయి.ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష నిర్మల్ రూరల్: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 721 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 87 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పై జాన్ అహ్మద్, జిల్లా విద్యాధికారి రామారావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్ ఆచారి, ఎంజేపీ విద్యాసంస్థల జిల్లా కన్వీనర్ గీత, పర్యవేక్షకుడు రమణారెడ్డి పరిశీలించారు. లక్ష్మణచాంద: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి మండలంలోని రాచాపూర్ ఎంజేపీ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ ప్రరీక్ష సజా వుగా ముగిసింది. 240 మంది విద్యార్థులకు 221 మంది పరీక్షకు హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు సీఎస్ సాయికృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ రాజు తదితరులున్నారు. -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
నిర్మల్‌టౌన్: చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్ చెరు వు, బత్తీఘడ్, శ్యామ్‌గడ్ తదితర పర్యాటక ప్రాంతాలను ఆదివారం ఆయన సందర్శించా రు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్మల్‌పట్టణంలో చాలా ప్రాంతాలున్నాయని తెలిపా రు. పలు ప్రాంతాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రమేశ్ రెడ్డి వెంట నిర్మల్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థల చైర్మన్లు అర్జుమంద్ అలీ, సత్తు మల్లేశ్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తదితరులున్నారు. -
‘సమావేశాన్ని అడ్డుకుంటాం’
ముధోల్: మండలంలోని కారేగాం గ్రామంలో సో మవారం భూభారతిపై నిర్వహించే అవగాహన సమావేశాన్ని అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపా రు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఏడుగురిని ఎన్నుకున్నట్లు తెలిపారు. శనివారం నిర్వహించిన ఇందిరమ్మ పథకం అవగాహన సదస్సులో కమిటీలోని ఇద్దరు పేర్లకు బదులు కొత్తవారి పేర్లు చేర్చారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ భూభారతి సమావేశానికి హాజరు కానున్న కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించకుంటే సమావేశాన్ని అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
నిర్మల్‌టౌన్: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివా రం బైక్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పోస్టర్లు అతి కించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభా కర్ మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫైరింజన్ వచ్చేదాకా ఎదురుచూడకుండా మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలని చెప్పారు. అనంతరం రిటైర్డయిన ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజలింగం, సిబ్బంది సుభాష్, రమే శ్, హుస్సేన్, పిర్ధస్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల కొనుగోలులో ఇబ్బందులు తలెత్తొద్దు
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్మల్‌చైన్‌గేట్: యాసంగి పంటల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యంలో తరుగు పేరిట ఎలాంటి కోతలు పెట్టొద్దని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నా రు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా, ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను మంత్రికి కలెక్టర్ తెలియజేశారు. నిర్ణీత సమయానికి కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో కోమల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
● పది, ఇంటర్ విద్యార్థులకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు నిర్మల్ రూరల్: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. దీనికోసం అధికా రులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పదో తరగతి పరీక్షల కోసం భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లి జెడ్పీహెచ్ఎస్, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జుమ్మేరాత్‌పేట్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను నియమించారు. 20 విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను కేటాయించారు. పదో తరగతి పరీక్షకు 660 మంది, ఇంటర్ పరీక్షకు 458 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, ఫర్నిచర్, ఫ్యాన్లు, టాయిలెట్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు నిమిషాలకు మించి ఆలస్యంగా వస్తే అనుమతించమని డీఈవో రామారావు తెలిపారు. పరీక్ష రాసే ప్రతీ విద్యార్థి హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. సందేహాలుంటే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం నంబర్ 90599 87730లో సంప్రదించాలని సూచించారు. -
సమయపాలన పాటించకుంటే చర్యలు
● డీఈవో రామారావులక్ష్మణచాంద/సోన్: సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని డీఈవో రామారావు ఉపాధ్యాయులను హెచ్చరించారు. లక్ష్మణచాంద, సోన్ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 23న పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వాలన్నారు. అనంతరం మండలంలోని పార్పెల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రమోద్ అనే ఉపాధ్యాయుడు సమయాని కన్నా ముందుగానే వెళ్లడంతో ఉపాధ్యాయుడి వివరాలు అడిగారు. అనారోగ్యం కారణంగా తన అనుమతితోనే వెళ్లాడని ప్రధానోపాధ్యాయుడు మోహన్ సమాధానం తెలిపారు. రిజిస్టర్లో వివరాలు ఎందుకు లేవని హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాఫ్ మీటింగ్ పెట్టి పాఠశాల అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అదే సముదాయంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సమయానికన్నా ముందు వెళ్లడంతో హెచ్ఎం ముత్తన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడిని వివరణ తీసుకోవాలని సూచించారు. జిల్లాలోనే సోన్ ఉన్నత పాఠశాల మొద టి ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా కొనసాగుతుందని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయబడ్డారని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికను పెంచా లని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో పరమేశ్వర్, హెచ్ఎం ఆరాధన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి
నాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్దరం మీటింగ్‌కు వెళ్లినం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పనిచేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. పింఛన్ కూడా వస్తలేదు. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ గ్రామస్తురాలు -
పని చేయకుంటే పక్కన పెట్టుడే..!
● అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు ● నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి ● త్వరలో అంగన్వాడీలలో ఖాళీల భర్తీ ● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ● ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్రశిశు సంక్షేమ శాఖలపై సమీక్ష ● అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తినిర్మల్చైన్గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవారిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న , పని చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పక్కన పెట్టాలని సూచించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించా రు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా చూడాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని ఫీల్డ్ విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఏఈలు మిషన్ భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు. అంగన్వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణ త్వరలో అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూ డేళ్లలో అంగన్వాడీలకు సొంత భవనాలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు చెక్కులు.. మంత్రి సీతక్క, కలెక్టరేట్‌కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మహిళా పోలీసులు ఏర్పాటు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. తర్వాత మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశా రు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. సమావేశంలో ఎంపీ గోడం నగేష్, నిర్మల్, ఆదిలా బాద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, అసిఫాబా ద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్ పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టర్లు కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారిని నియమించాలి.. మహిళా శిశు సంక్షేమ శాఖకు జిల్లా అధికారి పోస్ట్‌ను భర్తీ చేయాలి. సీడీపీవోలకు జిల్లా అధికారిగా అదనపు బాధ్యతలు కేటాయించడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్దులకు సరైన సేవలు అందడం లేదు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు సంబంధించి ప్రపోజల్ ఎవరిని అడిగి చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 2022లో అగ్రిమెంట్ చేసిన పనులు 2025 నాటికి కూడా పూర్తి కాలేదు. – ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే నీటి సమస్య పరిష్కరించాలి ముధోల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీరు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి కేటాయించిన రూ.కోటి సరిపోవు. వాటిని రూ.3.50 కోట్లకు పెంచాలి. తానూర్, కుభీర్, ముధోల్ మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. 600 మీటర్ల లోతు బోరువేసినా నీరు పడడం లేదు. – రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
అమరం.. స్వేచ్ఛా స్మరణం
సాక్షి, ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మురిసిపోతుంది. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవాని కి సిద్ధమైంది. ఏటా మాదిరిగానే కాకుండా ఈ సారి ఓప్రత్యేకత ఉంది. 43 ఏళ్లుగా నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరవీరులకు నివాళులు అర్పించగా, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సంస్మరణ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మేరకు కొద్ది రోజు లుగా జిల్లా అధికారులే ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. ఫలితంగా ఈ సారి స్వేచ్ఛగా నివాళులు అర్పించవచ్చన్న మురిపెం ఆదివాసీల్లో కనిపిస్తోంది. స్మృతివనంలో కళకళలాడుతున్న స్తూపం .. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే మార్గ మధ్యలో ఇంద్రవెల్లి గ్రామ శివారులో నిలువెత్తుగా దర్శనమిస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ స్తూపం ఆవరణలో అభివృద్ధి మచ్చుకు కనిపించేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి ప్రాంతం, ఆదివాసీల అభ్యున్నతిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలుత ఇక్కడికే విచ్చేశారు. ఆ సమయంలోనే స్తూపం వద్ద అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.కోటి కేటాయించారు. ఆ నిధులతో అక్కడ ఎకరం స్థలంలో అమరవీరుల స్మృతివనం అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈ సారి సంస్మరణ దినోత్సవంను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటనకు నేటితో 44 ఏళ్లవుతుంది. భూమి, భుక్తి, విముక్తితో పాటు స్వయం పరిపాలన కోసం ఆదివాసీలు పోరాటం చేశారు. అటవీ అధికారులు, షావుకార్ల దౌర్జన్యం నశించాలనే డిమాండ్‌తో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి పీపుల్స్‌వార్ మద్దతునిచ్చింది. అప్పట్లో ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతినిచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. విషయం తెలియక ఆదివాసీగూడేల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. అయితే సభాస్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇలా ఘర్షణ వాతావరణంలో పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు ఉద్యమకారులు (15 మంది అధికారికంగా) మృతి చెందారు. కాల్పుల ఘటనలో అమరులైన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి వద్ద 80 అడుగుల స్తూపం నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహణపై నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో ఏళ్ల పాటు ఏప్రిల్ 20 వచ్చిందంటే అక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించేది. స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళనతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి నిర్మించింది. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించింది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అదే రీతిలో ఉండేది. ఈ ఏడాది మాత్రం అలాంటివేమి లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. చివరి దశకు స్మృతి వనం పనులు నాటి అమరుల కుటుంబీకులతో పాటు గాయాలైన వారిని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ సోయం బాపూరావ్ అమరుల కుటుంబీకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెంచారు. స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు రూ.97లక్షల నిధులు కేటా యించారు. చుట్టూ ప్రహరీతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబీకులకు మండలంలోని ముత్నూర్ సమీపంలో గతేడాది ఇళ్ల స్థలాలు కేటాయించి హక్కు పత్రాలు అందించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇటీవల ఆ పనులను ప్రారంభించారు. నేడు అధికారికంగా నివాళులు నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా నిర్వహించనున్న సంస్మరణ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి నివాళులర్పించనున్నారు. మంత్రి చేతుల మీదుగా అమరుల కుటుంబీకులకు ట్రైకార్ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, నాటి ఘటనలో గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాక1981 ఏప్రిల్ 20 జల్.. జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసింది. అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వాల పాలనలో స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కొంతమేర సడలింపు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే సంస్మరణ దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. -
ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం
నిర్మల్‌టౌన్: ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పండరి, నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పూల మొక్క అందజేశారు. బస్సులేని గ్రామాలైన సారంగాపూర్ మండలం జీవిలి, లక్ష్మణచాంద మండలం మాచాపూర్ , నిర్మల్ మండలం మేడిపల్లి గ్రామాలకు బస్సులు నడపాలని ఎమ్మెల్యే సూచించారు. రూట్ సర్వే చేసి ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు. ఆయన వెంట అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ ఉన్నారు. -
శాసీ్త్రయజ్ఞానం పెంపొందించుకోవాలి
● ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ సాహెబ్రావుకుంటాల: విద్యార్థులు శాసీ్త్రయజ్ఞానం పెంపొందించుకుని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ సాహెబ్రావు సూచించారు. కుంటాల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి రహస్యాలను ఛేదించడం, కొత్త విషయాలను కనుగొనడానికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విద్య, విజ్ఞానం, జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని సూచించారు. అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్, మంగళయాన్ మిషన్ల ద్వారా భారతదేశానికి మంచి గుర్తింపు దక్కిందని తెలిపారు. విద్యార్థులు ఆదిశగా వెళ్లాలని కోరా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాసు నవీన్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
పచ్చదనం.. స్వచ్ఛతలో ఆదర్శం
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామ పంచాయతీ పచ్చదనం, స్వచ్ఛతలో జిల్లాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఎండలు తీవ్రమవుతున్నప్పటికీ, ఇక్కడి పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ వనం గ్రామస్తులకు పర్యావరణ సంరక్షణపై ఉన్న అంకితభావాన్ని చాటుతుంది. నర్సరీలో వినూత్నం.. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన పొట్టపెల్లి(కె) నర్సరీ విభిన్నతతో ఆకట్టుకుంటోంది. ఎంపీడీవో రాధ, పంచాయతీ కార్యదర్శి ప్రియాంకరెడ్డి చొరవతో ఈ నర్సరీలో డ్రాగన్ ఫ్రూట్ వంటి అరుదైన మొక్కలను పెంచుతున్నారు. ఈ వినూత్నత గ్రామానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 100% పన్ను వసూళ్లు.. పొట్టపెల్లి(కె) ఆర్థిక క్రమశిక్షణలో మోడల్‌గా నిలిచింది. 327 ఇళ్ల నుంచి రూ.2,26,295 పన్నులు, రూ.11 వేల ఇతర పన్నులతో మొత్తం రూ.2,37,295ను 100% వసూలు చేసింది. ఈ సాధన గ్రామస్తుల సహకారం, పంచాయతీ సమర్థతను ప్రతిబింబిస్తుంది. వ్యర్థాల నిర్వహణలో అగ్రగామి గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్లో కంపోస్ట్ ఎరువుగా మార్చుతున్నారు. ఈ ఎరువును నర్సరీ మొక్కలకు, రైతులకు సరసమైన ధరలకు విక్రయిస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ వ్యర్థ నిర్వహణ విధానం మండలంలో అగ్రస్థానంలో నిలిపింది. స్వచ్ఛత, హరితంలో ముందంజ హరితహారంలో నాటిన మొక్కలు రహదారుల వెంట ఆకుపచ్చని చెట్లుగా గ్రామ సౌందర్యాన్ని పెంచుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలతో పొట్టపెల్లి స్వచ్ఛ గ్రామంగా విరాజిల్లుతోంది. అన్నింటిలో ముందున్న పొట్టపెల్లి(కె) పంచాయతీకి ఉన్నతాధికారుల ప్రశంసలు అన్నింటిలో ముందు.. మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామం ఇంటి పన్నుల వసూలు, స్వచ్ఛ గ్రామంగా పచ్చదనాన్ని పంచే ప్రకృతి వనాన్ని పల్లెక్రీడా మైదానం ప్రత్యేకమైన నర్సరీని ఆహ్లాదం పరిచే రోడ్లను ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకత కలిగి ఉంది. మండలంలో అన్నిటిలో ముందు వరుసలో నిలుస్తుంది. – రాధ, ఎంపీడీవో గ్రామస్తుల సహకారంతో ఉన్నతాధికారుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, పంచాయతీ కార్మికుల సహకారం ఇలా అందరి సహకారంతో అన్నింటిలో ముందు వరుసలో నిలుస్తున్నాం. పంచాయతీకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధంలోనూ గ్రామస్తులు ఆదర్శంగా ఉన్నారు. – ప్రియాంకరెడ్డి, పంచాయతీ కార్యదర్శి -
లైంగిక వేధింపులు నిరోధించాలి
నిర్మల్‌చైన్‌గేట్: బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, హింసను నిరోధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర’ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించరు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల, మహిళల సమస్యలపై శ్రద్ధ చూపకుండా ఉద్యమాలను అణచివేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, సాయిలీల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, ప్రసాద, ఉపాధ్యక్షులు సుజాత, అంగన్వాడీ యూనియన్ నేతలు లలిత, శైలజ, ఆశ యూనియన్ నేతలు సుజాత, చంద్రకళ, వ్యవసా య కార్మిక సంఘం నాయకులు తిరుపతి, నూతన్‌కుమార్, మురళీ మోహన్, గిరిజన సంఘం నాయకులు శంభు, కేవీపీస్ నేత పోశెట్టి పాల్గొన్నారు. -
ప్రేమ్‌సాగర్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
సోన్: మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ ఇటీవల దుబాయ్‌లో హత్యకుగురికాగా, బాధిత కుటుంబాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ప్రేమ్‌సాగర్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రేమ్‌సాగర్ మృతదేహం ఇంటికి తీసుకువచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రావుల రామ్‌నాథ్, బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయకులు హరీశ్‌రెడ్డి, జక్క రాజేశ్వర్, ముత్కపల్లి నరేశ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని ఆదుకుంటాం దుబాయ్‌లో హత్యకు గురైన సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, ప్రసాద్, ప్రేమ్‌కుమార్, స్వామి బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. -
పువ్వు ఇచ్చి.. పలకరించి..
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు డిపో మేనేజర్ పండరి శుక్రవారం గులాబీ పువ్వు ఇచ్చి... ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కీ చైన్లు అందజేశారు. కీ చైన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ సేవలను వివరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ అందిస్తున్న 10 రకాల సేవలు కనబడతాయని పేర్కొన్నారు. ఇందులో ఆర్టీసీ ప్రవేశపెడుతున్న పథకాలు, టికెట్ బుకింగ్స్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కంట్రోలర్లు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. -
నిర్మల్
నిర్మల్ చైన్‌గేట్: ఎండలు ముదురుతున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. భానుడి ప్రతాపంతో జనం ఇబ్బందిపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్. పెరుగుతున్న ఎండలు.. వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తతపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.సాక్షి: వడదెబ్బ లక్షణాలు ఏంటి?డీఎంహెచ్‌వో: శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు లేదా 104 ఫారెన్ హీట్ వరకు పెరగడం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు, మైకం, హృదయ స్పందన పెరగడం, శ్వాసక్రియ రేటు పెరగడం, రక్తపోటు తగ్గడం, మూర్చ మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.సాక్షి: వడదెబ్బ తగిలిన వ్యక్తికి అందించాల్సిన ప్రథమ చికిత్స ఏమిటి?డీఎంహెచ్‌వో: వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి చేర్చాలి. తర్వాత వెన్నుముకపై పడుకోబెట్టి మడమ కింద దిండు ఉంచాలి. దుస్తులను వదులు చేసి గుడ్డను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ లేదా, కూలర్ గాలి తగిలేలా చూడాలి. ప్రథమ చికిత్స చేసిన 30 నిమిషాల తర్వాత పరిస్థితి మెరుగు పడకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వేసవిలో వ్యాపించే వ్యాధులు ఏమిటి?డీఎంహెచ్‌వో: వాతావరణ శాఖ సూచన మేరకు ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రజలందరూ కూడా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, వంటివి ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకోవాలి. ఇక వేసవిలో జలుబు, విరోచనాలు, డయేరియా, చికెన్ ఫాక్స్, మిజిల్స్, గవద బిల్లలు వంటివి సోకే ప్రమాదం ఉంది.సాక్షి: ప్రస్తుత సీజన్లో ఎటువంటి పండ్లు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయ, కర్బుజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, కీరదోస వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లనే ఎక్కువగా తీసుకోవాలి.సాక్షి: ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎండ అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుకు తీసుకెళ్లాలి. తలకు టోపీగానీ, రుమాలు గానీ, ధరించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో పనిచేసే కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి.సాక్షి: వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?డీఎంహెచ్‌వో: ఎవరికై నా వడదెబ్బ తాకవచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.సాక్షి: ఏ సమయంలో బయటకు వెళ్లాలి?డీఎంహెచ్‌వో: వేసవిలో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. తప్పకుండా బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్, చేతి రుమాలు ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.సాక్షి: ఎండాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉ త్తమం. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార జీ ర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్ డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.సాక్షి:ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయా?డీఎంహెచ్‌వో: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీలు, మూడు బస్తీ దవాఖానాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్యారాసెటమాల్, బీకాంప్లెక్స్ టాబ్లెట్లు, యాంటీబయటిక్స్ గోలీలు అందుబాటులో ఉంచాం. జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. -
సమీకృత గురుకులాలేవి?
● ఉమ్మడి జిల్లాలో రెండు మాత్రమే.. ● ముధోల్‌లో ఏర్పాటుకు వినతులు భైంసా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, మంచిర్యాలకు మాత్రమే సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ముధోల్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పేదవారే అధికం. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.11,600 కోట్లతో 58 సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ జాబితా కూడా విడుదల చేసింది. బాసర సరస్వతీ అమ్మవారు కొలువుదీరిన నిర్మ ల్ జిల్లాకు ఒక్కటైనా మంజూరు చేయలేదు. ఒక్కో గురుకులంలో ఇలా..ఒక్కో గురుకులంలో ప్రయోగశాలలు, గ్రంథా లయాలు, మినీ థియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్ చేశారు. ఒక్కో లైబ్రరీలో 5వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డి జిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. 900 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్‌హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతీ డార్మెటరీలో పది బెడ్లు, రెండు బాత్రూమ్లు, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సదుపాయాలు కల్పించనున్నారు. వినతిపత్రాలు ఇచ్చినా...యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ముధోల్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు, వినతులు వెళ్లాయి. గత నెలలో ముధోల్ మాజీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. గతంలో సేకరించిన స్థలంలో దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమీ కృత గురుకులాల ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జాబితాలో నిర్మల్ జిల్లాకు ఒక్కటీ లేదని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. ఇప్పటివరకు గురుకులాల ఏర్పాటుపై తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. -
మృతదేహాలను తెప్పించేందుకు ఆదేశం
సోన్: ఇటీవల దుబాయ్‌లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణవాసుల మృతదేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించేందుకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి గు రువారం ఓ ప్రకటనలో తెలిపారు. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి గురువారం స్పందించి ఆదేశించారని పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, మృతదేహాలను త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అధి కారులను ఆదేశించినట్లు తెలిపారు. సోన్ మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ దుబాయ్‌లో బేకరీషాప్లో పాకిస్తానీయుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాణ్యమైన సేవలందిస్తాం ఖానాపూర్: ఖానాపూర్ బీఎస్ఎన్ఎల్ కా ర్యాలయం పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈ శర్మన్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సేవా శిబిరానికి హాజరై మాట్లాడారు. సేవల్లో ఎలాంటి అంతరాయమున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలూ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్‌డివిజనల్ ఇంజినీర్ రమ్యజ్యోతి, డీలర్ రమణప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగశాలను సందర్శించిన కలెక్టర్
సోన్: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సందర్శించారు. పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించారు. ప్రయోగశాలలో విద్యార్థులకు ఖగోళ, భౌతిక శాస్త్రాల ప్రయోగాలు, మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించి పరిజ్ఞానం పెంపొందించేలా వివిధ రకాల నమూనాలు ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రయో గశాలలోని నమూనాలతో ఆచరణాత్మక విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు అన్ని అంశాలు సులువుగా అర్థమవుతాయని తెలిపారు. ఈ ప్రయోగశాలను ఉపయోగించి పాఠశాలలోని విద్యార్థులందరికీ నైపుణ్యాలు పెంపొందించేలా ఆచారణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ ఇలాంటి ప్రయోగశాల లేదని తెలిపారు. ఇలాంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. కాగా, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా, కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో సుమారు రూ.19.50లక్షలు ఖర్చు చేసి మొదటగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ కేజీబీవీ, మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ పాఠశాల, తాండూరు మండలం బోసి ప్రభుత్వ పాఠశాలలో ఒక్కోచోట సుమారు రూ.5లక్షల వ్యయంతో ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రామారావు, సెక్టోరల్ అధికారి రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి వినోద్, తహసీల్దార్ మల్లేశ్, మండల విద్యాధికారి పరమేశ్వర్, హెచ్ఎం ఆరాధన, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: అకాల వర్షాలు, ఈదురు గాలు లతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు అ ప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ సుదర్శనం సూచించారు. గురువారం మండల కేంద్రంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేపట్టిన విస్తరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రోడ్ల పక్కనున్న చిన్న స్తంభాలు తొలగించి పొడవైనవి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట నిర్మ ల్ డీఈ నాగరాజు, ఉమ్మడి జిల్లా సివిల్ ఈఈ జనార్దన్రావ్, ఇన్చార్జి ఏడీఈ శ్రీనివాస్, లైన్‌మన్ సత్యనారాయణ, ప్రేమ్, సిబ్బంది ప్రభాకర్, నజీర్ తదితరులున్నారు. నూతన ఫీడర్ ప్రారంభంమామడ: మండలంలోని తాండ్ర విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నూతన ఫీడర్‌ను ఎస్ఈ సుదర్శనం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఈ నాగరా జు, ఏఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మాతృమూర్తి దీవెనలతో ప్రవేశాలు
సారంగపూర్: మండలంలోని చించోలి(బీ) ప్రాథమిక పాఠశాలలో మాతృమూర్తుల దీవెనలతో తల్లి తన కన్నబిడ్డను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించే కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేశ్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉద యం 8గంటల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించడంతో పాటు నూ తనంగా పాఠశాలలో ప్రవేశాలు కల్పించనున్న వి ద్యార్థుల వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈపాఠశాలలో చదువుకుని అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడ్డ, ఎందుకు వెనుకబడ్డామో.. అనే వివరాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి ఇదివరకు ఇక్కడ చదుకువున్న విద్యార్థుల ప్రతిభను పోషకుల ముందు ప్రదర్శించారు. ఇది చూసిన గ్రామస్తులు పిల్ల లను అధికసంఖ్యలో పాఠశాలలో చేర్పించేందుకు ముందుకువచ్చారు. పాఠశాలలో ప్రవేశాలు పెంచేందుకు సరికొత్త ఆలోచన చేసిన ప్రధానోపాధ్యాయుడు గణేశ్‌ను గ్రామస్తులు, సిబ్బంది, నాయకులు అభినందించారు. త్వరలోనే ప్రైవేట్ పాఠఽశాలకు దీటుగా తాను పనిచేసే పాఠశాలను తీర్చిదిద్దుతానని సదరు హెచ్ఎం గణేశ్ చెప్పారు. -
‘సన్నబియ్యం కేంద్రమే ఇస్తోంది’
ఖానాపూర్: ఈ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పేర్కొన్నారు. ఖానాపూర్ పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో మాత్రమే కలుపుతూ అంతా తామే అన్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. వివిధ పథకాలకు కేంద్రం నిధులు వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఫొటోను విస్మరించడం సరి కాదని తెలిపారు. ఈజీఎస్ నిధులతో ఊ రూరా సీసీ రోడ్లు నిర్మిస్తూ వాటినీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, నాయకులు రమేశ్, గోపాల్‌రెడ్డి, కిషన్, భూమన్న, స్వామి, రవి, జీవన్, లింబాద్రి తదితరులున్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మధ్యాహ్నం వరకు పాక్షికంగా, ఆ తర్వాత వైవిధ్యంగా మేఘావృతమవుతుంది. ‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలినిర్మల్టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల మా ర్కింగ్ ప్రక్రియ, తాగునీటి సమస్య తదితర అంశాలపై ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు పూర్తిచేసిన ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ వివరాలు, తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశ లబ్ధిదారుల మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదా రుల అర్హతలు, జీవో వివరాల గురించి ఇంది రమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు అవగాహన క ల్పించేందుకు మండల స్థాయిలో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించాలని, బోర్లు, చే తిపంపులకు మరమ్మతు చేపట్టాలని తెలిపా రు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తాగునీటి సరఫరాను పర్యవేక్షించాల ని, భూగర్భజలాల లభ్యత తక్కువగా ఉన్న మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఉదయం 7నుంచి 11గంటల వ రకే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపా రు. జిల్లాలోని 117 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధిహామీ నిధులతో చేపట్టిన 228 మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేని మండల కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని సూచించా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నకళ్యా ణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, వీసీలో ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష -
విలేజ్‌లోనే విత్తనోత్పత్తి
● దశలవారీగా రైతులందరికీ సరఫరా ● ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కారు ● హర్షం వ్యక్తంజేస్తున్న అన్నదాతలులక్ష్మణచాంద: ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రా ష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు వివిధ కంపెనీల హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కారణంగా విత్తనాల్లో నాణ్యత లోపించి, దిగుబడులు తగ్గి నష్టపోయారు. దీంతో అన్నదాతలకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో విత్తనాలు ఉత్పత్తి చేసి, నాణ్యత పరీక్షించాకే రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామానికి 3–5 రైతులకు.. ఒక్కో గ్రామానికి చెందిన ఆదర్శంగా పంటలు సా గు చేస్తున్న 3–5 రైతులను ఎంపిక చేసి వారికి విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వీరు పండించిన వి త్తనాలను రెండో పంట కోసం ఇతర రైతులకు అందజేస్తారు. ఇలా మూడేళ్లలో గ్రామంలోని రైతులందరికీ అతి తక్కువ ధరకే మేలైన విత్తనాలు అందుబాటులోకి తేనున్నారు. రైతులను నకిలీ విత్తనాల బారి నుంచి కాపాడటంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. త ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించే అవకా శముంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రకా ల నూతన వంగడాలను అభివృద్ధి చేసినా అందులో నుంచి మరింత మేలైన విత్తనాలు మాత్రమే అందించాలని సర్కారు ప్రణాళికలు తయారు చేస్తోంది. 1.45లక్షల ఎకరాల్లో సాగు వానాకాలంలో జిల్లాలో 1.45 లక్షల ఎకరాల్లో వరి, పప్పు సంబంధిత పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా వరి 1.35లక్షల ఎకరాలు, కంది 8,500 ఎకరాలు, పెసలు 850 ఎకరాలు, మినుములు 650 ఎకరాలు, పప్పు ధాన్యాలు 10 వేల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆస్ట్రోనామిక ల్యాబ్‌పై ఓరియంటేషన్ శిక్షణ
సోన్: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాధికారి రామారావు చొరవతో బుధవారం ఆస్ట్రోనామిక ల్యాబ్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు దయానిధి, రిసోర్స్ పర్సన్స్ ఆర్ఎస్ మిశ్రా, నిషిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంపికై న నాలుగు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయో సైన్స్ టీచర్లకు ఆస్ట్రోనామిక ల్యాబ్ (ఖగోళ అంతరిక్ష ప్రయోగశాల) పై ఒక్కరో జు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొన్కల్, భోసి, నిర్మల్ రూరల్ (అనంతపేట్) కేజీబీవీలో రూ.5లక్షలతో ఆస్ట్రోనామికల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థి స్థాయి నుంచే అంతరిక్ష ఖగోళ వస్తువుల గురించి తెలుసుకోవడం, టెలిస్కోప్ పనిచేసే విధానం, పాఠ్యపుస్తకాల్లో వచ్చే పాఠాల్లోని ప్రయోగాలు చేసి చూడడం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించడం, అవగాహనకు ఆస్ట్రోనా మికల్ ల్యాబ్స్ ఎంతో ఉపయోగపడతా యని తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోసైన్స్ టీచర్లు శిక్షణలో పాల్గొన్నారు. ఒక్కరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో డీఎస్వో వినోద్‌కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన, ఉపాధ్యాయులు వందన, పూర్ణచందర్, భీమేశ్, సోషల్ ఫోరం అధ్యక్షులు రాపర్తి అశోక్, రాజగోపాల్, సుధాకర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివి ధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు టెన్త్, మ ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆరు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 697 మంది, ఇంటర్ పరీక్షలకు 511 మంది విద్యార్థులు హాజ రు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షల సమయానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని, పరీక్షాకేంద్రాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, జిల్లా విద్యాధికారి రామారావు, ఏసీజీఈ పరమేశ్వర్, డీఎంహెచ్‌వో రాజేందర్, సీడీపీవో నాగమణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంపిణీకి సిద్ధంగా హాల్‌టికెట్లు నిర్మల్ రూరల్: జిల్లాలో ఈనెల 20నుంచి నిర్వహించనున్న సార్వత్రిక 10, ఇంటర్ పరీక్షలకు హాజర య్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు ఆయా అధ్యయన కేంద్రాలకు అందజేసినట్లు జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డుతో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ నెల 26నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రాక్టికల్ పరీక్షల కోసం హాల్ టికెట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆయా అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు హాల్‌టికెట్లు తీసుకువెళ్లాలని పరమేశ్వర్ సూచించారు. -
నిర్మల్
ముందస్తు ప్రణాళిక మేలు ముందస్తు ప్రణాళికతో పంటల సాగుకు వెళ్తే ప్రయోజనముంటుంది. వేసవి దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటే పనులు సకాలంలో పూర్తవుతాయి. గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోu నిర్మల్: సోన్ మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ గత శుక్రవారం దుబాయిలో ఓ మతోన్మాద పాకిస్థానీ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురించి వెంటనే చెబితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య, తల్లి ఏమవుతారోనని, కొంతకాలంగా తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఆ పిల్లలు ఎలా స్పందిస్తారోనని కుటుంబసభ్యులు, బంధువులు ప్రేమ్‌సాగర్ మరణవార్తను వారికి తెలియనివ్వడం లేదు. ఈ హృదయవిధారక పరిస్థితి మిగతా కుటుంబసభ్యులు, గ్రామస్తులు, తెలిసినవాళ్లందరినీ కలచివేస్తోంది. ప్రేమ్సాగర్లాగే జిల్లాకు చెందిన పలువురు ఉపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయా రు. కొంతమంది ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా జాడ లేదు. వాళ్ల కుటుంబాలన్నీ ఇప్పటికీ తమవాళ్లను తలచుకుంటూనే ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు.. ‘ఉన్న ఒక్కగానొక్క కొడుకని గార్వంగ పెంచుకున్నం. మేమిద్దరం రెక్కల కష్టం చేసి కొడుకును సదివించినం. సదువుడు కాంగనే గోదావరిఖని పోయి మెకానిక్ పని నేర్సుకున్నడు. ఊళ్లే అందరూ దేశం పోతున్నరు.. నేను కూడా కొన్నేండ్లు పోయస్తనని చెప్పిండు. కొడుకు అడిగిండు గదా అని, పోరా.. అనుడే మా తప్పైపోయింది. రెండు లక్షలు అప్పు చేసి పంపినం. అట్ల పన్నెండేండ్ల కిందట పోయిన కొడుకు ఇప్పటికీ ఇంటికి రాలె. ఇదే బాధకు మా ఆయన కూడా కాలం చేసిండు. దేశంకాని దేశంల కొడుకు యాడున్నడో.. ఎట్లున్నడో.. ఏమైపోయిండో..’ అని నీళ్లు తిరుగుతున్న కళ్లతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది సోన్ మండలం కూచన్‌పెల్లికి చెందిన సాయమ్మ. గ్రామానికి చెందిన ఈర్ల సాయమ్మ, రాజారెడ్డి దంపతులు కొడుకై న కృష్ణ (కృష్ణారెడ్డి) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఏజెంట్ ఇచ్చిన కంపెనీ వీసాపై 2013లో దుబాయి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మూడురోజులు సదరు కంపెనీలో పనిచేశాడన్న సమాచారం ఉంది. ఆ తర్వాత నుంచి ఆయన జాడ లేకుండా పోయా డు. అక్కడ అసలేం.. జరిగిందనే విషయాలేవీ ఇప్పటికీ తేలలేదు. అక్కడున్న గ్రామస్తులు గాలించినా.. ఎంబసీకి చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఇదే బాధలో రాజారెడ్డి చనిపోయాడు. ఉన్న ఇల్లు అమ్మే సి, అప్పులు కట్టి సాయవ్వ అద్దె ఇంట్లో ఉంటోంది. భర్త చనిపోవడం, కొడుకు జాడ లేకుండా పోవడంతో బీడీలు చుట్టుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. పట్టించుకునేదెవరు? జిల్లా నుంచి ఇప్పటికీ గల్ఫ్‌దేశాలకు వందలసంఖ్య లో వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొక్కరు చొ ప్పున వెళ్లి వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. కానీ.. అక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే మాత్రం ఎంబసీ, గల్ఫ్సంఘాలు మినహా.. ప్రభుత్వం నుంచి పక్కాగా పట్టింపు ఉండటం లేదన్న ఆరోపణలు న్నాయి. అక్కడ చనిపోతే చాలా సందర్భాల్లో నెలల తరబడి మృతదేహాలూ ఇంటికి రాని దుస్థితి ఉంది. అసలు.. ఏదైనా ఘటన జరిగితే, వెంటనే ఎవరిని కలవాలనే దానిపై కూడా స్పష్టత లేదు. తెలిసిన వాళ్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు, ఎంబసీలకు ఫోన్లు చేయించచి తెలుసు కోవాల్సిన దుస్థితి ఉంది. ఈనెల 7న దుబాయ్‌లో చనిపోయిన యాకర్పల్లికి చెందిన రాజు మృతదేహం జిల్లాలో ఎందరో.. దూరదేశం పోయొస్తే.. సంపాదించిన పైసలు మిగుల్చుకోవచ్చని, వాటితో తమ కుటుంబాన్నైనా బాగా చూసుకోవచ్చని కొన్ని వందలమంది ఇళ్లు, ఊళ్లు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా గల్ఫ్‌బాట పడుతున్నారు. ఎడారిదేశాల్లో కఠినమైన పనుల్లో ఏళ్లకేళ్లు ఉంటూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలవుతూ కొందరు ఏకంగా తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. మరికొందరు జాడలేకుండా పోతున్నారు. సారంగపూర్ మండలకేంద్రానికి చెందిన కొత్తూరు గంగన్న (అడెల్లు) 1986లో సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఆర్నెళ్లకే ఆయనకు ఓ కేసులో జైలుశిక్ష పడింది. అప్పటినుంచి ఆయన ఇంటికి రాలేదు. ఇదే మండలం జామ్ గ్రామానికి చెందిన ఎండీ ఇస్మాయిల్ దుబాయి వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. అక్కడే చనిపోయిన ఆయన మృతదేహాన్ని కూడా ఇంటికి పంపలేదు. తమ ఇంటిపెద్ద ఆఖరిచూపుతో పాటు ఎలాంటి పరిహా రమూ బాధిత కుటుంబానికి దక్కలేదు. యాకర్‌పల్లి గ్రామానికి చెందిన నిర్మల రాజు (41) దుబాయిలో ఈనెల 7న అనారోగ్యంతో చనిపోయాడు. సోన్ మండలం కూచన్‌పెల్లికి చెందిన పిండి మల్లేశ్, మెట్టు సాగర్, ఎలిగేటి రాజన్న ఉపాధి కోసం గల్ఫ్‌దేశాల్లో అనారోగ్యంతోనే మృత్యువాత పడ్డారు. ఒక్క 2024 సంవత్సరంలోనే.. కడెం మండలం పెద్దబెల్లాలకు చెందిన బత్తుల నర్సయ్య (సౌదీ అరేబియా), ఇదే మండలం లింగాపూర్‌కు చెందిన ఎండీ నబీరసూల్ (సౌదీఅరేబియా), మామడ మండలం కొర్టికల్కు చెందిన గవ్వల రవి (ఖతర్), ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్కు చెందిన పుల్కం రాజేశ్వర్ (యూఏఈ), లక్ష్మణచాంద మండలం బోరిగాంకు చెందిన మక్కల వెంకటి (బహ్రెయిన్), ముధోల్ మండలం మచ్కల్కు చెందిన మల్లెపూల సాయన్న (దుబాయి), సారంగపూర్ మండలం చించోలి (బి)కి చెందిన అప్పాల నవీన్ (అబుదాబి)లో మృతిచెందారు. న్యూస్‌రీల్ ‘గల్ఫ్’లో జిల్లావాసుల మరణాలు ఉపాధి కోసం వెళ్తే ఊపిరాగుతోంది! మృతదేహాలూ ఇంటికి రాని వైనం జాడ లేకుండా పోయినోళ్లెందరో.. ఏళ్లు గడిచినా పట్టించుకునేవారేరి? ‘అమ్మా.. అమ్మా.. నాన్నెప్పుడొస్తడు..!? నేను.. నాన్నన్ని ఎప్పుడు చూస్తా..!? అక్కానేను అడిగిన బొమ్మలు తీసుకొస్తడా..!?’ అంటూ వచ్చిరాని మాటలతో తండ్రి గురించి ఆ చిన్నారి అడుగుతుంటే.. ‘వస్తడమ్మా.. త్వరలోనే వస్తడు.. మీ ఇద్దరికీ బొమ్మలు తెస్తడు.. సరేనా..!’ అంటూ ఆ తల్లి సర్దిచెబుతోంది. అమ్మ చెప్పిన మాటలతో ఆ చిన్నారులిద్దరూ ఆనందంగా ఆటలో మునిగిపోయారు. కానీ.. తమ నాన్న తిరిగిరాడన్న సంగతి ఆ పసిమనసులకు తెలియదు. ఒకవేళ వచ్చినా బొమ్మలా అట్టపెట్టెలో విగతజీవిగా వస్తాడని.. తమను ఇంకెప్పుడూ ఇక చూడలేడనీ వాళ్లు ఊహించనూ లేరు. అసలు.. ఆ పిల్లలకు కాదు.. వారికి సర్దిచెబుతున్న ఆ తల్లికీ తెలియని విషయమేమంటే.. తమ కోసం ఎడారి దేశానికి వెళ్లిన తన భర్త ఐదురోజుల క్రితమే హతుడయ్యాడని. అందుకే.. నిత్యం తమతో మాట్లాడే ఆయన గొంతు మూగబోయిందని. ప్రేమ్‌సాగర్ కుటుంబానికి పరామర్శసోన్: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల దుబాయిలో పాకిస్తాన్ వ్యక్తి చేతిలో హత్యకు గురైన మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని బుధవారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వినోద్‌కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుబాయి రాయబార కార్యాలయానికి ఫోన్లో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్‌రావు, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి, మాజీ సర్పంచ్ వినోద్‌కుమార్ తదితరులున్నారు. ప్రయత్నం చేస్తున్నాం తాజాగా దుబాయిలో చోటుచేసుకున్న ఘటనతో పాటు గల్ఫ్‌దేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. వారికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి నివేదించనున్నాం. – స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ అడ్వైజరీ మెంబర్ -
సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్ టౌన్: సమస్యలు పరిష్కరించాలని ఫా రెస్ట్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొజం అలీఖాన్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో సీసీఎఫ్ శర్వానన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. సమస్యలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సంక్షేమం తదితర అంశాలపై చ ర్చించారు. అసోసియేషన్ సభ్యులు ఎండీ నజీ ర్ఖాన్, రవీందర్, సుందర్ తదితరులున్నారు. 18 నుంచి జొన్నల కొనుగోళ్లు భైంసాటౌన్: ముధోల్ నియోజకవర్గంలో ఈనెల 18 నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ముధోల్ నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో రైతులు జొన్న సాగు చేస్తారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కొనుగోలు పరిమితి ఎకరాకు 14 క్వింటాళ్లకు పెంచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను ఫోన్ చేసి కొనుగోళ్లకు ఆదేశాలిచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. అక్రమాలను అరికట్టాలి ఖానాపూర్: ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శులు పీటర్, సురేందర్ కోరారు. బుధవారం ఖానాపూర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఈజీఎస్ టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కో కూలీ నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కొలతలు తీసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా..
● అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ ● ఈ నెల 22 వరకు కొనసాగనున్నకార్యక్రమం జిల్లా సమాచారం..లక్ష్మణచాంద: చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని అధిగమించి, వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 8న ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 22వ తేదీ వరకు కొనసాగనుంది. చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని తొలగించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లాలో ఇలా...జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ డివిజన్లలో కలిపి మొత్తం 926 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 816 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాల ద్వారా 0–6 సంవత్సరాల వయస్సు గల 57,077 మంది చిన్నారులు, 5,916 మంది గర్భిణులు, 6,012 మంది బాలింతలు సేవలు పొందుతున్నారు. పోషణ పక్వాడ కార్యకలాపాలు ఆరోగ్య పరిశీలన: గర్భిణులు, చిన్నారుల బరువు తనిఖీ చేయడం, రెండేళ్లకన్నా తక్కువ వయస్సు గల చిన్నారుల పెరుగుదలను పరిశీలించడం. తల్లిపాల అవగాహన: గ్రామాల్లో ఇంటింటి సందర్శనలు చేసి తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం. పోషకాహార విద్య: గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వివరించడం. వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మరియు రక్త పరీక్షలు నిర్వహించడం. పోషకాహార వంటకాలు: ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ వంటకాలు తయారు చేసి, పోషకాహార విలువలను ప్రత్యక్షంగా తెలియజేయడం. టీకాల షెడ్యూల్ తనిఖీ: వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్‌ను పరిశీలించడం. గర్భిణుల సంరక్షణపై అవగాహన: గర్భిణుల సంరక్షణలో భర్తల పాత్రపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంతోపాటు, సమాజంలో పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సీ్త్ర శిశుసంక్షేమ శాఖ పనిచేస్తోంది. అందరూ పాల్గొనాలి చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషకాహార లోపం నివారించేందుకు సీ్త్ర శిశుసంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – నాగలక్ష్మి, ఇన్చార్జి, డీడబ్ల్యూవోజిల్లాలోని ప్రాజెక్టులు 04అంగన్వాడీ కేంద్రాలు 9260 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 57,077బాలింతలు 6,012గర్భిణులు 5,916 -
నిర్మల్
జీవాల పెంపకానికి చేయూత పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాంసం ఉత్పత్తులు పెంచాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. జీవాల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోu శాంతిభద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ● ఏఎస్పీ రాజేశ్‌మీనా లక్ష్మణచాంద: శాంతి భద్రతల పరిరక్షణకు గ్రా మాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా తెలిపారు. మండలంలోని మునిపెల్లి గ్రామంలో మంగళవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించా రు. ఇందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లే ని 90 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ఏఎస్పీ మా ట్లాడారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లోకి అపరిచితులు వచ్చినా, అసాంఘిక కార్యకపాలు జరిగినా, దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాలతో త్వరగా గుర్తించే వీలుంటుందని వివరించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రూ ల్స్ తప్పకుండా పాటించాలన్నారు. వాహనా లకు సంబంధించి ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, అపరిచితులకు పిన్, ఆధార్, వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని సూచించారు. కార్యక్రమంలో సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు మాలిక్ రెహమాన్, గోపి పాల్గొన్నారు.● అమ్మకుండా.. వండుకుంటున్నారు.. ● పంపిణీ పై లబ్ధిదారుల సంతృప్తి ● రేషన్‌షాపుల వద్ద బారులు నిర్మల్ చైన్‌గేట్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరైన పద్ధతిలో వండితే ఎలాంటి సమస్య లేదని, గంజి సరిగా వార్చకపోతే కొద్దిగా మెత్తగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లాలో ఈనెల మొదటి వారంలోనే సన్న బియ్యం సరఫరా ప్రారంభమై, 70 నుంచి 80 శాతం మంది లబ్ధిదారులు ఇప్పటికే తమ కోటా బియ్యం తీసుకున్నారు. నాణ్యతపై ప్రజల ఆనందం రేషన్ షాపుల ద్వారా గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. వీటిని చాలా మంది విక్రయించి సన్న బియ్యం కొనేవారు. అమ్మిన బియ్యాన్నే మిల్లర్లు మళ్లీ సేకరించి ప్రభుత్వానికి అప్పగించేవారు. అయితే అక్రమాలకు చెక్ పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల నుంచి పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో పంపిణీ సజావుగా సాగుతోంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యం తీసుకోవడమే కాకుండా వండుకుని తింటున్నారు. దీంతో అమ్మెవారు కనిపించడం లేదు. కొత్త బియ్యం కావడంతో కొంత మెత్తదనం ఉన్నప్పటికీ, సరైన వంట పద్ధతులతో ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. కొన్ని చోట్ల స్వల్పంగా నూకలు ఉన్నప్పటికీ, గతంలో అందించిన దొడ్డు బియ్యంతో పోలిస్తే సన్న బియ్యం రుచి, నాణ్యతలో ఉన్నాయని పేర్కొంటున్నారు. తినేందుకే ప్రాధాన్యం గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో, చాలామంది లబ్ధిదారులు వాటిని ఇడ్లీ, దోసెలు, పిండి పట్టించడం వంటి ఇతర అవసరాలకు ఉపయోగించారు. కొందరు దొడ్డు బియ్యాన్ని అమ్ముకుని సన్న బియ్యం కొనేవారు. అయితే, సన్న బియ్యం నాణ్యతతో ఆకర్షణీయంగా ఉండటంతో దీనిని ప్రధానంగా తినేందుకే వినియోగిస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. సన్న బియ్యాన్ని అన్నం వండుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో మాట్లాడిన ‘సాక్షి’ బృందం, సన్న బియ్యం నాణ్యతపై సంతృప్తి, దాని వినియోగంలో సానుకూల ధోరణిని గమనించింది. సమర్థవంతమైన నిర్వహణ సన్న బియ్యం పంపిణీ రేషన్ షాపుల ద్వారా సజావుగా కొనసాగుతోంది. తొలి మూడు నాలుగు రోజుల్లో లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద బారులు తీరారు, 70 నుంచి 80 శాతం మంది ఇప్పటికే తమ వాటాను స్వీకరించారు. ఈ సమర్థవంతమైన పంపిణీ వల్ల లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందింది. రేషన్ షాపుల వద్ద ఎలాంటి గందరగోళం లేకుండా, వేగంగా పంపిణీ జరిగింది. సన్న బియ్యం అందుబాటులోకి రావడంతో, లబ్ధిదారులు తమ కోటాను స్వీకరించారు. చిన్నారికి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నపు బియ్యం అన్నం తినిపిస్తున్న తల్లి నీటి ఇబ్బందులు రావొద్దుభైంసారూరల్: మండలంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. మండల పరిషత్ కార్యలయంలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకంలో పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్నం ముద్దగా అవుతోంది.. రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం వండితే అన్నం ముద్దగా అవుతుంది. తినడానికి ఇబ్బందిగా ఉంది. బియ్యంలో సగానికిపైగా నూకలు. ఉన్నాయి. సన్న బియ్యం ఇవ్వడం సంతోషమే కానీ తినడానికి వీలుగా ఉండే బియ్యం ఇస్తే బాగుంటుంది. – అరుణ, నిర్మల్ నూకలు వస్తున్నయి.. మా కుటుంబానికి ఈనెల సన్నబియ్యం ఇచ్చిండ్రు. అందులో కొంత వరకు నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతీనెల సన్నబియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది. – విజయ, వైఎస్సార్ కాలనీ ఎప్పుడూ ఇలాగే పంపిణీ చేయాలి సన్న బియ్యం ఈ నెల మాదిరిగానే ప్రతీనెల పంపిణీ చేయాలి. దీంతో లబ్ధిదారులెవరూ రేషన్ బియ్యం బయట విక్రయించరు. అక్రమాలకు అవకాశం ఉండదు. కొత్త రేషన్ కార్డులు రాక చాలా మందికి అర్హత ఉన్నా అందడం లేదు. – బొప్పారపు శ్రీనివాస్, ఖానాపూర్న్యూస్రీల్మార్కింగ్ పూర్తి చేయాలినిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్(ముగ్గు పోసే ప్రక్రియ) ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియపై సంబంధిత అధికా రులతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఇప్పటి వరకు మంజూరైన ఇళ్ల లబ్ధిదారులు పూర్తిచేసిన మార్కింగ్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ ఏఈ మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ దగ్గరుండి చేయించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో గోవింద్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు రేషన్ తీసుకున్న వారి వివరాలు: జిల్లాలోని మొత్తం రేషన్ షాపులు 412 ఇప్పటివరకు రేషన్ అందుబాటులో ఉన్న షాపులు 407జిల్లాలోని మొత్తం కార్డు దారులు 2,08,380 రేషన్ పొందిన కార్డు దారులు 1,68,016 లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్న బియ్యం 35,07,083 కిలోలు వండుకుని తింటున్నం.. ప్రభుత్వం దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇవ్వడంతో వండుకుని తింటున్నం. గతంలో దొడ్డుబియ్యం తెచ్చుకుని దోశలు చేసుకునేందుకు పిండి పట్టించుకునే వారం. ఇప్పుడు అన్నం వండు కొని తింటున్నం. – గంగేశ్వరి, నిర్మల్ సన్న బియ్యం ఇవ్వడం సంతోషకరం.. ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. బయట కొనుక్కునే ఖర్చు తగ్గింది. అయితే అన్నం వండితే మెత్తగా అవుతుంది. రెండు, మూడు రకాల బియ్యం కలవడం వల్ల అలా అవుతుంది. – దండు శ్యామల, న్యూవెల్మల్ -
● నాసిరకం విత్తనంతో నష్టాలు ● బరువు పెరగని సబ్సిడీ చేపలు ● మత్స్యకారులకు తగ్గిన దిగుబడి ● ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వందశాతం సబ్సిడీతో చేప విత్తన పంపిణీ లక్ష్యం నీరుగారిపోతోంది. అదునులోపు చేప విత్తనం పంపిణీ చేయకపోవడం ఒక కారణమైతే.. నాసిరకం విత్తనాలతోనూ మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి లక్ష్యం కంటే సగానికి తక్కువగానే చేపపిల్లలను నీటిలో వదిలారు. వర్షాకాలం ఆరంభంలో కాకుండా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విడుదలలో జాప్యం జరిగింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 994నీటి వనరుల్లో లక్ష్యం ప్రకారం 6కోట్లకు పైగా చేపపిల్లలను వదలాల్సి ఉన్నా 3.57 కోట్ల చేపపిల్లలు వదిలారు. రవు, బొచ్చె రకాలు ఎక్కువగా ఉన్నాయి. 35ఎంఎం నుంచి 40ఎంఎం, 80నుంచి 100ఎంఎం పరిమాణం ఉన్న చేపపిల్లలను వదిలారు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఎదుగక సరైన దిగుబడి రాలేదు. కొన్ని చోట్ల మత్స్యకార సంఘాల సభ్యులే సొంత డబ్బులతో చేపపిల్లలు కొనుగోలు చేసి పెంచుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 372చెరువుల్లో 1.09కోట్ల చేపపిల్లలకు గాను 47చెరువుల్లోనే 2.99లక్షల చేపపిల్లలు వదిలారు. జాప్యం.. నాసిరకం ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో రూ.లక్షలు వెచ్చించి, చేపపిల్లలను కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచి అప్పగించింది. గత సర్కారు హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని కొన్ని చోట్ల ఒప్పందాలు ర ద్దు చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయినా విత్తనంలో నాణ్యత లేక చాలా చోట్ల లక్ష్యం మేర చేపలు బరువు పెరగలేదు. అదే సమయంలో ప్రైవేటుగా కొనుగోలు చేసిన, చేప విత్తనాలు మాత్రం బరువు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏటా వానాకాలంలో చేప విత్తనాలను ఎల్లంపల్లి, అడ(కుమురం భీం), కడెం, పీపీ రావు, సాత్నాల, స్వర్ణ, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీ తదితర ప్రాజెక్టుల్లో వదులుతున్నారు. ఈసారి ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువుల్లోనూ ఆశించిన మేర దిగుబడి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నాసిరకంగా ఉన్నాయి.. గతేడాది కంటే ఈ ఏడాది చేప విత్తనాలు నాసిరకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేప విత్తనాలకు బదులు నేరుగా డబ్బులు సొసైటీ సభ్యులకు జాయింట్ ఖాతాల్లో వేస్తే మేమే విత్తనాలను కొనుగోలు చేసుకుంటాం. –పుట్టి నర్సయ్య, నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణచాంద మండలం, నిర్మల్ జిల్లా -
ధైర్యంగా చదువుకోవాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్‌టౌన్: విద్యార్థినులకు పోలీసులు అండగా ఉంటారని, ధైర్యంగా చదువుకోవాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లాలో వారంలో ఒకరోజు కేజీబీవీలో మహిళా పోలీసులు నిర్వహిస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించా మని తెలిపారు. వారు వారంలో ఒకరోజు పాఠశాలను సందర్శిస్తారని, రాత్రి అక్కడే బస చేసి పిల్లలతో గడుపుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. విద్యార్థులను మానసికంగా ఉత్తేజపరిచి, తదుపరి చదువులపై సలహాలు సూచనలు చేస్తారన్నారు. ఉదయం మానసిక ఉల్లాసం, శారీరక ఉత్తేజం కోసం యోగా చేయిస్తారని తెలిపారు. ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
డిప్లొమాతో ఉజ్వల భవిష్యత్తు
● ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 13న ప్రవేశ పరీక్షపరీక్ష వివరాలు దరఖాస్తు: polycet. sbtet. telangana. gov. inలో అందుబాటులో ఉంది. చివరి తేదీ: ఏప్రిల్ 19, 2025 (ఫీజు లేకుండా); ఏప్రిల్ 23, 2025 (రూ.300 ఆలస్య రుసుముతో). పరీక్ష విధానం: ఆఫ్‌లైన్, 2.5 గంటలు, 150 ప్రశ్నలు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). పరీక్ష తేదీ : మే 13, 2025.లక్ష్మణచాంద: తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పాలిసెట్) 2025 మే 13న జరుగనుంది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరా లనుకునే విద్యార్థులకు ఈ పరీక్ష కీలకమని నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి, ఉట్నూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్న రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా పూర్తి చేసినవారు ఇంజినీరింగ్ డిగ్రీలో రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చని తెలిపారు. సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. -
ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి
నిర్మల్ రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని డీఈవో రామారావు అన్నారు. త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అనుముల కమలాకర్‌రావు, పెంట శంకర్, కృష్ణారావు, పద్మలత, ప్రభకుమారి, శ్రీనివాస్‌ను సెయింట్ థామస్ పాఠశాలలో మంగళవారం సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఇందులో జిల్లా సోషల్ ఫోరం ప్రధాన కార్యదర్శి భూషణ్, ఆర్థిక కార్యదర్శి ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు నారాయణరెడ్డి, మధు, ఏసీజీ పరమేశ్వర్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు. -
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
నిర్మల్‌చైన్‌గేట్: భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ఉంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ భూభారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)–2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూలంకశంగా అధికారులకు వివరించారు. భూభారతి చట్టంపై ప్రతీ అధికారి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. ఈనెల 17 నుంచి అధికారులంతా గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి చట్టంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల వివరాలు సేకరించాలన్నారు. భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని తెలిపారు. నూతన చట్టం ప్రకారం భూములకు భూదార్ కార్డులు మంజూరు చేసే వెసులుబాటు కల్పించారన్నారు. భూ విషయాలకు సంబంధించి చిన్నచిన్న సవరణల ప్రక్రియ అత్యంత సులువుగా, వేగంగా పూర్తవుతుందని తెలిపారు. సదస్సులో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
అంబేడ్కర్ ఆశయాలు సాధిద్దాం
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిఅంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌చైన్‌గేట్: సామాజిక సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మహనీయుడి ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అధికారులు, నాయకులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అణచివేతల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న తపనతో అంబేడ్కర్ ప్రపంచానికే మార్గదర్శకమైన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోనే నేడు బడుగు, బలహీనవర్గాల ప్రజలు సైతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపొందించడంలో అంబేడ్కర్ ముఖ్య భూమిక పోషించారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు అనుక్షణం పోరాడారని గుర్తుచేశారు. కులమత బేధాలను తొలగించి, ప్రతి ఒక్కరికీ హక్కులను కల్పించేందుకు పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో వాగ్వాదం.. అధికారికంగా నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. వివిధ కుల సంఘాల నాయకులను వేడుకలకు ఆహ్వానించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పలువులు అధికారులు, కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే వేదికపైకి ఎమ్మార్పీఎస్ నాయకులను ఆహ్వానించలేదు. దీంతో అంబేడ్కర్ భవనం ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని జయంతి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించడంతో అంగీకరించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం.. ఎమ్మార్పీఎస్ నాయకులు మెడలో మందకృష్ణ మాదిగ ఫొటోతో ఉన్న నల్ల కండువాలు వేసుకున్నారు. అధికారిక కార్యక్రమానికి పార్టీల కండువాలు కప్పుకుని రావొద్దని మాల సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మళ్లీ వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దాదాపు గంటన్నరపాటు ఘర్షణ పడ్డారు. కార్యక్రమానికి వచ్చిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు నాయకుల తీరు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా చేరుకొని ఇరువర్గాల నాయకులను అక్కడి నుంచి పంపించారు. తర్వాత అంబేడ్కర్ జీవిత చరిత్ర, భారత దేశానికి ఆయన చేసిన సేవలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, సంస్కృతిక సారధి కళాకారులు ఆవిష్కరింపజేశారు. అనంతరం పలువురు అధికారులు, కుల సంఘాల నాయకులు అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలియజేశారు. కార్యక్రమాల్లో జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ అధికారి రాజేశ్వర్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్య, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అధికారులు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు పాకాల రాంచందర్, ముడుసు సత్యనారాయణ, మేడారం ప్రదీప్, రమణారెడ్డి, కొప్పుల శ్రీధర్, రాఘవేందర్, అనుముల భాస్కర్, విద్యార్థులు -
ప్రజాపాలన తీసుకొచ్చాం
● ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనమంచిర్యాలటౌన్: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ప్రజాపాలన తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబీ ఆవరణలో మాతాశిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను మార్చి 16, 2023లో పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించానని, అదే ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పిలిపించామని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏంటో తెలిసిందని, మొదటి నుంచి పార్టీకి అండగా ప్రేమ్‌సాగర్‌రావు నిలిచారని, ఆయనకు కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో మంచిర్యాలలోని మాతాశిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టవద్దని చెప్పినా వినకపోవడంతో అక్కడే నిర్మించడం వల్ల వరదల్లో మునిగి పోయిందని తెలిపారు. నాడే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంసీహెచ్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఐబీ ఆవరణలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నది వరదతో రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోతుందని, కరకట్ట నిర్మించాలని నాడు ప్రజలు కోరారని, వారి కోరిక మేరకు కరకట్టను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపి వేసిన ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సభలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంత..?
నమోదు హాజరు నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు విద్యార్థుల నమోదు, హాజరు పెంపొందించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక యుడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను క్షేత్రస్థాయిలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. యుడైస్ ప్లస్ సర్వే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో డీఎడ్, బీఎడ్ విద్యార్థులతో సమాచార సేకరణకు సిద్ధమైంది. ఈ సర్వేలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిశీలించి, గణాంకాలను నమోదు చేస్తారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా లేదా అని కూడా ధ్రువీకరిస్తారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు నిధులు కేటాయిస్తాయి. విద్యా సంస్కరణలను మరింత పటిష్ఠం చేస్తాయి. జిల్లాలో సర్వే ఇలా.. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పరిధిలో సుమారు 735 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 532 ప్రాథమిక పాఠశాలలు, 86 ప్రాథమికోన్నత పాఠశాలలు, 117 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు జిల్లా విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సర్వేలో ఏప్రిల్ 15 నుంచి 21 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పరిశీలించి, ఛాత్రోపాధ్యాయులు నివేదికలను రూపొందిస్తారు. సర్వే కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. సంబంధిత కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీలు) సహకారం అందిస్తారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణ నిర్మల్ జిల్లాలో డీఎడ్, బీఎడ్ చదువుతున్న 60 మంది ఛాత్రోపాధ్యాయులను ఈ సర్వే కోసం కేటాయించారు. వీరు ప్రతిరోజూ రెండు పాఠశాలల చొప్పున సర్వే చేపడతారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలను అప్పగించి, నివేదికలను రూపొందించేలా శిక్షణ ఇచ్చారు. యుడైస్ ప్లస్ పోర్టల్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను హాజరైన విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చి, వాస్తవ గణాంకాలను నమోదు చేస్తారు. సర్వే ప్రాముఖ్యత.. ఈ సర్వే రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నిధుల కేటాయింపు కోసం కీలకం కానుంది. ప్రభుత్వం ఇ ప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూ నిఫామ్లు, దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భత్యం వంటి సౌకర్యాలను అందిస్తోంది. అయినప్పటికీ, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, ఈ సర్వే ద్వారా వాస్తవ గణాంకాలను సేకరించి, నమోదు పెంపొందించే చర్యలు చేపట్టనున్నారు. నేటి నుంచే యుడైస్ ప్లస్ సర్వే... ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, హాజరుపై దృష్టి జిల్లాకు 60 మంది ఛాత్రోపాధ్యాయుల కేటాయింపు..క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు వంటి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుంటారు. ఇందుకుగాను ఛాత్రోపాధ్యాయులు జిల్లాకు కేటాయించబడ్డారు. వీరు ఆయా పాఠశాలలను సందర్శించి యూడైస్ ప్లస్‌పై ఈనెల 15 నుంచి 21 వరకు సర్వే చేపడతారు. జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. – పి.రామారావు, డీఈవో -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్‌టౌన్: వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. వారం రోజులు ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, గ్యాస్ గోదాములు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, నిర్మల్ స్టేషన్ అధికారి రాజలింగం, సిబ్బంది అజయ్ కుమార్, సునీల్, హుస్సేన్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’
● కలెక్టర్ల సదస్సులో సీఎం నిర్మల్‌చైన్‌గేట్: రైతుల భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (ఎంసీహెచ్ఆర్డీ) సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. భూభారతిపై ప్రతీ మండలంలో సదస్సు నిర్వహించాలని సూచించారు. రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మెస్‌లకు టెండర్!
ట్రిపుల్ ఐటీభైంసా: గత ప్రభుత్వ హయాంలో బాసర ట్రిపుల్ఐటీతో సహా రాష్ట్రవ్యాప్త గురుకులాలు, ప్రభుత్వ కళాశాలల్లో కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్పటి సీఎల్పీ నేతగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా సమస్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం కోసం శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మంత్రి సీతక్క సందర్శన 2024, డిసెంబర్ 13న మంత్రి సీతక్క ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులతో భోజనం చేసి, సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అత్యవసర పనుల కోసం రూ.కోటి నిధులు కేటా యించినట్లు ప్రకటించారు. అయినా, మెస్ నిర్వహణలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాంట్రాక్టర్ల అవినీతి ట్రిపుల్ఐటీ అధికారులు విద్యార్థుల కంటే కాంట్రాక్ట ర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పురుగులు, ఫుడ్ పాయిజన్ ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా, పాత కాంట్రాక్టర్లనే కొనసాగించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ అక్రమాలపై విచారణ డిమాండ్ చేసినా, ఫలితం లేకపోయింది. టెండర్ నిబంధనల వివాదం కొత్త మెస్ టెండర్లలో కఠిన నిబంధనలు ఉన్నాయి. రూ.8 కోట్ల టర్నోవర్, 2–3 వేల మందికి భోజన అనుభవం అడిగారు. దీంతో ఈ నిబంధనలు పాత కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో చిన్న కళాశాలల్లో ఇటువంటి అనుభవం ఉండదు, ట్రిపుల్‌ఐటీలోనే ఇది సాధ్యం. 9 వేల మంది విద్యార్థుల భోజన బాధ్యతను నిర్లక్ష్యంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం నాలుగు మెస్‌లకు 12 మంది ఈ టెండర్లు వేసినట్లు సమాచారం. ఈ విషయాలు అధికారులైతే ఇప్పటికీ వెల్లడించడం లేదు. మహిళా సంఘాలకు అవకాశం లేనట్లే.. సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు ఇందిర శక్తి క్యాంటీన్లు కేటాయిస్తున్నారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కానీ, ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెస్ కూడా మహిళా సంఘాలకు ఇవ్వలేదు. స్థానికులు 500 మందికి మెస్‌లు కేటాయిస్తే రుచికర, నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి మహిళా సంఘాలకు ట్రిపుల్ఐటీ మెస్‌లను అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిబంధనలు చూస్తే కొత్త వారికి కష్టమే పాత వారికే దక్కేలా కాంట్రాక్ట్ రూల్స్ టర్నోవర్ పేరిట తిరకాసు ‘ఇందిరా శక్తి’కి ఛాన్స్ ఇవ్వరా? పాత వారిపై ఫిర్యాదులు.. ప్రైవేటు సంస్థల అన్ని కాంట్రాక్టు గడువులు ముగిసినప్పటికీ ఎట్టకేలకు ఇటీవలే మెస్‌లకు టెండర్లను పిలిపించారు. క్యాంపస్‌లో 9 వేల మంది విద్యార్థులకు భోజన బాధ్యతలు, నిర్వాహణను ప్రైవేటు క్యాట రింగ్ సంస్థలకు అప్పగించారు. గతంలో మెస్ దక్కించుకున్న కాంట్రాక్టర్లపై అక్కడి విద్యార్థులు ఫిర్యాలు చేసినా అధికారులు వారిపై చర్యలు తీసుకోలేదు. భోజనంలో పురుగులు రావడం, ఫుడ్‌పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకున్నా స్పందించ లేదు. మూడేళ్లుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి క్యాటరింగ్ సంస్థలపై అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
అంబేడ్కర్ ఆశయాలు సాధించాలి
నిర్మల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు కొనసాగించాలని ముధోల్ ఎమ్మెల్యే రా మారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథో డ్ సూచించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లాకేంద్రంలోని మి నీట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహాన్ని పాలు, నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అనేకసార్లు అవమానించిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం అంబేడ్కర్ ఆలోచనలకు పునాది వేస్తూ అ ణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు రూ పొందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అంబేడ్క ర్ జయంతి కార్యక్రమాల కన్వీనర్ రమేశ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, రాష్ట్ర నాయకుడు అయ్యన్నగారి భూమయ్య, యువ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణాధ్యక్షుడు సుంకరి సాయి, నాయకులు కార్తిక్, సుధాకర్, పోశెట్టి, రాజేందర్, వెంకటపతి, నాగేంద్రచారి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీ లోని అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ నీటితో శుద్ధి చేశారు. విగ్రహ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేందర్, మనోజ్, ఉపేందర్, మురళీకృష్ణ, సంతోష్, రమేశ్, రాజశేఖర్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, సురేశ్, భూమన్న, పరమేశ్వర్, కిషన్, నర్సయ్య, సుధాకర్, శ్రావణ్, రాజేశ్వర్, సందీప్, ప్రమోద్, పొశెట్టి తదితరులు పాల్గొన్నారు. కడెం: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కన్నాపూర్ గ్రామంలోగల అంబేడ్క ర్ విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ శుద్ధి చేశారు. పరిసరాలను శుభ్రం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు సత్తెన్నయాదవ్, మోహన్‌నాయక్, కృష్ణ, తిరుమల్, రాజేశ్, లక్ష్మణ్, భూమన్న, ఆశన్న ఉన్నారు. -
విమానం రూట్లోనే రైలు.!
● ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ● రైల్వేలైన్‌పైనా పెరుగుతున్న డిమాండ్ ● నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు అవసరం ● కొలిక్కి వస్తోందంటున్న జిల్లా నేతలునిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇప్పటికీ వెనుకబడి ఉండటంలో ప్రధాన లోపం రవాణావ్యవస్థనే. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో విమానయానానికి వాయుసేన నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఇదేక్రమంలో జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణాన్నీ వేగవంతం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఎంపీ నగేశ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తరచూ కేంద్రమంత్రిని కలుస్తున్నారు. తాజాగా ఈనెల 5న మరోసారి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్‌కు సంబంధించి సర్వే పూర్తయినందున మిగతా పనులు వేగవంతం చేయాలని కోరారు. రూట్ సర్వే పూర్తి..! ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రూట్ సర్వే పూర్తయ్యింది. దాదాపు ఎన్‌హెచ్–44 వెంటే ఈ లైన్ వెళ్లనున్నట్లు అంచనా. కొన్నిచోట్ల మాత్రం ఈ రూట్లో ప్రజాప్రతినిధులు మార్పులు–చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. భూత ల సర్వే పూర్తికావడంతో చివరగా ఏరియల్ సర్వేను హెలికాప్టర్ద్వారా చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియనూ పూర్తిచేసి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయనున్నారు. రెండంచెల పని బాకీ.. రైల్వే నిర్మాణంలో ప్రాథమికంగా సర్వే పూర్తి కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్‌కు సంబంధించి డీపీఆర్, నిధులకు సంబంధించిన ఎస్టిమేషన్ సిద్ధం చేయాల్సి ఉంది. కేంద్రం నిధులపై స్పష్టతనివ్వడం మిగిలింది. ఈ రెండు పనులు పూర్తయితే అవసరమైనచోట భూసేకరణ, టెండర్లు పిలుస్తారు. రైల్వేశాఖ అధికారులు ఈ పనులు వేగవంతంగా పూర్తిచేస్తే ఆరునెలల్లో నిర్మల్ మీదుగా రైల్వేలైన్ ఓ కొలిక్కి వస్తుంది. వేగం పెంచాలని ఒత్తిడి దశాబ్దాల కలగా ఉన్న హైదరాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం ఇప్పుడు ఆశాజనకంగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి నిర్మల్, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉండటం, వరుసగా ఆదిలాబాద్ ఎంపీ స్థా నాన్ని బీజేపీ గెలుస్తుండటంతో ఈ ప్రాంతంలో మరింత పట్టు పెంచుకోవడానికీ ఆ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ నగేశ్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలపైనా రైల్వేలైన్ నిర్మాణంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. స్థానికంగా ఈ లైన్ నిర్మాణ ఆవశ్యకత, నిర్మల్ సభలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తరచూ కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదేక్రమంలో తాజాగా మరో సారి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఎంపీ నగేశ్ కలిశారు. రైల్వేబోర్డు డీపీఆర్, ఎస్టిమేషన్ త్వరగా పూర్తిచేసేలా చూడాలని కోరారు. అటు విమానం.. ఇటు రైలు.. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లావాసులకు దశాబ్దాలుగా ఉన్న రెండు కలలు దాదాపు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో విమానయోగానికి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఇక రైల్వేలైన్ సంగతి చూడాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఓమూలన ఉన్న బాసరకు మాత్రమే రైల్వేలైన్ ఉంది. ఇక్కడ వ్యవసాయపరంగా అభివృద్ధి ఉన్నా.. మార్కెటింగ్ కోసం రవాణా సౌకర్యాలు లేవు. రైల్వేలైన్ వస్తే తమ పంటలనూ మార్కెట్ ఉన్నచోట విక్రయించుకునే అవకాశం దక్కుతుందన్న భావన రైతుల్లోనూ ఉంది. అన్నివర్గాలకూ రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ఈక్రమంలోనే విమానం రూట్లోనే రైలునూ తీసుకురావాలని ప్రజాప్రతినిధులను తరచూ అడుగుతున్నారు. వేగం పెంచాలని కోరాం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్‌కు సంబంధించిన ప్రతిప్రాదన మరోసారి కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. సంబంధిత పనులు వేగవంతం చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ ఏడాదిలో కొలిక్కి.. నిర్మల్ జిల్లావాసుల కలగా ఉన్న రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. సర్వే పూర్తి కావడంతో రెండంచెల్లో మిగతా పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇవి పూర్తయితే ఏడాదిలో రైల్వేలైన్ నిర్మాణ పనులు కొలిక్కి వస్తాయి. – మహేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత -
అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఆ లయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పో టీలు అలరించాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు పోటీలో తలపడ్డారు. సుమారు 60 కుస్తీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని కర్కెల్లి గ్రామానికి చెందిన గణేశ్ ఒంటి చేతితో ముగ్గురిని ఓడించి ప్రత్యేకత చాటుకున్నాడు. మహా రాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాలోని బిద్రెల్లికి చెందిన సాయినాథ్ విజేతగా నిలిచాడు. ఈయనకు గ్రామస్తులు రూ.5,100 నగదు, వెండి కడి యం, కొబ్బరికాయ అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అర్చకుడు జంగం మధు ఆధ్వర్యంలో గ్రామస్తులకు అంబలి పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. స్థానిక ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
జలం కోసం జనంలోకి..
● అడవిలో కనిపించని నీటిజాడ ● నీరు లేక వృథాగా సాసర్‌ఫీట్లు ● దాహంతో వన్యప్రాణుల విలవిల ● జనావాసాల్లోకి వస్తున్న వైనం ● ప్రమాదాల్లో చిక్కి మృత్యువాతకడెం: వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నా యి. వాగులు, వంకలు ఎండిపోయి అడవిలో చుక్క నీరు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దప్పికతో అల్లాడుతూ అడవంతా తిరిగినా చుక్క నీరు దొరకక వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామ శివారుల్లోని వ్యవసాయ బావులు, చెరువులు, కుంటల వద్దకు వచ్చి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యి. అడవి, వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న అటవీశాఖ వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించవడం లేదని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించని నీటి జాడ గతంలో వేసవి వచ్చిందంటే అటవీశాఖ వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేది. సిబ్బందితో అడవుల్లో ఏర్పాటు చేసిన సాసర్ఫీట్ల (నీటితొట్టెలు) లో ట్యాంకర్లతో నీటిని నింపేవారు. అక్కడికి వన్యపాణులు వచ్చి నీరు తాగి వెళ్లే వి. కానీ.. రెండేళ్లుగా సాసర్ఫీట్లలో నీటిని నింపేందుకు నిధులు కేటాయించడం లేదు. దీంతో అడవుల్లో సాసర్‌ఫీట్లు అలంకారప్రాయమయ్యాయి. కొ న్నిచోట్ల సోలార్పంపుల ద్వారా వీటిని నీటితో నింపుతున్నారు. అడవిలో చాలాచోట్ల నీటి జాడ లభించకపోవడంతో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని అటవీ సమీప గ్రామ శివార్లలోకి దాహార్తిని తీర్చుకునేందుకు వస్తున్న వన్యప్రాణులు నీటిలో పడడం, ఊర కుక్కలు వెంబడించడంతో మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ● ఈనెల 1న ఖానాపూర్ పట్టణంలోని పద్మావతినగర్లోకి వచ్చిన చుక్కల దుప్పిని కాలనీవాసులు రక్షించారు. దానిని క్షేమంగా అటవీ అధికారులకు అప్పగించారు. ● గత నెల 22న దస్తురాబాద్ మండలం అకొండపేట్ అటవీప్రాంతంలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిని ఊర కుక్కలు దాడిచేసి చంపేశాయి. ● గత నెల 8న కడెం మండలం చిట్యాల్ శివారులోని వ్యవసాయ బావి వద్దకు దాహార్తిని తీర్చుకునేందుకు చుక్కల దుప్పి వచ్చింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడగా గ్రామస్తులు రక్షించారు. ● గత నెలలో లక్ష్మీపూర్ బీట్ పరిధిలో దాహార్తిని తీర్చుకునేందుకు గ్రామ శివారులోకి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. దీంతో గాయపడ్డ అది మరణించింది. ● గత నెలలో ఖానాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, సాయిబాబా ఆలయం పరిసరాల్లోకి వచ్చిన దుప్పులను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు అప్పగించారు. ● ఫిబ్రవరి 28న కడెం మండలం చిట్యాల్ శివారులోని వ్యవసాయ బావి వద్దకు దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో గ్రామస్తులు రక్షించారు. దుప్పులను రక్షించినం మా గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్దకు అడవి జంతువులు వస్తున్నయ్. రెండు దుప్పులు నీళ్లు తాగేందుకు వచ్చి బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాతుండగా గ్రామస్తులమంతా వెళ్లి వాటిని రక్షించి ఫారెస్టోళ్లకు అప్పగించినం. – ధర్మాజీ రమేశ్, చిట్యాల్ నిధుల లేమితోనే.. రెండేళ్లుగా సాసర్ఫీట్ల నీటి నిర్వహణకు నిధులు కేటాయిండం లేదు. దీంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల సోలార్ మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. ఉన్నతాధికారులకు సమస్య వివరిస్తాం. – భవానీశంకర్, ఎఫ్‌డీవో -
గడువులోపు పూర్తయ్యేనా..?
● మరో రెండు నెలల్లో వర్షాకాలం ● గోదావరి నదిపై పూర్తికాని వంతెన ● దేగాం వద్ద ఇప్పుడే పనులు ప్రారంభం ● కొనసాగుతున్న భైంసా – బోధన్ ఎన్‌హెచ్ పనులు ● సెప్టెంబర్ 30 వరకు గడువుభైంసా/భైంసారూరల్: భైంసా నుంచి బోధన్‌ను కలిపే జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. అసంపూర్తి పనులపై స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భైంసా నుంచి బాసర వరకు ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలు, నాణ్యత లోపాలు, ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ రహదారి పనుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి అధికారులపై ఉంది. అసంపూర్తి నిర్మాణాలు.. భైంసా నుంచి బాసర వరకు 56 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి పనులు 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో చూస్తే అసంపూర్తి పనులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీలపై ఇప్పటికే పగుళ్లు ఏర్పడుతున్నాయి. దేగాం వద్ద ఇటీవల నిర్మించిన ఒక డ్రైనేజీపై లారీ ఎక్కగానే అది కుంగిపోవడం నాణ్యత లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. నిర్మాణ సంస్థ ప్రమాణాలను పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా పర్యవేక్షణ అధికారులు లోపాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. స్థానికుల ఇబ్బందులు.. రహదారి నిర్మాణం కారణంగా స్థానికులు రోజువారీ జీవనంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న పనుల వల్ల గ్రామాల్లో రోడ్డుకు ఆనుకుని నివసించే వారు, వ్యాపారాలు నడిపే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకల వల్ల ఎగిసే దుమ్ము, ధూళి ఇళ్లలో నిండిపోతుంది, దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వర్షపు నీటి డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. మరోవైపు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడం వల్ల నీటి ప్రవాహం సరిగా జరగడం లేదు. రూ.388 కోట్ల ప్రాజెక్ట్ భైంసా–బోధన్ జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణానికి రూ.388 కోట్ల నిధులు కేటాయించారు. 56 కిలోమీటర్ల ఈ రహదారి పనులు రెండేళ్లు దాటినా పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేగాం, టాక్లి–బిద్రెల్లి, మరియు బాసర వద్ద కీలకమైన వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం ఆలస్యమవుతోంది. అధికారులు సమస్యలను పరిష్కరించి, సెప్టెంబర్ 30, 2025 నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, వర్షాకాలం రెండు నెలల్లో ప్రారంభం కానుండటం ఆందోళన కలిగిస్తోంది. గోదావరి నదిపై బాసర వద్ద నిర్మిస్తున్న వంతెన సగం మా త్రమే పూర్తయింది, వర్షాకాలంలో నది ప్రవాహం కారణంగా పనులు కొనసాగించడం కష్టతరం. బాసర అండర్‌పాస్.. బాసరలో నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. దీంతో బాసర రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయానికి వచ్చే భక్తులు, ట్రిపుల్ఐటీ విద్యార్థులు, రైల్వే స్టేషన్‌ను ఉపయోగించే యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్ పూర్తయితే భారీ వాహనాలు నేరుగా నిజామాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతం ఈ ఆలస్యం స్థానిక రవాణాకు అడ్డంకిగా మారింది. గడువులోగా పనులు పూర్తి గడువులోగా పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తాం. భైంసా – బోధన్ రహదారి నిర్మాణ పనులు పూర్తయిన చోట రేడియం లైన్లు వేస్తున్నాం. రోడ్డు పక్కన ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో అక్కడక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అప్పటి వరకు ఆ పనులు కూడా పూర్తవుతాయి. – సుభాష్, డీఈఈసూచిక బోర్డులు లేక ప్రమాదాలు.. అసంపూర్తి నిర్మాణాలు రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నాలుగు నెలల్లో దేగాం వద్ద 13 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. భైంసా నుంచి బాసర వరకు మొత్తం 22 ప్రమాదాలు నమోదయ్యాయి. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేగాం, తరోడ, ముధోల్, బిద్రెల్లి, మరియు బాసర సమీప గ్రామాల వద్ద సుమారు అర కిలోమీటరు మేర పనులు నిలిచిపోయాయి, ఇది వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.నిర్మాణాలకు ఆటంకాలు గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు గత ఏడాదిన్నరగా కొనసాగుతున్నాయి, కానీ సగం మాత్రమే పూర్తయింది. మిగిలిన ఐదున్నర నెలల్లో ఈ పనులు పూర్తి చేయడం సవాల్‌గా కనిపిస్తోంది. దేగాం వద్ద గత నెలలో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడే పిల్ల ర్ల స్థాయిలో ఉంది. దీనిని గడువులోపు పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. టాక్లి–బిద్రెల్లి గ్రామాల మధ్య ఒక కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. వాగుపై వంతెన పనులు కూడా ఆగిపోయాయి. -
సర్కారుబడిలో పూర్వ ప్రాథమిక విద్య
● ప్రైమరీ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ.. ● రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం... ● అమలయితే జిల్లాలోనూ పెరగనున్న ప్రవేశాలు నిర్మల్‌ఖిల్లా: ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశా ల విద్యాశాఖ నిర్ణయించాయి. నర్సరీ, ఎ ల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలని ఆలోచన చే స్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఐదేళ్లలో పు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరగా, ఐదే ళ్లు నిండిన తర్వాతే వారు ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. అయితే, మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు పాఠశాలల్లో చే ర్పించడానికి ఆసక్తి చూపుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు, పూర్వ ప్రాథమిక విద్య ను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అ మలు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీ వీ.నరసింహారెడ్డి చర్యలు ప్రారంభించారు. ఈ అంశంపై తాజాగా సచివాలయంలో అధికారులతో చ ర్చలు జరిగాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్ర భుత్వ పాఠశాలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లా పరిస్థితి..జిల్లాలో ప్రస్తుతం ఐదు సంవత్సరాలలోపు పిల్లల కోసం 926 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా యి. అదే సమయంలో, జిల్లాలో 532 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెడితే, ఈ 532 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ తరగతులకు విద్యాబోధన బాధ్యతలను అంగన్వాడీ ఉపాధ్యాయులు లేదా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించాలా అనే విషయం ఇంకా నిర్ణయించాల్సి ఉంది.ప్రయోగాత్మక ప్రారంభం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఈ తరగతులను ప్రారంభించ డం ద్వారా, ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మల్ జి ల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో గత మూడు విద్యా సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియం విద్యను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు పూర్వ ప్రాథమిక తరగతులను కూడా ప్రవేశపెట్టడం ద్వారా, పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, తన నివేదికలో కీలక సూచనలు చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. -
‘గడ్డి మందు’పై పోరాటం
● పారాక్వాట్ నిషేధానికి డాక్టర్ల సంఘం ఏర్పాటు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో ఎంతోమంది నిండు ప్రాణాలను బలితీసుకుంటు న్న గడ్డి మందు(పారా క్వాట్) నిషేధమే లక్ష్యంగా పోరాటానికి ఓ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రంలో పలువురు ప్రైవేటు వైద్యులు కలిసి ‘డాక్టర్స్ అసోసియేషన్ అగెనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’ పేరుతో ఓ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించారు. మంచిర్యాల కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన డాక్టర్ సతీశ్ నారాయణచౌదరి, ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెంది న డాక్ట రాకేశ్ చెన్న, ప్రధాన కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ మానస మామిడాలతో సహా మరో ఆరుగురి వైద్యులతో కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ క్షణికావేశంలో గడ్డిమందు తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అనేక దేశాల్లో నిషేధించినా ఇక్కడ విరివిరిగా వాడకంతో అనర్థాలు ఉన్నాయని పేర్కొన్నా రు. ఈ విష రసాయన అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, పౌరులు తమతో కలసి రావాలని కోరారు. -
మాజీ కమిషనర్‌కు పరామర్శ
నిర్మల్‌టౌన్: ఉద్యానవన శాఖ రాష్ట్ర మాజీ కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన నేతలు శనివారం పరామర్శించారు. వెంకట్రాంరెడ్డి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ఆయనను జిల్లా నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరా మర్శించారు. నిర్మల్ జిల్లాకే చెందిన వెంకట్రాంరెడ్డి రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో జిల్లా రైతులకు విశేష సేవలు అందించారని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపా రు. దీర్ఘకాలం లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కల్పించి జిల్లా రైతులను ప్రోత్సహించారన్నారు. ఉద్యోగ విరమణ చేసినా జిల్లా రైతుల వ్యవసాయ క్షేత్రాల ను సందర్శిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారని తెలిపారు.త్వరగా కోలుకుని రైతులకు తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇందులో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
యూనిఫామ్ క్లాత్ వచ్చింది
నిర్మల్ రూరల్: వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులకు అందించే యూనిఫామ్‌కు సంబంధించిన క్లాత్ శనివారం జిల్లాకు చేరుకుంది. ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 48,874 మంది విద్యార్థులకు ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన వస్త్రం వచ్చింది. వీటిని త్వరలోనే ఆయా మండలాలకు సరఫరా చేయనున్నారు. దీనికోసం ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. మండలాలకు చేరిన యూనిఫామ్ వస్త్రాన్ని సరిచూసుకుని, ఆయా ఎమ్మార్సీలలో భద్రపరచాల ని.. తర్వాత పాఠశాల వారీగా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించి కుట్టించాలని డీఈవో రామారావు ఆదేశించారు. దీనికోసం మండలంలోని ఏపీఎంలను సంప్రదించాలని తెలిపారు. వస్త్రం పూర్తి వివరాలను వెంటనే పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. -
పచ్చని చెట్టే.. ప్రాణం
నిర్మల్: ఒక మొక్క నాటామంటే.. కేవలం మొక్కను పెంచుతున్నట్లు కాదు. మన ప్రాణం రక్షించుకుంటున్నట్లు.. ప్రాణవాయువును పెంచుకుంటున్నట్లు. మన జీవనాధారానికి ప్రాణం పోస్తున్నట్లు. బిడ్డను ప్రేమతో పెంచినట్లు పచ్చని చెట్టును సాకితే, అది ఆక్సిజన్, నీడ, పండ్లతో మీకు తిరిగి ఇస్తుంది. అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తూ మనమే మన ఆయుష్సును తగ్గించుకుంటున్నాం. ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇదే విషయం వెల్లడించింది. ఈ తీర్పు మనలో చెట్ల పట్ల బాధ్యతను గుర్తు చేస్తోంది. జిల్లాలోనూ చెట్ల నరికివేతను అడ్డుకుని, హరితవనాలను పెంచాలి. ఒక చెట్టు నాటితే బిడ్డను పెంచినంత ఆనందం.. భవిష్యత్‌కు భరోసా లభిస్తాయి. చెట్టు.. మన చుట్టం చెట్టు మనకు ఆక్సిజన్, ఆహారం, నీడను అందిస్తుంది. జగదీశ్చంద్ర బోస్ చెట్లలో ప్రాణముందని నిరూపించారు. కానీ, అడవులను నరికి, పచ్చదనాన్ని నాశనం చేస్తూ గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, వర్షాభావాన్ని కొనితెచ్చుకుంటున్నాం. చెట్టు లేనిదే మనిషి బతకలేడని అర్థం చేసుకోవాలి. జిల్లాలో చెట్ల నరికివేత అడవుల ఖిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. అధికారుల లెక్కల ప్రకారం 33శాతం వరకు జిల్లాలో అడవులు ఉన్నాయి. రెండు దశాబ్దాల్లో నాటిన చెట్ల కంటే నరికినవే ఎక్కువ. మామడ, సారంగపూర్, కుంటాలలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు అవి పంటభూములుగా మారాయి. దస్తురాబాద్‌లో హరితవనంలో మొక్కల నరికివేత, మైసంపేట ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 10,067 చెట్ల నరికివేత కేసులు నమోదయ్యాయి. చెట్ల రక్షణ.. అందరి బాధ్యత.. ప్రాణవాయువును ఇచ్చే చెట్లను లైట్‌గా తీసుకోవద్దు. ఓ మొక్కను పెంచడం చాలాకష్టం. అదే చెట్టును నరకడం చాలా ఈజీ. కానీ.. ఆ చెట్టు మనకు ఎంత మేలు చేస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అటవీశాఖ అనుక్షణం చెట్ల రక్షణ కోసం పనిచేస్తోంది. ఎక్కడ అడవులు, చెట్ల నరికివేతలు చేస్తున్నట్లు తెలిసినా వెంటనే చర్యలు చేపడుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పినట్లు చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత. – నాగినిభాను, డీఎఫ్‌వో చెట్టంటే.. మనిషితో సమానమే.. ఒక్కచెట్టు నరికితే.. రూ.లక్ష జరిమానా ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు పర్యావరణ ప్రేమికుల హర్షం మన బాధ్యతనూ మనం గుర్తించాలి..వివరాలు.. జిల్లాలో భూవిస్తీర్ణం: 3,56,251 హెక్టార్లు అటవీ విస్తీర్ణం: 1,21,660.20 హెక్టార్లు అటవీ శాతం: 33.08చెట్ల నరికివేత,కలప తరలింపు కేసులు.. ఖానాపూర్ డివిజన్ : 5,865 నిర్మల్ డివిజన్ :4,202ఇది కదా.. చెట్టంటే..! ఈ ఒక్క ఫొటో చాలదా..!? చెట్టు విలువ ఏంటో చెప్పడానికి. నోరున్న మనకై నా.. ఆ మూగజీవాలకై నా ఎలాంటి తేడా చూపకుండా పచ్చని ప్రేమను పంచుతోంది. లోకేశ్వరం చెరువు పక్కనున్న ఈ చెట్టు ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజసేవ చేస్తోంది. అందుకే.. చెట్టు మనకు దగ్గరి చుట్టం. దాన్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు.హైదరాబాద్‌లో నిరసనలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద వందల ఎకరాల్లో చెట్లను తొలగిస్తున్నారని స్థానికులు, పర్యావరణవేత్తలు నిరసన తెలిపారు. ఈ చర్యలు వన్యప్రాణులకు ముప్పు తెచ్చాయని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ తొలగింపును ఆపాలని ఆదేశించడంతో నిరసనకారులు ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉత్తరప్రదేశ్‌లోని మధుర–బృందావన్‌లో 454 చెట్లను చట్టవిరుద్ధంగా నరికినందుకు సుప్రీంకోర్టు రూ. 4.54 కోట్ల జరిమానా విధించింది. ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానాతో, పచ్చదనాన్ని కాపాడాలని గట్టి సందేశమిచ్చింది. ఈ తీర్పు పర్యావరణ ప్రేమికులను ఉత్తేజపరిచింది. -
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’
నిర్మల్‌టౌన్: కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్నవారంతా పేద, మధ్య తరగతి కుటుంబలకు చెందిన బాలికలే. గ్రామీణ ప్రాంతా ల్లో, అణగారిన వర్గాల్లో లింగ అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనిని నివారించేందుకు నిర్మల్ పోలీస్.. మీ పోలీస్.. అంటూ ఎస్పీ జానకీ షర్మిల పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇందులో భాగంగా ఆడపిల్లల సమస్యలను దగ్గరుండి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తొలిసారి జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఒక్కో పాఠశాలలను ఒక్కో మహిళ కానిస్టేబుల్ దత్తత తీసుకున్నారు. రాత్రి బస.. మహిళా పీసీలు విద్యార్థులతో కలిసి రాత్రి బస చేస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విద్యార్థినిలతో కలిసి బస చేశారు. వారితో కలిసి ముచ్చటించారు. వారితో కలిసే భోజనం చేశారు. సమస్యలు తెలుసుకున్నారు. వార్షిక పరీక్షల గురించి చర్చించారు. పరీక్షలు ఎలా రాయాలి.. ఎలా ప్రిపేర్ కావాలి.. అనే విషయాలు తెలియజేశారు. విద్యార్థినుల్లో ధైర్యం నింపారు. -
పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి
లక్ష్మణచాంద: సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొలుగోలు చేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు సీ్త్ర శిశు సంక్షేమశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డిని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు, సభ్యులు శుక్రవారం కలిశారు. వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు తెలిపారు. దీంతో సొసైటీలు ఆర్థికంగా బలోపేతమై రైతులకు ఎరువులు నాణ్యమైన విత్తనాలు, రుణాలు సకాలంలో అందించాయని పేర్కొన్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకపోతే సంస్థలు ఆర్థికంగా నష్టపోయి సిబ్బందికి కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజారతాయని వెల్లడించారు. మంత్రులను కలిసినవారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్‌రెడ్డి, పీఏసీఎస్‌ల చైర్మన్లు రమణారెడ్డి, పద్మాకర్‌రావు, గజ్జరాం, ప్రసాద్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌డ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మల్ చైర్మన్ ధర్మాజి రాజేందర్ ఉన్నారు. -
ప్లాంటేషన్‌ను సందర్శించిన ఎఫ్‌డీవో
కడెం: మండలంలోని ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని రాంపూర్ ప్లాంటేషన్‌లో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగింది. సుమారు ఎనిమిది వేల మొక్కలు కాలిపోయాయి. ఎఫ్‌డీవో భవానీశంకర్ శుక్రవారం ప్లాంటేషన్‌ను పరిశీలించి, మొక్కలకు నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు పూర్తిగా కాలిపోలేదని తెలిపారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మైసంపేట్ కుంటవద్ద సోలార్ మోటార్‌తో నీటిని నింపే పనులను పరిశీలించారు. ఎఫ్‌డీవో వెంట ఎఫ్ఆర్వో అనిత, డీఆర్వో ప్రకాశ్, అటవీ సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదు.. ● ఎమ్మెల్యే రామారావ్ పటేల్.. ● ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాకు సంఘీభావం.. బాసర: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు గుణపాఠం చెబుతారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం ధర్నా చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి మాట్లాడారు. జీవో 21తో ఏళ్లుగా పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తక్షణమే జీవను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 13 యూనివర్సిటీలో 900 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని తెలిపారు. అందులో 200 మంది మహిళా ప్రొఫెసర్లు అని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ముఖ్యమంత్రి వద్దకు వెళితే అరెస్ట్ చేసి నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి గెలిచాక మాట తప్పడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించండి ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌కి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వినతిపత్రం అందజేశారు. జీవో 21 రద్దు చేయాలని అధ్యక్షుడు శ్రీశైలం కోరా రు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని వీసీ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సభ్యులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మధుసూదన్, శ్రీధర్, హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
12 గంటలు
● తునికాకు సేకరణకు వెళ్లి తప్పిపోయిన మహిళలు ● గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో దారితప్పిన వైనం.. ● ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ.. ● ఎస్పీ చొరవతో క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు అడవిలో.. తప్పిపోయిన మహిళలను కప్పనపల్లి గ్రామానికి తీసుకు వస్తున్న ఎస్పీకి పూలతో స్వాగతం పలుకుతున్న గ్రామస్తులుగ్రామస్తులు, పోలీసుల గాలింపుమహిళలు రాత్రి 8 గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి 50 మందితో రెండు బృందాలుగా ఏర్పడి రాత్రంతా గాలింపు చేపట్టారు. లొంకపాడు లోయ సమీపంలోకి వెళ్లగా, గ్రామస్తుల అరుపులు మహిళలకు వినిపించాయి. వారు ‘‘రక్షించండి’’ అని కేకలు వేసినా, ఆ శబ్దం గ్రామస్తులకు వినిపించలేదు. దీంతో రాత్రంతా గాలింపు ఫలితం ఇవ్వలేదు.ఆ నలుగురు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి నిమిత్తం తునికాకు సేకరణకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే గురువారం మధ్యాహ్నం తునికాకు సేకరణకు వెళ్లారు. ఆకు సేకరించుకుని తిరిగి ఇంటికి బయల్దేరారు. కానీ, అప్పటికే చీకటి పడడం, ఒక్కసారిగా గాలిదుమారం, ఉరుములు, మెరుపులు రావడంతో ఆందోళనతో దారితప్పారు. ఎటు వెళ్లాలో తెలియక అడవిలోనే చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటలపాటు రాత్రంతా దట్టమైన అడవిలోనే గడిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎటువైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో అని ఊపిరి బిగపట్టుకుని కంటి రెప్ప వాల్చకుండా గడిపారు. శుక్రవారం ఉదయం ఎస్సీ జానకీ షర్మిల చొరవతో నలుగురినీ సురక్షితంగా ఇంటికి చేర్చారు. – మామడ మామడ మండలం కప్పన్‌పల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ వ్యవసా య కుటుంబాల నుంచి వచ్చినవారు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి కోసం వారు సమీప అటవీ ప్రాంతంలో తునికాకు సేకరిస్తుంటారు. సేకరించిన ఆకును కట్టలుగా కట్టి విక్రయించడం, బీడీలు చుట్టడం ద్వారా వారు ఆదాయం పొందుతారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు నలుగురూ తునికాకు సేకరణకు అడవికి బయలుదేరారు. త్వరగా తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. దారితప్పిన ఘటనమహిళల కథనం ప్రకారం, సాయంత్రం 5 గంట ల వరకు ఆకు సేకరించి ఇంటికి బయలుదేరారు. అయితే, ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్మ డం, గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో చీకటి కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యా రు. వచ్చిన దారిని మరచిపోయారు. ధైర్యంగా గ్రామం వైపు నడిచినా, ఎంతసేపు నడిచినా ఊరు కనిపించకపోవడంతో భయం ఆవహించింది. రాత్రి 7 గంటలకు పూర్తిగా చీకటి పడింది. గుట్టలు, లోయలతో కూడిన దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. తాము దారి తప్పామని గుర్తించి, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ, సిగ్నల్ అందకపోవడంతో సంప్రదింపులు కుదరలేదు. చేసేదేమీ లేక, ఒక చెట్టు కింద కూర్చుని రాత్రంతా భయంతో గడిపారు. వన్యప్రాణుల దాడి భయంతో కేకలు వేస్తూ, కంటిరెప్ప వాల్చకుండా గడిపారు. ఉదయం ఫోన్ సిగ్నల్‌తో ఆశ..శుక్రవారం ఉదయం 6 గంటలకు సూర్యోదయంతో కొంత వెలుగు రావడంతో మహిళలు సమీపంలోని చెట్టు ఎక్కి ఫోన్ సిగ్నల్ కోసం ప్రయత్నించా రు. అయినా సిగ్నల్ రాలేదు. చివరకు లోయ నుంచి గుట్టపైకి ఎక్కారు. అక్కడ సిగ్నల్ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి స్థానాన్ని గుర్తించారు. అయితే, దట్టమైన అడవి, గుట్టల కారణంగా ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది. గ్రామస్తుల స్వాగతంమహిళలను సురక్షితంగా తీసుకొచ్చిన ఎస్పీ జానకీ షర్మిలకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె చొరవ, సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు వచ్చినా.. గుర్తించలేదు తునికి ఆకు కోసం వచ్చి తప్పిపోయామనే సమాచారంతో గ్రామస్తులు మ మ్మల్ని వెతికేందుకు రాత్రి అడవిలోకి వచ్చారు. మేము ఉన్న ప్రాంతానికి సమీపంలోకి వచ్చినా మమ్మల్ని గుర్తించలేదు. మేము ఎంత అరిచినా మా గొంతు వారికి వినిపించలేదు. దీంతో గుర్తించలేకపోయారు. – బత్తుల సరోజ చెట్టెక్కి ఫోన్ చేసినా.. అటవీ ప్రాంతంతోనే చీకటి పడడంతో చెట్టుకింద కూర్చున్నాం. ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించాం. సిగ్నల్ రాలేదు. చివరకు చెట్టు ఎక్కి ఫోన్ చేశాం. అయినా ఫలితం లేదు. సమాచారం అందించలేక పోయామని ఏడ్చాను. – కంబాల లింగవ్వ రాత్రంతా భయం.. భయంగా తునికి ఆకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాం. చీకటి పడటంతో వచ్చిన దారి మర్చిపోయాం. గుట్టకింద చిక్కుకు పోయాము. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందోనని భయంతో తెల్లవారే వరకు నిద్ర కూడా పోలేదు. – రాజుల రాధ తెల్లారితే బతికినట్లే అనుకున్నం.. అటవీ ప్రాంతంలో దారి తప్పడంతో చెట్టుకింద కూర్చున్నం. రాత్రి అటవీ జంతువుల నుంచి రక్షించుకోవడం కష్టం అనుకున్నాం. తెల్లారితే బతికినట్లే అనుకున్నం. ఉదయం మా కోసం వచ్చిన ఎస్పీ జానకీ షర్మిల,పోలీసులను చూడగానే మాకు ధైర్యం వచ్చింది. – గట్టుమీది లక్ష్మి ప్రజలకు రక్షణగా.. తునికాకు కోసం వెళ్లిన మహిళలు అటవీ ప్రాంతంలో తప్పిపోయారని ఉదయం సమాచారం అందింది. రాత్రి పోలీసులు, గ్రామస్తులు గాలించారు. ఆచూకీ లేకపోవడంతో 50 మంది పోలీసులతో ఉదయం అడవిలోకి వెళ్లాం. మహిళలు ఉన్న ప్రాంతాన్ని సెల్ సిగ్నల్ ఆధారంగా గుర్తించాం. వారు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. నలుగురిని సురక్షితంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాం. అనుక్షణం ప్రజలకు రక్షణగా ఉంటాం. – జానకీషర్మిల, ఎస్పీ -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
● అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ● కలెక్టరేట్లో ఘనంగా జయంతి వేడుకలునిర్మల్చైన్గేట్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. పూలే జయంతి వేడుకలను కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే పోరాడారన్నారు. నాటి కాలంలో ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల విద్యకు కృషి చేశారన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలి బాలిక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. పూలే జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహనీయుల జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. జిల్లా కేంద్రంలో జ్యోతిబాపూలే భవనం, విగ్రహం ఏర్పాటు కోసం పలువురు సంఘ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేయగా, జ్యోతిబాపూలే భవన ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తామని అదనపు కలెక్టర్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్‌గౌడ్, మైనారిటీ అధికారి మోహన్ సింగ్, సీపీవో జీవరత్నం, ఎల్డీఎం రామ్‌గోపాల్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు నర్సాగౌడ్, భాస్కర్, ప్రభాకర్, మనోజ్, ముడుగు సత్యనారాయణగౌడ్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో..బాసర:బాసరలోని ఆర్జీయూకేటీలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.పూలే సంఘ సంస్కర్తగా చేసిన కృషిని, విద్యా విప్లవానికి తీసుకువచ్చిన మార్గదర్శనాన్ని వివరించారు. కులమత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే వంటి మహోన్నతులను స్మరించుకోవడం అవసరమన్నారు. అనంతరం మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డాక్యుమెంటరీ, పోస్టర్ ప్రజెంటేషన్, స్కిట్స్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్, అసోసియేట్ డీన్ నాగరాజు, నాగాంజనేయులు, సతీశ్‌కుమార్, డాక్టర్ విజయ్‌కుమార్, శ్యాంబాబు, రంజిత్‌కుమార్, శ్యాంసుందర్, లింబాద్రి, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ జయంతిని ఏప్రిల్ 11న అధికారికంగా నిర్వహించడంతోపాటు సెలవుదినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏప్రిల్ 11 నాటికి నిర్మల్ నడిబొడ్డున మహాత్మా జ్యోతి బాపూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోకన్వీనర్లు కత్రోజు అశోక్‌చారి, సిరికొండ రమేశ్, జింక లక్ష్మి నారాయణ, కొట్టూరీ కిషన్, అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్, నరేందర్ పాల్గొన్నారు. -
ఎస్పీ జానకీ షర్మిల చొరవ
మహిళలు అడవిలో తప్పిపోయారన్న సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు, అటవీశాఖ అధికారుల సహకారంతో గాలింపు చేపట్టారు. సాంకేతికత, డ్రోన్ సాయంతో మహిళలు ఉన్న స్థలాన్ని గుర్తించారు. కాలినడకన, ద్విచక్ర వాహనాలపై దాదాపు ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చివరకు వారిని కనుగొ న్నారు. ఎస్పీని చూసిన వెంటనే మహిళలు కన్నీళ్లతో పరుగెత్తుకొచ్చారు. ఎస్పీ వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. నీరసంగా ఉన్న వారికి మంచినీరు, పండ్లు అందించారు. అనంతరం ట్రాక్టర్లో వారితో పాటు ప్ర యాణించి గ్రామానికి సురక్షితంగా తీసుకొచ్చారు. నలుగురినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమవారు క్షేమంగా రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
సన్నబియ్యం రోడ్డుపాలు
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయతే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లారీ డ్రైవర్లు బియ్యాన్ని నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు. సారంగాపూర్ మండలం చించోలి గ్రామ శివారులో ఉన్న గోదాములో బియ్యాన్ని జిల్లా కేంద్రానికి శుక్రవారం తరలిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ ఏరియాలో ప్రధాన రహదారిపై బస్తాలు కిందపడ్డాయి. రోడ్డుపై పడ్డ బియ్యాన్ని హమాలీలు సంచుల్లోనింపి తర్వాత లారీలో వేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
ఐటీడీఏ పీవోకు నివేదిక
● ఇటీవల ఆశ్రమ పాఠశాలల్లో తనిఖీ ● సమగ్ర నివేదిక అందించిన పారాలీగల్ వాలంటీర్లు ● అభినందించిన కలెక్టర్ ● త్వరలో ఆస్పత్రుల పరిశీలననిర్మల్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వేసవి సెలవుల్లో పరిష్కరించాలని జిల్లా పారాలీగల్ వాలంటీర్ల బృందం సభ్యులు గురువారం ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తాను కోరా రు. జిల్లా న్యాయసేవాసాధికార సంస్థ చైర్మన్, న్యా యమూర్తి రాధిక ఆదేశాల మేరకు ఇటీవల 22 మందితో కూడిన పారాలీగల్ వాలంటీర్లు జిల్లాలోని 17 ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. ఈమేరకు సదరు నివేదికను న్యాయమూర్తితోపాటు కలెక్టర్ అభిలాషఅభినవ్కు అందించారు. అనంతరం ఉట్నూర్ వెళ్లి ఐటీడీఏ పీవోను కలిసి సమగ్ర నివేదిక అందించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులను బృందం సభ్యుడు, పెన్షనర్స్ సంఘం జాతీయనేత ఎంసీ.లింగన్న ఆమెకు వివరించారు. త్వరలో ఆస్పత్రుల పరిశీలన..పారాలీగల్ వాలంటీర్ల సేవలను కలెక్టర్ అభిలాషఅభినవ్ ప్రశంసించారు. బృందంలో ఉన్నవారందరూ రిటైర్డ్ అయిన పెన్షనర్స్ ఉన్నప్పటికీ పకడ్బందీగా సర్వీస్ చేస్తున్నారని అభినందించారు. ఆశ్రమ పాఠశాలలపై ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. న్యాయసేవాసాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలన చేపట్టనున్న నేపథ్యంలో బృందం సభ్యులతో కలిసి కలెక్టర్ సంబంధిత వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పారాలీగల్ వాలంటీర్ల బృందం సభ్యులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
నీటి వనరులను సంరక్షించుకోవాలి
మామడ/సారంగపూర్: నీటి వనరులను సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ జిల్లా పంచాయతీ, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్అన్నారు. మామడ మండలంలోని కొరిటికల్ గ్రామం, సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా వాటర్‌షెడ్ యాత్రను గురువారం వేర్వేరుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటియొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా సకాలంలో వర్షాలు కురవకుంటే సాగుపై ప్రభావం చూపుతుందన్నారు. వర్షం నీటిని కాపాడుకోవడానికి నీటి కుంటలు, రాళ్ల కట్టలు, కందకాలు, ఫాం పాండ్, చిన్న నీటి కంటలు, చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. ఇలా చేస్తే వర్షపు నీరు భూమిలో ఇంకుతుందని తెలిపారు. వాటర్షెడ్ల ద్వారా నిలిచిన నీటిని పచ్చదనం పెంపొందించేందుకు, భూగర్భ జలాల పెంపునకు, వ్యవసాయానికి వినియోగించకోవచ్చని వివరించారు. అనంతరం నీటి విలువను తెలిపే వీడియోను ప్రజలకు చూపించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో అజీజ్‌ఖాన్, ఏపీడీ ఓస ప్రసాద్, సెర్ప్ ఏపీఎం అరుణ, సారంగాపూర్ మండల ప్రత్యేకాధికారి బాలిక్ అహ్మద్, ఎంపీడీవో లక్ష్మికాంత్‌రావు, తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీం అజీజ్‌ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, డీఆర్వో నజీర్‌ఖాన్, స్థానిక నాయకులు బాపురెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, జిల్లా పంచాయతీ, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ వాటర్‌షెడ్ యాత్రలు ప్రారంభం -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
నిర్మల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు, సాధారణ కాన్పులు పెంచేలా కృషిచేసిన ఆశ కార్యకర్తలు సవిత, రుక్మిణి, మమత ను గురువారం సన్మానించారు. ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ అరవింద్ , డాక్టర్లు శ్రీనివాస్, సౌమ్య, రాకేష్, ప్రియాంక, శైలజ, నర్సింగ్ అధికారులు అన్నపూర్ణ, జ్యోతి, లలిత పాల్గొన్నారు. -
రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
లోకేశ్వరం: మండలంలోని రాజూర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పతాని నడ్పి మల్లన్న కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్‌తో కలిసి గురువారం పరామర్శించారు. ఆత్మహత్యకు కారణాలు అడిగి తెలు సుకున్నారు. అంతకుముందు మల్లన్న వ్యవసాయా భూమిలో వేసి న బోర్లను పరిశీలించారు. రైతు చేసిన అప్పులు గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలు సుకున్నారు. ప్రైవే టు వ్యక్తులు, బ్యాంకులో ఎంత మేరకు అప్పులు ఉన్నయని ఖాతాల ను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. వారివెంట ము ధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్, ఏసీవో మౌనిక ఉన్నారు. -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఇంటర్ మూల్యాంకనం గురువారంతో ముగిసింది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 21న ప్రారంభమై సుమారు 21 రోజులపాటు కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,35,000 జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేశారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 200 మంది అధ్యాపకులు స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు. మరో రెండు రోజులపాటు మాస్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మూల్యాంకనం విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఐఈవో జాదవ్ పరుశురాంను గజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. మరో 12 రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని డీఐఈవో తెలిపారు. -
అర్ధశతాబ్దపు ఆత్మీయ సమ్మేళనం!
వారు 1975–76లో సోమవార్‌పేట బాలికల ఉన్న త పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. కొంతమంది రిటైర్ కూడా అయ్యారు. అర్ధ శతాబ్దం తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారికోసం ఆరా తీశారు. చిరునామా తెలుసుకుని వారి ఇంటికి వచ్చారు. పూర్వ విద్యార్థులంతా వారంతా గురువారం ద్యాగవాడలో ఒక్కచోట కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నరసమ్మ, మలా మీనన్(సుమారు 90 ఏళ్లు)ను ఆత్మీయంగా సత్కరించారు. పాదాభివందనం చేశారు. ఇందులో పూర్వ విద్యార్థులు సుజాత దేవి, జయశ్రీ, భాగ్యలక్ష్మి, వీణ, కవిత, కృష్ణకుమారి, సుజాత, హేమలత, సునీత, ప్రభలత, శోభ, ఇందుమతి, మాయ, రత్నమాల తదితరులు పాల్గొన్నారు. – నిర్మల్‌ఖిల్లా -
పేదలపై పన్నులు.. సంపన్నులకు రాయితీలు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రస్తుత ప్రభుత్వాలు పేదలపై పన్నులు వేస్తూ సంపన్నులకు రాయితీలు ప్రకటిస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న అన్నారు. వంట గ్యాస్ ధరలు రూ.50, డీజిల్ ,పెట్రోల్‌పై రూ.2 సుంకం పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కట్టెల పొయితో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కె.రాజన్న మాట్లాడుతూ పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం చేస్తామన్నారు. అంతర్జాతీయంగా డీజిల్ గ్యాస్ ధరలు తగ్గినా దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమన్నారు. ఈ చర్యలతో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం ఆకలి, దారిద్రం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను అదుపు చేయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నిరసనలో నాయకులు ఎం.బక్కన్న, ఆర్.రామలక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రేష్మ, దేవక్క పాల్గొన్నారు. -
● ఆహ్లాదమా.. అడ్రసెక్కడా..!? ● వేసవిలో సేదతీరే.. చోటేది..!? ● ఎండిన చెట్లు.. కోల్పోతున్న ఆనవాళ్లు ● పట్టించుకున్నచోట పచ్చదనం ● ప్రకృతివనాలపై ‘సాక్షి’ విజిట్
ఆహ్లాదం.. బహుదూరంనిర్మల్ నర్సాపూర్(జి) మండల కేంద్రంలో పల్లెప్రకృతివనం ఊరి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది. పర్లేదు.. అక్కడిదాకా వెళ్లి కాసేపు ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే.. పక్కనే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేశారు. ప్రకృతివనం పచ్చగానే ఉన్నా.. పర్యావరణం సరిగా లేకపోవడంతో ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు.‘రూర్బన్’ తీరిది..కుంటాల: మండలంలోని కల్లూరు సాయిబాబా ఆలయ ఆవరణలో రూ.60 లక్షల రూర్బన్ నిధులతో పార్కును ఏర్పాటు చేశారు. ఏమాత్రం నిర్వహణ లేదిక్కడ. చెట్లు ఎండిపోయాయి. ఫౌంటేన్, ఆటవస్తువులు, సిమెంట్ బెంచీలు, జిమ్ పరికరాలు విరిగిపోయాయి. బాగానే ఉన్నా..!సోన్: మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, కూచన్‌పల్లి, సంగంపేట, మాదాపూర్ పల్లెప్రకృతి వనాలను విజిట్ చేయగా, చూడటానికి బాగానే ఉన్నా.. సరిపడా నీరందక మొక్కలు ఎండుతున్నాయి. ఇంకా కొంత నిర్వహణ చేయాల్సి అవసరం ఉంది. చెట్లు మాత్రమే ఉన్నాయి..సారంగపూర్: మండలంలోని జామ్, దుర్గానగర్‌లో పల్లె ప్రకృతివనాల్లో చెట్లు ఉన్నా.. ఏమాత్రం పచ్చదనం, కనీస సౌకర్యాలు లేవు. చూడటానికీ కళావిహీనంగా మారాయి. మియావాకీ.. సౌకర్యాలేవీ!తానూరు: మండలం ఉమ్రి(కె)లో పచ్చని చెట్ల మధ్య వాకింగ్ చేయడానికి మియావాకీ పద్ధతిలో ప్రకృతివనం ఏర్పాటు చేశారు. జిల్లాలో పేరొందిన ఈ పార్కు బాగానే ఉన్నా.. పిల్లల ఆటవస్తువులు, జిమ్పరికరాల వంటి సౌకర్యాలు కల్పించాలి. మాటేగాం.. నిర్వహణలోపంభైంసారూరల్: మండలం మాటేగాంలో పచ్చని ప్రకృతివనం ఉన్నా.. నిర్వహణ, పరిశుభ్రత లోపాలతో ఆకట్టుకోవడం లేదు. దేవునిగూడెంలో ఎండిపోయిన మొక్కలుఅక్కడలా.. ఇక్కడిలా.. లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో పరిశీలించగా, ఊరికి దూరంగా ఉన్నాయి. పట్టించుకునే నాథుడు లేక, అవి పల్లె ప్రకృతి వనాలేనా..! అన్నట్లు తయారయ్యాయి. ఇదే మండలంలోని పొట్టపల్లి(కె)లో నిండుగా పచ్చనిచెట్లతో కళకళలాడుతోంది. జిల్లాలో ఉత్తమ పల్లె ప్రకృతివనంగా గుర్తింపుపొందింది.ఎండిన ప్రకృతివనం.. దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెంలో నీళ్లు లేక పల్లె ప్రకృతివనం ఎండిపోయింది. పచ్చగా ఉండాల్సిన పార్కు నీళ్లు లేక కళావిహీనంగా మారింది. -
చరిత్రలో నిలిచిన వీరుడు రాంజీ గోండు
నిర్మల్‌చైన్‌గేట్: 1836 నుంచి 1860 వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిజాం దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల పక్షాన సాయుధ పోరాటాన్ని నడిపించిన గొప్ప నాయకుడు రాంజీ గోండు అని పలువురు వక్తలు కొనియాడారు. రాంజీ గోండు అమరత్వానికి 165 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాంజీ గోండు వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఖురానాపేట్ సమీపంలోని వెయ్యి ఉరుల ప్రాంతంలో ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పూజలు, గోండు సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ర్యాలీగా బయలుదేరి చైన్‌గేట్ వద్ద రాంజీగోండు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ జిల్లా కార్యదర్శి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు తొడసం శంభు ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రాంజీ గోండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రాంజీ గోండు విగ్రహ స్థలాన్ని జాతీయ స్థాయిలో చారిత్రక స్మారకంగా అభివృద్ధి చేయాలని కోరారు. టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు పంద్రం ఆనంద్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ పోశెట్టి, సోయం సూర్యభాను, ఉయిక భీంరావు, అర్జున్, పంద్రం సుజాత, శోభ, ఈశ్వర్, వినోద్, నాగరావు, ఎల్ల య్య, లక్ష్మణ్, గణేశ్, రాము పాల్గొన్నారు. వీరులను స్మరించుకోవాలి నిర్మల్ గడ్డపై పోరాడి ప్రాణత్యాగం చేసిన రాంజీ గోండు సహా వెయ్యిమంది వీరులను స్మరించుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. వారి త్యాగాల గురించి ముందు తరాలకు తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాంజీ గోండు వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆయన చిత్రపటం, చైన్గేట్లోగ ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో ఆంగ్లేయులు, నైజాం పాలకులతో పోరాటం సాగించి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఈ నేలపై నడిపిన గోండు వీరుడే రాంజీగోండు అని కొనియాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇక సులువుగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు
● 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి ● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు ● నిర్మల్‌లో నేటి నుంచి ప్రారంభంనిర్మల్చైన్గేట్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులు వు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ద స్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరి కొత్త సంస్కరణల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా జిల్లాలోని నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. స్లాట్ బుకింగ్ విధానం అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రోజుకు కనీసం 48 స్లాట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ల కోసం అందించడంతో జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజువారీ పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజు దారులు నేరుగా https:// registration. tela ngana. gov. in ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్లా ట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10–15 నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది. స్లాట్ బుకింగ్ లేకున్నా ఐదింటికీ.. స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వా త కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చే సుకోని ఐదు డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతీరోజు సాయంత్రం 5నుంచి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. త్వరలోనే ఆధార్ ఈ–సంతకం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసేవారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమ యం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ–సంతకం విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సమయం ఆదా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద స్లాట్ బుకింగ్ విధానంలో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ సమయం ఆదా అవుతుంది. దీనికి తోడు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరగదు. – రవికిరణ్, సబ్ రిజిస్ట్రార్, నిర్మల్ -
సాగునీరు అందించాలని రాస్తారోకో
కడెం: సదర్మట్ ఆయకట్టుకు మరో తడి సాగు నీ రందించాలని రైతులు బుధవారం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామం వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈనెల 9తో సదర్మట్ ఆయకట్టుకు సాగునీటి విడుదల ముగి యనుండగా రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తు తం వరి పొట్ట దశలో ఉందని తెలిపారు. మరో తడి సాగు నీరందించి ఆదుకోవాలని కోరారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ రైతులతో ఫోన్లో మాట్లాడారు. సాగు నీటి కోసం ఆందోళన చెందవద్దని తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీరందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పీహెచ్‌సీల్లో వసతులు కల్పించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్షనిర్మల్చైన్గేట్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులతో ఆమె సమావేశమయ్యారు. మండలాల వారీగా పీహెచ్‌సీల్లో వసతులు, మరమ్మతులు, ఇతర సామగ్రికి సంబంధించిన వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అత్యవసర సేవలు, ప్ర సూతి సంబంధిత సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విశ్రాంత ఉద్యోగులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, పీఆర్ ఈఈ శంకరయ్య, పంచాయితీరాజ్ ఇంజినీరింగ్, వైద్యశాఖల అధికా రులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఎంసీ లింగన్న తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరణ కలెక్టరేట్లోని తన కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పోషణ పక్షం ప్రచార పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆవిష్కరించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపంపై విస్తృత అవగాహన కలిగేలా అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టర్లు ప్రదర్శించాలని అధికా రులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వ రకు జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో నాగమణి, ఏసీడీపీవో నాగలక్ష్మి, జిల్లా ఆస్పత్రి ప ర్యవేక్షకుడు గోపాల్‌సింగ్, ఎంసీహెచ్ డాక్టర్ సరో జ, జిల్లా సమన్వయకర్త నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
వీరులకు.. గుర్తింపునివాళి
నిర్మల్వనమహోత్సవంపై దృష్టి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నా టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతోంది. గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259లోu చరిత్రకెక్కని చరితార్థులు స్వాతంత్య్రం కోసం నిర్మల్ గడ్డపై ఆంగ్లేయులు, నైజాంసేనలతో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులు చిరస్మరణీయులను డాక్టర్ కృష్ణంరాజు కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో జలియన్‌వాలాబాగ్ కంటే ముందే జరిగిన అత్యంత ఘోరమైన వెయ్యిఉరులమర్రి ఘటనపై చరిత్రలో పెద్దగా ప్రస్తావన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాంజీసహా వెయ్యిమంది వీరులు చరిత్రకెక్కని చరితార్థులని కొనియాడారు. పాలకులు, అధికారులు ఇప్పటికై నా నిర్మల్ చరిత్రకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై రాంజీ గోండు విగ్రహం పెట్టడమే కాకుండా, పాఠ్యాంశంలో చేర్చి ముందుతరాలకు అందించాలని కోరారు. నేటి యు వత రాంజీ పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవా లని సూచించారు. చరిత్ర పరిరక్షణతో పాటు భావి తరాలకు అందించాలన్న లక్ష్యంతో ‘సాక్షి మీడియా’ చేస్తున్న అక్షరకృషి అభినందనీయమని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా యువకవి ఆయిటి సాహితీ ‘అడవి బిడ్డలను ఆయుధాలుగా మలచి..’ అంటూ అప్పటికప్పుడు కవిత వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రాంజీగోండు స్మారక సమితి కన్వీనర్ పోలీస్ భీమేశ్, లైబ్రేరియన్ దీపక్, రాజమణి, సంకల్ప్ సొసైటీ కన్వీనర్ కిశోర్, సాక్షి జిల్లా ఇన్చార్జి రాసం శ్రీధర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కై లాశ్, యువతీయువకులు పాల్గొన్నారు. అమరుల స్ఫూర్తిని నింపేలా.. ‘వెయ్యిఉరులమర్రి’ పాఠ్యాంశమవ్వాలి నిర్మల్‌లో స్మారక కేంద్రం నిర్మించాలి రాంజీగోండు కాంస్యవిగ్రహం పెట్టాలి ‘సాక్షి’ ఆధ్వర్యంలో త్యాగాలదినం రాంజీ సహా వెయ్యిమంది అమరవీరులకు అధికారికంగా గుర్తింపునివ్వాలని యువత డిమాండ్ చేసింది. వెయ్యిఉరులమర్రి చరిత్రను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు స్థానికంగా భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. జిల్లా కేంద్రంలోని డాక్టర్స్‌లైన్‌లో గల డాక్టర్ కావేరీ లైబ్రరీలో రాంజీగోండు స్మారక సమితి సహకారంతో బుధవారం ‘సాక్షి మీడియా’ ఆధ్వర్యంలో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరుల త్యాగాలదినం నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజికవేత్త, డాక్టర్ కృష్ణంరాజు, యువతీయువకులు రాంజీగోండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెయ్యిమంది అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలంటూ రెండునిమిషాలు మౌనం పాటించారు. –నిర్మల్ పూర్తిపాఠంగా పెట్టాలి దేశచరిత్రలోనే అరుదైన వెయ్యిఉరులమర్రి ఘటనను ఇప్పటికై నా పూర్తిపాఠంగా విద్యార్థులకు అందించాలి. రాంజీగోండు సహా వెయ్యిమంది చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని వివరించాలి. – అరుణ్, నిర్మల్ నిర్మల్ చరిత్రను గుర్తించాలి వందలఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని పాలకులు ముందునుంచీ చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పటికై నా ఇక్కడి చరిత్ర, చారిత్రక కట్టడాలను ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకురావాలి. – విశాల్, నిర్మల్ చాలామందికి తెలియదు నిర్మల్ గడ్డపైనే రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులు చేసిన పోరాటం, వారి ప్రాణత్యాగాల గురించి ఇప్పటికీ చాలామంది తెలియదు. మన చరిత్రను విస్తృతంగా తెలియజెప్పాలి. – నిఖిత, నిర్మల్ -
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాజీనామా
బాసర: జీవో 21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బాసర ఆర్జీయూకేటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదనపు బాధ్యతలు స్వీకరించలేమంటూ విధులకు రాజీనామా చేశారు. ఆర్జీ యూకేటీ వీసీ గోవర్ధన్‌కు బుధవారం మూకుమ్మడిగా రాజీనామా లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా టీచింగ్‌తో పాటు పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమవంతు కృషి చేసినప్పటికీ తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పా రు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విన్నవించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. అందుకే రాజీనామా లేఖ అందించినట్లు చెప్పారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
డీఫ్యాక్టో సీఎం మీనాక్షి నటరాజన్
● రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం ● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవా రం మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ నేరుగా సచి వాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడం ద్వారా రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం అని చెప్పకనే చెప్పారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పగ్గాలను రాహుల్‌గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టు అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పిన విషయం గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనక రాహుల్‌గాంధీ ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోనే తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాలన్నారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ తమ విధానమంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజ్ నిరూపించారని ఎద్దేవా చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వయలార్ రవి వంటి నేతలు ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కారును రాహుల్‌గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారని విమర్శించారు. సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చులకన చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్నించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్నారు. ఇదేనా మార్పు, రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అని ఎద్దేవ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్ , ముత్యంరెడ్డి, జమాల్, విలాస్, విజయ్, తిరుమలాచారి, ముత్యం పాల్గొన్నారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
● డీసీహెచ్ఎస్ సురేశ్ భైంసాటౌన్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సే వలందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్ అన్నా రు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఓపీ గదుల్లో వైద్యుల హా జరు, ఓపీ నమోదు, రోగులకు అందిస్తున్న సేవల ను పరిశీలించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హా జరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. పలు వార్డుల్లో కలియదిరుగుతూ ఇన్‌పేషెంట్లకు సంబంధించి కేస్‌షీట్లు పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రసూతి వార్డులో మూత్రశాల వసతి లేకపోవడంతో, అందుబాటులోకి తేవాలని సూపరింటెండెంట్ కాశీనాథ్‌ను ఆదేశించారు. అలాగే క్యాజువాలిటీలో మందుల నిల్వలు సక్రమంగా నిర్వహించకపోవడం, కట్లు కట్టే గదిలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీ చేస్తానని హెడ్ నర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్‌ను హెచ్చరించారు. అనంతరం ఫార్మసిస్ట్ గది లో మందుల నిల్వలు పరిశీలించారు. గడువు ముగి సే మందుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు. ఏ ఓపీ గదిలో ఏ వైద్యు డు అందుబాటులో ఉన్నారో రోగులకు తెలిసేలా రిజిస్టర్ మెయింటేన్ చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు కొందరు రోగులకు తమ ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని ఓ సామాజిక కార్యకర్త ఆయన దృష్టికి తేగా, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. బాసర సీహెచ్‌సీకి స్థలం కేటాయించాలి... బాసరలో 30 పడకలతో సీహెచ్‌సీ నిర్మాణానికి గ్రా మంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ను కోరారు. భైంసాకు వచ్చిన ఆయన ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. బాసరలో ప్రస్తుతమున్న పీహెచ్సీ అర ఎకరంలో మాత్రమే ఉందని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు పర్యాటకుల తా కిడి ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో భవి ష్యత్ అవసరాల దృష్ట్యా సీహెచ్‌సీ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. రూ.5.75 కోట్ల నిధులు మంజూరుతోపాటు టెండర్ పూర్తయిందని తెలిపారు. -
సన్నబువ్వ తిని.. సమస్యలు తెలుసుకుని..
● తర్లపాడ్‌లో సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో కలెక్టర్ భోజనం ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం భోజనం చేశారు. ముందుగా ఎస్సీ కాలనీ రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. బియ్యం నాణ్యత, రుచి, పంపిణీ ప్రక్రియపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులైన పల్లెర్ల సుజాత–రాజేశ్వర్ దంపతుల ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులతో చర్చించిన కలెక్టర్, ఐకేపీ ద్వారా డెయిరీ, పౌల్ట్రీ ఫాంతోపాటు ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీలోని సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేని విషయాన్ని గ్రామస్తులు చెప్పగా, వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీతను కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత రాజీవ్ యువ వికాసం కార్యక్రమానికి దరఖాస్తు చేయాలని, ఇల్లు లేనివారికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీవో రత్నాకర్‌రావు, ఆర్ఐలు సత్యనారాయణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.