సన్నబియ్యం రోడ్డుపాలు
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయతే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లారీ డ్రైవర్లు బియ్యాన్ని నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు. సారంగాపూర్ మండలం చించోలి గ్రామ శివారులో ఉన్న గోదాములో బియ్యాన్ని జిల్లా కేంద్రానికి శుక్రవారం తరలిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ ఏరియాలో ప్రధాన రహదారిపై బస్తాలు కిందపడ్డాయి. రోడ్డుపై పడ్డ బియ్యాన్ని హమాలీలు సంచుల్లోనింపి తర్వాత లారీలో వేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
సన్నబియ్యం రోడ్డుపాలు


