మండే @ 43.9
● ఈ సీజన్‌లో ఇదే గరిష్ట ఉష్ణోగ్రత ● అంతటా 40 డిగ్రీలపైనే నమోదు.. ● ఆరెంజ్ అలర్ట్ జారీ
భైంసాటౌన్: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రతీరోజు 42–43 డిగ్రీలు నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే వేడి కాస్త తగ్గుతోంది. ఇక, సోమవారం రాష్ట్రంలోనే అధికంగా జిల్లాలోని నర్సాపూర్(జి)లో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌లో కనిష్టంగా 41 డిగ్రీలు నమోదైంది. అన్ని మండలాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దీంతో మండే రోజున జిల్లా పూర్తిగా ఆరెంజ్ (40–45డిగ్రీలు) జోన్‌లోకి వెళ్లిపోయింది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం నెత్తిన టోపీలు, రుమాలులు, మహిళలు స్కార్ఫ్‌లను ధరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లలో, బస్సుల్లో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఉన్నా ఎండవేడితో వేడిగాలి వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బస్టాండ్లలో చల్లటి నీటి వసతి సైతం లేకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఇక, రోడ్ల వెంబడి రిక్వెస్ట్ బస్టాప్‌లు, కూడళ్ల వద్ద సరైన నీడ వసతి లేక ప్రయాణికులు ఎండలోనే నిరీక్షిస్తున్నారు.
సోమవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు..
మండలం ఉష్ణోగ్రత
నర్సాపూర్(జి) 43.9
పెంబి 43.8
కడెం(పెద్దూర్) 43.7
భైంసా పట్టణం 43.5
కుభీర్ 43.5
తాండ్ర(మామడ) 43.4
తానూర్ 43.4
అక్కాపూర్
(నిర్మల్ రూరల్) 43.3
దస్తురాబాద్ 43.2
బుట్టాపూర్
(దస్తురాబాద్) 43.2
బాసర 43.1
ఖానాపూర్ 43.1
మండే @ 43.9


