ఇంటర్ మూల్యాంకనం పూర్తి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఇంటర్ మూల్యాంకనం గురువారంతో ముగిసింది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 21న ప్రారంభమై సుమారు 21 రోజులపాటు కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,35,000 జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేశారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 200 మంది అధ్యాపకులు స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు. మరో రెండు రోజులపాటు మాస్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మూల్యాంకనం విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఐఈవో జాదవ్ పరుశురాంను గజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. మరో 12 రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని డీఐఈవో తెలిపారు.


