EAPCET
-
EAPCET Results: బాలికలదే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)కు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఎం.రుషి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పులివెందులకు చెందిన ఎం.వంశీధర్ రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ సీబీటీ విధానంలో జరిగాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్‌కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో బాలురు 84.70 శాతం మంది అర్హత సాధిస్తే, బాలికలు 86.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొ. టీకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.వెంకటేశ్వరరావు, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్ పాల్గొన్నారు. వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్‌సెట్ ఫలితాలు వెల్లడవ్వడంతో కాలేజీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలిచినప్పటికీ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కన్వీనర్ అసలు హీరో కేవలం వారం రోజుల్లోనే ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేయడం మామూలు విషయం కాదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లడించడం అభినందనీయమన్నారు. పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు... సెట్ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి కూడా హీరోనే అని కొనియాడారు. -
నిమిషం లేటైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దీనిని ఈ నెల 11వ తేదీ వరకూ రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ ఉంటుంది. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ సెట్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు కీలక సూచనలు⇒ ఉమ్మడి ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఉదయం సెషన్లో పరీక్ష ఉన్న వాళ్లు 7.30 గంటలకు, సాయంత్రం సెషన్లో పరీక్ష ఉంటే మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ⇒ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులకు బయో మెట్రిక్ పరీక్ష ఉంటుంది. కుడిచేతి బొటన వేలి ముద్ర తీసుకుంటారు. దీంతో పాటు ఫొటో కూడా పరిశీలిస్తారు. ⇒ చేతులకు మెహిందీ, టాటూస్, ఇంక్ ముద్రలు ఉంటే పరీక్ష కేంద్రానికి అనుమతించరు. బ్లాక్ లేదా బ్లూ పెన్, హాల్ టికెట్, గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్‌ను దృష్టిలో ఉంచుకుని చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ క్యాలిక్యులేటర్, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, సెల్ఫోన్లు, చేతి గడియారాలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. -
ఎప్ సెట్ రాసిన వెంటనే ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సాంకేతికతను జోడించి ఈసారి మరింత మెరుగైన రీతిలో ఎప్‌సెట్‌ను నిర్వహిస్తున్నామని సెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ లాగవుట్ అయిన వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు.ఈ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో సెట్ పూర్తయిన మరుక్షణమే తెలుసుకోవచ్చని చెప్పారు. దీన్ని ఈ ఏడాది నుంచే ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. మే నెలలో జరిగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏప్సెట్)కు ఈ నెల19వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టికేకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, సెట్ ఉప కన్వీనర్ ప్రొఫెసర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సెట్‌కు ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఇదే నెల 23న హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రూ. 10 వేల ఫైన్‌తో పరీక్ష మొదలయ్యే రెండు రోజుల ముందు (ఏప్రిల్ 2 వరకూ) దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... తప్పు చేశారో... ఇట్టే పట్టేస్తుంది! ఇంటర్ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌కు, ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ సెట్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. కానీ ఆన్లైన్లో ఇందుకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ సమస్య ఉండదు. ఇంటర్ బోర్డ్‌తో సమన్వయం చేసుకుని ఇంటర్ హాల్ టిక్కెట్‌ను ఆన్లైన్ ద్వారా సెట్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థి తప్పు చేస్తే సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పేందుకు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నుంచి వెంటనే విద్యార్థి రిజిస్టర్ మొబైల్‌కు ఫోన్ వెళ్తుంది. సెట్‌కు హాజరైన విద్యార్థులు ప్రాథమిక కీ విడుదలవ్వగానే తప్పులుంటే తెలియజేయవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి ప్రతీ సందేహానికి రూ. 500 చెల్లించాలి. లేవనెత్తిన తప్పు నిజమని తేలితే సొమ్ము వాపస్ ఇస్తారు. విద్యార్థి తన మొబైల్ నుంచే ఏప్సెట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఈసారి కొత్తగా కలి్పంచారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ విద్యార్థి మీ సేవ కేంద్రం నుంచి దరఖాస్తు చేసేవాళ్ళు. దీనివల్ల కేంద్రం నిర్వాహకుడు దరఖాస్తులు తప్పుగా నింపుతున్నారు. ఇది చివరి నిమిషంలో సమస్యలకు తావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొబైల్ కంపాటబులిటీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన హయాంలో జరిగిన పురోగతిని వీసీ ప్రొఫెసర్ టికెకె రెడ్డి వివరించారు. ఈ పట్టణాల్లో పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో ఏప్సెట్ జరుగుతుంది. వీటి పరిధిలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో నాలుగు జోన్లు ఉంటాయి. ఈ జోన్లల్లో 32 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. బాలికలకు ఈసారి సమీపంలోనే పరీక్ష కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఫైన్‌తో దరఖాస్తు చేసే విద్యార్థులకు హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి. -
TG: ఈఏపీసెట్ పరీక్షా తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అగ్రి కల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం , మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిప్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో షిప్ట్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.


