ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ | YS Jagan Increases Asha workers Salaries | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

Jun 3 2019 3:43 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్రంలోని ఆశావర్కర్లకు తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై  సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు భారీగా పెరిగినట్టయింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement