పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జై ప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు వెళ్లిన జైప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్‌కార్యకర్తలు విరుచుపడ్డారు. పోలింగ్ బయట కాళ్లతో తన్నుతూ.. చెట్ల పొదలు ఉన్న మురికి కాలువలో తోసేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా, తనపై దాడికి యత్నించిన తృణమూల్ కార్యకర్తలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ మజుందార్ డిమాండ్ చేశారు. తృణమూల్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఈ దాడియే నిదర్శనమన్నారు.
బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ
Nov 25 2019 2:49 PM | Updated on Nov 25 2019 2:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement