సింహం పిల్లను ఎత్తుకుపోయిన కొండముచ్చు

జోహన్నెస్‌బర్గ్ : ఈ ఫోటోల్లో సింహం పిల్లను ఎత్తుకుపోతున్న కొండముచ్చును చూశారు కదా! అది ఆ కూనను చెట్టుపైకి తీసుకెళ్లి అటూ ఇటూ తిప్పింది. తన సొంత బిడ్డతో ఆడుకున్నట్లే దానితోనూ సరదాగా ఆడుకుంది. అరుదైన ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో ఈ నెల 1న చోటుచేసుకుంది. ఇలాంటి అసాధారణ ఘటనను తన 20 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని పార్క్‌రేంజర్‌కుర్ట్‌ షుల్జ్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కొండముచ్చు ...ఆ సింహం పిల్లను ఏం చేసిందో తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top