సెట్‌లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు | Watch: Monkey Chases TV Host In The Middle Of An Interview | Sakshi
Sakshi News home page

సెట్‌లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు

May 28 2020 2:36 PM | Updated on Mar 21 2024 8:42 PM

అప్పటి వరకు కోతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని సరదాగా ముద్దు చేసిన యాంకర్‌ ఒక్కసారిగా కోతిని నెట్టేసి సెట్‌లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ  సరదా ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోబ్నా అసల్‌ అనే  మహిళ  జర్నలిస్ట్‌ తన సహ జర్నలిస్ట్‌లతో కలిసి టెలివిజన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వీరు  ఇంటర్యూ చేస్తున్న ఈజిప్టు నటుడు తనతో ఓ కోతిని వెంట తీసుకొచ్చాడు. కోతిపై ముచ్చటపడ్డ యాంకర్‌ దానిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆడించింది. 

యాంకర్‌తో కోతి కాసేపు బాగానే ఉంది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో అనూహ్యంగా కోతి యాంకర్‌పై తిరగబడింది. ఆమెపై దూకి కాళ్లు గోకడం ప్రారంభించింది. కోతి దాడి చేయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన యాంకర్‌ దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడంతో కోతి నుంచి రక్షించుకోడానికి దాన్ని నెట్టేసి సెట్‌ నుంచి పరుగులు తీసింది. చివరికి  ఓ వ్యక్తి వచ్చి కోతిని తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.  ఇప్పటి వరకు దీనిని 50 వేల మంది వరకు వీక్షించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement