13 అడుగుల మొసలిని కామ్‌గా తొలగించాడు | Watch: Man Calmly Pushes Away 13 Foot Crocodile Bonecruncher | Sakshi
Sakshi News home page

13 అడుగుల మొసలిని కామ్‌గా తొలగించాడు

Sep 18 2020 11:23 AM | Updated on Mar 21 2024 7:59 PM

కాన్‌బెర్రా‌: సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు ఆదేశాలు జారీ చేయగలం. ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటాం కాబట్టి మనం కమ్‌, సిట్‌, గో అంటూ ఆదేశాలు జారీ చేస్తే.. చెప్పినట్లు వింటాయి. కానీ ఇదే ఆదేశాలను మొసలికి జారీ చేయగలరా.. అది కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఆస్ట్రేలియాకు చెందిన రాంగ్లర్‌ మాట్‌ రైట్‌ మాత్రం ఇలాంటి పనులను చాలా అలవోకగా చేయగలడు. ఆ వీడియోలను మనకు చూపించగలడు. రాంగ్లర్‌ 13 అడుగుల భారీ మొసలిని బుజ్జగిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు..  రైట్ ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని ఒక నది మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మొసలి అతడిని సమీపించింది. వేటడానికి రెడీగా దవడలను విశాలంగా తెరిచి రైట్‌ వైపు రాసాగింది. ఆ సమయంలో అతడు కాక అక్కడ వేరే  ఎవరు ఉన్నా ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగు తీసేవారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement