పిల్లలకు జన్మనివ్వడానికే బయటికి..

ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి.  మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి. సీల్స్‌ జీవితంలో చాలాభాగం నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి. ఆక్సిజన్‌ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి. నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది. వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవ లేదా ఓడ వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట. ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయట. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top