కాట్రెల్ వికెట్ సెలబ్రేషన్స్
క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడగొట్టిన ప్రతి బౌలర్ తనదైన రీతిలో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్లు చేసుకునే ప్రత్యేక సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలో మైదానంలో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మైదానంలో సహచర ఆటగాళ్లకు దొరకుకుండా పరిగెత్తుతూసంబరాలు చేసుకుంటాడు. అయితే కరేబియన్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ సెలబ్రేషన్స్ ప్రపంచకప్‌లోనే హైలెట్‌గా నిలుస్తున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌వైపు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే తను సెల్యూట్ చేయడానికి గల కారణాలను కాట్రెల్ తాజాగా వెల్లడించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు