‘మైదానం బయట నుంచి నాకు మద్దతుగా నిలిచినవారు కూడా నా ఫామ్‌కు కారణమే.. ముఖ్యంగా నా భార్యకు ఈ విషయంలో అధిక క్రెడిట్ దక్కుతుంది. ఈ పర్యటనలో తను నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. . గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. నిరంతరం నాకు ప్రేరణగా నిలుస్తూ ముందుకెళ్లేలా చేస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలందుకోవడం గొప్ప అనుభూతి. ఇంకా నాకు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. అందుకే ప్రతీ రోజునూ ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండి జట్టును నడిపిస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను, జట్టు విజయాల కోసం నా వంతు 120 శాతం కృషి చేస్తాను’ అని కోహ్లీ తెలిపాడు.