టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్‌ | Virat Kohli and co face Arjun Tendulkar at the nets ahead of Lord's Test | Sakshi
Sakshi News home page

టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్‌

Aug 10 2018 9:24 AM | Updated on Mar 22 2024 11:19 AM

టీమిండియా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు, యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్ కాస్త ఇబ్బంది పెట్టాడు. అర్జున్‌కు, భారత క్రికెటర్లకు సంబంధం ఏంటంటారా..! ఇక్కడి మార్చంట్‌ టేలర్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్జున్‌ బౌలింగ్‌ చేశాడు. కోహ్లితో పాటు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌లు రెండో టెస్ట్‌కు ముందు బుధవారం నెట్స్‌లో అర్జున్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ సమయంలో ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనూ భారత బ్యాట్స్‌మెన్‌ అర్జున్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement