దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తన ఫీల్డింగ్‌తో అబ్బురపరిచింది. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకుని శభాష్ అనిపించింది. క్యాచ్ పట్టుకున్న క్రమంలో రోడ్రిగ్స్ తనను తాను నియంత్రించుకోవడం భారత అభిమానుల్లో జోష్‌ను నింపింది.