దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, ‘360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్’ ఏబీ డివిలియర్స్(34) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లో ఎన్నో సరికొత్త విన్యాసాలను ప్రదర్శిస్తూ అవలీలగా బంతులను సిక్సర్లుగా మలిచే డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు ఏబీ వెల్లడించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తూ, తన నిర్ణయాలనికి కారణాలు వెల్లడించాడు. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22 సెంచరీల సాయంతో 8765 పరుగులు చేయగా, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.
అలసిపోయాను..ఇక ఆడలేను!
May 23 2018 5:17 PM | Updated on Mar 21 2024 8:29 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement