ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మైదానంలో చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. అతడు మ్యాచ్‌లో ఉన్నాడంటే జట్టు హాయిగా నిద్రపోవచ్చు. రియాల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో జువెంటస్ తో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్ హాట్ టాపిక్‌గా మారింది. గాల్లోకి పక్షిలా ఎగురుతూ చేసిన ఆ గోల్‌ను సైకిల్ కిక్ గోల్ అని ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో జువెంటస్‌పై 3-0తో నెగ్గిన రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. రొనాల్డో చేసిన గోల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.