భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, పరిమిత ఓవర్ల క్రికెట్ రెగ్యులర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిని మరిపించాడు ఇంగ్లండ్ స్సిన్నర్ ఆదిల్ రషీద్. అచ్చం ధోని తరహాలోనే రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. పాకిస్తాన్‌తో ఐదో వన్డేలో భాగంగా బాబర్ అజమ్ రనౌట్ చేసే క్రమంలో చూడకుండానే బంతిని స్టంప్స్‌పైకి విసిరి మన మిస్టర్ కూల్‌ను గుర్తు చేశాడు.